తనొక అమ్మాయి కానీ రాత్రి తన ప్రవర్తనేంటి?
మగాడికి ఉండొచ్చేమో అంత యావ!!
ఎంతకీ అలసిపోదూ పైగా ఆ వయ్యారం, ఆ కసి చూపులు, ఆ మెడ విరుపులు అన్నీ ఏదో తెలిసినదానికిమల్లే…!!
పోనీ తనకేమైనా…??!!
ఛీ…ఛీ… తను ”నా” భార్య…!!
ప్రేమించుకున్నాం అనే కానీ ఏనాడూ
తన పైన చెయ్యి వేయలేదు… వేయనీయలేదు కూడా!!
‘ఆ’ తెల్లారి ”బెడ్‌షీట్ బానే ఉంది ఏంట్రా?” అని
తనే అడిగేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఎప్పుడో చదివిన సంగతి గుర్తొచ్చి అందరికీ
అలా ఉండదు, పైగా స్పోర్ట్స్ పర్సన్స్‌కి కూడా
అరుదట అని అన్నాను కానీ లోపల ఎక్కడో కొంచెం…??!!
ఛీ… ఛీ… తను ”నా” భార్య…!!
ఎక్కడైనా ఏదైనా తడబడకుండా మాట్లాడగలదు,
ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పగలదు,
కాని ”నేను రాకముందు నీ లైఫ్ (….) ఏంటి?” అని అడిగితే,
”చెప్పాలా? లేదా చెప్పి నిరూపించుకోవాలా?” అన్నట్టు ఓ చూపు నా వైపు విసిరి సన్నగా నవ్వుతుంది.
ఇంతకుముందేమైనా…??!!
ఛీ… ఛీ… తను ”నా” భార్య…!!
నన్నెక్కువగా ఆనందపరచాలని తను చేసిన పనులను నేను వంకరగా తీస్కుంటున్నానేమో…??
భర్తను చూసి భయపడే (లేదా భయం నటించే) వాళ్ళనే పతివ్రతలనుకోవడం నా పొరపాటేమో…??
”తెర చిరిగి రక్తం కళ్ళచూడాలనుకోవడం” నన్ను మనిషిని చేస్తోందనే భ్రమలో ఉన్నానేమో…??
పెళ్ళి అనే మేడ పైన తానుంటే, నమ్మకం అనే మెట్టు దిగి గతమడిగి ఇబ్బంది పెట్టానేమో…??
ఇన్ని ఆలోచనల నుండి బయటపడేసింది తన మెసేజ్ ”ఓయ్!! యానివర్సరీ (…………) రోజు కూడా ఆఫీసా??!!”