మేధ-017 ఎంతో మంచి పుస్తకం. ఈ పుస్తకం రాసింది సలీం, బొమ్మలు గీసింది ఠాహక్. ఈ పుస్తకం పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకంలో స్నరణ్ పదవ తరగతి చదువుతుంటాడు. అతని చెల్లెలు శృతి ఎనిమిదో తరగతి చదువుతుంది. వాళ్ళిద్దరికీ వీడియో గేమ్స్ ఆడటం ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్న వాళ్ళకు ఎంతో మంచి వీడియో గేమ్స్ కొనిచ్చాడు, తయారు చేసిచ్చాడు. వాళ్ళ నాన్న పేరు బ్రహ్మం. అతను ఒక పెద్ద శాస్త్రవేత్త. కృత్రిమ మెదడు, మేథస్సు గల మరమనిషిని సృష్టించడమే అతని లక్ష్యం. అందులో అతని భార్య తమస్విని కూడా అతనికి సహాయం చేస్తుంటుంది. ఆఆయన మరమనిషికి శిక్షణనిస్తూ ఒక చిప్‌ని వీడియోగేమ్‌లో పెడతాడు. అప్పుడు ఆ వీడియో గేమ్ పిల్లలను తనలోకి తీసుకు వెళ్తుంది. మెదడు సరదాగా తరువాత ప్రమాదం తెస్తుంది. ఉంటుంది. అయితే తర్వాత అది తోడేళ్ళ గుంపును వాళ్ళ ఇంట్లోకి పంపిస్తుంది. అప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే మేధ-017 చదవాల్సిందే.
– సి.చక్రవర్ధన్ రెడ్డి, 8వ తరగతి, అరవిందా హైస్కూల్
పచ్చని చెట్లతో ఎన్నో ప్రకృతి అందాలు.
అరవింద చిన్నారులు బంధాలు.
నాలుగు గోడల కూడలిలో అరవింద అందాలు.
పూల తోటలోని గులాబి పుష్పాలు
పక్షుల కిలకిలా రావాలు
అరవింద చిన్నారుల రాగాలు.
శ్రీ కృష్ణుని బృందావనం.
మా చిన్నపాటి జ్ఞాపకాల అరవింద వనం.
– డి.సాల్మన్ జెదిద్య, 9వ తరగతి, అరవిందా హై స్కూల్.
చిన్ని చిన్ని కృష్ణుడు
చిన్నారి కృష్ణుడు
రాధా ప్రియుడు కృష్ణుడు
పరంధామ కృష్ణుడు
యశోద తనయ కృష్ణుడు
వేణుగాణ ప్రియా కృష్ణుడు
గోపాల కృష్ణుడు
అల్లరి కృష్ణుడు
– వి.కౌశిక్ ఈశ్వర్ చైతన్య, 10వ తరగతి, అరవిందా హై స్కూల్
మురళీ నాధుడు
చిన్ని కృష్ణుడు
నెమలి పింఛదారుడు
అందాల కృష్ణుడు
ధేనువు వాహనదారుడు
జయ కృష్ణుడు
చిలిపి చేష్టల ధారుడు
చిలిపి కృష్ణుడు
మగువలకు ప్రియుడు
ప్రియ కృష్ణుడు
రాధాపతి, రాధాకృష్ణ
పూమాలల ధారుడు
చిరునవ్వుల కృష్ణుడు
నీలిరంగు శరీర ధారుడు
నీలి కృష్ణుడు
జయ కృష్ణా ముకుందా! మురారీ!!!
– టి. వీర నాగ ఆదిత్య, 10వ తరగతి, అరవిందా హై స్కూల్.