నలుపే తెలుపుకి కాంతి.. – పి. ప్రశాంతి

విశ్వవిద్యాలయం ఆవరణలో విస్తరించి

ఉన్న పెద్ద పెద్ద చెట్లు. ఎటు చూసినా గుంపులు గుంపులుగా చెట్లకింద చేరిన విద్యార్థులు. ఒకరినొకరు ఆట పట్టించుతకుంటూ, జోకులేసుకుంటూ, హాయిగా నవ్వుకుంటూ కొందరు…. సబ్జెక్ట్‌పై చర్చలు, పరీక్షల తయారీ వ్యూహాలు, ఎవరికెన్ని మార్కులు రావచ్చంటూ ఇంకొందరు… విద్యార్థి రాజకీయాలు, వాటిని ప్రభావితం చేస్తున్న పార్టీల రాజకీయాలు, వచ్చే ‘విద్యార్థి ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు. ఎవరికి మద్దతి వ్వాలంటూ మరికొందరు… ఎటు చూసినా చైతన్యం చిందులేస్తోంది. ఇవేవీ పట్టునట్టు ఓ చెట్టుకింద గడ్డిమీద ఎదు రెదురుగా కూర్చుని సీరియస్‌గా చర్చించు కుంటున్నారు అరుణ, క్రాంతి, అమల. ముగ్గురూ ఇంటర్‌ నుంచి స్నేహితులు, కలిసి చదువుతున్నారు, ఒకరికొకరు ఆసరాగా నిలిచారు, వారి వారి ఇష్టాలనుబట్టి ఎవరు ఏ కోర్సులో అయితే బాగా రాణిస్తారో కలిసి అంచనా వేసుకుని, అందుకు తయ్యారీలో ఒకరికొకరు సహకరించుకునేవారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షక్కూడా ఒకరినొకరు ప్రోత్సహించు కుంటూ చదివి, వారివారి విభాగాల్లో మంచి ర్యాంకులు సాధించి ఒకరు హ్యుమాని టీస్‌లో, ఒకరు మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో, ఒకరు లా కోర్సులో చేరి ఆర్నెల్ల యింది. మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో బానే రాసినా అనుకున్నన్ని మార్కులు రాకపోయేసరికి కొంచెం నిరుత్సాహపడ్డా తిరిగి పుంజు కున్నారు. క్లాసులయ్యాక ఎక్కువ సమయం లైబ్రరీలో గడుపుతున్నారు. పుస్తకాలు కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి. వారి అవసరాలేంటో అర్థం చేసుకోలేని తల్లి దండ్రులు. రోజువారి కష్టంతో బ్రతికే కుటుంబాలు. వారి వారి ఊళ్ళలో, వారి కుటుంబాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి చేరిన మొట్టమొదటి తరం అరుణ, క్రాంతి, అమల.

అరుణది మత్స్యకార కుటుంబం. క్రాంతి చర్మకార వృత్తిలో ఉన్న కుటుంబం. అమల యానాది కుటుంబం నించి వచ్చింది. ఈ స్థాయికి చేరడానికి చాలా పోరాటాలు చేశారు. ఇంట్లో, ఊళ్లో, బందువుల్లో ఎదిగిన ఆడపిల్లకి పెళ్ళి చెయ్యకుండా ఊరిమీద వదిలేశారనే వాళ్ళని, మా మాట విననిది మాకు చచ్చిన్దాన్తో సమానమని అనే వాళ్ళని; అంత చదివి ఊళేలాలా, సంసారం చేసి పిల్లల్ని కనాల్సిందేగా, ఇంత మాత్రానికి అంత చదువులెందుకో చోద్యం కాకపోతే అంటూ నిష్టూరాలాడే వాళ్ళని… ఎవ్వర్నీ లెక్క చెయ్యలేదు. ఎవరికీ భారం కాలేదు. మొదట్నించీ స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్‌లతో పాటు చదువుల్లో, రకరకాల పోటీల్లో చూపించిన ప్రతిభకిగాను పొందిన నగదు బహుమతులతోనే సరిపెట్టుకున్నారు. ఒక్కొక్కరికి మూడేసి జతలు బట్టలు కుట్టించు కుని మాకు తొమ్మిది జతలు న్నాయని సంబర పడేవారు. ప్రస్తుతం ఫీజులు తక్కువైనా ప్రాజెక్ట్‌ వర్క్‌లకి, ఇతర అవసరాలకి కావలసిన డబ్బు, స్కాలర్‌షిప్‌ వస్తున్నందున సరిపోతుందనుకున్నారు. కాని ఆ మొత్తం రిలీజ్‌ అవడానికి సమయం పడుతుందంట. ఎప్పటికోగాని రాదంట. దానికి తోడు ఇక్కడ అంతర్లీనంగా జరుగుతున్న పోరాటం… కులాధిపత్య పోరాటం ఇబ్బంది పెడ్తోంది. వీళ్ళు ముగ్గురూ మెరిట్‌మీదే సీటు సంపాదించుకున్నా, రిజర్వేషన్‌తో ఈ కోర్సుల్లో చేరగలిగారని, అడవి మనుషులని, సంస్కారం, నాగరికత తెలియని కుటుంబాల నించి వచ్చిన వారికి ఈ కోర్సులు ఎందుకని, ముందే ఏదైనా ఒకేషనల్‌ కోర్సులో చేరుంటే ఈపాటికి సంపాదనాపరులైపోయేవారని, ఎక్కువ మార్కులొచ్చినా మాకు దక్కని సీట్లు రిజర్వేషన్లుపయోగించుకుని ఎగరేసు పోయారని… నానా మాటలు వినాల్సి రావడం వాళ్ళని రగిలించేస్తోంది. భరించలేక మాటకిమాట చెప్పినందుకు హాస్టల్లో బాత్రూం దొరకలేదు, క్యాంటీన్లో కూర్చోడానికి టేబుల్‌ దొరకలేదు. క్లాసులో తన సీటూ దొరకలేదు. వెలివాడ గుర్తొచ్చింది. రగులుతున్న రక్తాన్ని కఠినంగా చల్లార్చి, ఒంగి దణ్డం పెట్టి సారీ చెప్తేగాని లైబ్రరీలో పుస్తకాలు దొరకలేదు, కాలేజీ కారిడార్లో నడవడానికి చోటు దొరకలేదు.

ఇవన్నీ కొత్తకాకపోయినా, విశ్వ విద్యాలయంలో పరిస్థితి వేరేగా ఉంటుందను కున్నారు. కానీ ఇంత వేరేగా ఉంటుందని, తమ వర్గానికి చెందిన వారు కూడా తమకు మద్దతివ్వలేరని, కనీసం సానుభూతి కూడా చూపలేరని ఇప్పుడే అర్థమైంది. వీరికి సపోర్ట్‌గా ఉంటే వారి కూడా జీవితం ముళ్లకంప మీద బట్ట వేసినట్లే అవుతుందని అనే వరకు అర్థంకాలా ఈ లోతు.

తమలాగే, ఇక్కడ చదువు కుంటున్న దళిత, ఆదివాసీ విద్యార్థులు చాలా మంది విశ్వవిద్యాలయాని కొచ్చిన మొదటి తరం వారని అర్థమైంది. అయితే, కొందరి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా పెద్ద పదవుల్లో లేరని, మరికొందరు ఆర్థికంగా దిగువ మధ్య తరగతి వారైనా తరాల బాని సత్వపు అగచాట్లని ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని కూడా అర్థమైంది. అతి కొద్ది మంది ‘తమవారు’ ఉన్నత పదవుల్లో ఉన్నా తమవారిగా ఆందుకోలేరని అర్థమైంది.

అందుకే, అంత సీరియస్‌గా చర్చకు కూర్చున్నారు. కాని, రిజర్వేషన్లు ఇంకెన్నాళ్ళు, ఒకసారి ఉపయోగించుకున్న వారి కుటుంబంలో తర్వాతి తరానికి

ఉండకూడదు, కులాలపరంగా ఉన్న రిజ ర్వేషన్లు తీసేసి ఆర్థిక స్థితి ఆధారంగా రిజ ర్వేషన్లు కల్పించాలని వాదిస్తున్న వారికి తమ జీవితాన్ని జీవిస్తేకాని అంటరాని తనమేంటో, బానిసత్వమేంటో, అణచివేత అనుభ వమేంటో అర్థం కాదని ఎలా తెలియాలి? మాతో జీవించడానికి వారిని ఆహ్వానించడం కూడా శిక్షార్హమంటున్న వారికి ఆహార సంస్కృతి, జీవన విధానం, వృత్తుల ఎంపిక… అసలు మనుధర్మ రహస్యం ఎవరు విప్పాలి? ఎందరికి చెప్పాలి? ఎవరు బాధ్యులు? నలుపుంటేనే కానీ తెలుపుకి కాంతి లేదని అర్థం కావాలంటే ఎలా???

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.