లేలేత కుసుమాలను
ముళ్ళు, మూకుమ్మడి తోడేళ్ళై
చిన్నాభిన్నం చేస్తుంటే
గుడ్డిదైపోయింది దేశం
చిన్నారి అమాయకత్వం
కుక్కల దాడికి బలైపోతూ
ఆర్తనాదాలు చేస్తుంటే
చెవిటిదైపోయింది సమాజం
ఈ దేశపు ఆడపిల్ల మానం
నడివీధిలో సరుకైపోయి
న్యాయం కోసం పోరాడే చోట
మూగదైపోయింది చైతన్యం
కంచెలే చేనుమేస్తూ
ర్యాలీలు తీసి రచ్చ చేస్తుంటే
ఉక్కుపాదంతో తొక్కాల్సినవేళ
కుంటిదైపోయింది ఉద్యమం
‘బేటీ బచావో’ అంటే
బిడ్డను కాపాడే ముచ్చట కాదని
మీరే కాపాడుకోండనే హెచ్చరిక అని
మర్మం మర్చిపోయింది కుటుంబం
ఇంతకాలం గుడికెళ్ళినపుడు
తీసుకుంది తులసినీళ్ళ తీర్థమో
చిన్నారులు చిందిన రక్తమో
అర్థంకాని అవిటిదయింది ‘దేశభక్త’ జనం
Thanks to editor n entire bhumika team for publishing my poem. Keep the great work going towards empowerment of women