బొట్లు బొట్లుగా…
కన్నీరు…
వెల్లువై…ఉప్పెనై…
నోరు విప్పిన ప్రతిసారీ
గడ్డకట్టిన దుఃఖం
ఉబుకుతుంది…లావా అయి…
చూపులెప్పుడూ…
శరీరాన్ని దాటి
వెళ్ళలేనప్పుడూ…
వేల వేల అద్దాలలో…
బయటపడుతున్న
నీ మనోవికారం…
ఏ చదువులూ
నీలోని మృదుపార్శ్వాన్ని
తట్టిలేపనపుడు…
సంస్కారమంటే…”సాలీ”
అనడమే తెలుస్తుంది…
గుండె లోతుల చీకటికి
వెలుతురు రాదు…
విను… చూడు…
అరచేతులు కళ్ళకడ్డంగా
పెట్టుకున్నా…
చెవుల్లో హెడ్ ఫోన్స్
పెట్టుకొని… మెదడును మూసినా…
వినిపిస్తున్న ఆక్రోశం…
తొలుస్తున్న బాధ…
ప్రశ్నిస్తూంది…
లక్షల గొంతులై…