రజినీ తిలక్… ఈ పేరు కమ్యూనిస్ట్ ప్రజా సంగాలకు, మహిళా సంగాలకు, ఎన్జీఓ మహిళలకు, దళిత మహిళలకు, దళిత ఎన్జీఓ, కుల సంగాలకు, ఉద్యమ సంగాలకు బాగా తెలిసిన పేరు. ఆమె బహుజన్ ఫిలాసఫీకి రాకముందు విద్యార్థిని దశనుంచే మహిళలకు స్కాలర్‌షిప్‌ల కోసం, టాయిలెట్ల లేమిమీద మహిళల్ని కూడగట్టి ఉద్య మించింది. రజినీ తిలక్ రాష్ట్రీయ దళిత మహిళా ఆందోళన్ అధ్యక్షురాలు. గొప్ప రచయిత్రి. పాత ఢిల్లీకి వలసొచ్చిన ఉత్తర్ ప్రదేశ్ జాతవ్‌లు రజినీ తిలక్ వాళ్ళు. ఏడుగురు సంతానంలో పెద్దక్క రజినీ తిలక్. నర్సు కావాలని కలలు కని పైసల్లేక ఐటిఐలో టైలరింగ్ చేసింది. ఈ టైలరింగ్ చేసే తన తోటి మహిళల కోసం చేసిన ఉద్యమంతో మొత్తం తన జీవితమంతా ఉద్యమ బాటగా నడిచింది. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (పిఎస్‌యు) లో పంజేసి అదే కమ్యూనిస్టు ఉద్యమంలో పెండ్లి చేస్కుంది. పెండ్లి వాల్మీకి కులమతన్ని చేస్కుంది. కమ్యూనిస్టు ఉద్యమం లో కూడా ఆడవాళ్ళు వండేకాడ ఉంచే రాజకీ యాల్ని, మనువాద మగ పెత్తనాల్ని, ఆధిపత్య కుల పెత్తనాల్ని ప్రశ్నిస్తూ… ఆ క్రమంలో సహచరుడ్ని కూడా ఎదిరించి ఏడాది పసిబిడ్డతో… పార్టీనుంచి, ఇంటినుంచి బైటికొచ్చింది.
కమ్యూనిస్టు పార్టీలో పెద్ద కులాలదే పై చేయనీ అక్కడ చిన్న కులాలకు, మహిళ లకు సమాన ప్రాతినిధ్యాలు లేవనీ, కులాన్ని ఆచరిస్తూ కులం బుకాయింపులను పెత్తనాలను ఎదిరించిన ప్రశ్నలకు సమాధానాలు రాక మహిళా సంగాలవైపు మళ్ళింది. మధుర రేప్ కేసు సమయాన ఫెమినిస్టు, మహిళా సంగాలు పెద్ద ఎత్తున ఉద్యమించినయి. రజినీ ఆ కేసులో క్రియా శీలక పాత్ర నిర్వహించింది. మధుర కేసు ఉద్యమం భారతదేశ బహుజన కులాల మహిళలకు ఫెమినిస్టు మహిళా సంగాల పట్ల భ్రమలు కల్పించింది. ఫెమినిస్టు ఎన్జీఓ అయిన ‘సహేలీ’లో పంజేసింది చాలాకాలం. ఫెమినిస్టు మహిళా సంగాలు సవర్ణ మహిళా నాయకత్వంలో ఉన్నాయనీ, అవి కేవలం తమ సొంత సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చేస్తున్నాయనీ, దళిత మహిళల సమస్యల్ని కూడా ఎజెండాగా చేయాలని వాదించింది. గృహ హింస మీద మాట్లాడ్తుంటరు ఫెమినిస్టులు, కానీ కులహింస, పబ్లిగ్గా జరిగే హింసల మీద మౌనాలు. మహిళల విముక్తికి రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ల పేర్లు నిత్య స్మరణ చేస్తారు గానీ, సవర్ణ మహిళల మీదున్న వితంతు వివాహం, పునర్వివాహం, అవిద్యల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా మహిళాభివృద్ధి కోసం, మహిళల చదువు కోసం ఆశ్రమాలు పెట్టి పోరాడిన సావిత్రిబాయి ఫూలే, జ్యోతి రావ్ ఫూలేల మాట ఎత్తరు. మహిళా బిల్లు పెట్టి మహిళల కోసం తన పదవినే ఒదిలేసిన, మనుస్మృతిని దహనం చేసిన అంబేద్కర్‌ని అవాచ్యంగా ఉంచుతరు. ఎందుకంటే ఈ సంస్కర్తలది బ్రాహ్మణ కులం కాదు, అంటరాని వాళ్ళు అయినందున ఈ మహిళలు చరిత్రలో వారికోసం శ్రమించిన సంస్కర్తలను గుర్తించరు. మా బహుజన కులాలకు, బహుజన మహిళలకు బుద్ధుడు, సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావ్ ఫూలే, అంబేద్కర్ సిద్ధాంతాలున్నయి. మరి సవర్ణ కులాలకు, సవర్ణ మహిళలకు వారి ఐకాన్స్, వారి సిద్ధాంతాలేంటివి? అని ప్రశ్నించింది. ఇంటిలో పనికి విలువ కట్టాల్సిందే… ఏ పనికైనా అది ఆడవాళ్ళు చేసేదైనా, మగ వాళ్ళు చేసేదైనా, ఇంటి పనా, బైట పనా అని కాదు ఏ పనికైనా విలువ కట్టాల్సిందే. అయితే ఫెమినిస్టులు ముప్ఫయ్యేండ్ల నుంచి ఇంటిపని విలువల్నే మాట్లాడ్తున్నయి గానీ బైటి పని, బజార్లూడిసే పనికి సరిపడే సమాన వేతనాలు లేని కుల జెండర్, శ్రమ రాజకీ యాలు, కుల రాజకీయాలు మాట్లాడని మౌనాలను నిరసించి, వాదించి బైట ికొచ్చింది రజినీ తిలక్. ఖైర్లాంజి మారణ కాండలో అత్యాచారానికి గురై, క్రూరంగా చంపబడిన దళిత మహిళలు సురేఖ, ప్రియాంకల మీద ఫెమినిస్టు సంగాలు పెదవి విప్పలేదు. ఇట్లాంటి ఆధిపత్య జెండర్ రాజకీయాల్ని వదిలి అంబేద్కర్ సంగాల్లోకి వచ్చింది.
అంబేద్కర్ సిద్ధాంతం, సావిత్రి బాయి ఫూలే, జ్యోతిరావ్ ఫూలే ఆదర్శాలతో పనిచేస్తున్నామనే కుల సంగాల్లో దళిత మగవాళ్ళు దళిత మహిళా సమస్యల్ని, దళిత మహిళల ఆత్మ గౌరవాల్ని, హక్కుల్ని గుర్తించకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటి మగస్వామ్యాల్ని విభేదించింది. దళిత సంగాలంటే దళిత మగ సంగాలుగా చెలామణి అవుతున్న పరిస్థితులను వ్యతిరేకించింది. అట్లా అన్ని ఉద్యమాల్లో
ఉన్న మగస్వామ్యాల్ని, మహిళల పేరుతో
ఉన్న ఆధిపత్య దొర్సాండ్ల వివక్షలన్నింటినీ నిరసిస్తూ… ప్రశ్నిస్తూ… దళిత మహిళా సమస్యల్ని ఎజెండా చేస్తూ… సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ సిద్ధాంతాల వెలుగులో దళిత మహిళల అస్తిత్వ రాజకీయాలకై ‘రాష్ట్రీయ దళిత మహిళా ఆందోళన్’ ఏర్పాటు చేసి దళిత విద్యార్థినులను, దళిత ఉద్యోగినిలను, సెక్స్ వర్కర్స్, బార్ డాన్సర్స్, అంగన్‌వాడీ వర్కర్స్ ఇంకా అసంఘటిత రంగాల్లోని మహిళల్ని, గ్రామాల్లోని, పట్టణాల్లోని మున్సిపల్ మహిళల పక్షాన ఉద్యమించింది. ఈ సంగంతో పాటు మిగతా అనేక సంగాలకు వ్యవస్థాపక సభ్యురాలు రజినీ తిలక్. ‘సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ దళిత్ మీడియా (జూణూవీ) కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఉమెన్ (చీఖీణఔ) తో కల్సి పంజేస్తుండింది. ఢిల్లీలో ‘భారతీయ దళిత పాంథర్స్’ని స్థాపించింది. రజినీ తిలక్ గొప్ప రచయిత్రి. ‘దళిత్ లేఖక్’ సంగ్‌కి అధ్యక్షు రాలు. ‘పద్ చాప్ (వీaతీషష్ట్రఱఅస్త్ర ూ్‌వజూర)’ పవాసి బేచెయిన్ యావతియా (=వర్‌శ్రీవరర ఔశీఎవఅ) కవితా సంకలనాలు వేసింది. ఇంకా తన సంపాదకత్వంలో అనేక సాహిత్యం తీసుకొచ్చింది. తన బిడ్డ జ్యోత్స్న సిద్ధార్ధ్‌ను కూడా ఉద్యమ బాట పట్టించింది. దళిత మహిళా హక్కులు, ఆత్మ గౌరవం కోసం జీవితాంతం పోరాడిన రజినీ తిలక్ (60) 30-03-2018న ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌లో మా అందర్నీ వదిలేసి వెళ్ళడం ఉద్యమ సమాజానికి ముఖ్యంగా దళిత మహిళలకు తీరని లోటు.