ఫోర్త్‌ ఎస్టేట్‌ కాస్తా రియల్‌ ఎస్టేట్‌ ఎందుకయ్యింది? -కొండవీటి సత్యవతి

 

ఇటీవల తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహారశైలి మీద తెలుగునాట తీవ్రస్థాయిలో ఒక చర్చ ప్రారంభమవ్వడం మంచి పరిణామం. నిజానికి ఈ చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. మీడియా, సినిమా, టీవీ, పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో స్త్రీల అంశాలకు సంబంధించి, స్త్రీలను గురించి ఎవరికిష్టమొచ్చినట్లు, నోటికి ఎంతొస్తే అంత పేలడం చూస్తున్నాం. సినీ నటుడు చలపతిరావు ఒక సినిమా విడుదల సందర్భంగా మాట్లాడిన రొచ్చు మాటలు, ఆ తర్వాత ఒక టీవీ స్టూడియోలో లైవ్‌లో కూర్చుని మహిళా సంఘాల గురించి సంస్కార రాహిత్యంగా మాట్లాడిన మాటలు అతడిని చట్టానికి పట్టిచ్చాయి. ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ జిఎస్‌టి మీద జరిగిన చర్చలు, అతని బాధ్యతారాహిత్యమైన కామెంట్లు అతడిని కూడా చట్టం ముందు దోషిగానే నిలబెట్టాయి. అయితే వీళ్ళకి చట్టం గురించి అవగాహన లేదు, గౌరవమూ లేదు. ‘మేం సెలబ్రిటీలం’ ఈ భూమి మీద ప్రాణులం కాదన్నట్టు వ్యవహరించే ఇలాంటి ఆమాంబాపతు వ్యక్తుల నెత్తికెక్కిన అహంకారపు తెరలు ఏదో ఒకరోజు జారిపోతాయని, చట్టం ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుందని అర్ధమవ్వడానికి (చర్మాలు దళసరి కదా!) చాలా సమయం పడుతుంది. సినిమాలు తీసినంత మాత్రాన తానేదో గొప్పవాడిననీ, ఈ దేశపు చట్టాలకి అతీతుడిననీ విర్రవీగినంత మాత్రాన చట్టం ముందుకు రాక తప్పదు. వర్మ విషయంలో అదే జరిగింది.

సునీతారెడ్డి అనే పోలీసు అధికారి పట్ల తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా వ్యవహరించిన తీరు పరమ జుగుప్సాకరంగా అన్ని విలువల్ని తుంగలో తొక్కి, టి.ఆర్‌.పి కోసం వెంపర్లాడిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. అత్యంత ప్రతిభావంతురాలైన ఒక పోలీసు అధికారి వ్యక్తిగత జీవితం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రజాస్వామిక హద్దులన్నింటినీ దాటేసిన మీడియా ఆమె ఇంట్లోనే ఆమెను వేటాడి, వేధించిన పద్ధతి తీవ్ర అభ్యంతరకరం. బ్రిటిష్‌ యువరాణి డయానాను హత్య చేసిన మీడియా మితిమీరిన వైఖరి తప్పకుండా గుర్తొస్తుంది. సునీత భర్త తన భార్యను ”రెడ్‌ హేండెడ్‌”గా మీడియా ద్వారా పట్టిచ్చాడు కాబట్టి పోలీసు శాఖ ఆమెను విధుల్నుండి సస్పెండ్‌ చేయడం మరింత ఆందోళన కలిగించే అంశం. విధుల్లో ఎలాంటి నెగటివ్‌ రిపోర్టు లేని సునీతని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీడియా ప్రదర్శించిన ”రెడ్‌ హేండెడ్‌” రుజువుతో ఆమెను విధుల్నుంచి తప్పించడం అన్యాయం. ఇంతకు ముందు నల్సార్‌ లా యూనివర్శిటీ విద్యార్థుల విషయంలోనూ మీడియా, ఇలాగే విద్యార్థుల్ని నానా యాగీ చేసి తన లేకితనాన్ని ప్రదర్శించింది.

సునీతారెడ్డి విషయంలో మహిళా సంఘాలన్నీ ఐక్యమై ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు, ఆ మీట్‌కి హాజరైన మొత్తం మీడియా మహిళా సంఘాల నాయకులతో వాదనకి దిగాయి. ఆమె భర్త పిలిస్తేనే తాము సునీతారెడ్డి ఇంటికెళ్ళామని, ఆమెను వెంబడిస్తూ బెడ్‌రూమ్‌లోకి, బాత్‌రూమ్‌లోకి వెళ్ళాం తప్ప ఎప్పుడూ ఇలాగే చేస్తామనడం అన్యాయమని వాదించారు. మీ ఉద్యమాలన్నింటికీ మేము ముందుంటామని, అలాంటి మమ్మిల్ని ఇలా దుమ్మెత్తి పోయడం అన్యాయమని చాలాసేపు వాదించారు. ఎన్నో అంశాలలో మీడియా సపోర్ట్‌ చేసిన విషయం తమకు తెలుసునని, అందుకు కృతజ్ఞతలు కూడా చెబుతామని, అయితే సునీతారెడ్డి కేసులో సహా ఎన్నో కేసుల్లో మీడియా అన్ని హద్దుల్ని దాటేసిందని, తాము దాని గురించే మాట్లాడుతున్నామని చెప్పడం జరిగింది.

ఈ పత్రికా సమావేశానంతరం జరుగుతున్న కొన్ని సంఘటనలు మీడియా దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయి. స్త్రీల

ఉద్యమంలో ఉన్నవారిని, పత్రికా సమావేశంలో పాల్గొన్నవారినే కాక కొంతమంది యూనివర్శిటీ ప్రొఫెసర్లను సైతం టార్గెట్‌ చేస్తూ గుర్తించలేని మెయిల్స్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ”మీ వ్యక్తిగత జీవితాల గురించి మాకు తెలుసు. ఆ సమాచారం అంతా మా దగ్గరుంది. మీ ”డార్క్‌ సీక్రెట్స్‌” బయటపెట్టి మిమ్మల్ని బదనామ్‌ చేస్తాం, మేము చెప్పినట్లు వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనుకాడం” అంటూ మెయిల్స్‌ వచ్చాయి చాలామందికి. వీటిపై సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇంత దిగజారిన పద్ధతిలో వ్యవహరిస్తున్నది మీడియా.

ఇదెలాంటి మీడియా అవుతుంది? టి.ఆర్‌.పి. వేట తప్ప మరింకెలాంటి విలువలూ పాటించని, బెదిరింపులకు సైతం పాల్పడుతున్న మీడియా పట్ల ఎలా వ్యవహరించాలి? బిజినెస్‌ హౌస్‌లుగా మారిన మీడియా హౌస్‌లను ఎలా సంస్కరించాలి. జెండర్‌ స్పృహ ఆవగింజంతైనా లేని ఎలక్ట్రానిక్‌ మీడియాని చట్టపరిధిలోకి, కేబుల్‌ నెట్‌వర్క్‌ చట్టపరిధిలోకి తేవాల్సిన అవసరం ఎంత ఉంది? మీడియాను ప్రజాస్వామికీకరించాల్సిన అవసరం, మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల మానవ హక్కుల్ని గౌరవించే ఒక గౌరవప్రదమైన, సున్నితమైన, సంస్కారవంతమైన మీడియా కోసం ఏమి చేయాలి అనే దానిమీద తెలుగునాట ఆరోగ్యకరమైన చర్చ జరుగుతోంది. మీడియా ఈ చర్చని ఆహ్వానించి, మహళా సంఘాల అభిప్రాయాన్ని గౌరవిస్తే బావుంటుంది. లేదంటే ప్రముఖ జర్నలిస్ట్‌ సాయినాధ్‌ అన్నట్టు ‘ఈ రోజు మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌ కాదు రియల్‌ ఎస్టేట్‌’ అన్న మాట నిజమయ్యే ప్రమాదముంది.

 

”డార్క్‌ సీకెట్స్ర్‌”

చీకటి రహస్యాలట

చీకట్లో జరిగే రహస్యాలట

అసలు చీకటి రహస్యాలంటే ఏమిటి?

ఈ రోజు మీడియా డార్క్‌ సీక్రెట్స్‌ అంటూ

కొత్తగా బెదిరిస్తోందా?

నిజానికి ఇది కొత్తేం కాదు

నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో

సో కాల్డ్‌ రక్షకభటుల చేతుల్లో

అత్యాచారానికి గురైన రమీజాబీ

చీకటి రహస్యాలివిగో చూడండి

పలు సంబంధాలున్న ఈమెను రేప్‌ చేస్తే తప్పేంటి?

అంటూ వాగింది ఆ నాటి మీడియా

పోలీసుల పన్నాగాన్ని విజయవంతంగా అమలుపరిచింది

‘రెడ్‌ హేండెడ్‌’గా పట్టుకున్నాం చూడండి

అంటూ అనైతిక పద్ధతిలో, అప్రజాస్వామికంగా

స్త్రీల వ్యక్తిగత జీవితాల్ని

వాళ్ళ బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లతో సహా

పబ్లిక్‌లోకి లాక్కొచ్చి

‘రెడ్‌ హాండెడ్‌’గా పట్టుకున్నామంటూ వదరుతోంది మీడియా

స్త్రీల వ్యక్తిగత ఛాయిసెస్‌ని, వ్యక్తిగత జీవితాన్ని

నైతికత చట్రంలో బిగించి శాసించాలని

భావిస్తున్న అమానవీయ, అనైతిక మీడియా

వ్యక్తుల, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగత జీవితాలమీద

అనుచితంగా వ్యాఖ్యానించే హక్కు తమకున్నదంటూ

బెదిరింపులకు, నీచ రాజకీయాలకు పాల్పడుతున్న మీడియా

స్త్రీల వస్త్రధారణ మీద, కదలికల మీద

వారి పబ్లిక్‌ ప్రపంచం మీద, ప్రయివేట్‌ జీవితం మీద

అవాకులూ చెవాకులూ పేలే గుత్తాధిపత్యం

ఈ మీడియాకు ఎవరిచ్చారసలు?

గురివింద చందాన తన నలుపు గురించి

అస్సలు పట్టింపులేని, పట్టించుకోని మీడియా

వ్యక్తుల ”సో కాల్డ్‌ డార్క్‌ సీక్రెట్ల”ను బయటపెడతామంటూ

బెదిరింపులకు దిగుతోంది దిగజారిన మీడియా

ధిక్కార స్వరాలను, ఉద్యమ కెరటాలను

మానసికంగా కుంగదీయాలని ప్రయత్నిస్తోంది.

ఖబడ్దార్‌! మమ్మల్ని ఆపడం మీ తరం కాదు

కెరటం కాసేపు విరిగినా తిరిగి అంతెత్తున ఎగసిపడుతుంది

మీడియా ప్రజాస్వామికీకరణ దిశగా పడుతున్న

మా సామూహిక అడుగుల్ని,

వీలైతే గౌరవించండి, మాతో కలిసి నడవండి

బెదిరింపులకు, సంకుచిత పన్నాగాలకు పాల్పడితే

ఖబడ్దార్‌! చట్టంతో చాచి కొడతాం కాచుకోండి…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.