భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 కి 149 సంవత్సరాల చరిత్ర వుంది. లార్డ్ మెకాలే 1860లో ఈ సెక్షన్ని ఇండియన్ పీనల్ కోడ్‌లో చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీ పురుషులు పది సంవత్సరాల జైలు శిక్షకి, పెనాల్టీకి గురవుతారు. వారిని శిక్షించడానికి ఈ సెక్షన్ రూపొందించబడింది. నూట నలభై సంవత్సరాలుగా ఈ సెక్షన్ను ఉపయోగించి హోమోసెక్సువల్స్‌ని నేరస్తులుగా ముద్రవేసి హింసించడం, బ్లాక్‌మెయిల్ చెయ్యడం జరుగుతూ వస్తోంది. కేసులు పెట్టడం కాక ఆయా వ్యక్తులను, కుటుంబ సభ్యులను బెదిరించే పనికి పోలీసులు పూనుకోవడంతో హోమోలు భయం భయంగా బతకడం, తీవ్ర మానసిక ఆందోళనకి లోనవ్వడం జరుగుతోంది.
377కి వ్యతిరేకంగాను, ఈ సెక్ష న్ మొత్తంగా భారతీయ శిక్షాస్మృతిలోనుంచి తీసెయ్యాలని చాలా కాలంగా నిశ్శబ్ద ఉద్యమం జరుగుతోంది. చివరికి జూలై రెండు 2009 లో ఈ ఉద్యమం బహిరంగంగా రోడ్డెక్కింది. సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్, లెస్బియన్స్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు, ముంబయ్, కలకత్తాలో కూడా ఇలాంటి ర్యాలీలు జరిగాయి. మొట్ట మొదటి సారి పెద్ద సంఖ్యలో వీరు ప్రదర్శనల్లో పాల్గొని నినాదాలతో కదం తొక్కారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 377 రద్దుచేయాలని, రద్దు చేయకూడదనే వాదనలు జరుగుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారతీయ మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్) మొత్తం ఈ తీర్పుకు అనుకూలంగా స్పందించడంతో పాటు మొదటి పేజీల్లో పతాక శీర్షిక కథనాలను ప్రచురించాయి. పాజిటివ్ దృష్టిికోణంతో ఆర్టికల్స్ ప్రచురిస్తున్నాయి. దీనివల్ల జరిగిన మేలు ఏమిటంటే -ఇంతకాలం-మొదటి దశలో వున్న హెచ్‌ఐవి/ ఎయిడ్స్ పట్ల ప్రజల్లో వున్న ‘స్టిగ్మా’ లాంటిది ఈ అంశంలోనూ మెల్లగా కరగడం మొదలైంది. ఒక ఆరోగ్య కరమైన చర్చకు ఇది తెరతీసింది.
అయితే మత నాయకులు, సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇది భారతీయ సంస్కృతి కాదని, దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని గగ్గోలు పెడుతున్నారు. సుప్రీమ్ కోర్టులో ఈ తీర్పును నిలిపివేయాలంటూ అప్పీల్ కూడా చేసారు. అయితే సుప్రీమ్ కోర్టు స్టే ఇవ్వలేదు. ఒక వ్యక్తి హోమోగానో, లెస్బియన్‌గానో వుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనమౌతుంది? వారి వారి పుట్టుకతో భిన్న లైంగిక ధోరణులను కలిగి వుండే వ్యక్తులు నేరస్థులు ఎలా అవుతారు? వారి భిన్నమైన లైంగికత వల్ల వారు మొత్తంగా నేరం చేసినట్లు సెక్షన్ 377 కింద కేసులు బుక్ చేయడం లేదా చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ ఈ రోజున ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అంతే కాకుండా భారతీయ కుటుంబాల నాశనం అంటూ జరిగితే అది పురుషుల హింసాయుత ప్రవృత్తులవల్లే జరుగుతుంది. ఇటీవల కాలంలో స్త్రీల పట్ల పెరిగిపోతున్న హింసా ధోరణులు, తాగుడు, కుటుంబ హింస, కట్నం హత్యలు, పిల్లలపై దాడులు వీటిని గురించి మాట్లాడని వారంతా ఇపుడు సంస్కృతి పేరుతో ‘గే’ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. స్త్రీలపై అమలవుతున్న భయానక హింస భారతీయ సంస్కృతిలో భాగమా? దీన్ని మన సంస్కృతికి వ్యతిరేకమని వీళ్ళు ఎందుకు మాట్లాడరు? భారతీయ సంస్కృతికి, కుటుంబానికి, వివాహ వ్యవస్థకి ముప్పు వాటిల్లబోయేది పురుషుల ఆధిపత్య, అహంకార, హింసాయుత ధోరణుల వల్లనే తప్ప తమ మానాన తాము బతికే ”ఎల్‌జిబిటి”ల వల్ల కాదు అనేది స్పష్టం.
ఇటీవల ఒక సర్వే ప్రకారం 10% మంది భిన్న లైంగిక ధోరణులను కలిగివున్నారని, వీరినెవ్వరూ తయారు చెయ్యలేదని, వీరంతా పుట్టుకతోనే, బయలాజికల్‌గా ఈ ధోరణులను కల్గి వున్నారని తెలుస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు హాస్టల్స్‌లో వుండేటపుడు ‘గే’ లుగా తయారవుతారని, కౌన్సిలింగుద్వారాను, సైకియాట్రిక్ చికిత్స ద్వారాను వీరిని నయం చేయవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. అయితే ‘గే’లుగా బతికే పురుషులు స్త్రీలతో లైంగిక సంబంధాలని ఇష్టపడరని, అలాగే లెస్బియన్‌లుగా బతికే స్త్రీలు పురుష సంపర్కాన్ని ఒప్పుకోరనేది కూడా విదితమే. సైకియాట్రిక్ కౌన్సిలింగుద్వారా వీరిని నయం చేయవచ్చనే వాదం పై విధంగా వీగిపోతుంది.
ఢిల్లీ హైకోర్టు 377 మీ ఇచ్చిన తీర్పు ‘గే’ హక్కులపై ఒక విస్పష్టమైన, విస్తృతమైన చర్చకి దారితీయడం సంతోషిించాల్సిన అంశం. ఎందుకంటే ఒక అంశాన్ని కార్పెట్ కింద దాచేసినట్లు దాచేస్తే ఆ అంశం ఉనికి లేకుండా పోదు. దాని పట్ల నిగూఢతను, స్టిగ్మాను కొనసాగించడం కాక బహిరంగంగా ఒక చర్చను లేవనెత్తడం అవసరం. మంచి, చెడ్డలను చర్చించడం అవసరం.
రాజ్యాంగ విరుద్ధమైన ఒక ఐపిసి సెక్షన్ (377) 149 సంవత్సరాలుగా కొనసాగడం చాలా అన్యాయమైన విషయం.. వ్యక్తి స్వేచ్ఛకు, ఛాయిస్‌కు సంబంధించిన భిన్నమైన లైంగిక జీవన విధానం నేరమని చెబుతూ వారిని హింసించడం అమానుషమే అవుతుంది. ప్రజలు తమ కిష్టమైన, నచ్చిన విధానంలో (ఎదుటి వారికి కష్టం, నష్టం కల్గించకుండా) బతికే తీరును, బతుకుతున్న విధానాన్ని అర్ధం చేసుకోలేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందిందే కాదు.
దీనిమీద చెలరేగుతున్న వాదోపవాదాలను గమనిస్తే. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఎల్‌జిబిటి (లెస్బియన్ , గే, బైసెక్సువల్ మరియు ట్రాన్స్ జెండర్)లుగా జీవనం సాగిస్తున్న వారికి లీగల్ సపోర్ట్ నిచ్చింది గానీ సామాజిక సమ్మతి చాలా దూరంలో వుందనిపిస్తోంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
ఇండియాలో హోమోసెక్సు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. గత 20 ఏళ్ళలో పోలీసులకి హోమోసెక్స గురించి ఒక్క కంప్లెయింట కూడా రాలేదు.
ప్రవీణ హెరాస చేసేదే పోలీసులు. ఇక హోమోసెక్సువల్స కేసేవరిమీద పెట్టాలి. అర్థం కాని విషయాల గురించి ఇంత ఫ్రీగా మాట్లాడకూడదు నాయనా!
నేను హరాస్మెంట్స్ గురించి మాట్లాడలేదు. ఫలానా వ్యక్తులు హోమో సెక్స్ చేస్తున్నారని గత ఇరవై ఏళ్ళలో ఒక్కరు కూడా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదు. హోమోసెక్సువల్ సంఘాలు పెట్టి బహిరంగంగా హోమోసెక్స్ ని ప్రోత్సహించే కొంత మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చెయ్యడం జరిగింది. హోమో సెక్స్ చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. హోమో సెక్స్ కి చట్టబద్దత పేరుతో హెటెరో సెకువల్స్ చేత కూడా హోమోసెక్స్ చెయ్యించి ఏమి సాధిస్తారు?
మహేష నీకు చట్టాల గురించి తెలిసినట్టు లేదు. పోలీస ఆఫీసర నేరం చేస్తే అతని మీద కోర్టులో కంప్లెయింట ఇవ్వొచ్చు. ఎందుకంటే పోలీస ఆఫీసర తన స్టేషన్లో తన మీదే ఎఫ్.ఐ.ఆర్. వ్రాసుకోడు.
ఆడైనా, మగైనా హోమోసెక్స్ ఏ దేశంలోను, ఏ కాలంలోను సామాజిక సమ్మతికి నోచుకోదు. ఇప్పుడు చట్టాల్ని సవరించడం ద్వారా దానికి సమాజం చేత బలవంతంగా ఒప్పించాలని, acceptable చెయ్యాలని చూస్తున్నారు. హోమోసెక్సు ప్రబలితే నష్టపోయేది స్త్రీలే. ఆ సంగతి ఫెమినిస్టులు గ్రహించడానికి రెండుమూడు తరాలు తీసుకుంటుందేమో, అప్పటికి తరాలనేవి అసలు మిగిలుంటే !
మనిషి సుఖంగా బతకడానికి హెటెరోసెక్స చాలదా? హోమోసెక్స ఎందుకు? నేను వ్రాసిన “రమణీయం” కథలో కూడా హోమోసెక్స కి వ్యతిరేకంగా వ్రాసాను. http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/ramaneeyam.html
మా అమ్మమ్మ గారి ఊర్లో చాలా మందికి ఒకప్పుడు హోమోసెక్సు గురించి తెలియదు. హోమోసెక్సుని చట్టబద్ధం చెయ్యాలంటూ పత్రికలలో వచ్చిన ప్రకటనలు చదివిన తరువాతే తెలిసింది. హోమోసెక్సు అలవాటు లేని వాళ్ళకి కూడా అది అలవాటు చెయ్యడానికి గే & లెస్బియన సంఘాలు పెట్టడం ఎందుకు? మన ఆనందానికి హెటెరోసెక్సు చాలదా? హోమోసెక్సుని ప్రోత్సహించడానికి చట్టబద్దతా అంటూ ఈ సింగినాదం ఎందుకు?
Pingback: ఆరోగ్యకరమైన స్త్రీ-పురుష సంబంధాల కోసం లెనిన్ – సాహిత్య అవలోకనం
Pingback: ఆరోగ్యకరమైన స్త్రీ-పురుష సంబంధాల కోసం లెనిన్ « పౌర స్వేచ్చ