ఆడజన్మ
– కె. మౌనిక
ఆడజన్మ పాడు జన్మగా చూసేటి ఈ యొక్క
పాపిష్టి రాజ్యంబులోనే ఆడజన్మనెత్త, గోస పడేకంటే
అడివిలో మానయి పుట్టిందే మేలో
పెరిగిందో మేలో || ఆడజన్మ ||
తల్లి ఒడిలో కన్ను తెరిసిందో లేదో ఆడపోరినంటు
మీ నాన్న తిట్టిండో ఇంటోళ్ళందరు ఈసడించుకుండ్రు
ఇంటోళ్ళందరు ఈసడించుకుండ్రు ఆడపిల్లగ
పుట్టినందుకు బడికి పోయే బాగ్యమ లేదంట (2) || ఆడజన్మ ||
అద్దమద్దమొలే ఇల్లాకిలి ఊడ్చిన సక్కంగ చుక్కోలే
ముగ్గే పెట్టిన మిలమిల మెరిసేటి బోలే తోమిన
నందన వనమొలే అందంగా వండిన ఇంటోళందరికి
(2) మంచాల మీదికి కంచాలు ఇచ్చిన…
ఎంత పని చేసిన గాని అది నూటికి రాధంట
అది అక్కరకు లేదంట || ఆడజన్మ ||
మేం అన్నదమ్ములు అర్థరాత్రి దాక తిరిగి వచ్చిన
గాని ఆ అనరు వాళ్ళను ఊ అనరు గాని
గడప దాటి ఒక కాలు బయటకు వేసిందో లేదో
జరగరానిదేదో జరిగేపోయినట్టు మా అమ్మ
తిటిందో మా అయ్య కొట్ట కొట్టొచ్చిండో || ఆడజన్మ ||
నేను బ్రతకలేను ఆడ మగ తేడాలేని
సమాజ మార్పుకై సాగిపోతాను…
నా స్నేహం
నా ప్రాణానికి ప్రాణం
నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నేస్తమా
ఒంటరితనములో జంటగ నిలిచిన
తోడువు నీవే నా నీడవు నీవే నేస్తమా
శోధన – వేదన బాధలలో నా వెలుగు నీవే నేస్తమా
అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివీ
నా తల్లియు నీవే నా తండ్రివి నీవే నేస్తమా
నా కొండవి నీవే నా కోటవి నీవే నేస్తమా
విప్లవాల వనములో
విప్లవాల వనములో ఎర్ర మందార పువ్వులో
నింగిలోన దారమోలే నీటిలోన చాపవోలే
ఎగిసినార జనములో కమ్యూనిస్టు బిడ్డలు
విప్లవ పాఠమై పోరు గీతమై || విప్లవాల ||
ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు
ఎవరో ఈ పిల్లలు అడవి మల్లెపువ్వులు
వీళ్ళ నడుముల్లో తూటాల దండలు
వీళ్ళ నడకల్లో ఎర్రని జెండాలు || విప్లవాల ||
అయ్యో పేరు కొరకు ఒచ్చిరందున అయ్య
అమ్మ పెట్టిన పేరు చెప్పరు అయ్యో ఆస్తి కొరకు
వచ్చిరందున వీపున సద్దిమూట కూడ ఉండదు ||ఎవరో ||
అయ్యో దొరల భూములెన్నో పంచిన ఒక సెంటు
భూమి కూడ ముట్టరు అయ్యో చెరువు కుంటలెన్ని
తవ్విన ఒక చుక్క కూడా వారు ముట్టరు || ఎవరో||
—
నీ సెలవడిగి నే కదిలెత్తన్న నా కలలన్ని నీతో
వదిలెత్తన్న ఎంత అనుకున్న ఏదో బాధ మెలిపెడుతుందో
లోపల అనుకుంటె మరి తెగిపోయేదా మన అనుబంధం
నేటిధ భారంగా ఉంది నిజాం దూరంగా వెళ్తుంది జీవితం
నీమాటే నా నిర్ణయం నీ కోసం ఏదైనా సమ్మతం
ఆ… ఆ… ఆ…
నమ్మక తప్పని నిజమైన శావిక రావని
చెబుతున్న ఎందుకు వినదో నా మది ఇప్పుడైన
ఓ…ఓ… ఓ…
ఎవరు ఎదురుగ వస్తున్న నువ్వేనో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనొదిలేన
ఓ… ఓ… ఓ…
ఎందరితో కలిసి ఉన్న నే ఒంటరిగానే
ఉన్న నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా
ఓ… ఓ… ఓ…
నే నమ్మలేకున్న నువ్వు నిన్నటి కలవే అయిన
ఇప్పటికి ఆ లోకంలోనే ఉన్న
ఓ… ఓ… ఓ..