50 సంవత్సరాల 68′ ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం – డా|| రమా మెల్కోటే

1968వ సంవత్సరం ‘విద్యార్థి సంవత్సరమ’ని అంటారు. (year of the student) విద్యార్థులు చాలా దేశాల్లో రాజకీయ పోరాటాల్లో ముందుండి నడిపించారు. చైనాలో ‘Bombard the head quarters’ అనే నినాదంతో సాంస్కృతిక విప్లవం (Proletarian Cultural Revolution) చెకొస్లావాకియా ప్రాగ్‌ స్ప్రింగ్‌ (Prague spring) ‘Socialism with a human face అనే నినాదంతో, మెక్సికోలో ఏక పార్టీ వ్యవస్థకు వ్యతిరేకంగా, దక్షిణ అమెరికా, కొలంబియా లాంటి దేశాలలో పోలీసు సైన్యాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి. 1964లో అమెరికాలో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా, అదే విధంగా నల్లజాతి, indigenous ప్రజల పౌర హక్కుల ఉద్యమాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూరప్‌లో పశ్చిమ జర్మనీలో, ఫ్రాన్స్‌, ఇటలీ, హాలెండ్‌, స్వీడన్‌ దేశాల్లో విద్యార్థి ఉద్యమాలు ఊపందుకున్నాయి.

50 సంవత్సరాల క్రితం విద్యార్థులు ప్యారిస్‌లో ఉద్యమంలో పాల్గొంటూ ”ఇది ప్రారంభం మాత్రమే, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం” అంటూ నినాదమిచ్చారు. 68′ మే నెలలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని ఫ్రెంచ్‌ ప్రభుత్వం అణచివేసి, పాత సామాజిక వ్యవస్థను, ప్రభుత్వాన్ని కాపాడగలిగింది. అయితే రాజకీయ, సామాజిక సంక్షోభం, విద్యార్థుల ఉద్యమం నిర్మించిన మార్గావరోధాల (Barricades) బయట, ఒక నూతన సామాజిక చరిత్ర ప్రారంభమైనదనడంలో సందేహం లేదు. కొత్త సమస్యలు, కొత్త సంఘర్షణలు, ఎటువంటి సిద్ధాంతం కానీ, పార్టీ కానీ, పాలసీ కానీ లేకుండానే తలెత్తాయి.

పారిశ్రామికీకరణ చెందిన పాశ్చాత్య దేశాలన్నింటికంటే కొంత వెనకబడిన దేశమే అయితే విద్యార్థి ఉద్యమం రావడమే కాకుండా, ఇతర దేశాలకంటే (జర్మనీ, అమెరికా) ముందుండి, కొత్త సమస్యలు, కొత్త సైద్ధాంతిక అవగాహనలు తేవడానికి ఫ్రాన్స్‌ ఏ విధంగా, ఎందుకు దోహదపడింది?

జర్మన్‌లో ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఆర్థిక దోపిడీకే పరిమితం చేయకుండా, సామాజిక వ్యవస్థను, సామాజిక జీవితాన్ని కూడా నియంత్రించడాన్ని వ్యతిరేకిస్తే, వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని యూనివర్శిటీలు వ్యతిరేకిస్తే, చెకొస్లావాకియా స్వేచ్ఛ (intellectual freedom) కై చేస్తున్న ప్రజా పోరాటాలు అన్నీ అప్పటి (60ల) నేపథ్యం. అయితే ఫ్రాన్స్‌ తన కాలనీల్లో స్వాతంత్య్రానికై వస్తున్న ప్రజాపోరాటాలను నియంత్రించడంలో వైషమ్యాలు చూసింది. అల్జీరియాలో అతి క్రూరంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసి తన colony ని వదులుకోవడానికి ఒప్పుకోలేదు. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని ఫ్రాన్స్‌లో శ్రామిక వర్గ ఉద్యమం మాత్రం కొనసాగుతూ ఉంది. వామపక్ష మేధావులు రాజకీయ సాధికారత పొందకపోయినప్పటికీ, సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థను విశ్లేషించడంలో, వ్యతిరేకించడంలో నాయకత్వం వహించారు. సాధారణంగా ఇక్కడ వచ్చిన ప్రశ్న… అమెరికాలో, బర్కెలీలో, జర్మనీలో వచ్చిన ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను సంక్షోభంలోకి నెట్టలేనప్పుడు 68’ మే నెలలో ఫ్రాన్స్‌లో వచ్చిన విద్యార్థి ఉద్యమం ఫ్రెంచ్‌ సమాజాన్ని, ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి ఎందుకు నెట్టగలిగింది అనే ప్రశ్న. దీనికి కారణాలు ఫ్రెంచ్‌ సామాజిక వ్యవస్థ, అక్కడ యూనివర్శిటీ వ్యవస్థ. ఒకవైపు కేంద్రీకృత వ్యవస్థ, మరోవైపు ఉదారవాద వ్యవస్థ, ఆధునీకత, ప్రాచీనత (Archaic) మిళితమైన సామాజిక వ్యవస్థ. వీటితోపాటు జనరల్‌ డి గాల్‌ (French President Gen. De Gaulle) దృష్టిలోని ఫ్రెంచి జాతి చారిత్రక వైభవం (National Grandeur). ఇవన్నీ ప్రజలకు, అంతకంటే విద్యార్థులకు అతి దూరమైన విషయాలు. విద్యార్థులు బూజు పట్టిన పాత యూనివర్శిటీ విధానాలను, బూర్జువా వ్యవస్థను వ్యతిరేకిస్తూ కొత్తగా వస్తున్నటువంటి professional experts, technicians, rsearch group తో జతకట్టి సామాజిక ఉద్యమానికి నాంది పలికారు.

50 సంవత్సరాల మే 68

ఫ్రాన్స్‌లో మే నెలలో వచ్చిన విద్యార్థి ఉద్యమం యూనివర్శిటీ వ్యవస్థనే కాకుండా, సామాజిక వ్యవస్థను కూడా కుదిపి వేసింది. దీనికి కారణాలు ఒకవైపు యూనివర్శిటీ వ్యవస్థ, మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులు, తద్వారా వస్తున్న సామాజిక మార్పులు. యూనివర్శిటీ వ్యవస్థ దేశంలో వస్తున్న మార్పులతో స్పందించకుండా, కేంద్రీకృత పరిపాలన ఫ్రెంచ్‌ విద్యావ్యవస్థను ఒక మూలలోకి నెట్టివేసింది. పియర్‌ బూర్దియో Pierre bourdieu – Socialogist) చేసిన విశ్లేషణలో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. హైస్కూలు ముగించిన విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయంలో చేరినప్పటికీ వర్గరీత్యా, సామాజిక స్ధాయి రీత్యా ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికి ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కార్మిక వర్గాలకు గ్రామీణ, రైతాంగ వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉన్నత వర్గాలకు చెందిన యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఇమడలేక పోవడం ఒకటైతే, ప్రాచీన సాహిత్యం, భాషల (లాటిన్‌, గ్రీకు) ప్రాముఖ్యత తగ్గిపోవడం, ప్రమాణాలు తగ్గిపోవడం నూతన విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోవడం బూర్జువా యూనివర్శిటీ పునాదుల్ని కదిలించింది. ”ఫ్రెంచ్‌ సమాజంలో ఆర్థిక వ్యవస్థ తీసుకొస్తున్న మార్పులు యూనివర్శిటీ, ఉన్నత విద్య పాత్రలో కూడా మార్పులు తెచ్చింది. ఉన్నత విద్యా వ్యవస్థ అంతర్గత నిర్మాణం, పాలనా పద్ధతుల వల్ల (internal organization) పెద్ద సంఖ్యలో వచ్చిన కొత్త సామాజిక వర్గ విద్యార్థులను ఇమడ్చలేక (విద్యా వ్యవస్థలో కలుపుకోక పోవడం) పోయింది. అధిక సంఖ్యలో చేరిన మహిళా విద్యార్థులు, కొత్త సామాజిక వర్గాల విద్యార్థులు తమ సామాజిక స్థాయిని పెంచుకోవడానికై ఉన్నత విద్యా సంస్థల్లో చేరడం వల్ల విద్యార్థి సంఘాల్లో (Student Community) పెను మార్పులు రాక తప్పలేదు.

విద్యా వ్యవస్థ సామాజిక పరిణామాలకు అనుగుణంగా మార్పులు తేలేకపోవడంతో పాటు, మార్క్సిజంపై ఒక కొత్త కోణంలో అవగాహన, మార్క్స్‌ రచనలను ఒక కొత్త కోణంలో విశ్లేషించడం కూడా విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. అప్పటివరకూ అందుబాటులో లేని మార్క్స్‌ రాసిన రచనలు Young Marx, Roza Luxembourg అంథోనీయ గ్రాంసి సమకాలీన మేధావులు – లూయీ జాక్‌ డెరీడా మొదలగువారి ఫ్రెంచ్‌ రచనలు అమెరికా, బ్రిటిష్‌ యూనివర్శిటీలను ప్రభావితం చేశాయి. రష్యాలో స్టాలిన్‌ సోషలిస్టు నమూనాను, కేంద్రీకృత ఆధిపత్య విధానాలను వ్యతిరేకించారు. అయితే ఇది కార్మిక వర్గ ఉద్యమాలకు అంతగా సోకలేదు. 1960లలో ఒక anti establishment culture, బూర్జువా వ్యవస్థపై వ్యతిరేకత, మార్క్సిజం స్ఫూర్తితో పెరిగింది. పేరుపొందిన రచయిత్రులు, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలావరకు వామపక్షానికి చెందినవారే. ఇటలీలో ఇది ఫాసిజంకు వ్యతిరేకమైతే, కమ్యూనిజాన్ని మాత్రం వ్యతిరేకించలేదు. రోమన్‌ కేథలిక్‌ చర్చి ప్రభావాన్ని నిరసించారు. ఫ్రాన్స్‌లో ‘Jean Luc Godard was the incarnation of the spirit of 1968′, ఒక కొత్త సంస్కృతి – counter culture –  వస్త్రధారణలలో, లైంగిక సంబంధాల్లో, యువత ప్రవర్తనలో వ్యక్తమయింది. వివిధ వర్గాల నుంచి, సమూహాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలపై వామపక్ష అవగాహన వారిని collective action కు పురిగొల్పింది. సోషియాలజీ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం లాంటి వాటిని అభ్యసించిన విద్యార్థులు సమాజంలోని సైద్ధాంతిక వైరుధ్యాలను, ప్రభుత్వ పాలసీలను విశ్లేషించారు. విద్యార్థుల సమస్యలను సామాజిక సమస్యలతో ముడిపెట్టి విశ్లేషించారు. 1968 మే, జూన్‌లలో ఎన్నడూ లేనన్ని కార్మిక వర్గ సమ్మెలు, పెట్టుబడిదారీ విధానాలను ప్రశ్నించాయి. యూనియన్లతో సంబంధం లేకుండా కొత్త పద్ధతులను అవలంబించాయి. Tools down sabotage, go slow methods etc.  కార్మిక సంఘాల్లో ఉధృతమవుతున్న కార్మిక అసంతృప్తిని అరికట్టలేక పోయాయి. 1968 ఫిబ్రవరిలో నాన్‌తెర్‌ యూనివర్శిటీ (Nanterre university)లో Daniel Cohn – Bendit అనే విద్యార్థి మగ విద్యార్థుల కోసం ఈతకొలను ప్రారంభోత్సవ సందర్భంలో యూనివర్శిటీ అధికారులను హేళన చేస్తూ ”Down with Sexual ghettos” అనే నినాదంతో అమ్మాయిల వసతి గృహంలోకి ప్రవేశించడం, విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో అధికారుల వైఫల్యాన్ని ఖండిస్తూ ప్రదర్శనలు చేయడం, ఆ తర్వాత (మార్చి 22న) యూనివర్శిటీ పరిపాలనా విభాగాన్ని (Administrative building) ఆక్రమించడం… ఇవన్నీ ఇతర ప్రాంతాల్లో విద్యార్థులను ఉత్తేజపరిచాయి. ఏప్రిల్‌ 12న ప్యారిస్‌లో లాటిన్‌ ుబaత్‌ీవతీ లో పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి, విద్యార్థి నాయకుడైన రూడీ దుష్కె (Rudy dutckeh) పై జరిగిన ఫాసిస్టు దాడిపై నిరనస వ్యక్తం చేశారు. యూనివర్శిటీ అధికారులు పోలీసులను పిలవడంతో విద్యార్థులను అరెస్టు చేయడం, అటు నాన్‌తెర్‌ యూనివర్శిటీని మూసివేయడం (మే 2) ఇవన్నీ చివరకు స్వేచ్ఛకు, స్వావలంబనకు ఆలయమైన సోన్‌బోర్‌ (Sorbonne) యూనివర్శిటీలో రెక్టర్‌ పిలుపు మేరకు మొట్టమొదటిసారి పోలీసులు ప్రవేశించడం జరిగింది. ఫ్రెంచ్‌ విద్యార్థి సంఘమైన UNEF పెద్ద ఎత్తున విద్యార్థి ప్రదర్శనకు పిలుపునిచ్చింది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల్లో చాలామంది గాయపడ్డారు. పారిస్‌ నగరంలో పలు వీథుల్లో విద్యార్థులు బ్యారికేడ్లను నిలబెట్టారు. మే 10న పలు కార్మిక సంఘాలు, CGT (Confederation generale des Travelleurs), National Union of french Students (UNEF), FEN (Teachers union) సమ్మెకు పిలుపునిచ్చాయి. 600,000 మంది విద్యార్థులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వామపక్ష నాయకులు పారిస్‌ వీథుల్లో నినాదాలిస్తూ ప్రదర్శన చేశారు. విద్యార్థులు, పోలీసుల మధ్య యుద్ధం జరిగింది. పలు పత్రికలు పోలీసుల దౌర్జన్యం గురించి వార్తలు ప్రచురించాయి. స్థానిక మధ్య తరగతి – Local bourgeous వారు హింసాకాండను ఖండిస్తూ విద్యార్థులకు వైద్య సేవలందిస్తూ సాయపడ్డారు. మధ్య (secondary), ఉన్నత విద్య ఉపాధ్యాయ సంఘం (SNESUP) సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రజాభిప్రాయం పోలీసు చర్యను తీవ్రంగా ఖండించింది.

మే 12న ప్రఖ్యాత ఫ్రెంచ్‌ మేధావి జీన్‌పాల్‌ సార్త్‌ృ (Jan Paul Sartre) స్పందిస్తూ విద్యార్థులకు మద్దతునిస్తూ ”విద్యార్థులు యూనివర్శిటీని బద్దలు చేయాలి, అందుకోసం వీథుల్లోకి రావాల్సిందే”నని పిలుపునిచ్చారు. ఫ్రెంచి ఫెమినిస్టు సిమోన్‌ ది బ్యువోయ్‌ర్‌ (Simone de Beauvoir) కు మహిళా మేధావులు తమ మద్దతునిచ్చారు. రెండు రోజులపాటు సోర్‌బోని మూసివేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, అన్ని సంఘాలు, వివిధ అభిప్రాయాలకు చెందిన వారు యూనివర్శిటీ గదుల్లో, హాల్లోనే ఉండి ఎన్నోఉపన్యాసాలిస్తూ, పాటలు పాడుతూ గడిపారు. సోర్‌బోన్‌ తిరిగి తెరిచినప్పుడు అన్ని చోట్లా ఎర్ర జెండాలు ఎగురుతూ, కరపత్రాలతో నిండిపోయి విప్లవాన్ని తలపెట్టింది. విద్యార్థులకు బయటనుంచి ఆహారాన్ని అందించి చిన్నపిల్లల కోసం క్రెచ్‌ను కూడా అందుబాటులోఉంచారు. మే 14న South Aviation ఫ్యాక్టరీ కార్మికులు 2000 మంది సమ్మెకు దిగారు. ూఅaతీషష్ట్రశీ ూవఅసఱషaశ్రీఱర్‌ నాయకత్వాన ఎర్రజెండా ఎగరేసి సమ్మె చేశారు. మద్దతుగా పేరు గాంచిన రెనాల్ట్‌ (Renault) మోటారు కంపెనీ సమ్మెలో చేరింది. విద్యార్థి సంఘాలు, కార్మికులకు మద్దతుగా ఎర్రజెండాలు పట్టుకుని రెనాల్ట్‌ కర్మాగారంలోకి ప్రవేశించారు.

దేశవ్యాప్తంగా అన్ని అనుబంధ సంస్థల్లో సమ్మెలు జరగడం, 18న అతి పెద్ద రవాణా సంస్థ మెట్రో (under ground train) సమ్మె చేయడం వల్ల దేశం స్తంభించిపోయింది. మే 24 నాటికి సమ్మె చేస్తున్న వారి సంఖ్య పది మిలియన్లకు చేరి ఫ్రాన్స్‌లో అతి పెద్ద సమ్మెగా గుర్తించబడింది. అయితే గుర్తించాల్సిన విషయాలు – కార్మికులు జీతాలు పెంచమని మాత్రమే అడగలేదు. Power to the workers’ అని ఎర్ర జెండాలు ఎగురవేశారు. official కార్మిక సంఘాలు అంటే పార్టీ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాలతో కలవడానికి సిద్ధపడలేదు. ఫ్రెంచ్‌ కమ్యూనిస్టు పార్టీ, దాని అనుబంధ కార్మిక సంఘాలు విద్యార్థి ఉద్యమంలో చేరడానికి ఒప్పుకోలేదు. Romantic petit bourgeious student movement అనే ధోరణిలో CGT సమ్మె చేసినప్పటికీ విద్యార్థి ఉద్యమానికి దూరంగానే ఉంది. వారంపాటు కొనసాగిన సమ్మెలో విద్యార్థులకు, పోలీసు దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో చాలామంది గాయపడడంతో రెనాల్టో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులతో, ప్రభుత్వంతో మే 27న కనీస వేతనాల పెంపు, పని గంటల తగ్గింపుపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విద్యార్థులు మాత్రం పోలీసులు రెనాల్టో ఫ్యాక్టరీని ఆక్రమించడాన్ని నిరసిస్తూ సమ్మె కొనసాగించారు. పోలీసు కాల్పుల్లో ఒక విద్యార్థి, ఇద్దరు కార్మికులు చనిపోయారు. UNEF విద్యార్థి సంఘం పోలీసు నిర్బంధం/దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగడంతో హింస పెరిగింది. పోలీసు వ్యాన్‌ తగలబెట్టడం, కిటికీల అద్దాలు పగలగొట్టడం లాంటి చర్యలు చేపట్టడంతో, అప్పటిదాకా విద్యార్థులకు సంఘీభావం తెలిపినవారు ఆ హింసాకాండను వ్యతిరేకించారు. ఇందులో 400 మంది గాయపడ్డారు. విద్యార్థులు, విద్యా సంస్థల కేంద్రమయిన లాటిన్‌ క్వార్టర్‌ యుద్ధ రంగంగా మారడంతో సాధారణ ప్రజలు సహనం కోల్పోయారు. అంతేకాక సిత్రాయెన్‌ (Citroen) మోటారు ఫ్యాక్టరీలో సమ్మెలో పాల్గొన్న 900 మంది కార్మికులను పనిలోనుంచి తొలగించారు. జరుగుతున్న ‘విప్లవం’ గురించి మాట్లాడుతూ ఫ్రెంచి రేడియోలో పనిచేస్తున్న వారందరూ ఉద్యోగాలు కోల్పోయారు. సోర్‌బోన్‌ విశ్వవిద్యాలయాన్ని, ఓదెయోన్‌ (Odeon) సినిమా హాల్‌ను పోలీసులు తెరిపించి, ఖాళీ చేసి అందరినీ బయటకు పంపించారు. చివరకు ‘శాంతి’ స్థాపించబడింది.

1968 మే విద్యార్థి ఉద్యమాన్ని జనరల్‌ ది గాల్‌ (Gen De Gaulle) crisis of civilisation గా వర్ణించి, సంస్కరణల అవసరాన్ని గుర్తించారు. అయితే శాంతి భద్రతలు ముందుగా అవసరమని భావించి పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకై పిలుపునిచ్చాడు. మే 30న దాదాపు అన్ని పార్టీలు – గాలిస్టులు (Gaullists), కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు వారి వారి కారణాలు, ఉద్దేశాల రీత్యా ఎన్నికలకు సిద్ధమై సమస్యలను సంస్కరణల ద్వారానే పరిష్కరించాలని నిశ్చయించాయి. 1968 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో జనరల్‌ ది గాల్‌ (Gen De Gaulle) పెద్ద ఎత్తున గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. విద్యార్థి నాయకులు, Cohn Bendit (కోన్‌ బాందీ), Danny the Red (డానీ ద రెడ్‌) ఊహించినట్లుగా విప్లవం ముందుకు సాగలేదు. “The revolution was still born”.  “The Revolution will not be achieved in a single day and it is not tomorrow that the students and workers will unite”. అయితే, ఇది ప్రారంభం మాత్రమేనని, పోరాటాన్ని కొనసాగిస్తామని వారు గట్టిగా నమ్మారు.

68′ మే ఉద్యమాన్ని పలు రకాలుగా విశ్లేషించారు. ఫ్రెంచ్‌ మేధావుల్లో కొందరు విశ్వవిద్యాలయాల్లో సంక్షోభం, కొత్త తరం విద్యార్థులు అధిక సంఖ్యలో చేరడం, పాతబడిన విద్యా విధానాలు, మురుగుపడుతున్న నాగరికతకు వ్యతిరేకంగా వామపక్ష ప్రత్యామ్నాయం లేక, రాజకీయ సంక్షోభానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం అని విశ్లేషించారు. సామాజిక ఉద్యమాలపై పరిశీలనా గ్రంథాలు రచించిన ఆలాన్‌ తూరెన్‌ (Alain Tourraine) మే 68′ ఉద్యమం పారిశ్రామిక వ్యవస్థను, సంస్కృతిని వ్యతిరేకించలేదని, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యతిరేకతలకు తెరతీసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించిందని విశ్లేషించాడు. ప్రజల కోరికల మేరకు సామాజిక మార్పు కోసం వచ్చినటువంటి ఉద్యమం విప్లవం తీసుకు రావడంలో విఫలమైనప్పటికీ విద్యార్థి ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి నూతన రాజకీయ, సామాజిక దృక్పథాలను, సమకాలీన రాజ్య వ్యవస్థను, సామాజిక వ్యవస్థను తీవ్ర విమర్శకు గురిచేశాయి. అటు రష్యాలో స్టాలిన్‌ స్థాపించిన కమ్యూనిజాన్ని విమర్శిస్తూ, మార్క్సిజాన్ని పునః విశ్లేషించి నయా వామపక్ష (New Left) సిద్ధాంతాలకు నాంది పలికింది. ఫెమినిస్టు ఉద్యమం, పర్యావరణ ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలకు దోహదపడింది. సంస్థాగతమైన జాతి, కుల వివక్షల ముసుగు తొలగించి, వ్యక్తిత్వం Consciousness/Subjectivity లను విశ్లేషణాంశాలుగా నిలబెట్టి సామాజిక శాస్త్రాల్లో, Humanities లో నూతన పరిశోధనా పద్ధతులు (Theoretical methods) కీలకమైన మార్పులు, interdisciplinary approaches దోహదపడింది. ఫ్రాన్స్‌లో, జర్మనీలో విశ్వవిద్యాలయాల సంస్కరణలు అనివార్యమయింది.

68′ విద్యార్థి ఉద్యమం విప్లవాన్ని తీసుకురాకపోయినా, అది ఫ్రెంచి చరిత్రలో ఒక గీటురాయని చెప్పాలి. ఉద్యమం లేవనెత్తిన సమస్యలు, విషయాలు, చర్చలు ఇప్పటికీ చర్చనీయాంశాలే. 68′ తర్వాత పలుమార్లు జరిగిన సమ్మెలు ఆర్థిక సంక్షోభానికి చిహ్నాలు. 2007 నవంబరులో 5 మిలియన్ల కార్మికులు ఆరోగ్య సంస్థలు, పోస్టల్‌, విద్యుత్‌ రంగాలు, గ్యాస్‌ సర్వీసెస్‌లోని ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, విమానయాన రంగం ఉద్యోగులు 24 గంటలపాటు సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్తంభింపచేశారు. అప్పటికే విద్యార్థులు, రైల్వే కార్మికులు సమ్మె చేపట్టారు. పెరుగుతున్న మధ్య తరగతుల ఆర్థిక సంక్షోభంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 1, 2018 మే డే సందర్భంగా జరిగిన కార్మిక ప్రదర్శనలో కూడా పోలీసులతో ఘర్షణలు తప్పలేదు. 19 సంవత్సరాల విద్యార్థి తన ఆందోళనను ఈ విధంగా వ్యక్తపరిచాడు. ”పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నింటినీ నాశనం చేస్తోంది. ఎదిరించే వారిని పోలీసులు నిర్బంధిస్తారు. దీంతో విసిగిపోయాము”.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.