స్త్రీల కోసం, స్త్రీ రక్షణ, సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రధాన ‘భూమిక’ పోషిస్తోంది. ఒక సంస్థగా ప్రారంభమై ఒక వ్యవస్థగా ఎదిగే నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందడుగు వేస్తూ, స్త్రీ జాతిలో ధైర్యాన్ని నింపుతున్నందుకు అభినందిస్తున్నాను.
”ఇందుగలడందులేడనే సందేహం లేదు” అన్నట్లు ఎక్కడ స్త్రీకి సమస్య ఉంటే అక్కడ ”భూమిక” ఉంది అన్న రీతిలో స్త్రీలలో నమ్మకం కలిగిస్తోంది ”భూమిక”.
అందరికీ ఆధారమైన భూమి-క పేరు ఎంపిక దగ్గర్నుండి, అట్టడుగు స్థాయిలో పనిచేసేవరకు సత్యవతిగారు పోషిస్తున్న పాత్ర అమోఘం. స్త్రీలందరూ గుండెలమీద చెయ్యి వేసుకుని నమ్మగలిగిన పత్రిక భూమిక.
ఇదే స్ఫూర్తితో ఇంకా ఎదిగి స్త్రీ జాతిలో ఒదిగిపోవాలని ఆశిస్తూ…
– పద్మావతి, హైదరాబాద్