వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన శీలా సుభద్రాదేవి గార్కి, నమస్తే.

ఎలా ఉన్నారు? మండే ఎండల గుండా ప్రయాణించి వానచినుకుల పరిష్వంగంతో కొంత కోలుకున్నాం కదా! మీ మనసుకు నచ్చే ఈ వాతావరణం శరీరాన్ని మాత్రం గాయం చేస్తుంది కదూ! వీర్రాజుగారెలా ఉన్నారు? నేనూ, యాకూబ్‌ మొట్టమొదటిసారిగా మీ ఇంటికి బ్రహ్మానంద్‌ నగర్‌ వచ్చినపుడు ఎంత సంతోషపడ్డామో! చిత్రకారులు, సాహిత్యకారులు, కళాకారులు జంటగా నివసిస్తుంటే ఆ ఇల్లొక మ్యూజియం లా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసింద ప్పుడు. ఇంటి ముఖద్వారంపైన చెక్కిన నగిషీ లు, ఒకదాన్ని మించిన ఒకటి ఎన్నెన్నో కళాఖండాలు ఎప్పటికీ మా దృష్టిలో మరిచి పోలేనిది. అలాగే మీ ఆప్యాయత కూడా! ఇన్నేళ్ళ మన పరిచయంతో విరబూసినవి స్నేహ పరిమళాలే! ఇద్దరూ రచయితలైతే ఎంత సౌలభ్యం ఉందో, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో అంత ఇబ్బంది కూడా

ఉంటుంది. స్వయం ప్రకాశకాలైన ఇద్దరూ ఉపగ్రహాలుగా మారాల్సి వస్తుంది. జెండర్‌ వివక్ష ఇక్కడ కూడా బాగా పనిచేస్తుంది. ప్రతిభావ్యుత్పత్తుల్లో సమానస్థాయిలో

ఉన్నప్పటికీ పరిగణనలోకిరారు. ఇది కొంచెం బాధాకరమే అయినప్పటికీ, అందరం అంగీకరించాల్సి వచ్చిన సత్యం. మీ స్వభావం మొదటినుంచీ సున్నితం. అవార్డుల వెంట, పేరు ప్రఖ్యాతుల పరుగు పందెంలో మీరెప్పుడూ లేరు. మిమ్మల్ని వెతుక్కుంటూ అవే వచ్చాయి కానీ, ఐడెంటిటీ క్రైసిస్‌ను మాత్రం అనుభవిస్తూనే ఉన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం, సాహిత్య రచన చేస్తున్న మీరు మీ నిబద్ధతకు, విలువలకు ఇదొక విషయమే కాదు అన్పించినప్పటికీ, కొందరివల్ల గొంతులో ముల్లు గుచ్చుకున్నట్లవుతుంది.

నేను ఎం.ఫిల్‌ చేసేటప్పుడు మీ కవిత్వాన్ని చదివాను. అప్పటికే మీరొక మేటి రచయిత్రి. ‘వటవృక్షపు నీడలో/ సేదతీరే చిన్నారి గడ్డి మొక్కలా కాదు/ నేనే ఒక వృక్షాన్నై’ ఠీవిగా నడవాలని స్త్రీ కోరుకుం టుందని భావించారు. తెలుగు సాహిత్యంలో అప్పట్లోనే స్త్రీ వాద ఛాయల్ని ప్రతిబింబించిన సాహిత్యాన్ని రచించారు. మానవత్వాన్ని మించిన దైవత్వం లేదన్న నిర్ణయ ప్రకటన, పేదరికం పట్ల తండ్లాట, సానుభూతి, హేతు వాదం పట్ల నమ్మకం, గౌరవం, ఫెమినిస్ట్‌ ఉద్యమ స్ఫూర్తి, చైతన్యం, ప్రకృతి ప్రియత్వం. కర్తవ్య స్ఫూర్తిని, కరుణను ఒలికించేదిగా

ఉండాలనీ, ఒక కమిట్‌మెంట్‌తో రాసే కవిత్వమే మిన్న అనేదే మీ అభిప్రాయం కదూ! మతాలవల్ల విభేదాలు రావనీ, మత రాజకీయాల వల్లే స్పర్థలన్న విషయం స్పష్టంగా చెప్పారు. పురుషాధిపత్యం పట్ల నిరసన, స్త్రీశక్తి నిరూపణ, ఆత్మవిశ్వాసమే స్త్రీలకు మందనే జ్ఞానాన్ని వెలిబుచ్చారు. కౌటింబిక హింసలవ్లల స్త్రీలకు ఇళ్ళు జైళ్ళు గా మారిన తీరుని వివరిస్తూపోయారు. అది కథైనా, వ్యాసమైనా, కవిత్వమైనా, ప్రసంగ మైనా మీ ధోరణి ఒకేలా సాగిపోతుంది. నిజానికి సాహిత్యాన్ని మీరు నిర్వచించుకున్న తీరు, ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేయడానికి మీరుపడిన తపన చెప్పాలని ఉంది. కానీ ఈ కాలమ్‌లో స్థలం చిన్నది కావడంతో రాయాలని ఉన్నా కుదించుకుంటున్నా.

ఇక మీ రచనల వివరాల్లోకి వెళ్తే ఇప్పటివరకు తొమ్మిది కవిత్వ పుస్తకాలు ప్రచురించారు. ఆకలి నృత్యం (1980) ఆవిష్కారం, తెగిన పేగు, మోళీ, ఒప్పుల కుప్ప, యుద్ధం ఒక గుండెకోత (దీర్ఘకావ్యం), ఏకాంత సమూహాలు, బతుకుపాటలో అస్థిత్వ రాగం వీటన్నింటిని కలిపి ఒక సంకలనంగా 2009లో వేసారు. మీ 50యేళ్ళ జీవిత ప్రయాణానికి గుర్తుగా ఆరోజే ఈ పుస్తకాన్ని తెచ్చారు. యుద్ధం ఒక గుండెకోతను తొలి దీర్ఘకవితగా చెప్పొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీషు ల్లోకి కూడా అనువాదం చేయబడింది. ‘గీటు రాయిపై అక్షర దర్శనం’ పేరిట ఈ మధ్యే మీ రచనలపై వచ్చిన సమీక్షలతో పుస్తకం వేశారు కూడా! గత రెండున్నర ఏళ్ళుగా ‘తెలుగు విద్యార్థి’లో ”ఇస్కూలు కతలు” పేరిట రాస్తున్నారు. డ్రాపవుట్స్‌ గురించి, ఆర్థిక నేపధ్యాన్ని, విద్యార్థులు, టీచర్ల సమస్యల్ని విశ్లేషిస్తున్నారు. వీటిల్లో ‘ఒకే తాను ముక్కలు’ అనే కథను మహారాష్ట్ర గవర్న మెంట్‌ వాళ్ళు 7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా పెట్టారు. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ వాళ్ళు కూడా డిగ్రీలో ‘మార్పు వెనుక మనిషి’ కథను సిలబస్‌లో పెట్టారు. కథల పుస్తకాలు కూడా రెండు వేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళకు పి.శ్రీదేవిపై ‘మోనోగ్రాఫ్‌’ను రాసిచ్చారు. భార్గవీరావు గారితో కలిసి ‘ముద్ర’ అనే బృహత్‌ సంకలనాన్ని తీసుకొచ్చారు.

1970లోనే కథానికతో మొద లైంది మీ రచన ‘పరాజిత’ కథతో కదూ! ‘నా ఆకాశం నాదే’ ఇటీవలి కవిత్వ సంపుటి. 1949లో విజయనగరం ఆకాశం కింద కళ్ళిప్పి లోకాన్ని తొలిసారిగా చూసి, అక్కడే బియస్సీ చదివారు. ఆ తర్వాత ఓ.యూ.నించి గణితంలో ఎమ్మెస్సీ, తెలుగు ఎం.ఎ. చేసి ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్‌ అయి పోయినా, అది ఉద్యోగానికే కానీ రచనకు కాదని భావించి రి-టైర్‌ – కొత్త చక్రంతో సాహిత్య వస్త్రాన్ని నేస్తున్నారు. మీకు సాహిత్య గౌరవాన్ని మిగిల్చిన కొన్ని అవార్డుల్లో 70లో తెలుగు యూనివర్శిటీ అవార్డు, 99లో

ఉత్తమ రచయిత్రి అవార్డు, 2011లో దీర్ఘకవితకు ‘సోమసుందర్‌’ గారి ద్వారా రాజహంస, కృష్ణశాస్త్రి అవార్డు, గురజాడ అవార్డు వచ్చాయి కదూ! విస్మృత రచయిత్రు లపై వ్యాసాలు ఎక్కువగా రాస్తున్నారు. చూస్తున్నాను. ఇంతవరకూ కవర్‌ పేజీల విషయం మీరిద్దరూ చూస్తుంటే, ఇప్పుడు మీ అమ్మాయి పల్లవి కూడా డిజైన్‌ చేస్తోంది కదూ! అవునూ ‘ఆశ్లేష’ ఎలా

ఉంది? ఇంటర్‌కి వచ్చేసుంటుంది కదూ! మీ ఇద్దరితో పాటు వాళ్ళిద్దరి ప్రతిభనూ సంపాదించుకొంది. క్రాఫ్ట్‌వర్క్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంది కదూ! మీ అక్కయ్య పి.సరళాదేవిగారి కథను కూడా సిలబస్‌లో పెట్టారు. ఆమె మీకెంతో స్ఫూర్తి అన్నారొకచోట. ‘కొండ అద్దమందు కొంచమై ఉంటుంద’న్నట్లుగా, మీ గురించిన స్వల్ప పరిచయమిది. ప్రస్తుతానికి సెలవా మరి…

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.