తండ్రి ప్రేమ : కొన్ని ప్రశ్నలు -ఎ.సునీత

దాదాపు సంవత్సరంన్నర క్రితం గర్భవతి అయిన కూతురు అమృత, భర్తతో కలిసి ఆస్పత్రికి చెకప్‌కి వెళ్తే, ఆమె కళ్ల ముందే స్వంత అల్లుణ్ణి చంపించిన మారుతీరావు రెరడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని మన సమాజంలో కొంత మంది దీన్ని తండ్రి ప్రేమకి పరాకాష్టగా వర్ణించారు. సంవత్సరం నిండని పసికందుని అత్తా మామల అరడతో భర్త లేకుండా పెరచుకుంటూ ముఖంలో ఇంకా పసితనం పోని అమృతని ఇద్దరు మనుషుల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసిగా చూడాలని, పెళ్లికి మురదు ఆమెని తీవ్రంగా హిరసించిన స్వంత బాబాయి ఆమె గురించి పేలిన అవాకులు చెవాకులు సత్యమని, ఆమె కుటుంబం నాశనమవటానికి మారుతిరావు, తమ్ముళ్లతో కలిసి చేయించిన ప్రణయ్‌ హత్య కాదని, ఆమె వారికిష్టం లేకుండా దళితుడయిన ప్రణయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయమే కారణమని కూడా తీర్పులు చెప్పారు. నిజ జీవితంలో తండ్రి ప్రేమని చవిచూసిన నాలారటి ఎంతో మంది స్త్రీలకి మా తండ్రుల ప్రేమ నిజమైంది కాదేమో, మారుతీరావు వంటి ఆదర్శ హంతక తండ్రి కోసం అరదరు కూతుళ్లు కలలు కనాలేమో, నవలలు రాయాలేమో, సినిమాలు తీయాలేమో, రోడ్లమీదకొచ్చి ధర్నాలు చెయ్యాలేమో అన్న అనుమానాలు కలుగజేశారు. ఆధునిక సమాజంలో మీడియా తననుకున్న విలువలకి ‘అరగీకారాన్ని’ తయారుచేస్తుందన్న నోమ్‌చోమ్స్కీ మాటలని గుర్తు చేసుకుంటే, మారుతీరావు ఒక అమూర్త తండ్రి ప్రేమ ఆనవాలుగా, అరగీకరించాల్సిన నమూనాగా మన మురదుకి ఎందుకు వస్తున్నాడో చర్చించుకోవాల్సిన అవసరం కూడా వెంటనే అర్థమవుతుంది.

పిల్లల పెంపకంలో తండ్రి పోషించే పాత్రని 1970ల వరకూ సోషియాలజీ గాని, ఆంథ్రోపాలజీగాని, ఇతర సామాజిక శాస్త్రాలు గాని పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు వచ్చిన తరువాత కుటుంబాల్లో ఎవరెంత పని చేస్తారో, పిల్లల రోజువారీ సంరక్షణలో తల్లుల పాత్రతో పాటు నెమ్మదిగా తండ్రుల పాత్రని కూడా అధ్యయనం చేసే ఆసక్తి మొదలయింది. సంపాదించటంతో పాటు కొంత మేరకు కొంత మంది తండ్రులు కూడా సంరక్షణలో బాధ్యత తీసుకుంటారని అర్థమయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ పిల్లల పెంపకం ప్రధానంగా తల్లుల బాధ్యతగానే కొనసాగుతోంది – వారు ఇంద్రనూయి వంటి ధనిక బ్రాహ్మణ స్త్రీలయినా, రాధిక వేముల వంటి పేద దళిత స్త్రీలయినా. మన దేశంలోనే అనేక కారణాల వల్ల కుటుంబాలని వదిలేసి పారిపోయే తండ్రులు కోకొల్లలు. 40 శాతం వరకు తండ్రులు లేని కుటుంబాలే ఉన్నాయని ఒక అరచనా.

ప్రధానంగా మన సమాజంలో తండ్రుల పాత్ర, వారు బాధ్యత తీసుకున్న సందర్భాల్లో, ప్రధానంగా సంపాదించటం, పిల్లల చదువులకి, పెళ్లిళ్లకి బాధ్యత వహించటం మేరకే ఉంటుంది. వారిని ఉత్సాహపరచటం, వారితో ఆడుకోవటం, వారి చిన్న చిన్న సంతోషాల్లో, బాధల్లో పాలు పంచుకోవటం చాలా అరుదు. వీటికి మించి సామాజిక కట్టుబాట్లని (కులం, వర్గం, కుటుంబ పరువు) అమలుపరిచే బాధ్యత ప్రధానంగా పురుషులు తీసుకోవటంతో తండ్రులు సాధారణంగా నియమాలు, కట్టుబాట్ల అమలులో ఎక్కువ శ్రద్ధ, పిల్లల మానసిక పురోగతిలో తక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.

అయితే, సమాజం ఆశించే రోబోట్‌లానో, రూల్‌ బాబాయ్‌గానో కాకురడా ఎక్కడో అక్కడ వీటిని అధిగమించిన తండ్రులే తమ పిల్లల, ముఖ్యంగా కూతుళ్ల పురోగతిలో పాత్ర పోషిస్తారని చెప్పటానికి మనకు ఉదాహరణలు వున్నాయి. గోగు శ్యామల, జూపాక సుభద్ర కథల్లో అటువంటి తండ్రులు కన్పిస్తారు. కుల కట్టుబాట్లని కాదని కూతుళ్లని చదివించే తండ్రులు ఇక్కడ ఔదార్యానికి కాక నిజమయిన ప్రేమకి చిహ్నాలుగా కన్పిస్తారు. కుల పితృస్వామ్యాన్ని ఎదుర్కోవటం మామూలు విషయం కాదు. ఇంకో పక్క కె.లలిత తన పుస్తకంలో తన తాత ఎలా కూతుళ్లకి పట్టు పరికిణీలు కుట్టించారో, తన తండ్రి ఎంత పనున్నా పిల్లలతో సమయం గడిపి, భాష, సరగీతం నేర్పించటంలో శ్రద్ధ తీసుకునేవారో వర్ణిస్తారు. నా మేరకు నాకు మా నాన్న, ‘నువ్వెంత వరకు చదువుకున్నా చదివిస్తాను’ అని చేసిన వాగ్దానం రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్‌ వరకు తెచ్చింది. నాతో సహా అనేకమంది నా స్నేహితురాళ్లకి తండ్రులు స్కూలుకి తీసుకెళ్లటం టిఫిన్‌ కారియర్‌ మర్చిపోతే తెచ్చి పెట్టటం, ఎల్టీసీ మీద దేశం చూపెట్టటం నురడి కులారతర వివాహాలు చేసుకుంటే మురదు బాధపడినా తరువాత మంచిగానే చూసుకోవటం అనుభవమే. అవన్నీ తండ్రి ప్రేమ వ్యక్తీకరణలు. ఇప్పుడు కొంత మంది తండ్రులు కూతుళ్లకి ఆటలు నేర్పించటం, వారి చదువు కోసం ఇల్లు మారటం, వారి ఎంట్రన్స్‌ల కోసం ఊళ్లు తిరగటం ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలు.

అయితే ఇటువంటి తండ్రీ కూతుళ్ల బంధాలని మన సమాజం ఇప్పటికీ తండ్రుల ఔదార్యానికి ఉదాహరణలుగా చూస్తోంది తప్ప, మారుతున్న కాలానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న తండ్రి ప్రేమకి వ్యక్తీకరణాలుగా చూడట్లేదు. తండ్రంటే మన సమాజ ఊహలో ఇప్పటికీ నియమ నిబంధనలని, అధికార సమాజ విలువల్ని కుటుంబంలో అమలుచేసి, వాటిని ఉల్లంఘించినపుడు పిల్లల్ని శిక్షించేవాడే తప్ప పిల్లల సంరక్షణలో, చదువు, పురోగతిలో పాలుపంచుకుని ఆనందించేవాడు కాదు. సమాజ ఊహల్లో ఇప్పటికీ కూతుళ్లపట్ల తండ్రి ప్రేమ శిక్షించగలిగే ప్రేమగానే ఉంటోంది.

రాజనీతి శాస్త్రంలో ఆధునిక రాజ్యం, ప్రజాస్వామ్యం, సమాజ ఆవిర్భావాలకి మూలంగా చెప్పే 17వ శతాబ్దపు ‘సామాజిక ఒడంబడిక’ సిద్ధాంతాలలో కుటుంబంలో నిరరకుశ తండ్రికుండే పితృస్వామ్య అధికారం మార్పుకి లోనయ్యి కొడుకులు దాన్నుండి విడుదలవ్వటం ప్రజాస్వామ్యం వైపు ఒక ప్రధాన అడుగుగా చదువుకుంటాం. కొడుకులు తండ్రులతో సమాన స్థాయికి చేరగలిగే పరిస్థితి సూత్రపాయ్రంగానైనా వచ్చినప్పుడే, అరటే వయోజనులయిన వారందరినీ సమానంగా గుర్తిస్తేనే, ప్రజాస్వామ్యానికి భూమిక ఏర్పడి ఆధునిక రాజ్యంతో (మగ) ప్రజలు ఒప్పందం చేసుకోగలరని, ఆ క్రమంలోనే హక్కులు వస్తాయని సూత్రీకరించారు. అప్పటి యూరోపియన్‌ సమాజాల్లో కుటుంబాలపై తండ్రుల అధికారం చట్టపరంగా, మతపరంగా సంపూర్ణం.

అయితే కొడుకులకి సమానత్వం ఉండాలని చెప్పిన థామస్‌ హాబ్స్‌, జాన్‌ లాక్‌లు కూడా కుటుంబంలో స్త్రీలకి దాని అవసరం లేదని, వాళ్లు తమ రక్షణ కోసం, పిల్లల పెంపకం కోసం కుటుంబంలో పితృస్వామ్య అధికారం క్రింద ఉండటమే మంచిదని, పురుషుల ఔదార్యంపై స్త్రీలు ఆధారపడాలని, భర్తలుగా, తండ్రులుగా పురుషులు వారికి బయటి ప్రపంచంలో ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని చెప్పారు. స్వేచ్ఛా సిద్ధాంతానికి ఆద్యుడని అరదరు చెప్పుకునే రూసో అయితే ఒకడుగు మురదుకెళ్లి స్త్రీలలో చాపల్యం ఎక్కువనీ, వారు కుటుంబంలో ఉంటూ భావి పురుష పౌరులని సిద్ధం చేస్తే చాలని, వారు బయటికొస్తే ప్రజాతంత్ర వ్యవస్థ కూలిపోతుందని సూత్రీకరించాడు.

ఆధునిక రాజ్య మూలాల్లో ఈ విధంగా సూత్రీకరించబడిన ఈ సర్వసత్తాక తండ్రి పాత్రకి తెలుగు సమాజం మనముందు పెడుతున్న అమూర్త తండ్రి ప్రేమ నమూనాకు సారూప్యత విదితమే. ఈ నమూనాని మన అరగీకారం కోసం ఇప్పుడెందుకు మురదు పెడుతున్నట్లు?

భారతదేశ ప్రజాతంత్ర వ్యవస్థ 1950లో ఏర్పడినప్పుడు స్త్రీలకి సమాన ఓటింగ్‌ హక్కులుండాలనే విషయాన్ని అరదరూ ఒప్పుకున్నారు గానీ, కుటుంబంలో వారికెంత మేరకు హక్కులుండాలనేది మాత్రం ఒక పట్టాన ఒప్పుకోలేదు. కుటుంబంలో సమాన హక్కులు లేకుండా వాళ్లు సమాన పౌరులుగా ఎలా అవగలరని డా|| బీ.ఆర్‌ అరబేడ్కర్‌తోపాటు అనేకమంది మహిళా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎక్కువగా ఆధిపత్య కులాల హిందూ స్త్రీలపై వుండే నిరంకుశ కుటుంబ నిబంధనలు పోవాలని – పెళ్లి చేసుకునే హక్కు, విడాకులు తీసుకునే హక్కు, ఆస్తి హక్కు ఉండాలని – అప్పుడే వాళ్లు భారత సమాజంలో సమాన పౌరులుగా మెలగ గలరని, మన ప్రజాతంత్ర వ్యవస్థ సరిగ్గా నడుస్తుందని వాదించిన అరబేడ్కర్‌ను మొదటి పార్లమెంటులో వ్యతిరేకించారు. అరదుకే రాజ్యాంగ డ్రాఫ్టింగ్‌ కమిటీని నడిపిన ఆయన తన న్యాయ మంత్రిత్వానికి రాజీనామా చేశారు. తమ స్త్రీలు స్వతంత్రులయితే, కుటుంబంలో తమ అధికారమే కాదు, కులాధిపత్యం కూలిపోతుందని పార్లమెంటులో వున్న ప్రజా ప్రతినిధులందరూ విపరీతంగా భయపడ్డారు.

కానీ వాళ్లు భయపడింది క్రమంగా జరగటం మొదలైంది. 1970లలో హిందీ సినిమాలల్లో ప్రేమ ముఖ్యంగా భూస్వామ్య కుటుంబాలలో కొడుకులు తల్లి తండ్రులని ధిక్కరించే చర్య. తల్లి తండ్రుల అనుమతి చట్రం నుండి బయటపడి తమ స్వతంత్రతని ప్రేమించటం ద్వారా వ్యక్తం చేసుకున్నారు ఆ హీరోలు. అప్పట్లో వచ్చిన వివిధ ప్రగతిశీల ఉద్యమాలలో కులారతర వివాహాలు ఒక భాగం అయ్యాయి. 1990లలో చదువుకున్న అమ్మాయిలు కూడా బయటి ప్రపంచాన్ని చూసి, తల్లి తండ్రులు చెప్పిందే సర్వస్వము అనుకోవటం మానేసి, స్వంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు.

కొడుకులు చేస్తే వేరే పద్ధతుల్లో నియంత్రించిన ఆధిపత్య కుటుంబాలు కూతుళ్ల చర్యలని అసలు సహించలేదు, మరీ ముఖ్యంగా కుల నిచ్చెనలో ‘కింది’ కులాల పురుషులని, దళిత పురుషులని పెళ్లి చేసుకుంటే విపరీతమయిన హింసతో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో కుటుంబాలని ధిక్కరించి పెళ్లి చేసుకున్న జంటలని కనికరం లేకుండా చంపెయ్యటం చాలా సాధారణం. వాటిల్లో వార్తా పత్రికలకి ఎక్కేవి తక్కువ. వారిని కాపాడటానికి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. నిరంతరం పని చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్ల చుట్టూ జరిగే ఘర్షణ సమాజంలో ఇంకుతున్న ప్రజాస్వామ్య విలువలకి, మారని ఆధిపత్య విలువలకి జరుగుతున్న ఘర్షణ.

ఈ చారిత్రక పరిణామాన్ని తెలుగు ప్రధాన స్రవంతి తల్లి తండ్రుల ప్రేమకి, యువతుల బరితెగించిన స్వభావానికి జరుగుతున్న ఘర్షణగా చూపించటానికి చాలా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే మారుతీరావుని తండ్రి ప్రేమకి చిహ్నంగా నిలబెట్టటానికి, దానికి మనందరి అరగీకారాన్ని పొందటానికి తెలుగు సమాజంలో జరుగుతున్న భావోద్వేగ ప్రచారాన్ని, దానికి వస్తున్న మద్దతుని అర్థం చేసుకోగలం. ఇది ఒక రకంగా అమెరికన్‌ సివిల్‌వార్‌లో ఓడిపోయిన దక్షిణాది అమెరికా తెల్లవాళ్లు బానిసత్వాన్ని సమర్థించిన మేమె అమెరికన్‌ విలువలకి చిహ్నంగా భావించి భావోద్వేగ భరితమయిన రొమారటిక్‌ నవలలు రాసుకున్నట్లు, ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడిపోతున్న పితృస్వామ్య కుటుంబాలు చేస్తున్న భావోద్వేగ ప్రచారం ఇది.

అరదువల్లే అనేక మంది తల్లి తండ్రులు ప్రణయ్‌ హత్యని బహిరంగంగా సమర్థిస్తున్నారు. తర్కబద్ధంగా ఆలోచిస్తే, ప్రణయ్‌-అమృత పెళ్లి తెలుగు సమాజంలో జరిగిన దళిత-ఆధిపత్య కులారతర వివాహాలలో మొదటిది కాదు. చివరిదీ అవబోదు. కానీ వారికి తమ పిల్లల గురించి విపరీతమైన భయాలున్నాయి. ఎందుకంటే, తమ పిల్లలతో, కూతుళ్లతో వారికి పెద్దగా కమ్యూనికేషన్‌ ఉండట్లేదు. అమ్మాయిలు స్వతంత్రులైతే తమ మాట వినరన్న భయం, కూతుళ్లతో మనసు విప్పి మాట్లాడలేని అసమర్థత, సంకోంచం, వారి భవిష్యత్తు గురించి వారికి నిర్ణయాలు తీసుకునే సమర్థత, ఆలోచన లేదనే అపనమ్మకం, ఒక్క తప్పు చేస్తే మొత్తం జీవితం మొత్తం పోయినట్లే అన్న అనాలోచిత ధోరణి, వారిని ఎలాగయినా కట్టడి చెయ్యకపోతే సమాజంలో, కులంలో తమ పెద్దరికాన్ని నిలుపుకోలేమనే భీతి – ఇవన్నీ కలిసి వారిని ఈ భావోద్వేగ చర్చలో పాల్గొనేట్లు చేస్తున్నాయి. వయోజనులైన, చదువుకున్న కూతుళ్ల మాటని గౌరవించే స్థితికి రావాలనే అవగాహన కూడా లోపించిన తల్లితండ్రులకి ఇదంతా యువత చాపల్యం నుండి పుట్టాయనుకోవటం చాలా సౌకర్యంగా కన్పిస్తోంది.

కానీ ఆలోచన లేమి నురడి పుడుతున్న ఈ భావోద్వేగ చర్చ, ప్రచారం మారుతీరావుకి ఏమన్నా ఉపయోగ పడిందా? ఆవేశంతో ఊగిపోయిన మద్దతుదారులు అతడికి కూతురి ఛీత్కారాన్ని తట్టుకునే స్థయిర్యాన్ని ఇవ్వలేదు.. ఏ ఆస్తి, పరువు కోసమైతే హత్య చేయించాడో కూతురు ఆ ఆస్తిని వద్దు పొమ్మంది. ఇంటికే రానంది. ఇంకొక తల్లి, తండ్రి ఉసురు పోసుకున్నాననే భీతి నుండి మారుతీరావుకి ఎవరు ఉపశమనం కల్గించలేదు. కుటుంబంలో ఆస్తి తగాదాల నుండి బయటపడలేదు. అల్లుణ్ణి చంపించి, కూతుర్ని దూరం చేసుకుని, ముద్దుగా వున్న మనవడిని ఎత్తుకోలేని పరిస్థితికి వచ్చి, చివరికి తన చావుని తానే కొనితెచ్చుకున్నాడు కదా?

దెబ్బతింటున్న కులాధిపత్యం తండ్రులకి కూతుళ్ల జీవితాలపై పూర్తి అధికారం ఉండాలనే భావానికి తోడయ్యి ప్రణయ్‌ హత్య తరువాత జరిగిన తెలుగు సమాజంలో జరిగిన చర్చలో నిండు యువకుడి ప్రాణాలని తీసిన చర్య పట్ల కనీస ఖేదం, పశ్చాత్తాపం వ్యక్తపరచనీయలేదు. ఇక్కడ ప్రణయ్‌ దళితుడు కావటం యాదృచ్ఛికం కాదు. దళితుల ప్రాణాలకి విలువనివ్వని సమాజంలో మనం ఎప్పటినుండో బ్రతుకుతున్నాం. కానీ కులారతర వివాహాలని వేడుకగా కొరత కాలమైనా జరుపుకున్న సమాజ సంస్కృతి నుండి కులారతర వివాహం చేసుకున్న దళిత యువకుల హత్యలని బహిరంగంగా సమర్థించే స్థితికి, కూతురి సంతోషాన్ని నాశనం చేసిన క్రూరత్వాన్ని ఆమోదనీయంగా చూసే పరిస్థితికి దిగజారడం చాలా శోచనీయం. మారుతున్న సమాజంలో కూతుళ్లు తండ్రుల నుండి ఏమాశిస్తున్నారో అర్థం చేసుకునే విజ్ఞత, మారే ప్రపంచంతో మారాల్సిన తల్లితండ్రుల పాత్రలు, తండ్రి ప్రేమని వాస్తవ జీవితంలో వ్యక్తీకరించగలిగే రూపాల గురించి అవగాహన పెంచుకోవటానికి బదులు తండ్రి ఉండటమే ప్రేమని, తండ్రి ఏం చేసినా, చివరికి ప్రేమించిన భర్తని హత్య చేయించినా దాన్ని ప్రేమగానే అర్థం చేసుకోవాలనే పిడివాదంలోకి తెలుగు సమాజ ప్రధాన స్రవంతి రావటం ఏమాత్రం మంచిది కాదు!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.