నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25న స్త్ర్రీలపై హింసకు వ్యతిరేక దినంగా మొదలై అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ప్రచారం ముగుస్తుంది.
ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో ూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని 16 రోజుల యాక్టివిజవ్‌ుగా ూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి?
అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్ళు ఆడపిల్లల్ని లైంగికంగా కాల్చుకుతింటున్న సంఘటనల గురించి మాట్లాడాలా? పెళ్ళయితే కుటుంబ హింస, పెళ్ళి చేసుకోకపోతే ఒంటరిమహిళగా ఎదుర్కొనే హింస, రోడ్డు మీద హింస, పనిచేసేచోట హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం ఇలా మాట్లాడాలి?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది స్త్రీలు గొంతు చించుకుని ఎలుగెత్తి హింస లేని సమాజం స్త్రీల హక్కు’ అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం అంటూ నినదిస్తున్నారు. ఎవరు వింటున్నారీ మాట? ఎవరి చెవులద్వారా ఎవరి గుండెల్లోకి చేరుతోంది ఈ ఘాెష? అసలు ఎవరైనా వింటున్నారా? ఆ వింటున్న వాళ్ళకి తల్లి ఉండదా? తోడపుట్టిన వాళ్ళుండరా? సహచరో, సహవాసో ఉండరా? ూతుళ్ళుండరా? ఉంటారు. అందరూ ఉంటారు. తాము నానారకాల హింసలకి పాల్పడుతూ, తమ వాళ్ళని భద్రంగా ఉంచుతున్నామనే భ్రమలో ఇళ్ళల్లో బంధించాలనుకుంటున్నారు.
ఓ పక్క స్త్రీల బతుకుల్ని హింసామయం చేస్తూ మరో పక్క మేమే స్త్రీల రక్షకులమంటూ ఫోజు కొట్టడం ఎలాంటి నీతి అవుతుంది? పురుషులు పాటిస్తున్న ఈ ద్వంద్వ నీతి కోట్లాది స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తోందో గణాంకాలు చెబుతూనే
ఉన్నాయి. అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం అనే నినాదం ఎవరిని ఉద్దేశించింది? పురుషుల్నా? వ్యవస్థల్నా? ప్రభుత్వాలనా? వివిధ హింసలతో వేలాది స్త్రీల మరణాలకు కారణమౌతున్న శత్రువు అసలు ఎవరు? ఎవరి మీద మనం పోరాడుతున్నాం? స్త్రీల రక్షణ కోసం బోలెడు చట్టాలు తెచ్చాం మా పని అయిపోయింది అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వాలు స్త్రీల పక్షపాతంతో వ్యవహరిస్తూ, వాళ్ళ కోసం కొత్త కొత్త చట్టాలు తెస్తూ, మమ్మల్ని రాచిరంపాన పెడుతోంది అంటున్నాయి పురుషవాద సంఘాలు. అంతేకాదు పురుషుల్ని వేధించే స్థితికి మహిళలు చేరిపోయారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ూడా ఆరోపించి, దూషిస్తున్నారు. ఇదే నిజమైతే హింస ఎందుకు పెరుగుతోంది? హింసారూపాలెందుకు మారుతున్నాయి.? ఆలోచించి, విశ్లేషించే ఆసక్తిగాని’ అసలు కారణాలను అన్వేషించే సహనం కానీ లేని కొంతమంది పురుషులు స్త్రీలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు’ అవతలి వైపు చూసే అవసరం మాకు లేదు అంటూ మొండిస్తుేన్నారు.
నిజమే! ప్రభుత్వం మహిళల ఉద్ధరణ కోసం కొత్త చట్టాలను తేస్తూనే ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం స్త్రీల మీద హింసను అంతం చేసే చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇంకా ఎన్నో ూ్యలో ఉన్నాయి ూడా. ఇవన్నీ మహిళలకి అండగా, రక్షణగా ఎందుకుండటం లేదు? దీనికి కారణం ఒక్కటే. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టాలన్నీ ఆచరణ యోగ్యంకాని విధంగానే మిగిలిపోతున్నాయి. కొత్త చట్టాల అమలుకు కావలసిన బడ్జెట్‌లు, వనరులు మంజూరుకావు. వాటిని పటిÄష్ఠంగా అమలు పరిచే వ్యవస్థలు రూపొందవు. చట్టం అందమైన భాషలో, అద్భుతమైన పదజాలంతో రూపొంది కాగితం పులిలా గాండ్రిస్తుంటుంది. ఆ గాండ్రింపుల భయపడి పురుష ప్రపంచం ప్రభుత్వం స్త్రీల పక్షం అంటూ నింద వేస్తుంది. మరింత హింసని ప్రేరేపిస్తుంది. పటిష్ఠమైన ఆచరణకు నోచుకొని చట్టాలు మరో వంద వచ్చినా స్త్రీలకు ఒరిగేదేమీ లేదు. గృహహింస చట్టం కింద ఏర్పాటైన రక్షణాధికారులు జిల్లా ప్రధాన ంద్రంలో ూర్చుని ఆ జిల్లాలోని స్త్రీలందరిని గృహహింస నుంచి కాపాడుతారనుకోవడం ఎంత భ్రమో చట్టాలొక్కటే స్త్రీలను హింసల్నుండి రక్షిస్తాయనుకోవడం అంతే భ్రమ.
స్త్రీల మీద హింస ఇంత భయానక స్థితికి చేరి తొమ్మిది నెలల పసికందు నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధురాలికి ూడా రక్షణ లేని స్థితి ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పెచ్చరిల్లిపోతున్నది. భారతదేశంలో స్త్రీల ఉద్యమం వల్ల అనేకానేక చట్టాలు, సహాయ సంస్థలూ వచ్చాయి.
మహిళలు, పిల్లల సహాయార్ధం అనేక వ్యవస్థలు నడుస్తున్నాయి. అయినప్పటికీ హింస తగ్గుముఖం పట్టకపోవడానికి కారణం అమలులో ఉన్న చట్టాల గురించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగకపోవడం ఒక కారణమైతే, చట్టాల అమలు తీరు, సకాలంలో న్యాయం దొరికి శిక్షలు పడక పోవడం మరో కారణం.
ప్రభుత్వ పల్స్ పోలియో గురించి, హెచౌఐ వి నియంత్రణ గురించి చేపట్టిన స్థాయిలో మహిళల మీద హింస ఆమోదయోగ్యం కాదు, కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి అనే ప్రచారం చేపట్టకపోవడం ూడా ఒక కారణం.
కుటుంబాల్లోను, సమాజపు అన్ని పొరల్లోను శిలాజ రూపంలో తిష్టవేసి ఉన్న పితృస్వామ్య భావజాలం మహిళలని వారి హక్కులను అనుభవించనీయడం లేదు. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిపాదించే జెండర్ అవగాహన లేకపోవడం’ ఆ దిశగా కార్యక్రమాలుగానీ, ప్రచారం కానీ లేకపోవడం మరో ముఖ్యమైన కారణం.
అన్ని రకాల హింసల్ని వ్యతిరేకిస్తూ జరిగే 16 రోజుల ప్రచారోద్యమంలో ఈ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ‘హింసలేని సమాజం స్త్రీల హక్కు’ అని నినదిద్దాం.
పదహారు రోజుల ప్రచారోద్యమం మాత్రమే కాదు మూడొందల అరవై అయిదు రోజుల ఉద్యమం స్త్రీల ఉద్యమం. అట్టడుగు స్థాయినుంచి ఢిల్లీదాకా విస్తరించి ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన ఉద్యమం. ఆ ఉద్యమమే నేటి ఆవశ్యకత. ఆ ఉద్యమమే అన్నిరకాల హింసలకి సమాధానం…