రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా వేణుగోపాల్‌ ఉపన్యాసం

రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా వేణుగోపాల్‌ ఉపన్యాసం
రైతు స్వరాజ్య వేదిక అధ్యక్ష వర్గానికి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాక ఆంధ్రప్రదేశ్‌ నుండి కూడా వచ్చిన రైతు స్వరాజ్య వేదిక సభ్యులకు, మిత్రులకు, కార్యకర్తలకు, సహృదయులకు అందరికీ నా నమస్కారం. నిజానికి కవిత మాట్లాడిన తర్వాత ఇక నాకు

మాట్లాడేది ఏమీ లేదు. కవితనే ఇంకా చాలాసేపు విందామని అనుకున్నాను. ఎందుకంటే గత నాలుగు నెలలుగా ఢల్లీిలో ఏం జరుగుతోందో, సింఘూలో, సిక్రిలో, నజీంపూర్‌లో… బహుశా తెలుగు వాళ్ళలో చాలామంది మనుషులు ఇక్కడ ఉండవచ్చు కానీ మనసులు అక్కడే ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతోందన్నది ప్రతిరోజూ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజూ సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రెస్‌ రిలీజ్‌లు చదువుతూ ఉన్నాం. వాటిని ప్రింట్‌ చేసి మరీ పంచుకుంటున్నాం. కనుక, కవిత చెప్పిందే ఇంకా ఎక్కువ వినాలి. ఢల్లీిలో ఏం జరుగుతోంది? ఉత్తరాది రైతులు ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రైతులు దేశానికి ఏమి సందేశమిస్తున్నారు అని తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా, కోరికగా ఉంది.
కానీ ప్రస్తుత ఈ ఢల్లీి రైతాంగ ఉద్యమం కంటే భిన్నమైన నా ఆలోచనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదట అసలు రైతు స్వరాజ్య వేదిక అనే ఒక సంస్థ లేదా ఒక సంస్థ సమ్మేళనం ఒక దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడమే చాలా అపురూపమైన విషయం. ఇవాళ పుట్టిన సంఘం రేపటికి ఉంటుందా, లేదా, ఎల్లుండికి ఉంటుందా లేదా, ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది, ఎన్ని ప్రత్యేక శక్తులను ఎదుర్కొంటుంది, ఏ విధంగా ఆగిపోతుంది, ఎట్లా నాయకులై వెళ్ళిపోతారు, కార్యకర్తలై వెళ్ళిపోతారు అని ప్రతి సంఘం గురించి ఒక అనుమానం ఉంటున్న, ఒక సందేహం ఉంటున్న సందర్భంలో పది సంవత్సరాలపాటు ఈ సంస్థ నిలదొక్కుకుంది. దశాబ్ది (పది సంవత్సరాల) ఉత్సవాలు జరుపుకుంటోంది. అంటే ఒక రకంగా మనం ఇదొక ఊటగా ప్రారంభమైనప్పుడు చూశాం. ఈ ఊట వాగైంది, వంకయింది, సెలయేరయ్యింది, మహానదిjైు మన ముందర ఉంది. ఈ మహానదిని మనం చూస్తూ ఉన్నాం, ఈ మహానది వ్యవస్థను చెక్కే సముద్రం అవుతుందా, లేదా అని. అలా కావడానికి మనం ఏమి చేస్తాం? మనం చేయి ఎట్లా అందిస్తాం అని మాట్లాడుకోవడానికే ఈ రోజు మనం ఇక్కడ సమావేశమయ్యామని నేను అనుకుంటున్నాను.
అయితే ఎన్నెన్ని రకాల వాళ్ళను, ఎన్నెన్ని రకాలుగా కలుపుకుని రావడానికి ప్రయత్నం చేస్తామా అని ఈ సమావేశంలో ముందు కిరణ్‌, రవిలు చెప్పారు. ఈ మహానది కావడంలో ఎక్కడో ఒక చిన్న ఊటగా ఒక చిన్న చుక్క వచ్చింది. ఇవాళ మహానది అయిందంటే అనేక ప్రవాహాలు ఇందులో కలిశాయి. రైతు స్వరాజ్య వేదిక ఆ పని చేసింది, చేస్తోంది. దాంట్లో నాకు సన్నిహితుడు, 34 సం॥గా మిత్రుడు దర్శన్‌బాబు ఉన్నాడు. దర్శన్‌బాబుకు పూర్తిగా భిన్నమైన దృక్పథం తీసుకునే మనుషులు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నడుపుతున్నారు కాబట్టే ఆ ఉద్యమం దేశానికి మాత్రమే కాక, కవిత చెప్పినట్లు ప్రపంచానికే ఆశాజ్యోతిగా ఉంది.
ఈ సందర్భంలో అసలు రైతు ఉద్యమ అవసరం ఏమిటి? రైతు స్వరాజ్య వేదిక ఇంతే ఉంటుందా లేక విస్తరిస్తామా, ఇంకా ఎన్ని సంస్థలను కలుపుకుంటాం అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ నేడు రైతు ఉద్యమ అవసరం ఏమిటి? నిజానికి ఈ దేశంలో అత్యద్భుతమైన పోరాట సాంప్రదాయానికి వారసత్వం. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి వ్రాసిన ప్రతి ఒక్కరూ, అంతకు ముందటి ప్రజా పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, కుల వ్యతిరేక పోరాటాలు, హిందూత్వ వ్యతిరేక పోరాటాలన్నింటిలోనూ రైతాంగం పాత్ర ఉంది. అవన్నీ పక్కన పెట్టండి. 1857లో ఈ దేశంలో తొలిసారి వలస వ్యతిరేక ఉద్యమం, ఒక సామ్రాజ్యవాద ఉద్యమం, ఒక వ్యవస్థను మార్చే ఉద్యమం, ఒక ప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభమయింది. ఆ ఉద్యమం ప్రారంభించిన వాళ్ళు ‘రైతులు, రైతుల బిడ్డలయిన సైనికులు’. కనుక మన చరిత్ర ఈ రోజు ప్రారంభమయింది కాదు, 150 ఏళ్ళుగా ఈ దేశంలో ఎడతెగకుండా సాగుతున్న రైతాంగ ఉద్యమ వారసులం మనం. ఆ రైతాంగ ఉద్యమాన్ని కొనసాగించి శిఖరాయమానం చేసి, వ్యవస్థను మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నవాళ్ళం మనందరం. అనేక రకాల శత్రువుల ప్రయత్నాలు, మిత్రుల జీవితాలు ఉన్నాయి. మనకే కొంత అజ్ఞానం ఉంది, కొంత అమాయకత్వం
ఉంది. 1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత 1949లోనే ఈ దేశంలో పారిశ్రామిక విధాన తీర్మానం వచ్చింది. దేశ జనాభాలో ఆనాటికి 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఎటువంటి వ్యవసాయ విధానాలు లేవు, అప్పటికే కాదు, 2020 దాకా విధానం గురించిన ఆలోచనలే రాలేదు. సామ్రాజ్యవాద విత్తన సంస్థలు, ఎరువుల సంస్థలు, పురుగుల మందుల సంస్థలు ఏమి చేస్తే అదే ఇక్కడ విధానం. ఒక విధానమంటూ లేదు.
రైతాంగం గురించి విధానం ఏమిటి? వ్యవసాయం గురించిన విధానం ఏమిటి? వ్యవసాయ అభివృద్ధిని, రైతాంగ అభివృద్ధిని, గ్రామీణ అభివృద్ధిని ఎలా సాధించాలి అన్నది పాలకులు ఎన్నడూ పట్టించుకోలేదు. ఈ పాలకులకు వ్యతిరేకంగా పోరాడవలసిన శక్తులు కూడా ఆ విషయంలో కొంత వెనుకంజ వేశాయి. రెండు రకాల ఉద్యమాలు వచ్చాయి. అసలు ఉద్యమం రాలేదని కాదు, ఒక రకమైన
ఉద్యమం అన్ని సమస్యలకు భూమిలోనే, వ్యవస్థలోనే కారణాలున్నాయి. మిగిలిన ఉద్యమాలు ఏమీ చేయనక్కర్లేదు, మిగిలిన సమస్యలను పట్టించుకోనక్కర్లేదు. ‘భూమి పోరాటం’ చేస్తే చాలు అన్నాయి.
ఒక పొరపాటు వల్ల, ఒక అమాయకత్వం వల్ల, ఒక తప్పు వల్ల అనేక సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు ఆలస్యం చేశాము. మరొకవైపు పాలకవర్గాలు తమ దళారీ రైతు సంఘాలను ఏర్పాటు చేశాయి. ఈ రోజుకీ అవి ఉన్నాయి. ఈ మూడు చట్టాలు ఎంత గొప్పవి? చెంగల్రెడ్డి గారు మాట్లాడుతున్నది మీరు వినే ఉంటారు. అవి ఒక 30, 40 సంవత్సరాలు ఈ దేశ రైతాంగ ఉద్యమాన్ని దెబ్బతీశాయి, రైతుకు కాకుండా చేశాయి. మళ్ళీ ఒకసారి రైతాంగ ఉద్యమాన్ని విస్తరించడానికి, బలపడడానికి, ఇన్ని సమస్యలను ప్రధానం చేయడానికి, వ్యవసాయ సమస్యలను ప్రధానం చేయడానికి, గ్రామీణ సమస్యలను ప్రధానం చేయడానికి నక్సల్బరీ ఉద్యమం ప్రయత్నించింది. కానీ నేను ఇంతకు ముందే చెప్పినట్లు వాళ్ళు కూడా వ్యవస్థలో పై మార్పులు విత్తనాలు, నీరు, విద్యుచ్ఛక్తి, పండిన పంటకు గిట్టుబాటు ధర, గిడ్డంగులు, రవాణా సమస్యలతో పాటు ఇతర అనేక సమస్యలను పట్టించుకోలేదు. భూమి సమస్య పరిష్కారమయితే చాలు, భూ సంస్కరణలు జరిగితే చాలు, వ్యవస్థాగత పరమైన సమస్యల పరిష్కారాలయితే చాలు అని అనుకున్నాం. చాలా కాలం జరిగింది కానీ ఇక్కడ కూడా విఫలమయ్యాం. వ్యవస్థాగత సమస్యలతో పాటు తక్షణ సమస్యలూ ఉన్నాయి. ఈ రెండిరటిని కలిపి పోరాడవలసి
ఉంది. ఈ రెండిరటినీ మన ఎజెండాలో తీసుకోవలసి ఉంది. ఈ రెండిరటినీ తీసుకోవడం మాత్రమే కాదు. కిరణ్‌ చాలా స్పష్టంగా చెప్పారు, అసలు విధాన రూపకల్పనలో మన పాత్ర ఉండాలి. పాలకులు ఎవరున్నా కానీ, పాలకులకు వ్యవసాయం మీద ప్రేమలేదు, చిత్తశుద్ధి లేదు. కానీ వాళ్ళు చేసే ఈ విధానాలు ఎలా ఉండాలి? రైతాంగం లేచి నిలబడాలి. నేను చాలా రోజులు ఫైనాన్షియల్‌ జర్నలిజం. వాణిజ్య రంగ పత్రికా రచనలో ఉన్నాను. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ రాబోయే ముందు అన్ని పరిశ్రమల వాళ్ళు వెళ్ళి వారి కోసం ఏమున్నాయి అని అడుగుతారు. కానీ వ్యవసాయం గురించి అడిగినవారు లేరు. అడిగినా కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్లు దళారీ సంఘాలు అడుగుతాయి. నిజంగా రైతాంగానికి ఏమి కావాలి? వ్యవసాయానికి ఏమి కావాలి? 70 సంవత్సరాల తర్వాత కూడా నేటికీ బడ్జెట్‌ తయారీలో, విధానాల రూపకల్పనలో మన పాత్ర లేదు, రైతాంగం పాత్ర లేదు. కనుక ఇప్పటికైనా విధానాల రూపకల్పనలో కూడా మనం జోక్యం చేసుకోవాలి. అక్కడి నుంచి ప్రారంభించి ఒక చట్టం వస్తుంది, ఒక విధానం వస్తుంది. దాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అమలులో కూడా మన పాత్ర ఉండాలి. ఎక్కడికక్కడ ప్రజా ఒత్తిడి లేకుండా, అమలు జరగాలి. క్షేత్ర స్థాయికి వెళ్ళి క్షేత్ర స్థాయిలో రైతాంగ సమస్యలేమిటి అన్నది గమనించాలి. భారతదేశంలాంటి సువిశాల దేశంలో, వేర్వేరు పంటలున్న దేశంలో, వేర్వేరు ఉష్ణోగ్రతలు, శీతోష్ణపు స్థితులు ఉన్న దేశంలో ఒక చోట ఉన్న రైతాంగ సమస్య, ఇంకోచోట రైతాంగానికి ఉండదు. ఒకచోట రైతాంగానికి ఇచ్చే పరిష్కారం ఇంకో చోట రైతాంగానికి సరిపోదు. కనుక క్షేత్రస్థాయి విధానాలు అవసరం. క్షేత్ర స్థాయి విశ్లేషణ, క్షేత్రస్థాయి పరిష్కారాలు కూడా రైతు స్వరాజ్య వేదిక వంటి స్థానిక సంస్థలు, క్షేత్రస్థాయి సంస్థలు చేయవలసినవే. ఇది మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం వేలాది, లక్షలాది, కోట్లాది మంది రైతులను నిర్వాసితులను చేయడం జరిగింది. ప్రాజెక్టుల పేరిట, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట, రోడ్ల పేరిట, రైలు మార్గాల పేరిట, విమానాశ్రయాల పేరిట, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరిట, ఇప్పుడు ప్రత్యేక అవ్యస్థాపన మండలాల పేరిట… పేరు ఏదైనా పెట్టండి, లక్షల కోట్లాది ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారబోతోంది. లక్షల మంది రైతుల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ఈ కారణం వల్ల, అనేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాళ్ళకు సహాయం అందించాలి, పునరావాసం అందించాలి. అంటే నేడు రైతు ఉద్యమం ముందర కేవలం వ్యవస్థాగత సమస్యలు మాత్రమే కాదు, వ్యవస్థ సృష్టిస్తున్న దినదిన సమస్యలు, క్షణక్షణ సమస్యలు కూడా అనేకం ఉన్నాయి.
కొన్ని వేలమంది, లక్షల మంది చేసి ఇంకా మిగిలే పని ఉంది. కనుక, మన శ్రేణులను అంత విస్తరించుకోవడం ఎట్లా? ఇది ఊట. మన ఊట ఒక పదిమందితో పుట్టినది. పది మంది రైతులు కలిసి యాత్ర చేసి ఒక సంస్థ కావాలి, ఒక స్వతంత్ర సంస్థ కావాలి అని అనుకొన్నారు. ఏర్పాటు చేశారు. అది ఈనాడు 300 మంది డెలిగేట్ల స్థాయికి చేరింది. ఈ 300 మందిలో ఒక్కొక్కరికి కనీసం 10 మందో, 20 మందో వెనక ఉన్నారు. ఇది ఇంకా విస్తరించడం ఎట్లా, ఇంకా వేల మందికి, లక్షల మందికి చేర్చడం ఎట్లా అని ఈరోజు మనం ఆలోచించవలసి ఉంది. ఎందుకంటే ఇవాల్టి సందర్భం మన నుంచి మాట్లాడే, రాసే, ఆలోచించే వాళ్ళ నుంచి రైతుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళ నుంచి చరిత్ర కోరుతోంది, కాలం కోరుతోంది, సమాజం కోరుతోంది. ఇప్పుడు మూడు ప్రధానమైన సమస్యలు మన ముందర ఉన్నాయి. మొట్టమొదటి ప్రపంచీకరణ నుంచి ఆలోచించి 1980ల మధ్యలో, రాజీవ్‌గాంధీ పాలనలో, దిగుమతుల సరళీకరణ దగ్గర ప్రారంభించి 1992లో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన దగ్గర నుంచి, 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ మీద మనం సంతకం పెట్టడం దగ్గర నుంచి ఇవాల్టికి మనయొక్క భారత వ్యవసాయ రంగం సామ్రాజ్య వాద శక్తుల, రథచక్రాలకు కట్టివేయబడిరది. కనుక మన ముందర ప్రధానమైన సమస్య ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శక్తులను ఓడిరచడం ఎట్లా? వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ఎట్లా?
నిజానికి ఇవాల్టి ఈ మూడు చట్టాలు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశం ప్రకారం వచ్చాయి. కనుక ఈ మూడు చట్టాలను కూడా ప్రపంచీకరణలో భాగంగానే చూడాలి. గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో పెచ్చరిల్లుతోన్న హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిజం సామ్రాజ్యవాద శక్తులతో వంత పాడుతూ, ఈ మూడు చట్టాలను తీసుకొచ్చింది. కనుక శత్రువు, బలమైన శత్రువు, విశాలమైన శత్రువు అంటే మనం కూడా అంత బలంగా మారవలసి ఉంది. అంత విశాలవంతమైన ఐక్యత సాధించవలసి ఉంది. ఇక్కడ కవిత ప్రస్తావించిన విషయాన్ని నేను కూడా ముందే చెబుదామని అనుకున్నాను. ఇక్కడ మనకు ఉండేది ఒకే ఒక్క బలం, మనం గుర్తు తెచ్చుకోవలసింది ఒకే ఒక్క బలం ‘‘రైతు’’. ఈ దేశంలో రైతు సహజ స్వభావం, సహజ లక్షణం. ఆ సహజ లక్షణం ‘‘పట్టుదల’’, ఆ సహజ లక్షణం ‘‘ఓలిని’’, ఆ సహజ లక్షణం ‘‘నిరంతర కృషి’’, ఆ సహజ లక్షణం ‘‘ఆశావాదం’’. ఈ దేశంలో విశాలమైన వ్యవసాయాధార భూములున్నాయి. విత్తనం వేస్తాం, ఆ విత్తనం మొలకెత్తుతుందో లేదో తెలియదు. ఇప్పుడైతే హైబ్రిడ్‌ విత్తనాలను కొనుక్కొస్తాం, అది ఎంత కల్తీ విత్తనమో తెలియదు, పంట పండుతుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ పండినా కాండం వస్తుందో లేదో తెలియదు. కాండం వచ్చి మొక్క ఏపుగా పెరిగి దానికి చీడ వస్తుందో, పీడ వస్తుందో తెలియదు. చీడ పీడలు అయిపోయాయి, మనం కోతకు వచ్చిందన్నా కోత కోసి పనలు పరచిన తర్వాత అకాల వర్షం, రాళ్ళ వాన, పంటలు పోతుంటాయి. కానీ, ఎన్నడన్నా రైతు నిరాశపడ్డాడా? ఇక అయిపోయిందిరా, ఇక నేను చేయలేను అని మధ్యతరగతిలో సాధారణంగా చాలామంది అనుకొంటుంటారు. ఒక చిన్న ఎదురు దెబ్బ తగలగానే కృంగిపోయి ఇక నావల్ల కాదు, ఇక నేను చేయలేను అని అనుకొంటుంటారు.
కానీ ఈ దేశంలో మూడు వేల ఏళ్ళుగా, ఐదు వేల ఏళ్ళుగా రైతులు ఎన్నడూ కృంగిపోలేదు, ఎన్నడూ నిరాశపడలేదు. మళ్ళీ కాలం వస్తుంది, మళ్ళీ విత్తనం వేస్తాడు, మళ్ళీ పంట పోతుంది. 12 ఏళ్ళ కరువు చూసిన, 14 ఏళ్ళ కరువు చూసిన రోజులున్నాయి. కానీ ఏనాడూ రైతు కృంగిపోలేదు. ఆ తత్వాన్ని మనం వంటబట్టిచ్చుకుంటే రైతు స్వభావాన్ని మనం, భారతదేశ స్వభావం, రైతు స్వభావం, ఆ స్వభావాన్ని మనం మళ్ళీ పుణికి పుచ్చుకుంటే తప్పనిసరిగా రైతు స్వరాజ్య వేదిక ఉన్న స్థితి నుంచి కావలసిన స్థితికి చేరగలదు. అందుకు మీరు ప్రతి ఒక్కరూ మీ హస్తం చాచగలరు. మీరు నేడు దాంతో కలిసి నడుస్తున్నారు. మీతో మరో 10 మందిని, ఇంకో 100 మందిని కలిపి నడుపుకుంటే తప్ప మన ముందర ఉన్న మహా పర్వతాన్ని పెళ్ళగించడం సాధ్యమేనా? సాధ్యమేనని ఢల్లీి ఈనాడు చూపుతోంది. రేపు దేశమంతా చూపుతుందని ఆశిస్తూ రైతు స్వరాజ్య వేదిక ఎప్పుడు అడిగినా నేను ఒక వ్యాసకర్తగా, ఉపన్యాసకుడిగా నా శక్తి సామర్ధ్యాలను రైతు స్వరాజ్య వేదికకు ఇచ్చాను. ఈరోజు బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర రైతు స్వరాజ్య వేదిక సభ్యులందరి ముందర, నేను సంపాదకత్వం వహించే వీక్షణం పత్రిక పక్షాన, నా పక్షాన మీకు ఎప్పుడు, ఏ సహాయం కావలసి వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను. వీక్షణం పత్రిక గత 18 సంవత్సరాలుగా నడుస్తోంది. వందలాది రైతాంగ సమస్యపైన వ్యాసాలు ప్రచురించింది. ఢల్లీి రైతు ఉద్యమం మీద ఒక సంచికలోనే 18 వ్యాసాలను వేసింది. ఆ తర్వాత వరుసగా ఇంకొక 7, 8 వ్యాసాలను ప్రచురించింది… రైతు ఉద్యమాన్ని, రైతు స్వరాజ్య వేదికను మొత్తంగా భారత సమాజ, రైతు స్వభావాన్ని లేపి నిలపడానికి, ప్రత్యర్థులపైన విజయం సాధించడానికి.
చిట్టచివరకు మనం కోరుకునేది ఏమిటి? ‘‘దోపిడీ, పీడన లేని సమాజం, అసమానతలు లేని సమాజం’’. ఆ సమాజాన్ని సాధిస్తామని, రైతు స్వరాజ్య వేదికతో తోడుగా నడుస్తూ… రైతు స్వరాజ్య వేదికలో సభ్యత్వం అయితే తీసుకోలేదు. సభ్యత్వం తీసుకోకపోయినా అభ్యంతరం లేదు. నన్ను సభ్యుడిగానే భావించమని కోరుతూ, నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు.

Share
This entry was posted in ఉపన్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.