నీవు ఆదుకోకపోవడం
నిరాశే కల్గించినా
అది ఒక రకంగా ‘దిక్ సూచికే‘
ఆశలు అనంతాలై
తీరక నిరాశ కల్గినా
అది ఒక రకంగా ‘ఆశా దీపికే’
కష్టాలెదురైనప్పుడు
ఆత్మ ఆక్రోశిస్తుంటే
అది ఒక రకంగా ‘సోపానమే’
నిత్య జీవితంలో నిత్యం
సమస్యలే ఎదురైనా
నీవు కఠినంగా నిరాకరించి
నిరంతరం రక్షించుకుంటావు
నీవు రక్షించినా శిక్షించినా
సారధిగా నా ముందు నిలు
చాలు…
నేను ముందుకు అడుగు వేస్తాను.