జెండర్‌ స్పృహ లేని బండ వ్యవస్థలు – పి. ప్రశాంతి

చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చింది రాణి నేస్తాన్ని కలవడానికి కర్రలు, తాటాకులతో కట్టిన దడికి వెదురు తడికను గేటులా అమర్చారు. దాని తోసుకుని ఉత్సాహంగా ‘సోనీ… సోనీ… అని అరుచుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే జామచెట్టు మొదట్లో కూర్చున్న సోని నిరాసక్తంగా చూసింది రాణిని. చలాకీగా ఉండే సోని అలా ఉలుకూపలుకూ లేనట్లు కూర్చోడం రాణికి ఆందోళన కలిగించింది. ఈ మధ్య కొన్నాళ్ళుగా సోనీలో ఈ మార్పుని చూస్తోంది. నవ్వుతూ గెంతుతూ ఉన్నట్టుండి మౌనంగా అయిపోతుంది. దొంగా, పోలీస్‌ లాంటి ఆటలని ఆడనంటోంది. ఊర్లో చుట్టు పక్కల ఇళ్ళల్లోని అడ, మగ పిల్లలందరూ కలిసి కబడ్డీ ఆడుకునేవారు. సోనీ తమ టీంలో అంటే తమ టీంలో అని పోటీ పడేవారు. అంతబాగా ఆడే సోని కబడ్డీ కోర్టువైపే రావట్లేదు. ఎప్పుడైనా వచ్చినా హఠాత్తుగా ఆట వదిలి వెళ్ళిపోతుంది. ఏమైందో అర్థంకాక, అడిగినా ముభావంగా ఉండడంతో ఫ్రెండ్స్‌ సోనీని వదిలేసి ఆడుకోడం మొదలుపెట్టారు. ఇప్పుడు సోమవారం నించి బడి తెరుస్తున్నారన్న వార్తని మోసుకొచ్చిన రాణి అక్కడ రాయిలా కూర్చున్న సోనిని చూసి ఆగిపోయింది. దగ్గరకొచ్చి పక్కన కూర్చుని ‘ఏమయిందే?’ అంది రెండు, మూడు సార్లు కుదిపి అడిగేసరికి ఏడ్చేసింది సోని. ‘నేను బడికి రాను. ఈ మాటే అమ్మతో చేప్తే చక్కగా చదివిస్తామంటే చదువుకోడానికి మాయ రోగమా అంటోంది. నా మాటవినట్లేదు… నాకు చదువొద్దు. నేను బడికి రాను’ అంటూ ఏడుస్తూనే ఉంది. ఏం చెప్పాలో తోచక బిక్కమొహంతో సోనీని పట్టుకుని పక్కనే కూర్చుంది రాణి.

పక్కింట్లోంచి ఇదంతా గమనిస్తున్న భావన ‘ఏమైంది ఈ పిల్లలకి!’ అనుకూంటూ వాళ్ళ దగ్గరకొచ్చింది. బి.ఎ. సోషల్‌వర్క్‌ పూర్తిచేసి పిల్లలతో పనిచేసే ఒక సంస్థలో ఈ మధ్యే వాలంటీరుగా చేరింది భావన. ఆ అనుభవం తోనే ఏదో సమస్యతో సోని బాధపడుతోందని అనిపించి మాట్లాడదామని వచ్చింది. ‘సోనీ, పిన్ని లేదా? ఇక్కడ కూర్చున్నారేంటి ఎండలో?’ అంటూ పలకరించింది. ‘అమ్మ మార్కెట్‌కి వెళ్ళిందక్కా’ అంటూ కళ్ళు తుడుచుకుంది సోని.

‘ఏమైందిరా … ఎందుకేడుస్తున్నావ్‌? బడికి వెళ్ళనంటున్నావు ఎందుకని?’ అని అడిగింది భావన. ‘కాలేజీ లెక్చరర్‌ అవుతా లేదా కబడ్డీ కోచ్‌ అవుతా అని అంటుంది ఎప్పుడూ. ఇప్పు డేమో చదువొద్దు, బడికి రాను అని ఏడుస్తోం దక్కా’ కంప్లైంట్‌లా చెప్పింది రాణి. ‘కాలేజి లెక్చరర్‌ అవ్వాలనుకున్నావ్‌ ఆసక్తిగా అడిగింది భావన. అవునని తలూపిన సోనితో ‘మరి ఏడో తరగతిలోనే బడిమానేస్తే లెక్చరర్‌ ఎలా అవు తావు? అయినా బడెందుకు మానేస్తానం టున్నావ్‌? బాగా చెప్పట్లేదా? కొడతారా?’ అడిగింది భావన.

‘అస్సలు కొట్టరక్కా మాస్కూల్లో చాలా బాగుంటుంది. మా టీచర్లు బాగా చెప్తారు. సైన్స్‌ ఫేర్‌లో, మాథ్స్‌ ఒలింపియాడ్‌లో మా స్కూల్‌కి అవార్డులొచ్చాయి. ఆటలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీల్లో మేమే ఫస్ట్‌. సోనీకి నాకు కూడా ప్రైజులొచ్చాయి. మండలంలో హైస్కూల్‌ ఆటల పోటీల్లో రన్నింగ్‌, కబడ్డీల్లో మేమే గెలిచాం’

ఉత్సాహంగా చెప్పుకుపోతోంది రాణి. సోనినే గమనిస్తోంది భావన. రాణి మాట్లాడుతు న్నప్పుడు మొదట్లో సోనీకళ్ళల్లో కనబడిన వెలుగు ఆటల ప్రసక్తి వచ్చేటప్పటికి గప్పున ఆరిపోవడాన్ని గుర్తుపెట్టింది భావన. అక్కడే ఏదో విషయం ఉందని అర్థం చేసుకుని ‘మీ కోచ్‌ పేరేంటి? మీ పి.ఇ.టినే ఆడిస్తారా లేదా బయటినించి వస్తారా’ అని అడిగింది. ‘ముందు మంజుల టీచర్‌ ఉండేవారు. ఈ సంవత్సరం బాలుసార్‌ వచ్చారు. మాతో కలిసిపోయి బాగా ఆడతారు. అందర్నీ, ముఖ్యంగా అమ్మాయిలు ఆటల్లో ముందుండాలని ఎంకరేజ్‌ చేస్తారు’ అంది రాణి. ‘కాని మంచోడు కాదు…’ ఎక్కడో చూస్తూ హఠాత్తుగా అంది సోని. ఆశ్చర్యంగా చూసింది రాణి. ‘ఎందుకని, ఏంచేశాడు?’ వెంటనే అనునయంగా అడిగింది భావన. సమాధానం చెప్పని సోనీని చూస్తూ ‘మంచోడు కాదనిపించినప్పుడు వెంటనే హెచ్‌. ఎమ్‌తో చెప్పాలి. మీ క్లాస్‌ టీచర్‌తో చెప్పాలి. చెప్పారా?’ అడిగింది భావన. ‘ఏమని చెప్పాలి? వాళ్ళకెలా అర్థమవుతుంది?’ విసురుగా అంది సోని ఏదో అర్ధమయినట్టే అనిపించింది రాణికి.

‘చెత్తగాడు… కబడ్డీలో పట్టు ఎలా ఉండాలి, రన్నింగ్‌లో స్టార్ట్‌ పొజిషన్‌ ఎలా ఉండాలి… అంటూ ఎక్కడెక్కడో పట్టుకుంటాడు. థూ…’ అంటూ అసహ్యంగా మొహం పెట్టింది సోని ‘అవునా! నువ్వు స్టార్‌ ప్లేయర్‌ అని, నేషనల్స్‌కి తయారుచేస్తానని, మేమంతా సహకరించాలని అంటుంటే, నీ మీదే శ్రద్ధ పెడ్తుంటే నిజమేనను కున్నాం. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలా’ కోపంగా అరిచింది రాణి అంటున్న వదిలి పెట్టకూడదు. కంప్లైట్‌ ఇవ్వాలి అంటున్న భావన మాటలకి ధైర్యం వచ్చినట్టు చెప్పడం మొదలెట్టింది సోని.

‘జారిపోకుండా ఉండాలంటే ఎలా పట్టుకో వాలి, కదలనివ్వ కూడదంటే ఎక్కడ పట్టు కోవాలి, వెనక్కి గుంజాలంటే ఏంచేయాలి… అంటూ ముందు, వెనక అన్ని చోట్లా పట్టుకుం టాడు. ఛాతీ, పొట్ట, నడుము, పొత్తికడుపు, ఇంకా కిందకి … కాలు మెలికేసి…’ ఇక చెప్పలేక బావురుమంది భావనని పట్టుకుని. ‘రన్నింగ్‌ రేస్‌కి స్టార్ట్‌ పొజిషన్‌ చెప్తూ అమ్మాయిలు ఒంగుంటే వాళ్ళ మీదగా ఒంగుని కాలు ఎలా స్ట్రెచ్‌ చెయ్యాలో కాలుగుంజి చెప్తాడు. నిజమే అక్కా! నేనందులో లేనుకాబట్టి నేనంతగా పట్టించుకోలేదు’ అంది రాణి. ‘ఇక్కడ గట్టిగా తగులుతుంటే ఎంత చీదరగా ఉంటుందో…’ అంటూ వీపు దగ్గర, నడుము దగ్గర దులుపు కుంటూ జుగుప్సతో నిండిన మొహంతో అక్కడ్నించి లేచి రోషంగా, అసహనంగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. కాళ్ళని తప తప కొట్టుకుంటు నడుస్తున్న సోనీని గట్టిగా వాటేసుకుని ‘సోనీ ఇలాంటిదే మా పక్కింటి అన్నయ్యతో, తన ఫ్రెండ్‌తో నాకు ఎదురైంది. భయమేసి ఎవ్వరితో చెప్పలేదు తప్పు నాది కాదు…’ అంటూ వెక్కెక్కి ఏడ్చింది రాణి.

వాళ్ళలా మాట్లాడుకోడమే అవసరం అను కూంటూ అలాగే కూర్చుంది భావన. దాదాపు వారి వయసులోనే తనకీ తాతయ్య వరసయ్యే పెద్ద మనిషినించి ఎదురైన అనుభవం గుర్తొచ్చి అమ్మాయిలందరిదీ ఇదే అనుభవమా! ఇలాంటి ప్రవర్తన లేని మగాడే కనపడడా!! తల్లిదండ్రులు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు అబ్బాయిల్ని సక్రమంగా పెంచాలి అనుకుంది భావన.

మన కోర్టులకి, పోలీసులకి, ముఖ్యంగా కొంతమంది మహిళా జడ్టిలకి, ఆఫీసర్లకి, సోనీ, రాణి ఎందుకు బావురుమంటున్నారో అర్థం కాదా? పోక్సోలాంటి ప్రోగెస్సివ్‌ చట్టాలని నీరు కార్చే అధికారులుంటే బాధిత బాలికలకి న్యాయం అందేనా?? సమానత్వం దిశగా సాగాల్సిన సమాజంలో ఇటువంటి మానసిక వ్యధకి గురైన బాలికలు ఎటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందిచు కుంటారో, తర్వాత తరం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం కావట్లేదా?? ఇప్పటికైనా

కళ్ళు తెరుచుకోకపోతే జరిగే నష్టాన్ని పూడ్చుకో డానికి ఇంకొన్ని తరాలుపడుతుంది.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.