యిండ్లల్ల గూడ టాయిలెట్లు లేని ఆడగోసలు -జూపాక సుభద్ర

 

టాన్స్‌ జెండర్‌ మిత్రులు అప్పుడప్పుడు మా సెక్రెటేరియట్‌కి వచ్చేటోల్లు. మినిస్టర్లని కలవడానికి, ప్రభుత్వ అధికారాలను కలవడానికి వచ్చేవాల్లు. వాల్ల సమస్యల్ని అర్జీలుగా యిచ్చేవాల్లు. అట్లాయిచ్చి ఆ సమస్యల మీద నాతో కూడా చర్చజేసేటోల్లు. అట్లా వచ్చి చర్చచేస్తూ… ఒక ట్రాన్స్‌జెండర్‌ మిత్రురాలు ఒకసారి ‘అక్కా వాష్‌రూమ్‌కి వెళ్లొచ్చా’ అని అడిగింది.’ అయ్యో దానికి అడుగుడెందుకు? పో…’ అన్నాను మామూలుగా.

దానిని ఆమె టాయిలెట్‌ సొదంతా ముందటేసింది. ”అయ్యో అక్కా ఈ టాయిలెట్‌ సమస్య నాబతుకునే బర్బాత్‌ జేసింది. అందికే మేము నీల్లు తాగి బైటకు రామక్కా… జెంట్స్‌ టాయిలెట్స్‌, లేడీస్‌ టాయిలెట్స్‌ ఆఫీసులల్ల రైల్వే, బస్టాండుల్ల వుంటాయి గానీ ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్స్‌ వున్నయా! మా టాయిలెట్‌ సమస్య వల్ల నాకు ఉద్యోగం బోయింది, దీని కోసం నాకు ఎవ్వరూ

ఉద్యోగం యిస్తలేరక్కా. మాది బాగా చదువుకున్న కుటుంబం. అందరూ బాగానే వున్నారు ఉద్యోగాల్లో. నేంగూడ పీజీ చేసి ఒక ప్రైవేటు కంపనీలో చేరిన. నిజానికి నాకు ఈ ట్రాన్స్‌ సమస్య 5వ క్లాసునుంచే మొదలైంది. నాన్న, అన్నలు నా నడకమీద, నవ్వుమీద, మాటతీరుమీద ‘ఆడపిల్ల షెకలేంట్రా అని బాగా కొట్టేవాల్లు మార్చుకొమ్మని బాగా హింసించేవాల్లు. వాల్లు ఎంత కొట్టినా తిట్టినా, హింసబెట్టినా నా శరీరం ఆడపిల్లలాగనే ప్రవర్తించేది. నన్ను మగవాడిగా చూపించ డానికి చాలా తంటాలు బడేది నటించేది మా వాల్లు, నన్ను నటింపజేసేవాల్లు.

ప్రైవేటు కంపనీలో నాకు ఉద్యోగ మొచ్చినప్పుడు ఆ నటన ఉపయోగపడింది. ఉద్యోగానికి ప్యాంటు, షర్టు వేసుకొని మగవాడిలాగ నడవడానికి మాట్లాడడానికి హింసబడుతూ నటించేది. అట్లా పదేండ్లు నటిస్తూ పంజేసిన బైట మాట్రాన్స్‌లతో కలిసి తిరుగుతున్నా, కలిసి ఉద్యమిస్తున్నా… మా కంపనీకి నా ట్రాన్స్‌ గుట్టు బైటబడకుండా పంజేసిన.

ఎప్పుడైతే 377 సెక్షన్‌ మీద సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందో అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మా కంపనీకి అప్పన్నించి చుడిదార్‌ వేసుకొని, అమ్మాయిలా మంచిగ తయారైపోవడం మొదలుబెట్టిన. నన్ను నేను ట్రాన్స్‌జెండర్‌గా, ట్రాన్స్‌ మహిళగా గర్వంగా పరిచయం చేస్కున్న మా కొలీగ్స్‌ అందరికి. అందరి నోర్లు తెరుచుకొని, తలలు వాలిపోయినయి కాని నాకు కొత్త సమస్య తలెత్తింది. నేను ఏ టాయిలెట్‌ లోకి పోవాలి? లేడీస్‌ టాయిలెట్లకు పోవడానికి లేదు, జెంట్స్‌ టాయిలెట్‌కి పోవడానికి లేదు మరి ఏంచేయాలి? నీళ్ళు తాగడం మానేసిన, రోజంతా టాయిలెట్‌కి పోలేని పరిస్థితికి అసలు ఒక్క చుక్క నీల్లు తాగకపోయేది. నేను సీటు నుంచి లేస్తే చాలా ఆడ, మగ కళ్ళన్నీ వాష్‌రూమ్‌కాన్నే వుండేయి. అట్లా నీళ్ళు తాగక, యూరిన్‌ని కంట్రోల్‌ చేస్కున్నందు వల్ల, యూరిన్‌కి బదులుగా రక్తం వచ్చేది. తర్వాత ఆరోగ్యం పాడైంది, కిడ్నీ సమస్యలొచ్చినయి. సెలవులు పెడితే… వార్నింగ్‌ ఉత్తర్వులు యిచ్చేది కంపని. నా ఆరోగ్య సమస్యల కారణం చెప్పి, ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ఒక ప్రత్యేక టాయిలెట్‌ ఏర్పాటు జెయ్యమని అర్జీపెట్టిన. నా అర్జీని చూసి యిన్నేండ్లనా సర్వీస్‌, రిమార్క్స్‌లేని నా పనితనాల్ని పక్కకు తోసి నన్ను ఉద్యోగం నుంచి తీసేసింది కంపనీ యాజమాన్యం.

తర్వాత ఏ ప్రైవేటు సంస్థలు నన్ను

ఉద్యోగంలోకి తీసుకోలే ట్రాన్స్‌జెండర్‌కి ప్రత్యేక టాయిలెట్‌ అర్జీ యితర సంస్థలక్కూడా ఫార్వర్డ్‌ అయిందేమో! ‘అమ్మో ట్రాన్స్‌జెండర్స్‌కి

ఉద్యోగాలివ్వడమే రిస్క్‌. యింకా ప్రత్యేక టాయిలెట్లా అని ఎవ్వరూ ఉద్యోగ మియ్యట్లే దక్కా”… ఆమె టాయిలెట్‌ బాధ చుట్టు అల్లుకున్న రాజకీయాలు విన్నంక నాకు మొసమర్రలే.

ఈ మధ్య కేరళ ప్రభుత్వం స్కూల్లల్ల విద్యార్థులు, విద్యార్థినీలు నీల్లు తాగడం లేదనీ, దానివల్ల ఆరోగ్యం సమస్యలొస్తున్నాయని గంటకోసారి నీల్లబెల్‌ కొట్టాలనే నిబంధన తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం కూడా దాన్ని యిక్కడికి తెచ్చింది. మంచి నిర్ణయమే బాగా వుంది. కానీ మన స్కూల్లల్ల టాయ్‌లెట్ల వసతులు సక్కంగ సవ్యంగా వున్నాయా! రాష్ట్రంలో దేశంలో టాయిలెట్లువున్న స్కూలు ఎన్ని వుంటాయి? పది శాతం గూడా లేవని లెక్కలు చెప్తున్నయి టాయిలెట్స్‌ లేని బడుల్లో నీల్ల బెల్‌ కొట్టినా విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినీలు నీళ్ళు తాగగలరా! నీళ్ళు తాగి టాయిలెట్లకు ఎక్కడికి వెళ్లగలరు? నీళ్ళబెల్లు కొట్టినా టాయిలెట్‌ భయంతో నీళ్ళు తాగ గలరా! యీ టాయిలెట్లు ఆడపిల్లల చదువుల్ని గూడ మాన్పిస్తున్నయి.

అయితే యివన్నీ బయటి ప్రదేశాల్లో టాయిలెట్లు లేని విషయాల ముచ్చట. కానీ పల్లెల్ల గూడేలల్ల యిండ్లల్ల టాయిలెట్లు వుండని ఆడవాల్ల, ఆడపిల్లల బాధలు కూడా మాట్లాడు కోవాలి. గూడెం యిండ్లల్ల అంతా ఆరు బయలుగ వుంటాయి. చాటు, మాటులు చూసుకోవాల్సిందే గానీ టాయిలెట్లు వుండవు. నిత్యం వచ్చేపోయే మనుషులు, అటిటు తిరుగుతుంటరు మగవాల్లు. ఆడవాల్లకు చానా కష్టం. కానీ వీల్లకున్న బతుకుదెరువు కష్టంలో, యింకా రకరకాల శతకోటి కష్టాల్లో బోడి కష్టంకింద కొట్టేస్తరు.

నేను గూడెం గుడిసెల నేపథ్యం. టాయిలెట్‌కి పోవాలంటేనే… ఏ చెట్టునో, ఏ బండచాటునో, ఏ గోడ చాటునో వెతుక్కో వాలె. అక్కడ పాములు తేళ్ళు, పురుగు పుట్రలు లేకుండ చూసుకోవాలె. ఎవరన్నా మొగ వాల్లొస్తున్నారా గమనించుకోవాలె. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఎక్కువ. అందికే నీళ్ళు దూపార తాగకపోయేది. ఈ గోస పడలేక హాస్టల్లోనే వుండేది. యింటికొస్తే టాయిలెట్‌ వసతిలేక, సిగ్గుతోని, అవమానా లతో ఓ చావుగా వుండేది టాయిలెట్‌ సమస్య. ఈ మద్యనే కొద్ది మంది తడికలతోనన్న చాటు కడ్తున్నరు ఆడవాల్లకోసం. మా కాలంలో యిండ్లల గూడ టాయిలెట్‌ సమస్యలే. టాయిలెట్ల కోసం చావు అంచులకు పోయిన అనుభవాలు రాస్తాను ఈ సారి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.