అమలుకాని చట్టాలు – వంద ఉంటేనే? లక్ష ఉంటేనే? – కొండవీటి సత్యవతి

అదొక భారీ కర్మాగారం విస్తరించి ఉన్న ఆవరణ. డిఫెన్స్‌కి సంబంధించిన అనేక వస్తు సముదాయం అక్కడ తయారౌతుంది. అంచెలంచల రక్షణ వలయంలో ఆ ఫ్యాక్టరీ కాపాడబడుతుంది. రక్షక దళంలో స్త్రీలూ, పురుషులూ ఉంటారు. రాత్రీ పగలూ విధులుంటాయి. స్త్రీ పురుష గార్డులు కళ్ళల్లోవత్తులేసుకుని ఆ పరిసరాలను కాపాడుకుంటారు. అలాంటి చోట పనిచేస్తున్న మహిళా గార్డుల కోసం భద్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాక్టరీ యాజమాన్యానిదా? రక్షణ కల్పిస్తున్న సంస్థదా? పురుషులతో భుజం భుజం కలిపి, భుజాన రైఫిల్‌ను మోస్తూ కూడా తోటి పురుష గార్డుల వల్ల లైంగిక వేధింపులకు గురవ్వడం, ఎవరికి చెప్పుకోవలో తెలియక కుమిలిపోవడం… ఏమిటిది? ఎక్కడున్నాం?

గృహహింస నిరోధక చట్టమొచ్చి పదేళ్ళు. చట్టంతో సంబంధం లేకుండా పెరిగిపోతున్న గృహహింస రూపాలు. కుటుంబ హింసలో కునారిల్లుతున్న మహిళలకి ఎలాంటి రక్షణనీ ఇవ్వని గృహహింస నిరోధక చట్టం. చట్టం గురించిన చైతన్యం లేదు. చట్టం గురించి తెలిసి కేసులేసినా న్యాయమివ్వని న్యాయమూర్తులు. హింసని భరించలేక పోలీస్‌ స్టేషన్ల కొస్తే కౌన్సిలింగులు చేస్తున్న పోలీసులు. ఎటుపోతున్నాం? మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం సందర్భంలో సంపాదకీయం రాయాలని కూర్చున్నప్పుడు నా ఎదురుగా నిలబడిన ప్రశ్నలివి.

పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని నిరోధిస్తూ చట్టమొచ్చి నాలుగు సంవత్సరాలు. వేధింపులకు గురయ్యే ఉద్యోగినుల రక్షణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చెయ్యాలి. చేసారో లేదో కనుక్కునే వ్యవస్థేదీ లేదు. ఏర్పాటు చేసిన చోట వెల్లువెత్తుతున్న కేసుల్ని పరిశీలిస్తున్నపుడు కొంత మంది పురుషులు ఇంట్లో ఎంత హింసకి పాల్పడుతున్నారో తాము పనిచేసే చోట తోటి మహిళల పట్ల అంతే స్థాయిలో వేధింపులకు పాల్పడటం గమనించినపుడు దిగ్భ్రమ కలగకమానదు. తరాలు మారుతున్నా, తరతరాల పితృస్వామ్య భావజాలం వీళ్ళ మెదళ్ళని వదలకపోవడం చాలా షాకింగ్‌గా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా, విద్యతో సంబంధం లేకుండా తనతో పాటు పనిచేసే స్త్రీల పట్ల పురుషుల ఆలోచనలు, వారి దృక్పధాలు ఎంత హీనంగా ఉన్నాయో కేసు కథనాల ఆధారంగా పరిశీలించినపుడు మనసంతా నిరాశ, నిర్వేదం కమ్ముకున్న సందర్భాలెన్నో! ఏమి చెయ్యాలి? ఎవరు మారాలి?

ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా పురుష రంగాలుగా పేర్కొనబడిన మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌, నావి, ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, పోలీస్‌ లాంటి ఉద్యోగాల్లోకి పెద్ద ఎత్తున మహిళలు ప్రవేశిస్తున్నారు. రేయింబవళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. యూనిఫామ్‌ ఫోర్స్‌లో ఉండే కఠినమైన క్రమశిక్షణ, బాసిజం, మేల్‌ ఛావనిజం మధ్య పనిచేసే ఉద్యోగినుల పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవలే నాకర్థమైంది. రైఫిల్‌ చేతుల్లో ఉన్నా తోటి ఉద్యోగుల నుంచే రక్షణ లేనితనం తేటతెల్లమై నేను తెల్లముఖమేసిన సందర్భం అది. స్త్రీల రక్షణ కోసమంటూ వచ్చిన చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి… తాముకట్టు తప్పి ప్రవర్తిస్తే ఎలాంటి శిక్షలు పడతాయి… తమను, తమ కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తాయి… అచ్చోసిన అంబోతుల్లా దేనికీ కట్టుబడకుండా ప్రవర్తిస్తే తమ బతుకు ఎలా జైలు పాలవుతుంది… ఊహూ… ఎలాంటి ప్రచారం లేని చట్టాలు. చేతులారా చేతులు కాల్చుకుని ఆకులకోసం వెతుక్కునే దుస్థితి. ఇటీవల నేను విచారించిన అనేక కేసుల్లో ”ఏదో సరదా అనుకున్నాను. ఇంత కఠినమైన చట్టముందని తెలియదు. క్షమించండి… ఆవిడ పాదాలను పాలతో కడుగుతాను. నా ఉద్యోగం పోతే నా కుటుంబం వీధిన పడుతుంది” అంటూ నన్ను విపరీతంగా ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసాడొక ఉద్యోగి. ఏభై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి తన తోటి ఉద్యోగిని లైంగికంగా వేధించి, ఆవిడ ఫిర్యాదు చేస్తే, ఆరోపణలు రుజువై ఉద్యోగం ఊడినపుడు తను ఎలాంటి నేరం చేసాడో అర్థమైంది. ఎలాంటి చట్టముందో అర్థమైంది. స్త్రీల రక్షణ కోసం కఠినమైన చట్టాలున్నాయి. మీ హద్దుల్లో మీరుండండి… హద్దులు మీరకండి” అంటూ హెచ్చరిస్తూ, అవగాహన కలిగించే పనిని యాజమాన్యం చేయనపుడు చట్టముంటేనేం? లేకపోతేనేం?

రాత్రి పగలు డ్యూటీ చేసే ఉద్యోగినలకు భద్రమైన పని ప్రదేశాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ధైర్యం నింపాల్సింది కూడా యాజమాన్యాలే. అలా కాపోతే నేను మొదట్లో పేర్కొన్న భారీ కర్మాగారపు గేట్ల ముందు పనిచేసే మహిళా గార్డుల భద్రత గాలి కొదిలేసి, అక్కడ పనిచేసే పురుషులు సంవత్సరాల తరబడి వారిని వేధిస్తూ, కాల్చుకుతినే పరిస్థితిని కల్పించిన యాజమాన్యం కూడా శిక్షను అనుభవించాల్సిందే. వారిని విచారిస్తున్నపుడు ఒక్కో ఉద్యోగిని కన్నీళ్ళ పర్వంతమౌతూ తమ దుఃఖ గాధను వివరిస్తున్నపుడు నేను విచలితనైపోయాను. నాకూ కన్నీళ్ళొచ్చాయి… ఎందుకిలా జరుగుతోంది?

మార్చి ఎనిమిది… మహిళాదినోత్సవమట. ఉత్సవం చేసుకోవాల్సినంత ఉల్లాసంగా ఉన్నామా? మన రక్షణ కోసం మహామహా చట్టాలొచ్చాయని సంబరం చేసుకుందామా? ఏ చట్టమొస్తే నాకేంటి? నేను అన్ని చట్టాలకీ అతీతం అంటూ రెచ్చిపోతున్న పితృస్వామ్య మను వారసులు ఇంటా, బయటా సృష్టిస్తున్న విషాద సంస్క ృతిని అలాగే తలవొంచి ఆమోదిద్దామా? పురుషాధిక్య విషపు పడగను ఫెటీల్మని తన్నే ప్రత్యామ్నాయ సంస్క ృతిని సృష్టించుకుందామా? ఏం చేద్దాం… మార్చి ఎనిమిదిని రొటీన్‌ తద్దినంలాగా కాకుండా మనల్ని మనం పునర్‌ నిర్వచించుకునే పోరాట దినంగా జరుపుకుందామా?

ఓ నూతన తరమా! కదలిరా! నీ ముందు తరాల మహిళల్ని పట్టి బంధించిన సమస్త వివక్షల్నీ, సవాలక్ష సంకెళ్ళనీ తెగ్గోయడానికి ముందుకురా! మార్చి ఎనిమిది అంటే మామూలు దినం కాదు… పోరాటదినం… పోరాడితే పోయేదేమీ లేదు… సంకెళ్ళు తెగిపడడం తప్ప… నూతన శకానికి నాంది పలుకుదాం… నవ నవోన్మేష భావాలను ఆవాహన చేద్దాం… మార్చి ఎనిమిది రోజున మనం చెయ్యాల్సిందిదే!!!

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.