ఎస్‌.శ్రీదేవి రచనలు-ఒక పరిశీలన -అలువాల శ్రీలత

 

సాహితీ ప్రస్థానంలో తమ కథల ద్వారా ప్రజలకు మనోవికాసాన్ని కల్పించే రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు సోమంచి శ్రీదేవి. అనాది కాలం నుండీ స్త్రీ స్వేచ్ఛా రహిత జీవిగా, బానిసగా బ్రతుకుతూనే ఉంది. స్త్రీని సమాజంలో ఇంటిపని, వంటపని చేసే మరబొమ్మగా చూస్తూ అణగదొక్కే ప్రయత్నాలు చేసారు. కానీ నేటి సమాజంలో స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ స్త్రీ పాత్ర ఎంత అనే అంశాలు ఈమె రచనల ద్వారా అవగతమౌతాయి.

మహిళల సర్వతోముఖాభివృద్ధికి పాటుబడడమే కాకుండా నేటి సమాజం సాంకేతికత పేరుతో ఏమేం కోల్పోతోందో సవివరంగా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఈ రచయిత్రి రచనల ద్వారా. పిల్లల మనస్తత్వాల నుండి పెద్దల మనోభావాల వరకు, నాటి వృత్తి నైపుణ్యాల నుండి నేటి సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం వరకు శ్రీమతి ఎస్‌.శ్రీదేవి రచనలు స్పృశిస్తాయని తెలుపడంలో అతిశయోక్తి లేదు.

శ్రీమతి సోమంచి శ్రీదేవి 16-07-1962 లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు కీ.శే.సోమంచి బాలకృష్ణమూర్తి, వెంకట సుబ్బలక్ష్మి. వీరు ఆంధ్రప్రాంత వాస్తవ్యులైనా ఈమె తండ్రిగారి వృత్తిరీత్యా వరంగల్‌ ప్రాంతానికి వచ్చి ఇక్కడే విద్యాభ్యాసం గావించి స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. ఈమె వరంగల్‌ పోస్టాఫీసులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త చదలవాడ విష్ణుమూర్తి, గోదావరి ఎత్తిపోతల పథకంలో ఎ.ఇ.గా విధులు నిర్వహిస్తున్నారు.

ఎస్‌.శ్రీదేవి ‘సాహితి’ అనే కలం పేరుతో ఇప్పటివరకు 150కి పైగా కథలు వ్రాసారు. వీటిని కథా సంపుటాలుగా ప్రచురించారు. అవి గూడు, సింధూరి, గుండెలోతు అనే పేర్లతో కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. వీటిలో సింధూరి కథా సంపుటికి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు అవార్డు లభించింది. ”నీలి నక్షత్రం” అనే నవల కూడా రచయిత్రి కలం నుండి జాలువారిన అద్భుత రచన. ఆంధ్రప్రభ, విపుల, ఇండియాటుడే వంటి పత్రికలలో అనేక కథలు ప్రచురితమవడమే కాక బహుమతులు కూడా సంపాదించి పెట్టాయి. ఈ రచనలన్నీ రచయిత్రి కలం నుండి కాక మనసు నుండి ఉద్భవించాయని చెప్పవచ్చు.

ఎస్‌.శ్రీదేవి రచించిన ఏ పుస్తకానికైనా తాను ముందుమాట ప్రకటించుకోలేదు. సంపాదకుల మెప్పు పొంది పత్రికలలో ప్రచురించడం, అవార్డులు, రివార్డులు రావడమే తన రచనల గొప్పతనానికి ప్రతీక అని, ఇంకా కథలలోని సారాన్ని ఎవరికి వారు చదివి తమకు అనుకూలంగా గ్రహించాలనేది రచయిత్రి ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. తన రచనలన్నింటినీ తన భర్త అయిన చదలవాడ విష్ణుమూర్తికి అంకితమిస్తున్నట్లుగా రాసే రెండు, మూడు వాక్యాలు సైతం పాఠకులను ప్రభావితం చేస్తాయి.

రచయిత్రి కలం నుంచి జాలువారిన ఏ కథను చదివినా తనకో, తన పక్కింటివాళ్ళకో, తెలిసిన వాళ్ళకో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని అనుకోక మానరు పాఠకులు. పాఠకులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక అలౌకికానందాన్ని కలుగచేస్తాయి.

రచయిత్రి కథా సంపుటిలైన గూడు, సింధూరి, గుండెలోతు కథలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ, మానసిక పరిపక్వత, చదువు, సమయస్ఫూర్తి, సమానత్వం వంటి అంశాలలో పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, తమ జీవితాలు వేరే వారి చేతుల్లో చేరి ఒక మరబొమ్మగా నడుచుకోకూడదని, ఒక బలిపశువుగా మారకూడదని తెలుపడమే కాక చక్కటి సామాజిక విలువలను, నైతిక, ఆర్థిక విలువలను రంగరించి మనముందు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. కథలన్నీ మన చుట్టుపక్కల జీవితాలను స్పృశిస్తున్నట్లు, సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలుపుతున్నట్లు అనిపిస్తుంది.

రచయిత్రి తన కథలకు శీర్షికలను ఎన్నుకోవడంలో చూపించిన నైపుణ్యం ఆమె ఊహాశక్తిని, భావదీప్తిని, దార్శనికతత్వాన్ని, స్త్రీ సాధికారతను విదితం చేస్తాయి. పాఠకులకు ఆసక్తి రేకెత్తించే విధంగా నామకరణం చేయడం ఒక కళ. గూడు, గుండెలోతు, వంటింటి కిటికీ, సింధూరి, సార్వభౌముడు, అంచనా తప్పింది, నీలినక్షత్రం, ప్రేమ రాహిత్యం వంటి శీర్షికలు పాఠకులను ఆలోచనా లోతుల్లోకి తీసుకెళ్తాయి. తన కథల్లో ఉపయోగించే పద నిర్మాణం, వాక్యాల కూర్పు నేటి యువతరానికి దగ్గరగా, భాష సహజ సుందరంగా, సరళంగా అనిపిస్తుంది.

నీలి నక్షత్రం నవలలో కథను నడిపిన తీరులో రచయిత్రికి సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషా నైపుణ్యం, ఊహాశక్తి అద్భుతమని చెప్పవచ్చు. ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురితమైన ఈ నవల పాఠకుల హృదయాలను పరవశింపచేసింది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో చైతన్యవంతులను చేసింది. సాంకేతికాభివృద్ధి చెందిన కాలంలో మనుషులు ఎటువైపు వెళ్తున్నారు, ఏం సాధించాలని కోరుకుంటున్నారు అనే అంశాల వల్ల కలిగే అనర్థాలను, అభివృద్ధిని వివరిస్తూ చక్కని కథతో ముందుకు నడిపించింది. నీలి నక్షత్రం నవలను చదివినంతసేపూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది. తదుపరి మన వంతుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము ఏం చేయాలనే ఆలోచనలు రాక మానవు. ఎంతో గొప్పగా, అద్భుతంగా అనిపిస్తుంది.

నేటి సమాజాన్ని నిలబెట్టాలన్నా, కుదిపేయాలన్నా ప్రేమ అవసరమని చెప్తూనే, ప్రేమ ఆకలి తీర్చదని చెప్పే ”వంటింటి కిటికీ” కథ పాఠకులను ఆలోచింపచేస్తుంది. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది చదువేనని, స్త్రీకి ఆర్థిక స్వేచ్చ ఉండాలని, ఎవరైనా శరీరం సహకరించినంత వరకు తమ పనులను తామే చేసుకుంటూ ఆదర్శంగా బ్రతకాలని, ఎవరికైనా సొంతగూడు ఉండాలని, స్త్రీల అంతరంగం తెలుసుకోవడం సాధ్యం కాదని తెలుపుతూ తన కథలను ఒక కొత్త తోవలో నడిపించిన ఆధునిక రచయిత్రి ఎస్‌.శ్రీదేవి. తన కథలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్త్రీలు, పురుషులు అనే భావన కలుగకుండా అన్ని వర్గాల వారు చదవగలిగే విధంగా ఉన్నాయి. అదే ఆవిడ కలం విశిష్టత.

ఈమె రచనలు 3 కథా సంపుటాలు మరియు ఒక నవల. అవి గూడు, సింధూరి, గుండెలోతు కథా సంపుటాలు మరియు నీలినక్షత్రం నవల.

పుస్తకాలకు పెట్టిన పేర్లే కాకుండా వాటిలోని కథల పేర్లు, పాత్రల పేర్లు కూడా ఆలోచింపచేసేవిగా ఉంటాయి. కథలను చదివిన తర్వాత కథకు తగ్గట్టుగా, పాత్రలకు తగ్గట్టుగా శీర్షికలు ఎంతో అద్భుతంగా కుదురుకున్నాయని అనిపిస్తుంది. అది ఒక కళ. ఈ శీర్షికల ఎంపిక తనకు సహజసిద్ధంగా అలవడినట్లుగా మనకు తోస్తుంది.

తన కథా సంపుటాల పేర్లనే పుస్తకంలో మొదటి కథగా ప్రచురించి పాఠకుల మనసులను ఆకట్టుకుంటుంది. శీర్షికలు ఎన్నుకొన్న పద్ధతి గమనిస్తే రచయిత్రి దార్శనికత, ఊహాశక్తి, మహిళా సాధికారత వంటివి ప్రస్ఫుటమవుతాయి. పునరపి, మలుపు, వంకరగీత, అపరిచిత మిత్రులు, ప్రేమ రాహిత్యం, వాకిట్లో అభ్యుదయం వంటి శీర్షికలు అందుకు కొన్ని ఉదాహరణలు.

్న నేటి సమాజంలో స్త్రీలు ఎటువంటి హింసలకు గురవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి హింసాయుత చర్యలకు చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాయి.

్న ప్రేమవల్ల బాలబాలికల స్థాయి నుంచే మార్పులు, నష్టాలను సమాజం చవిచూస్తోంది. అందుకోసం

వారి స్థాయినుంచే అవగాహన పెంచేందుకు తోడ్పడతాయి.

్న కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్న చిన్న అపార్థాల వల్ల ఛిన్నాభిన్నమవుతుంది. చిన్న కుటుంబాలుగా

జీవించినా ప్రేమ, ఆప్యాయతలు మనుషుల మధ్య చాలా అవసరమని తెలుపుతాయి.

్న వివాహేతర సంబంధాల వల్ల వ్యక్తులే కాదు కుటుంబాలు, సమాజం నాశనమవుతున్నాయి. వీటిని

అరికట్టడానికి తోడ్పడతాయి.

్న చదువు గొప్పదనం వివరిస్తాయి.

్న స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని తెలుపుతాయి.

్న నైతిక విలువల ఆవశ్యకతను వివరిస్తాయి.

్న కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు వంటివి చాలా అవసరమని తెల్పుతాయి.

్న పురుషులైనా, స్త్రీలైనా సమాజంలో పరిస్థితులను ఏ కోణంలో అవగతం చేసుకోవాలో వివరిస్తాయి.

్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందిస్తాయి.

్న జీవితాలకు చక్కటి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి.

్న నవల ఆధారంగా మనమున్న పరిస్థితులు, పర్యావరణం, సాంకేతికత పేరుతో మనం చేసే పనులు

కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి.

ఎస్‌.శ్రీదేవి రచనలు ఈ అంశాలన్నింటినీ తెలపడమే కాక సమాజాభివృద్ధికి, స్త్రీల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయని చెప్పవచ్చు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.