గుజరాతీ మూలం, హిందీ అనువాదం: డా.వినోద్‌కుమార్ జోషి
సందర్భమంతా ఆగినా, ఆపకపోయినా
తనలోకి తాను పరికించుకుంది సైరంధ్రి!
పతి దగ్గరున్నా చెంతనెవరూలేరు…
స్త్రీధర్మం బహువిధాల అమ్ముడుపోయింది!
సత్వరం ఆజ్ఞ వచ్చింది: ‘‘రాజు వచ్చేస్తున్నారు,
ఓ సైరంధ్రీ! ఇక్కడనుండి ఇక వెళ్ళిపో…
ఇది మా పరస్పరానందంలో మదనోత్సవం
హరివిల్లువర్ణాల తనువుల పరిపూర్ణత్వం!’’
చేటుకాలాన్ని అతిభారంగా సహిస్తూ…
మందమరాళం నీట నడిచినట్లు
సైరంధ్రి వెడలింది ఏకాంతంలోకి!
పాండవకులాలంకృత ఆమె!
తెలియనిదారిలో ఆమె నడక
శిరసున భగ్నస్వప్నాలు
నిజనామం కూడా మరిచిన మనసు
శరీరమమకారమేమీ లేదు!
నిండుయవ్వన ఉత్సాహవతి
తనుమనమ్ముల నిత్యవాసంతిÑ
కానీ నిరాటంక అనుచరి,
మారువేషాన కుపిత కుంఠిత!
(సైరంధ్రి అనువాద కావ్యంలోంచి)