భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి,
ఆత్మీయునిగా సలహా, కోరికలు
సలహా: ప్రతి సంచికలోను మీ పేరు, పత్రిక పేరు, చిరునామా ఆంగ్లంలో ఇవ్వాలి. డబ్బు చెక్కు ద్వారా పంపడానికి ఆ అకౌంట్ పేరు యివ్వాలి
కోరికలు: భూమిక పేరిట రూ॥ 1200 వందలకు చెక్కు పంపుతున్నాను. పేరూ, ఊరూ, ఆడా, మగా తెల్పకుండా… భూమిక పఠిత నుండి అని క్రింద యిచ్చినట్లు డబ్బు పంపాలి.
కవన భూమిక: 1. శారద శివపురపు 2. డా॥ బండారి సుజాత 3. డా॥ తాళ్ళపల్లి యాకమ్మ 4. శ్రీతరంచింగి శ్రీకాంత్ ఒక్కొక్కరికి రెండు వందలు.
పిల్లల భూమిక: 1. కె. అఖిల 2. టి. ఉషశ్రీ 3. జి. గౌమిక 4. డి. నీలిమ కృష్ణ ఒక్కొక్కరికి వంద రూపాయలు
రాగమాలికలో స్త్రీవాద విరుద్ధమైనది (నా ఉద్దేశ్యం అది కాకపోయినా) ఏదైనా ఉంటే అది బహిరంగంగా చెప్పాలి. పుస్తకాల ముఖ పత్రాలతో పాటు అవి ఎక్కడ, ఎలా, ఎంతకు దొరుకుతాయో కూడా తెలియపరిస్తే వేసిన వారికి చదవాలనుకున్న వారికీ మంచిది.
` వి.ఎ.కె. రంగారావు, చెన్నై.
భూమిక సంపాదకులకు
1993 సం. నుంచి మనం చదువుతున్న భూమిక ఆనాటి నుంచి నేటి వరకు దిన దినాభివృద్ధి చెందుతూ ఎంతో మంది మనస్సులను ఆకట్టుకుంటూ వస్తోంది. ప్రతి కథనం మనస్సుకు దగ్గరిగా మనకు సంబంధించినదిగా ఉంటుంది, ఆశక్తి కలిగిస్తూంటుంది. ఏదో ఒక కొత్త విషయం తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూసే పత్రికలో భూమిక ఒకటి. కొత్త కొత్త కవితలు అందులో
ఉపయోగించే పదాలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. స్త్రీలను జాగృతం చేసే ఈ పత్రిక స్త్రీ వాదాన్ని మరింత గొప్పగా చెబుతుంది. ఎవరో ఒక్కరి జీవితం గురించి చక్కటి వివరణతో ఎప్పుడూ నూతన అనుభవాలను అందిస్తున్న భూమిక ఎల్లప్పుడూ అందరిని జ్ఞానంతో, విజ్ఞానంతో పరిజ్ఞానం పెంచుతుంది.
` భవాని, హైదరాబాద్.