కారల్ చర్చిల్
అనువాదం : కె.సునీతారాణ
ఇ : ఎఎంత మూఢ నమ్మకాలు! చైనాలో ఓ ఆకతాయి గుంపు దాదాపు నన్ను హత్య చేసినంత పని చేసింది. అనాగరికులు పసిపిల్లలను తింటారని, రైలుపట్టాలను దృఢంగా చెయ్యడానికి వాటికింద పాతిపెడతారని, కళ్ళు తీసి కెమెరా లెన్సులు చేస్తారని అనుకున్నారు వాళ్ళు. / అందుకే.
మ : నీ దగ్గరేమో కెమెరా కూడా ఉంది!
ఇ : ‘ప్లిలలను తినే పిశాచి’ అంటూ కేకలు పెట్టారు. కెమెరాలకోసం, మాంసం కోసం తమ ఆడపిల్లలను యూరోపియన్లకు అమ్మడానికి ప్రయత్నించారు కొంతమంది!
నవ్వులు.
మ : ఒక్క మిడతల బెడద తప్ప అదో ఘనవిజయమేనన్నమాట.
జో : బిడ్డ లేకుండా ఉంటే ముసలితనం వరకూ కూడా సన్యాసిగా బతికిన అలె గ్జాండర్‌కు చెందిన థియొదొరాలాగా చాలాకాలం అలాగే ఉండేదాన్ననుకుంటా / ఒకమ్మాయి ఆవిడతో / ప్రేమలో పడి తన బిడ్డలకు ఆవిడే తండ్రని ఆరోపించింది. తర్వాత –
నీ : నీ బిడ్డకేమైందో ముందు చెప్పు. నాక్కూడా పిల్లలుండేవాళ్ళు.
మ : దాన్నొదిలించుకోవడానికి ప్రయ త్నించలేదా?
జో : బిడ్డను కనడం కంటే కూడా పెద్ద పాపం కాదా అది? పోప్‌కు బిడ్డ పుట్టడమంటే ఎంతో దారుణమైన విషయం.
మ : ఏమో మరి. నువ్వు పోప్‌వి.
జో : కానీ ఎలా వదిలించుకోవాలో నాకు తెలీదే?
మ : మిగతా పోప్‌లకు కూడా పిల్లలుండే ఉంటారు, ఖచ్చితంగా.
జో : వాళ్ళు కనలేదు కదా.
నీ : నువ్వు ఆడదానివి మరి.
జో : అదీ విషయం. నేను ఆడదాన్ని అయి ఉండకూడదు. ఆడవాళ్ళు, పిల్లలు, పిచ్చివాళ్ళు పోప్ కాకూడదు.
మ : అంటే, ఒకే ఒక మార్గం! దాన్నె లాగో వదిలించుకోవడమే.
నీ : రహస్యంగా దత్తతకిచ్చి ఉండాల్సింది.
జో : కానీ ఏం జరుగుతోందో నాకస్సలు అర్థం కాలేదు. లావెక్కుతున్నాననుకున్నాను. పోప్‌ది విలాసవంతమైన జీవితం. ఊరికే తిని కూర్చునేదాన్ని. పన్నెండేళ్లొచ్చినప్ప ట్నుంచి నేను ఆడవాళ్ళతో మాట్లాడలేదు. ప్రతీహారి గమనించాడు.
మ : అప్పటికే బాగా ఆలస్యమ య్యుంటుంది.
జో : నేను పట్టించుకోదల్చుకోలేదు. ఏమీ చెయ్యకుండా ఉండడమే సులభమని పించింది.
నీ : కానీ బిడ్డను కనడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. ఒంట్లో బాగాలేదని వెళ్లిపోవాలి.
జో : అలాగే చేసి ఉండాల్సిందను కుంటా.
మ : వాళ్ళే కనుక్కోవాలనుకున్నావా?
నీ : నాక్కూడా తరచూ ఇబ్బందికర మైన సందర్భాలు ఎదురయ్యేవి. పుకార్ల విషయం చెప్పనే అఖ్ఖర్లేదు. దురదృష్టవశాత్తూ చనిపోయిన నా మొదటిబిడ్డ రాజుకు పుట్టింది. రెండో బిడ్డ అకాబొనేది. నాకప్పుడు పదిహేడేళ్ళు. నాకు పదమూడేళ్ళప్పుడు అతను నాతో ప్రేమలో పడ్డాడు. నేను రాజు దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతను చాలా కుమిలిపోయాడు. అదో ప్రేమ కావ్యం. ఎన్నో కవితలు. రాజు రెండు నెలలు నా దగ్గరకు రాకపోవడంతో నాకు ఆరోనెల కడుపైనా నాలుగో నెల అనే అనుకున్నాడు. తొమ్మిదో నెల వచ్చాక / నాకు.
జో : ఎన్నో నెల అన్నది నాకు అసలు తెలీనే తెలీదు.
నీ : ఆరోగ్యం చాలా బాగా లేదని చెప్పాను. అకాబొనే కూడా ధార్మిక విశ్రాంతిలోకి వెళ్తున్నట్లు ప్రకటించాడు. బిడ్డ పుట్టగానే నడుము పట్టుకుని నన్ను గాల్లోకి లేపాడు. చిన్న కత్తితో బిడ్డకు బొడ్డుకోసి, బిడ్డను తెల్లటి బట్టలో చుట్టి తీసుకెళ్ళి పోయాడు. ఆడపిల్లే అయినా అలా దూర మవడం నాకు బాధగా అనిపించింది. నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల గర్భం పోయిందని రాజుతో చెప్పాను, అంతే. ప్రమాదం గడిచిపోయింది.
జో : కానీ నీజో, ఓ స్త్రీ శరీరం కలిగి ఉండడమన్నది నాకు అలవాటే కాలేదు.
ఇ : అయితే ఏమైంది మరి?
జో : సమయం దగ్గర పడిందని నాకు తెలీదనుకోండి. ఊరేగింపు జరుగుతోంది. పోప్ దుస్తులు ధరించి గుఱ్ఱం మీద కూర్చున్నాను. నాముందు శిలువ పట్టుకుని నడుస్తున్నారు. మతాధికారులు, గుంపులు గుంపులుగా జనం నా వెనక నడుస్తున్నారు. / మేము.
మ : పరిపూర్ణమైన పోప్.
జో : సెయింట్ జోన్స్‌కు వెళ్లడానికి సెయింట్ పీటర్స్ నుంచి బయల్దేరాం. అంతకు ముందే సన్నగా కడుపు నొప్పి మొదలైంది. నేను తిన్నదేదైనా పడలేదేమో అనిపించింది. నొప్పి మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఊరేగింపు అయ్యాక వెళ్ళి పడుకుందామనుకున్నాను. మధ్యమధ్యలో చాలాసేపు బాగానే ఉండింది. అందరి దృష్టి నా వైపు తిరిగి, ఊరేగింపు పాడైపోవడం నాకిష్టం లేకపోయింది. హఠాత్తుగా అదేమిటో నాకర్థమైంది. ఇంటికి వెళ్ళి దాక్కునే దాకా ఎలాగో భరించాలి. ఇంతలో ఏదో అయింది. నా ఊపిరి ఆగిపోతోంది. ఏ పని సరిగ్గా చెయ్యలేక పోతు న్నాను. ఓ చిన్న సందులోంచి ఊరేగింపు వెళుతున్నప్పుడు నేను గుఱ్ఱం దిగి ఓ నిముషం పాటు కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. నా శరీరమంతా తీవ్రమైన ఒత్తిడి కెరటాలు. ఆవు అరుపుల్లాంటి శబ్దాలేవో నా గొంతులోంచి వస్తున్నట్లు అనిపించింది. దూరంగా జనం అరుస్తూండడం వినిపించింది. ”పోప్ జబ్బు పడ్డారు, పోప్ చచ్చిపోతున్నారు,” అంటూ. బిడ్డ అలా రోడ్డు మీదకు జారిపోయింది.
మ : మతాధికారులకు / ఏం చెయ్యాలో తోచుండదు.
నీ : అయ్యో జోన్, ఎంత పని జరిగిపోయింది! అదీ వీధిలో!
ఇ : ఎంత ఇబ్బందికరం.
గ్రె : వీధిలో, అబ్బా.
నవ్వుకుంటారు.
జో : ఒక మతాధికారి ”మతద్రోహి” అంటూ మూర్ఛపోయాడు.
అందరూ నవ్వుతారు.
మ : అయితే ఏం చేశారు మరి? చాలా బాధపడి ఉంటారు.
జో : నన్ను కాళ్ళు పట్టుకుని ఊరి శివార్ల దాకా లాక్కువెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారు.
నవ్వడం ఆపేశారు.
మ : జోన్, ఎంత దారుణం.
జో : నిజానికి నాకు గుర్తులేదు.
నీ : బిడ్డకూడా చచ్చిపోయిందా?
జో : అవునవును, అనుకుంటా, అవును.
నిశ్శబ్దం.
వెయిట్రెస్ టేబుల్ శుభ్రం చెయ్యడానికి వస్తుంది. మెల్లగా మాట్లాడుకుంటూంటారు.
ఇ : (జోన్‌తో) నాకసలు పిల్లలే లేరు. నాకు గుఱ్ఱాలంటే చాలా ఇష్టంగా ఉండేది.
నీ : (మర్లీన్‌తో) ఒకసారి నేను నా కూతుర్ని చూశాను. అప్పుడు తనకు మూడేళ్ళు. ఎఱ్ఱటి / పొట్టి చేతుల గౌను వేసుకుంది. అకెబొనో
ఇ : బర్డీ అంటే నాకు చాలా ఇష్టం. ముదురు గోధుమరంగు ఇండియన్ గుఱ్ఱం. రాకీ కొండల్లో దాని మీద స్వారీ చేసేదాన్ని.
నీ : భార్యకు బిడ్డ చనిపోవడంతో నా బిడ్డనే తన బిడ్డగా చూసుకునేది. నేను కేవలం అతిథిననే అందరూ అనుకున్నారు. పాపను చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు, నన్ను పంపినట్లే అంతఃపురానికి పంపడానికి.
ఇ : దృఢమైన కాళ్ళు, ఎప్పుడూ సరదాగా ఉండే ముద్దు మొహం. కొత్త వాళ్ళెవరైనా దగ్గరకు వెళితే గొడవ పడేది.
నీ : ప్రీస్ట్ ఆరియాక్‌కు పుట్టిన నా మూడోబిడ్డను నేనసలు చూడనే లేదు. పుట్టిన రోజే వాడ్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికర్థమయినట్లే మాట్లడుతూ ఏడ్చాడు ఆరియాక్. నాలుగోవాడు కూడా ఆరియాక్ బిడ్డే. వాడు పుట్టకముందే ఆరియాక్ చనిపోయాడు. నాకెవ్వర్నీ చూడాలనిపించ లేదు. కొండల్లో ఒక్కదాన్నే ఉండిపోయాను. మళ్ళీ మగబిడ్డే, మూడో కొడుకు. విచిత్రమేమిటంటే వాడి మీద నాకేమీ అనిపించలేదు.
మ : నీకెంతమంది పిల్లలు గ్రేట్?
గ్రె : పదిమంది.
ఇ : ఇంగ్లండు కొచ్చినప్పుడల్లా నేను సరిదిద్దుకోవాల్సింది ఎంతో ఉందనిపించేది. హెన్నీ, జాన్ ఎంతో మంచి వాళ్ళు. నా జీవితంలో నేనేమీ మంచి చెయ్యలేదు. ఆత్మస్తుతి చేసుకోవడంలోనే ఏళ్ళు గడిపాను. కమిటీల్లోకి నన్ను నేను విసిరేసుకున్నాను. ఇన్‌ఫ్లుయెంజా వచ్చినప్పుడు టోబర్‌మొరీ ప్రజలకు సేవ చేశాను. పొదుపు మీద యంగు విమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్లో ఉపన్యాసా లిచ్చాను. తూర్పు దేశాలు ఎంత దుర్మార్గ మైనవో మరీ మరీ చెప్పాను. వివరించాను. నా ప్రయాణాలు కేవలం నాకు మాత్రమే కాకుండా కనీసం కొంతమందికైనా ఉపయోగపడాలి. మంచి పనులకోసం ఎంతో పాటుపడ్డాను.
మ : భగవంతుడా, ఎందుకు మనందరి జీవితాలు ఇంత దారుణంగా ఉన్నాయి?
జో : మళ్ళీ ఎప్పుడూ ఊరేగింపు ఆ వీధిలోంచి వెళ్ళలేదు.
మ : ప్రత్యేకంగా వేరే దారిలో తీసుకువెళ్ళారా?
జో : దాన్ని తప్పించుకోవడానికి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. రంధ్రమున్న కుర్చీ వాడడం మొదలుపెట్టారు.
మ : రంధ్రమున్న కుర్చీనా?
జో : అవును. నాణ్యమైన పాలరాతితో చేసిన కుర్చీ, కూర్చునేచోట ఓ రంధ్రం / అది సేవియర్ ఛాపెల్లో ఉండేది. పోప్ అయ్యాక.
మ : హాస్యమాడుతున్నావా?
జో : అందులో కూర్చువాల్సి ఉంటుంది.
మ : అతని గౌను పైకెత్తి చూసేవాళ్ళా? / లేదు కదూ?
ఇ : ఎంత అసాధారణమైన విషయం.
జో : ఇద్దరు మతాధికారులు / అతడు మగ వాడేనని నిర్ధారించుకునే వాళ్ళు.
నీ : మోకాళ్లు, మోచేతుల మీద వంగి!
మ : రంధ్రమున్న కుర్చీ!
గ్రె : ఛఛ.
(ఇంకా వుంది.)