ఎంతటి గొప్ప అడుగులు మీవి
సముద్రంతో ఆటలాడుకున్నవి
భీకర అలలతో భయపెట్టిన
సముద్రపు గుండెమీద తన్ని
బడుగుల కాపాడినవి
కంటకావృత మార్గాల పయనించి
అరికాళ్ళు చీరుకుపోతున్నా
గమ్యం సడలలేదు
ఎంత గొప్ప కళ్ళు మీవి
కాలుమోపడానికి
కాసింత జాగ కోసం
కాలమంతా వెతికినవి
ఎన్ని భయవిహ్వల దృశ్యాలు జూశాయో
ఎంతగా దుఃఖ నదులై పారాయోగాని
అచంచల విశ్వాసాల్ని
కంటికాంతులుగ నిల్పినవి
పున్నమి వెన్నెల కాంతుల విరజిమ్మినవి
ఎంత గొప్ప హృదయం మీది
తుఫానులెన్ని రేగినా
ప్రళయాగ్నులు చెలరేగినా
సముద్రాల్ ఉప్పొంగినా
మానవుడజేయుడని
మహోన్నతంగా చాటిచెప్పినవి
చెల్లెళ్ళారా! నా తల్లుల్లారా!
అరబ్ రక్తకాసారంలోంచి
పైకి లేచిన అగ్నిపుష్పాల్లారా!
ఇల్లులేదా మీకు
చెదరని ఆత్మవిశ్వాసమే
భద్రమైన మీ పొదరిల్లు
జాతీయ గీతమే లేదా,
ఉత్పాతాలకెదురేగి
మీరెత్తిన పోరుగీతమే
అసలైన జాతీయ గీతం
ఒక్క బంగారు పతకమూ రాలేదా..
విధ్వంసంలో
చెదరని దీపాల్లా
మీ చెదరని చిరునవ్వులే
జాతికి మీరిచ్చే బంగారు పతకాలు
మీరు ఓడిపోతేనేమి,
చెదరని ఆత్మవిశ్వాసంతో
ప్రపంచాన్నే గెలిచారులః
అందుకే…
మీకు సలాం
మీ మాటకు సలాం
మీ బాటకు సలాం
…………………
సిరియా శరణార్థి యూస్రా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సందర్భంగా
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags