స్త్రీల చరిత్రగతిని మార్చిన మార్చి ‘8’….

అనగనగా ఒక రాజు, ఆ రాజుగారి కూతురు అందాలరాశి. అమెనో రాక్షసుడు ఎత్తుకుపోతాడు. అప్పుడు పక్క రాజ్యానికి చెందిన అందమైన రాజకుమారుడు వచ్చి రాక్షసుడ్ని చంపి రాకుమార్తెను రక్షించి తీసుకొస్తాడు. రాకుమార్తె తండ్రి ఆమెను ఆ రాకుమారుడికిచ్చి (ఈలోపుగానే ఆమె మొదటిచూపులోనే ఆ రాకుమారుడిని ప్రేమించేసి ఉంటుంది లెండి) పెళ్లిచేసేసి రాజ్యం వారికిచ్చేసి అడవులకి తపస్సుకోసం వెళ్లిపోతాడు. ఇక రాకుమార్తె పిల్లల్ని కంటూ, రాకుమారుడు రాజ్యాన్ని ఏలుతూ సుఖంగా జీవిస్తూ ఉంటారు. కథకంచికి, మన పిల్లలు నిద్రలోకి… ఇది మన కథల్లో రాకుమార్తె కుండే ప్రాముఖ్యత.

చరిత్రలో కెళ్తే ఝాన్సీలక్ష్మి, రాణి రుద్రమాంబ (వీరంతా మగ వేషాల్లోనే రాజ్యాలేలారు లెండి) లాంటి వారిని, మరీ మొన్నటి ఇందిరాగాంధీని (ుష్ట్రవ శీఅశ్రీవ ఎaఅ ఱఅ షశీఅస్త్రతీవరర అని కొనియాడిన) గుర్తుచేసుకుంటాం. కానీ వారలా చరిత్ర ప్రసిద్దిగాంచిన స్త్రీలుగా రూపుచెందడానికి వెనుక వారి తండ్రులో, లేక భర్తలో ఎంతగా కృషిచేసి, సహకరించారో మరీ వివరంగా చెప్పుకుంటాం. మరి గత రెండు శతాబ్దాలుగా ప్రపంచంలో జరిగిన అనేక వలసవాద వ్యతిరేకుద్యమాల్లోనూ, పారిశ్రామికీకరణ నేపధ్యంలో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా శ్రామికులు తమ హక్కులకోసం చేసిన పోరాటాల్లోనూ స్త్రీలపాత్ర గురించి మనకు తెలిసిందే చాలా తక్కువ. అంతేకాకుండా మనం ప్రతిసంవత్సరం మార్చి 8న గుర్తుచేసుకుని, అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా పండుగ చేసుకుంటునే ఉన్నాం. కాని మార్చి ‘8’కున్న ప్రాముఖ్యత ఏమిటి? అది అంతర్జాతీయ మహిళాదినంగా ఎలా గుర్తింపు పొందింది అనేది మాములు స్కూలు పుస్తకాలకు పరిమితమయిపోయి మన చదువులో భాగంగా మనం తెలుసుకునే అవకాశం లేదు. అందుకనే మార్చి ‘8’ ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం.

పారిశ్రామికీకణ నేపథ్యంలో స్త్రీలు పంటపొలాలు, పంటగదుల పనులకే పరిమితమైపోకుండా ఫ్యాక్టరీ పనుల్లో కూడా చేరడం మొదలయ్యింది. పట్టణాల్లో ఇటువంటి స్త్రీ కార్మికులు అధికసంఖ్యలో ఫ్యాక్టరీల్లోను, వర్క్‌షాప్‌లోనూ ఒకచోటికి చేరడం జరిగింది. కాని వారి పని పరిస్థితులు, జీతాలు పురుషులకంటే హీనంగా ఉండేవి. దీనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల్ని కనడం-పెంచడం, బాధ్యతల బరువుకూడ అమె భుజంమీదే ఉండేది (ఇప్పుడు కూడా మన స్థితి అంతేననుకోండి) 16 గంటల పని. ఒకసారి ఉదయం ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టిన స్త్రీకి మరి పగలు వెలుగు అంటూ ఎలా ఉంటుందో చూసే అవకాశం ఉండేది కాదు. 19వ శతాబ్దపు మధ్యకాలంలో బట్టల ఫ్యాక్టరీల్లో మగ కార్మికుల సంఖ్య 23శాతం మాత్రమే, మరి స్త్రీ కార్మికుల కూలి మగవారికూలీలో సగం మాత్రమే. ఈ విధంగా పారిశ్రామికీకరణ స్త్రీల, బాలకార్మికుల భుజాలపైనే పెరిగింది. అమెరికాలోని నల్లజాతి స్త్రీలస్థితి అయితే మరీ హీనంగా ఉండేది. వారికూలి తెల్లమగ కార్మికుని కూలీలో 1/3 వవంతు మాత్రమే, అంతేకాకుండా, తరచూ జాత్యహంకారపు చర్యలకు లోనవుతూ ఉండేవారు. వారిని నీతి లేని, విచ్చలవిడి మొద్దు అవతారాలుగా పరిగణించేవారు.

అయితే తెల్లవారి జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వారొక సంఘంగా ఏర్పడ్డారు. దానిపేరు ”నేషనల్‌ అసోసియేట్‌ ఆఫ్‌ కలర్డ్‌ వుమెన్‌”. ఈ విధంగా తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడటం ఆ రోజుల్లో చావును కొని తెచ్చుకోవడమే. కాని వారు వెనుకంజ వేయలేదు. 1832వ సంవత్సరంలో కొంతమంది తెల్లజాతికి చెందిన తోటి స్త్రీ కార్మికులు వారికి అండగా నిలిచి, బానిస వ్యతిరేక సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం సభ్యులు బానిసత్వాన్ని నిర్మూలించడానికి విరివిగా ప్రచారం చేసారు. కావలసిన నిధులు సేకరించారు. ఈ క్రమంలో వారు ఎన్నో కష్టాలు పడ్డారు.

ఈ విధంగా తొలి స్త్రీ కార్మికులు సంఘాలుగా ఏర్పడ్డానికి చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవలసివచ్చేది. కాని హీనంగా పనిచేసే పరిస్థితులు, బెత్తెడు కూలీ వారి ఐక్యతకు దోహదం చేసాయి. (ఆ రోజుల్లో ట్రేడ్‌ యూనియన్లల్లో కేవలం మగవారే ఉండేవారు) దాని ఫలితమే 1845 సంవత్సరంలో జరిగిన పశ్చిమ పెన్‌సెల్వానియా బట్టలమిల్లు కార్మికుల సమ్మె, 5000 మంది అడ, మగ కార్మికులు పనిగంటలు పదికి తగ్గించాలని సమ్మె చేశారు. ఇక్కడ స్త్రీల సంఘటిత శక్తి గురించి తెలిపే విషయం ఒకటి చెప్పాలి. కొంతమంది మగకార్మికులు సమ్మె మధ్యలో పనికి తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. స్త్రీ కార్మికులు మిల్లుగేట్లవద్ద బారులుతీరి సమ్మె విరమించాలనుకున్న కార్మికులను బయటికి తరిమేశారు. చివరికి 1848వ సంవత్సరంలో జరిగిన సమ్మెలో వారి సంఘటితశక్తి కారణంగానే పదిగంటల పనిదనాన్ని సాధించడం జరిగింది.

1888-89 సంవత్సరాలలో బ్రిటన్‌ కార్మిక ఉద్యమం ఉదృతరూపం దాల్చింది. ‘Bryant and May’ అనే అగ్గిపుల్లల ఫ్యాక్టరీలోని 1400 మంది స్త్రీ కార్మికులు సమ్మెచేసి పనిగంటలు తగ్గించడం, అనవసరపు ఫై˜న్‌లు లేకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు, దీని తర్వాత వివిధ పరిశ్రమల్లోనిస్త్రీలు కార్మిక సంఘాల్లో చేరడం అదికమయ్యింది. అమెరికాలో కూడా 1880 సంవత్సరం తర్వాత ఇటువంటి మార్పులే వచ్చాయి. స్త్రీల ట్రేడ్‌యూనియన్‌ లీగ్‌ ఏర్పడింది. ఎనిమిది గంటల పని పరిస్థితులు, ఇంటి వసతి మెరుగుపరచడం కోసం పోరాటం అనేది వారి కార్యక్రమంలో భాగం.

ఆ తర్వాత 20వ శతాబ్దంలో జరిగిన అనేక ఉద్యమాల్లో స్త్రీలు ప్రముఖపాత్ర వహించారు. వాటిలో ముఖ్యమైనవి- 20,000 కార్మికుల సమ్మె (1990 సం.) లారెన్స్‌ సమ్మె (1912 సం.) ఈ సమ్మెలకు మద్దతునిచ్చిన ట్రేడ్‌ యూనియన్లు The Induatrial workers of the world (IWW) Women’s Trade Union league. దీనిలో మొదటి సమ్మె న్యూయార్క్‌ పట్టణంలో 22 నవంబర్‌ 1909 సంవత్సరంలో మొదలయ్యింది. సమ్మెకు ముందు జరిగిన సమావేశంలో 2 గంటల చర్చల తర్వాత కూడా నాయకులుగా ఉన్న

మగవాళ్ళు సమ్మె విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నారు. అప్పుడు క్లారాలెమిట్‌ అనే యువతి వేదికనెక్కి ధైర్యంగా జనరల్‌ సమ్మెకి పిలుపునిచ్చింది. దాన్ని సమావేశంలోని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమ్మె ఫలితంగా వారి ముఖ్యమైన డిమాండ్‌ ఆమోదించబడనప్పటికీ స్త్రీలు ప్రధాన నిర్వహకులుగా సాగిన మొట్టమొదటి సమ్మెగా దీన్ని పేర్కొనవచ్చు.

1912 జనవరి-మార్చి నెలల్లో లారెన్స్‌ నగరంలో (యు.ఎస్‌.ఏ) జరిగిన సమ్మెలో 23వేల మంది కార్మికులు పాల్గొన్నారు. వారిలో 25 దేశాలకు చెందిన 45 రకాల భాషలు మాట్లాడే స్త్రీలు పాల్గొన్నారు. ఈ సమ్మెలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసు దెబ్బలవల్ల కొంతమందికి గర్భస్రావం అయ్యింది. 600 మంది జైలుపాలయ్యారు. వారి కుటుంబాలు ఆకలి పాలయ్యాయి. చివరికి సమ్మె విజయం సాధించింది. పై రెండు సమ్మెలు ‘స్త్రీ ఉద్యమాలు (సమ్మెలు)’గా పేరు పొందాయి. వీటికి suffragist ఉద్యమానికి (స్త్రీ ఓటు హక్కు గురించి జరిగింది) తెగని సంబంధం ఏర్పడింది.

20వ శతాబ్దం వరకు స్త్రీలకు ఓటు హక్కు లభించలేదు. ఓటు హక్కు ఉద్యమం తొలిదశలో మధ్య, ఉన్నత తరగతులకు చెందిన స్త్రీలు పాల్గొన్నారు. వీరి ఉద్యమం ఓటు హక్కు అనేది అన్ని వర్గాల స్త్రీలకోసం కాకుండా అస్థి, చదువు ఉన్న వారికి మాత్రమే అనే పరిధిలో జరిగింది. కాని 1907 సంవత్సరంలో స్టూట్‌గార్డ్‌, జర్మనీలో జరిగిన మొదటి సోషల్‌ ఉమెన్‌ కాన్ఫరెన్స్‌లో ఈ డిమాండ్‌ రూపం మారింది. జర్మన్‌ కమ్యూనిస్ట్‌ క్లారాజెత్కిన్‌ ‘ఓటుహక్కు అన్ని వర్గాల స్త్రీలకుండాలి. అది ఒక మధ్యతరగతి వారికి మాత్రమే పరిమితం కాకూడదు’ అని ప్రకటించింది.

ఆ తర్వాత 1908 మార్చి 8న న్యూయార్క్‌ లో రూట్జ్‌స్క్వేర్‌లో వేలకొలది మహిళలు ఒక గొప్ప ప్రదర్శన జరిపారు. దానిలో 10 గంటల పనిదినంతో పాటు పని పరిస్థితులు మెరుగు, లింగ, జాతి, ఆస్థి, చదువులతో సంబంధం లేకుండా పెద్దలందరికీ ఓటుహక్కు అనే డిమాండ్లను ముందుంచారు.

1910 సంవత్సరంలో కోపెన్‌హేగ్‌ (డెన్మార్క్‌)లో సోషలిస్టు వుమెన్‌ రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ జరిగింది. దానిలో జెత్కిన్‌ ‘మార్చి8’ని అంతర్జాతీయ మహిళాదినంగా (రెండేళ్ల క్రితం అమెరికాలో జరిగిన స్త్రీ కార్మికుల మహోద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని) ప్రకటించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా ‘స్త్రీ ఓటు హక్కు సమ సమాజ స్థాపనలో మన శక్తిని సంఘటితం చేస్తుంది’ అనే నినాదంతో మార్చి 8 అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ విధంగా మొదలయిన ఓటుహక్కు ఉద్యమం 1918 సంవత్సరంలో ఇంగ్లాడులోను, 1919 సంవత్సరంలో అమెరికాలోను విజయం సాధించింది. అంతకంటే అద్భుతం 1917సం.లో రష్యాలో జరిగింది. విప్లవం విజయం సాధించిన తర్వాత స్త్రీల ఆర్థిక, రాజకీయ, లైంగిక సమానతను తమ ఎజండాలో భాగం చేసారు. బోల్షివిక్‌ ప్రభుత్వం స్త్రీలకు ఓటుహక్కునివ్వడమే కాకుండా విడాకుల చట్టాన్ని ఆమోదించింది. పుట్టే పిల్లలు లీగల్‌ ఔనా, కాదా అనే మీమాంస రాకుండా ఉండే సివిల్‌ చట్టాలను తీసుకొచ్చింది. వీటివల్ల 1917 రష్యన్‌ విప్లవం స్త్రీ స్వాతంత్య్రోద్యమంలో ఒక మైలు రాయిగా నిలిచింది.

ఇక భారతదేశంలో మొట్టమొదటిగా మార్చి 8 ఉత్సవాలు 1943 సంవత్సరంలో బొంబాయిలో జరిగాయి. ఈ విషయం కేవలం వామపక్ష పత్రికలు మాత్రమే రాసాయి. 1980వ సంవత్సరంలో 50వ వార్షికోత్సవం సందర్భంగా మనదేశంలో కొన్ని రోజులపాటు మార్చి8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నారు. ఇదే సందర్భంలో మధుర రేప్‌కేసులో తిరిగి విచారణ జరగాలని పోలీసు, న్యాయవ్యవస్థల స్త్రీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశమంతా అనేక ప్రదర్శనలు జరిగాయి. అప్పటి నుంచీ, భారతదేశంలో మార్చి 8 స్త్రీలకు సంబంధించిన అంశాల గురించిన ఉద్యమదినంగా రూపుదాల్చింది.

అంతర్జాతీయ మహిళాదినం వెనుక ఇంత కథ, పోరాట చరిత్ర, వేలకొద్ది స్త్రీల త్యాగాలు, వాటి విజయాలు ఏన్నో ఉన్నాయి. ఓ మహాకవి తాజ్‌మహల్‌ అందాలు చూసి మురిసిపోవడం కాదు. దాన్ని కట్టడానికి రాళ్లెత్తిన కూలీల శ్రమని గుర్తుచేసుకోమంటాడు. ఒక్క రాళ్ళెత్తిన కూలీలనే కాదు వారితోపాటు రాళ్లెత్తుతూ కుటుంబంలో ప్రధానభాద్యతను కూడ తమ భుజాలపై మోస్తూ ప్రపంచమనుగడకే మూలస్థంబాలయిన స్త్రీలను, వారి శ్రమను, సమస్యలను అర్థం చేసుకోమని భుజం తట్టి లేపే రోజే ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం.

(జనవరి – ఫిబ్రవరి 1997 భూమిక నుంచి…)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.