తీరానికవతల… -సుజాత పట్వారీ

 

భుజాల మీదుగా

కొంగును లాక్కొని

నిశ్శీర్షికగా

నడిచి వెళ్ళే

సరళరేఖ…

ఎవరు తనతో

సంభాషించినా

హాస్యపు గనులు

ఇట్టే తెరుచుకుని

మనలో నవ్వుల తంత్రుల్ని

మీటి,

చుట్టూ

ఆనంద ఛాయల్ని

పరిచే

సతతహరితవనం – మన ముందే !

ఓ మాట నిశ్శబ్దాన్ని

ఓ మహానది శాంతిని

అన్వేషిస్తూ వెళ్ళిపోయాక

ఈ తీరాన

మౌనంగా నేను

అటు తీరాన

ఆకాశపు నీలంలా

తను…

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.