ప్రతిస్పందన

ప్రియమైన శిలాలోలితా,

నమస్తే!

వర్తమానలేఖ (భూమికలో) నాకు వ్రాసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు నాయందు గల ప్రేమాభిమానాలకు మనసు పులకించింది. నా గురించి చాలా వ్రాశారు. కానీ అవన్నీ మీకు నా మీద ప్రేమను చాటుతున్నాయి.

అవును! మనం మొట్టమొదటసారి అస్మితలోనే కలుసుకున్నాం. నాకు బాగా గుర్తుంది. నేను జడపదార్థంగానే మీకిష్టమని ముడి పదార్థంగా నచ్చలేదని తెలిసి ముచ్చటేసింది. నిజం సుమండీ! నాకు జడవేసుకోవడమే ఇష్టం. సులువు. మొన్నమొన్ననే ఆ ముడి చుట్టుకుని పిన్నులు గుచ్చుకోవడం చేతనైంది. వీలయినప్పుడల్లా అవన్నీ తీసేయాలనిపిస్తుంది.

నేను దేశ స్వాతంత్య్రం రాకముందే పుట్టాను. అందుకేనేమో స్వేచ్ఛగా ఆలోచించడానికీ, నన్ను నేను విశ్లేషించడానికీ చాలా సమయమే పట్టిందనిపిస్తుంది. ఒకసారి ఓల్గా మాట్లాడుతూ ‘మన సమాజంలో ఆడపిల్ల పుట్టి పెరిగి కుటుంబాన్నీ, కట్టుబాట్లనీ, సంక్లిష్టమైన సమాజాన్ని కొంచెం అర్థం చేసుకునేసరికే ముప్ఫై ఏళ్ళు వచ్చేశాయి. ఆ తర్వాతే… ఆరాటం… పోరాటం… అన్నారు.

నా విషయంలో ఇంకాస్త ఆలస్యమనే చెప్పాలి. నా పేరు ముందు ‘ఇంద్రగంటి’ అని లేకుండా మొదట్లో కథలు ప్రచురించాను. జ్యోతి (మాసపత్రిక) ‘యువ’ కూడా అని గుర్తు. ఆంధ్రజ్యోతి (వీక్లీ)కి కథ పంపినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ”చక్కని ఇంటి పేరు… ఎందుకుండకూడదూ…” అంటూ నా పేరుముందు పెట్టారు. నేను పెద్దగా వ్యతిరేకించలేదు. బహుశా లోపల్లోపల ఆనందపడ్డానేమో. ఇప్పుడు బాగా గుర్తులేదు.

మా పెళ్ళయిన కొత్తలో నేనెక్కడ సాహిత్య సభల్లో కనిపించినా పెద్ద పెద్దవాళ్ళు నన్ను ‘హనుమచ్ఛాస్త్రి గారి కోడలు జానకీబాల’ అనేవారు. అది కాదనే విషయం కాదు. అలాగనీ సాహిత్యపరంగా ఆనందించే విషయంగానూ తోచేది కాదు. తరువాత్తరువాత శ్రీకాంతశర్మ భార్య అంటూ ఆనందంగా పరిచయం చేసేవారు. అది సంతోషంగా స్వీకరించాలో, చేజారిపోతున్న నన్ను నేను పరిరక్షించుకోవాలో తెలియని ఒక అవస్థ.

మన స్త్రీలకి స్వయం ప్రకాశం ఉన్నా ఆ వెలుగుకి వెయ్యి అబద్ధాలు కల్పించబడతాయి. బంగారు పళ్ళానికి గోడ చేరువలాంటి దుష్ట ఉపమానాలతో నిలబడనీయకుండా చేస్తారు. అందుకే నేనెప్పుడూ ప్రోత్సహించడం, సహకరించడం అనే మాటలకి విలువ ఇవ్వను. అలాంటివేమీ ఎక్కువగా ఉండవని నా నమ్మకం. ఎప్పుడయినా ఎవరి కష్టం వారు పడాల్సిందే. ఈ పేర్ల తాలూకు లగేజి మోస్తూ ప్రయాణం చేయాల్సిందే. ఒకే ఇంట్లో ఇద్దరు రచయితలు ఒక ఒరలో రెండు కత్తులే. పదునుగా ఉన్న కత్తి రెండో కత్తిని సహజంగానే పక్కకు నెట్టుతుంది. అది నెట్టకపోయినా, చుట్టూ ఉన్న ప్రపంచం ఆ వసతి కల్పిస్తుంది. అయినా ఇంతవరకు స్త్రీలు ‘మిసెస్‌ రావు నండీ’, ‘మిసెస్‌ మూర్తి నండీ’ అని చెప్పుకుంటూ గర్వంగా మసలుకుంటుంటే మనం నా పేరు లక్ష్మి, నా పేరు జానకి అంటే విడ్డూరంగానే ఉంటుంది.

నా పాట గురించి మరీ పొగిడారు. పొగడ్త కాసేపు ఆనందాన్ని ఇచ్చినా, అది ఎక్కువసేపు నిలబడదు. ఏదో పాడగలిగేదాన్ని, ఇప్పుడు అదీ పోయింది. బాగా శృతి నిలిపి పాడలేకపోతున్నా. గొంతు పైకి వెళ్ళడానికి మొరాయిస్తోంది.

మా అబ్బాయి మోహన కృష్ణ ‘అష్టా-చెమ్మా’ కలిసి చూశాం. గుర్తుంది. ఈ మధ్య డైరెక్టర్‌గారి అమ్మగారు అనే చాలామంది గుర్తుపడుతున్నారు. పైగా పుత్రోత్సాహం… అంటూ పై సంగతి వేస్తుంటారు.

ఇప్పుడు మళ్ళీ మనందరం కలిసి ‘అమీ-తుమీ’ చూసి హాయిగా నవ్వుకుంటూ సినిమా హాల్లోంచి బయటకొద్దాం. ఒకరోజు నిర్ణయించుకుందాం. అంతా బాగుందనే అంటున్నారు కనుక నాలుగు నాళ్ళు ఉంటుందనే అనిపిస్తోంది. మరి ఆలస్యమెందుకు బయలుదేరుదాం.

మీ ఉత్తరానికి కృతజ్ఞతలు చెప్పాలని లేదు. అది చాలా తక్కువ మాటగా తోస్తోంది. నా మనసులో మీ స్నేహం ప్రేమగా నిలిచి ఉంటుంది. అది మీకు పంచి ఇస్తాను. ఎప్పుడూ మనసా మీ ప్రగతినీ, యోగక్షేమాల్నీ కోరుకుంటూ

ఉంటాను. మనం కలుసుకుని మరిన్ని మాటలూ, కొంచెం పాటలూ కలిపి కాలక్షేపం చేద్దాం.

అలాంటి సమయం కోసం ఎదురుచూస్తా…

ప్రేమతో

మీ జానకీబాల

 

మిక ఎడిటర్‌ గారికి నమస్తే!

”ఐ లవ్‌ రెవల్యూషన్‌” చాలా బాగుంది. ఒక ప్రశ్నా-జవాబుల మామూలు మూసలో కాకుండా ఓ కథలా చెప్పడం చాలా బాగుంది. చివర్లో ”మమద మమద మమదా..” అన్న ట్యూన్‌ కూడా భలే కుదిరింది. ఆ నగరాన్ని, న్యువర్క్‌ అని పలుకాలని విన్నానే.

– ప్రసాద్‌ చరసాల, మేరీల్యాండ్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో