రోజూ చిటికెడు తెల్ల విషం – ప్రశాంతి

ఎండాకాలం ముగింపుకొచ్చింది. గత పదిరోజులుగా అప్పుడప్పుడూ మబ్బులు పట్టి, ఉరుములతో పాటు జల్లులు పడటం, అంతలోనే గాలులకి మబ్బు కొట్టుకుపోవడం జరుగుతోంది. ‘వానలు పడితే కాయల్లో పురుగొస్తుందని చెట్లకి మిగిలిన చివరి మామిడికాయల్ని కోయించుకొచ్చేశా, ఒక యాభై ఉంటాయ్‌. ఏం చేస్తారో చూడండి’ అంటున్న తాతగారి మాటలు పూర్తవ్వ కుండానే బస్తా మూతి విప్పి రెండు మామిడి కాయల్ని తెచ్చేసుకుంది శాంతి. కాయల్ని కడిగి పొడుగు ముక్కలుగా కోసి చిన్న ప్లేటులో ఉప్పు, కారం కలిపి తీసుకొచ్చింది. ‘కాయలన్నీ కోసి ఒరుగు చేసి పెట్టుకుందాం’ అంటూ ఒక ముక్క తీసుకుంది అమ్మమ్మ. ఉప్పు కారం ఇవ్వబోతుంటే ‘నాకొద్దమ్మా, రక్తపోటు పెరిగిపోతుంది’ అంది అమ్మమ్మ.

మర్నాడు ఎండలో ఆరబెట్టిన

ఉప్పు కలిపిన మామిడికాయ ముక్కల్ని అటెల్తూ ఒకటి, ఇటొస్తూ ఒకటి నోట్లో వేసు కుంటున్న పిల్లల్ని ‘ఆ ఉప్పు ముక్కలు అదేపనిగా తింటే వాంతులవుతాయర్రా’ అని కోప్పడింది అమ్మమ్మ. వెంటనే రక్తపోటు ఎక్కువై తల్లో నరాలు చిట్లి, చచ్చిపోయిన చిట్టెమ్మ గుర్తొచ్చి నోట్లో నముల్తున్న ముక్క ఉమ్ముతో సహా ఊసేసింది రమ. మిగతా వాళ్ళు కూడా గబుక్కున బోరింగ్‌ దగ్గరికి పరిగెత్తి పంపుకొట్టి నీళ్ళతో నోళ్ళు కడిగేసు కున్నారు. ఇంతలో ‘కళ్ళు తిరుగుతున్నై అంటే ఉప్పు నీళ్ళు తాగమంటారు, ఉప్పు ముక్కలు తింటే వాంతులవుతాయంటారు. ఉప్పుతోనే ఉందా అంతా…’ అని ధర్మసందేహం లేవ నెత్తింది మణి. ‘అవును కదా! ఉప్పెక్కువైతే రక్తపోటు పెరిగిపోయిందని… తిండిలో

ఉప్పు తగ్గించేసి రక్తపోటు పడిపోయిం దంటారు. అసలేంటిదంతా’ అని ఆశ్చర్య పోయాడు శ్రీను. ‘మరంతే, ఏదైనా ఫర్వాలేదు కానీ, తిండిలో ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా దాని ప్రభావం ఒంట్లో రక్తం మీద… దాన్తో గుండె మీద గట్టిగా పడ్తాదంట’ అన్నాడు డాక్టర్‌ చేయాలనుకుంటున్న ప్రకాష్‌.

వీళ్ళ మాటలు వింటున్న లీలకి ఈ మధ్య చదివిన ఆర్టికల్‌ ఒకటి గుర్తొచ్చింది. కూరల్లో చిటికెడు ఉప్పు ఎక్కువైందనో, తక్కువైందనో సాకుతో భార్యలను హింసిస్తున్న భర్తలు… రెండంగుళాల నాలుక మీద మాత్రమే తెలిసిన రుచిని వదులుకోలేక, రుచిగా తినలేనప్పుడు బ్రతికేం లాభం? ఛస్తే ఏంటి అంటున్న బిపి పేషెంట్లు… ఉప్పు పండించే రైతులు మొదలుకొని వీథుల్లో తోపుడు బండిమీదో, రిక్షా బండిలోనో

కళ్ళుప్పు అమ్మే చిరు వ్యాపారుల వరకు రసాయన ఉప్పు ప్రభావానికి ఎలా గురయ్యారో చదివింది గుర్తొచ్చి ఒక్క క్షణం నోట్లో ఉప్పు నీళ్ళూరినట్టనిపించింది.

పప్పు తినని మనిషుండొచ్చేమో కానీ, ఉప్పు తినని మనిషంటూ ఉండరని, శరీరంలో ఉప్పు శాతం సమపాళ్ళలో లేకపోతే జరిగే అనర్థం అంతా ఇంతా కాదని అర్ధమై ఇంకా లోతుగా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో తెలిసిన నిజాలు మాత్రం చేదుగా ఉన్నాయి.

సహజంగా సముద్ర జలాల నుంచి పండించిన ఉప్పు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉపాధిపరంగా ఎంతో ఉపయుక్తంగా

ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌ని ముంచెత్తిన సన్నుప్పు… ‘సాల్ట్‌’… కేవలం ఒక బడా వ్యాపారవేత్త స్వార్ధంగా ఆలోచించి ఉప్పు రూపంలో ఉన్న తన వ్యాపార వ్యర్థాన్ని ప్రజలమీద గుమ్మరించి దాన్నించి కూడా లాభాన్నాశించి సేరు అర్థ రూపాయికి దొరికే కళ్ళుప్పుని మాయం చేసేసిన వైనం సామాన్య ప్రజలకెలా తెలుస్తుంది! తెల్లటి, సన్నటి, పొడిపొడిగా జారిపోయే ఉప్పు ఆకర్షణీయంగా రంగు రంగుల ప్లాస్టిక్‌ సంచుల్లో సిద్ధంగా దొరుకు తుంటే కిలోకి పదిరెట్లు ఎక్కువ ఖరీదైనా కొనడానికి వెనకాడని జనం ఆ సంచుల్లో ఉన్నది సహజమైన ఉప్పా కాదా అని ఆలోచించే అవకాశం లేకుండా పోయింది.

పదిమంది తినేంత కూరలో చారెడు గరుకుప్పు వేసేకంటే రెండు స్పూన్ల సన్నుప్పు సరిపోతోందని సంతోషపడుతున్నారు కానీ ఉప్పు పేరుతో అసహజ రసాయనాలు తింటున్నామని… అంటే రోజూ చిటికెడు తెల్ల విషం ఆప్యాయంగా తింటున్నామని తెలిసేదెలా! అది కూడా ఈ సన్నుప్పు అంటే అయోడిన్‌ నిండిన ఉప్పుని, వాడాలని అంగ వైకల్యం రాకుండా ఉండాలంటే, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అయోడైజ్డ్‌ ఉప్పే వాడాలని ప్రభుత్వమే ప్రచారం చేయడం వెనక ఎవరి స్వార్థముందో బైటికెలా వస్తుంది? శరీరంలో అవసరానికి మించి అయోడీన్‌ శాతం ఎక్కువైతే అది థైరాయిడ్‌ సమస్యలకి దారి తీస్తుందని ఏ డాక్టర్‌ చెప్పాలి?

సముద్రపు ఉప్పు చల్లటి తేమగాలి తగిలితే చెమ్మగిల్లిపోయి క్రమంగా నీరు చిప్పరిల్లి వాడకం అసౌకర్యంగా

ఉంటుందని… నిల్వ చేసుకోవడం మహా కష్టమని వాపోయేవారికి పొడిపొడిగా జాలువారిపోయే సాల్ట్‌ ‘రుచికర’మైన

ఉప్పదనాన్నిచ్చే ఒక రసాయనమని… దీర్ఘకాలిక అనారోగ్యానికి కమ్మటి దగ్గర దారని అర్థం చేయించడమెలా! అసలీ చిరువ్యాపారుల వర్తకాన్ని బడా కంపెనీలు ఎందుకు ఆక్రమించినట్లు? దీని వెనుక దాగిన వాస్తవాల్ని శోధించి ప్రజల ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా హరించే ‘సాల్ట్‌’ సీక్రెట్‌ తెలియాలంటే మరో ఉప్పు సత్యాగ్రహం రావలసిందేనా?!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.