‘‘తన మార్గం’’ వైపునకు ‘‘ప్రయాణం’’ చేసిన అబ్బూరి ఛాయాదేవి -డా॥ వేలూరి శ్రీదేవి

సమాజం, సాహిత్యం పరస్పర ప్రేరేపితాలు. నాటినుండి నేటివరకు సమాజంలో సగభాగమైన స్త్రీలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వివిధ కాలా7ల్లో, వివిధ ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా, చదువుల తల్లిగా, ధనలక్ష్మిగా ఆకాశానికెత్తినప్పటికీ, మరికొన్ని పరిస్థితుల్లో

దాసిగా, మాతంగులుగా అథఃపాతాళానికి తొక్కబడుతున్నారు. జన్మతః ప్రకృతి, పురుషుడు సమస్థాయినే కలిగి ఉన్నప్పటికీ స్త్రీలకు సమాజంలో సముచితమైన స్థానం అందించబడడం లేదు. దీని కోసం చాలామంది సంఘ సంస్కర్తలు, రచయితలు, కవులు, కళాకారులు తమయొక్క ఘంటాలను, గళాలను రaళిపించారు. ఈ శతాబ్దంలో సాహిత్య ప్రక్రియల ద్వారా స్త్రీల యొక్క సమస్యలను ఉటంకిస్తూ రచనా వ్యాసంగం చేసిన వారిలో ముందు వరుసలో ఉన్నవారిలో శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ప్రథములు.
శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి సనాతన సంప్రదాయ సత్‌బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 13 అక్టోబరు 1933లో మూడవ (చివరి) సంతానంగా మద్దాలి వెంకటరమణమ్మ, వెంకటాచలం దంపతులకు జన్మించారు. ఛాయాదేవికి ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళింట్లో ఈసారి తప్పనిసరిగా మగసంతానం కలుగుతాడనే గట్టి నమ్మకంతో ఉన్నప్పుడే ఛాయాదేవి జన్మించింది. అందుకే ఇంట్లో వాళ్ళందరూ ఆమె బాల్యంలో మగ పిల్లాడిలాగానే పెంచారు. తాను అబ్బాయిలాగే నిక్కర్లు, షర్టులు వేసుకునేదాన్నని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రాథమిక విద్యాభ్యాసమంతా రాజమండ్రిలో జరిగింది. వారి కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఆమె ఉన్నత విద్యాభ్యాసం హైద్రాబాద్‌లో ఆమె అన్నగారింట్లో ఉంటూ చదివింది. ఆ క్రమంలోనే 1951`53 లో నిజాం కాలేజిలో ఎం.ఎ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశారు.
అబ్బూరి ఛాయాదేవికి 1953లో కవి, రచయిత అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది. తరువాత ఆమె లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. 1959`1961 కాలంలో న్యూఢల్లీిలోని యునైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో లైబ్రేరియన్‌గాను, తర్వాత 1972`1982 లో జవహర్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గాను పనిచేశారు. ఆ సమయంలోనే ఉద్యోగరీత్యా డాక్యుమెంటేషన్‌ కోసం 1976`77 లో ఒక సంవత్సరం పాటు ఫ్రాన్స్‌లో ఉన్నారు. తర్వాత 1982లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
అబ్బూరి ఛాయాదేవి ప్రముఖ స్త్రీ వాద కథా రచయిత్రుల్లో విలక్షణ శైలి కలిగిన కథా రచయిత్రి. తన కథా రచన గురించి ఆమె మాటల్లోనే ‘‘నా అనుభవాలనూ, అనుభూతులనూ కథలుగా చెప్పాలనే తపన నా విద్యార్థి దశనుండే మొదలైంది. మద్దాలి ఛాయాదేవి పేరుతో రాసిన ‘అనుభూతి’ కథ నిజాం కాలేజీ పత్రిక ‘విద్యార్థి’లో 1952`53లో ప్రచురించబడిరది’’. ఇదే ఈమె మొదటి కథ. ఇందులో కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉండేదో, అందులోనే స్త్రీలు తమ ఆనందాన్ని ఎలా వెతుక్కునేవారో రచయిత్రి వివరించారు. అనంతరం వైవాహిక జీవితంలోని మంచిచెడులను విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో ప్రచురించబడిరది. అయితే అబ్బూరి ఛాయాదేవికి 1965లో రాసిన ‘ప్రయాణం’ కథతో మంచి గుర్తింపు వచ్చింది.
అబ్బూరి ఛాయాదేవి రచనలను గమనిస్తే ‘‘తన మార్గం, అబ్బూరి ఛాయాదేవి కథలు, ఎవర్ని చేసుకోను?’’ అనే కథా సంపుటాలను, ‘‘చైనాలో ఛాయాచిత్రాలు’’ అనే యాత్రా కథనం, అపరిచిత లేఖ ఇతర కథలు, మృత్యుంజయ (రచయిత్రి వాళ్ళ నాన్నగారు రాసుకున్న లేఖలకు సంబంధించినవి), వరద స్మృతి (సంకలనం) రచయిత్రి భర్త అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి నిష్క్రమణ అనంతరం ప్రేమ కానుక ఈ రచన. వ్యాస చిత్రాలు (1955 వ్యాస సంకలనం)Ñ ఇందులో ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవ్య, మిసిమి లాంటి పత్రికల్లో రచయిత్రి రాసిన కాలమ్స్‌, వ్యాసాలు కలిపి ఈ వ్యాస సంకలనంలో వేశారు. బొమ్మలు చెయ్యడం, స్త్రీల జీవితాలు`జిడ్డు కృష్ణమూర్తి, మన సమస్యలు`కృష్ణాజీ సమాధానాలు, మన జీవితాలు`జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు (యధాతథానువాదం) వంటి పుస్తకాలు ప్రచురించారు. 1954లోనే ‘కవిత’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆంధ్ర యువతీ మండలి ‘వనిత’ అనే పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. 1989`90లలో ఉదయం పత్రికలో మహిళా శీర్షికను నిర్వహించారు. చాలాకాలం భూమిక స్త్రీ వాద పత్రికలో (1996`2006 వరకు) ‘‘అలోకనం’’ పేరుతో కాలమ్స్‌ రాశారు. 2016 నవ్య వారపత్రికలో సంవత్సరం పైగా నిర్వహించిన ‘మాట సాయం’ కాలమ్‌లో రాసిన వ్యాసాలతో ‘మాట సాయం’ పేరుతో పుస్తకం ముద్రించారు.
అబ్బూరి ఛాయాదేవి కథలన్నీ దాదాపుగా స్త్రీ ప్రాధాన్యతను, స్త్రీల సమస్యల నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. తన కథల గురించి రచయిత్రి ఇలా అంటారు, ‘‘నా కథలు చాలావరకు కుటుంబంలోనూ, సమాజంలోనూ నేను చూసిన స్త్రీల స్థితి గతుల గురించి, స్త్రీ పురుష వివక్ష గురించి రాసినవే. నా తోటి స్త్రీలకు జరిగిన అనుభవాలను కూడా నాకు జరిగినట్లుగానే స్పందించి రాశాను’’. ఇంకా రచయిత్రి సమాజంలోని ఇతర అంశాలను కూడా నేపథ్యంగా తీసుకుని కథలు రాశారు. అవి కూడా పాఠకుల మన్ననలు పొందాయి. పాఠకులకు కథ చదువుతుంటే కలిగే సందేహాలకు, అక్కడే సమాధానాలు దొరుకుతాయి. ఈమె కథల్లోని స్త్రీ పాత్రలు ఉద్యోగిని అయినా, గృహిణి అయినా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. ‘‘స్త్రీ మనసే ఆమెకు శాపం. ఆమె ప్రేమే ఆమెకు పాపం’’ వలే ఉంటూ కథల్లోని స్త్రీ పాత్రలు తమలో తామే మధనపడుతుంటాయి తప్ప తిరుగుబాటు చేయవు. సమాజంలోని సగటు స్త్రీల అనేక పార్శ్వాల్ని ఈమె తన కథల్లో చూపించారు. పూర్వకాలం నాటి స్త్రీలకు అణకువ, మధ్యకాలం నాటి స్త్రీలు తమలో తామే సంఘర్షించుకోవడం, ఆధునిక కాలం నాటి స్త్రీలు స్వతంత్రంగా ముందడుగు వేయడం కనిపిస్తుంది. ‘‘అసమ సంబంధాలున్నాయన్న స్పృహ కలిగిన తరువాత ఆ స్త్రీలు పూర్తిగా అణగిమణిగి ఉండలేరు. మానసిక సంఘర్షణకు గురవుతూనే, పురుషుల్లో మార్పు తేవడానికి కృషి చేస్తూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు’’ అన్నది స్థూలంగా అబ్బూరి ఛాయాదేవి రచనా దృక్పథం. అబ్బూరి ఛాయాదేవి కథల్లో వర్ణనలు అధికంగా ఉండవు. స్త్రీల స్థితి సామాన్యంగానే ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు కూడా మధ్యతరగతి స్త్రీల జీవనశైలి మాదిరిగానే ఉంటుంది. కథాంశం చిన్నదైనా కథనం ఏకబిగిన చదివింపచేస్తుంది, పాఠకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. శైలి సులభంగా ఉండి పదాలు వాడుక భాషలో ఉంటాయి. ‘తన మార్గం’ కథాసంపుటిలోని కథలన్నీ దాదాపుగా ఉత్తమ పురుషలోనే సాగుతాయి. ఈమె కథల్లో విజ్ఞానదాయక విషయాలను చెప్పడం ఒక ప్రత్యేకత. ఈమె కథలు హిందీ, తమిళ, మరాఠీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. ‘‘తన మార్గం’’ కథా సంపుటికి 2005లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
‘తన మార్గం’ : తన మార్గం కథాసంపుటిలోని 28 కథల్లో ‘‘తన మార్గం’’ కథ ఒకటి. ఈ కథలో వర్ధనమ్మ పెద్ద కొడుకు రాఘవ. రాఘవ భార్య లక్ష్మి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. వర్ధనమ్మ చిన్న కొడుకు కేశవ. అతని భార్య మాలతి. వీరికి ఇద్దరు పిల్లలు. వర్దనమ్మ కూతురు మాధవి, గణపతి, మీనాక్షమ్మ, మీనాక్షమ్మ కోడలు, రిక్షావాడు పాత్రలుగా ఉన్నారు.
వర్దనమ్మ పెద్దకొడుకు రాఘవ: రాఘవ ప్రస్తుతం తన భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి ఉద్యోగ నిమిత్తం ఢల్లీిలో స్థిరపడ్డాడు. తనకు వీలైనప్పుడల్లా తల్లికి ఎంతో కొంత డబ్బు పంపిస్తుంటాడు. చాలా ఏళ్ళుగా ఢల్లీిలో ఉంటున్న రాఘవకి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మ వర్దనమ్మ పేరుమీద ఉన్న ఇల్లు అమ్మి కొంత డబ్బు తీసుకుని తల్లిని తనతో ఢల్లీికి తీసుకెళ్ళాలనుకుంటాడు. అలా కాదంటే తమ్ముడు కేశవ దగ్గరైనా ఉంచాలనుకుంటాడు. తల్లిని సొంత ఊర్లో ఉన్న తమ్ముడు కేశవ బాగానే చూసుకుంటాడని అనుకుంటాడు. అయినా అమ్మ సొంతింటిని అమ్మక, కొడుకుల దగ్గరికి వెళ్ళక ఆ ఇంట్లోనే ఒంటరిగా ఎందుకు ఉంటోందో రాఘవకి అర్థం కాదు.
వర్దనమ్మ చిన్న కొడుకు కేశవ: పెళ్ళైన కొత్తలో తల్లిదండ్రుల నుంచి విడిపడిన కేశవ భార్య మాలతి, ఇద్దరు పిల్లలతో అదే ఊరిలో రెండు గదుల అద్దె ఇంట్లో ఉంటూ, చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత నలుగురితో కూడిన కుటుంబానికి రెండు గదుల అద్దె ఇల్లు సరిపోక కష్టపడుతుంటాడు. సొంత ఇంట్లో ఉంటున్న అమ్మ వర్ధనమ్మ దగ్గరికి వెళ్దామనుకుంటే ఆమె ఒప్పుకోదు. ప్రతినెల అన్నయ్య డబ్బు సర్దుబాటు చేస్తున్నాడనుకుంటాడు కేశవ. ఇంటి వెనుక భాగం పోర్షన్‌ అద్దెను అమ్మే తీసుకుంటోంది. అమ్మకు డబ్బులకు లోటు లేదనుకుంటాడు. మరి తన కుటుంబాన్ని రానివ్వక ఆ ఇంట్లోనే ఒంటరిగా ఎందుకుంటోందో అర్థంకాదు కేశవకి.
వర్ధనమ్మ కూతురు మాధవి: మాధవి తన అన్నలిద్దరూ వేర్వేరు కారణాలతో తన తల్లికి దూరంగా ఉంటున్నారని గ్రహించి తల్లిని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. కానీ తల్లి వెళ్ళదు. దీపావళి వంటి పండుగలకు రమ్మని కబురుచేసినా పెద్దగా సుముఖత వ్యక్తం చేయదు అమ్మ. ఆ ఇంట్లోనే ఒంటరిగా ఎందుకుంటోందో అర్థం కాదు మాధవికి.
వర్ధనమ్మ భర్త: కథలో ఈ పాత్రకి పేరు లేదు. తన అన్న అతని భార్య చెప్పినట్టు నడుచుకుంటుంటే భార్య కొంగు చాటు మొగుడు అని అందరూ హేళన చేసేవాళ్ళు. అందుకని వర్ధనమ్మ భర్త తన భార్య పట్ల కఠినంగా, గంభీరంగా వ్యవహరించేవాడు. భార్య తనకు ఎదురుచెబితే సహించేవాడు కాదు. ఒక్కోసారి దండిరచేవాడు కూడా. తన అవసాన దశలో భార్య యొక్క దయనీయ స్థితిని గమనించి, రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోయిన కొడుకులు, కోడళ్ళ కుటుంబాల గురించి ఆలోచించి, భార్యకు కనీస న్యాయమైనా చేయాలనే తలంపుతో తన తదనంతరం తన ఇంటిని భార్య వర్ధనమ్మకు చెందేలా ఆమె పేరుమీద రాసి ఆమె ఇష్టప్రకారం ఆ ఇంటిని ఏమైనా చేసుకునే అధికారం ఆమెకే కల్పిస్తూ వీలునామా రాస్తాడు.
వర్ధనమ్మ: ఈ కథలో ప్రధాన పాత్ర వర్ధనమ్మ. బాల్యం నుండి భర్త మరణించే వరకూ కూడా ఆమె జీవితం ఎవరో ఒకరి అదుపాజ్ఞలలోనే గడిచిపోయింది. బాల్యమంతా తల్లిదండ్రుల ప్రేమానురాగాల కంటే, ఎక్కువగా భయభక్తులతోనే సాగింది. పెళ్ళయిన తర్వాతైనా తన జీవితం మారుతుందనుకుంటే భర్త అహంకార ధోరణి వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. తన అభిప్రాయాలకు విలువనివ్వకపోగా, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు భౌతిక దాడిగి దిగడం వల్ల తన స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోయింది వర్ధనమ్మ. పిల్లల ఆలనా పాలనలతో తేరుకుంటున్న వర్ధనమ్మ పెద్ద కొడుకు రాఘవ భార్యాపిల్లలతో తాను వద్దని వారిస్తున్నా వినకుండా సుదూర ప్రాంతమైన ఢల్లీికి ఉద్యోగం పేరుతో తమని వదిలి వెళ్ళడంతో నిశ్చేష్టురాలవుతుంది. అలాగే చిన్న కొడుకు కేశవ తన భార్య లక్ష్మి మాటలు విని పెళ్ళయిన కొత్తలోనే అదే ఊర్లో వేరు కాపురం పెట్టడంతో నిర్ఘాంతపోతుంది. అటు భర్త, ఇటు పిల్లల యొక్క నిరాదరణ వర్ధనమ్మను మరింత కృంగదీస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుని తనను ఒంటరిని చేశారని విలవిల్లాడిపోతుంది. కూతురు రమ్మన్నా కూడా అల్లుడి పంచన చేరడానికి ఆమె మనస్సు అంగీకరించదు. తన భర్త చనిపోతూ రాసిన విల్లులో ఇంటిని తన పేరుమీద రాయటం ఆమెకు ఆనందం కలిగించే విషయమైనా తనలో నిగూఢమై ఉన్న నిర్లిప్తత ఆ ఆనందాన్ని కప్పివేస్తుంది.
తమ్ముడు కేశవ వచ్చి రోజూ అమ్మ బాగోగులు చూసుకుంటున్నాడనే ఆలోచనలో ఉన్న అన్న రాఘవ ఆలోచనలను, అన్న రాఘవ నెలనెలా డబ్బులు పంపిస్తుంటే వాటితో పాటుగా ఇంటిలోని అద్దెకిచ్చిన పోర్షన్‌ డబ్బులు వసూలు చేసుకుంటూ అమ్మ ఆర్థిక పరిపుష్టితో ఉందన్న భావనలో ఉన్న తమ్ముడు కేశవ తలంపులు నిజం కావని చెప్పే ప్రయత్నం చేయదు వర్ధనమ్మ. రెండు, మూడు నెలలుగా డబ్బులు పంపించని అన్నయ్య గురించి తమ్ముడికి, వారం, పది రోజులుగా ఇంటికి రాని తమ్ముడి గురించి అన్నయ్యకి అవకాశం ఉన్నా చెప్పే ప్రయత్నం చేయదు. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదని కాదు, ఆ దశను దాటిన ఒక స్తబ్దత, ఒక నిర్లిప్తత… అంతే. అందుకే తన ఇంట్లోనే ఒంటరిగా ఉండాలనుకుంటుంది వర్ధనమ్మ. కానీ ఆ ఇంట్లోనే ఒంటరిగా ఎందుకుందో అర్ధం కాదు మరెవ్వరికీ.
భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం శూన్యంగా అనిపించినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి అవసరాల కోసం, బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వర్ధనమ్మకి. మొదట్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం, దిగులు ఉండేవి. కాలక్రమేణా వాటి స్థానాన ధైర్యం, ఉత్సాహం ప్రారంభమై మెల్లిగానైనా తన పనులన్నీ తానే చేసుకునే అలవాటు చేసుకుంటుంది. ఇద్దరు పిల్లలూ తమ బాధ్యతలను విస్మరించినా వారిపై ఏ మాత్రం కోపాన్ని ప్రదర్శించదు. తన మార్గాన్ని తానే వెతుక్కునే పనిలో పడుతుంది. తనకున్న చిన్న చిన్న సంతోషాలను, అంటే సినిమాలు చూడటం, చెవి కమ్మ విరిగితే అతికించుకోవడం, పార్కుకి వెళ్ళి సేదతీరడం, బయటికి వెళ్ళి తనకు అవసరమైన సామాన్లు తెచ్చుకోవడం వంటివి సంతృప్తిగా చేసుకుంటుంది. తనకున్న నాలుగు మార్గాల్లో… మొదటిది, పెద్ద కొడుకు వద్దకు వెళ్ళడం. రెండవది, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళడం, మూడవది, చిన్న కొడుకునున తనింటికి ఆహ్వానించడం, నాల్గవది, కూతురు, అల్లుడి దగ్గరకు వెళ్ళడం. ఈ నాలుగు మార్గాలను వదిలి తనింట్లో తాను స్వతంత్రంగా, సంతోషంగా, సంతృప్తిగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉండాలని వర్ధనమ్మ తన జీవన మార్గాన్ని తానే ఎంచుకుని, తన మార్గంలోనే పయనిస్తుంది.
ఈ ‘తన మార్గం’ 1996లో రచించినా, ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు కనబడుతూనే
ఉంటాయి. ఇది రచయిత్రి ముందు కాలాన్ని ఊహించి రాశారనడానికి ఒక తార్కాణం. ఇందులో ముగింపుగా వచ్చిన ఒక వాక్యం నాకు సుఖాంతమైన ముగింపులా అనిపించింది. ‘‘ఆమె మనస్సు 60 సం॥లు వెనక్కి వెళ్ళి గాలిపటంలా ఆకాశంలోకి ఎగిరి గంతులేసింది’’.
ప్రయాణం: మా కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విభాగంలో పి.జి. ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు ‘‘మహిళా జీవన అధ్యయనం’’ అనే పేపర్‌లో ‘ప్రయాణం’ కథను పాఠ్యాంశంగా బోధిస్తున్నాం. ప్రయాణం కథ, 1995 డిసెంబరులో జ్యోతి పత్రికలో ప్రచురించబడిరది. 2002 అక్టోబర్‌ ఆదివారం నాడు ‘వార్త’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత్రి ఈ కథ ముగింపు గురించి మాట్లాడుతూ, ‘‘మళ్ళీ నాకు ఈ ప్రయాణం కథను ఇప్పుడు రాసే అవకాశం వస్తే ఈ ముగింపులో రమకు శేఖర్‌ వంటి ఆదర్శ పురుషుడు ఎదురై కథ సుఖాంతమయ్యేలా ఇప్పుడైతే రాయలేనేమో. జరిగిందంతా మర్చిపోవడానికి ప్రయత్నించి కథా నాయిక పాత్ర రమను తన్ను తాను నిలదొక్కుకుని మూర్తికి దూరంగా ఉంటూ జీవితాన్ని తనకు నచ్చిన మార్గంలో కొనసాగించేలా చేస్తానేమో’’ అన్నారు. ఇంకా ‘‘ఆ వయస్సులో రాయగలిగినంత ప్రభావవంతంగా ఇప్పుడు రాయగలనో లేదో’’ అని రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి అభిప్రాయపడ్డారు.
ఈ ‘తన మార్గం’ అనే కథా సంకలనంలోని మొత్తం కథలలో మార్పులు, చేర్పులు చేయాలనుకున్న మొదటి కథ, చివరి కథ కూడా ఇదే. ఇక ఇప్పుడు ఈ ‘ప్రయాణం’ కథవైపు ప్రయాణిద్దాం. కథానాయిక రమ స్వతంత్ర భావాలు కలిగి ఉన్నతమైన వ్యక్తిత్వం గల అమ్మాయి. తల్లిదండ్రుల మాటకి గౌరవమిస్తూనే తన ఇష్టాయిష్టాలను సూటిగా, స్పష్టంగా వారికి తెలియజెప్పగలిగే నేర్పరి. తనకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసినప్పుడు వారి మాటను కాదనలేక పెళ్ళిచూపులకు అభ్యంతరం చెప్పకుండానే, తాను మరొకరిని ఇష్టపడుతున్నానని తల్లిదండ్రులకు నిక్కచ్చిగా చెబుతుంది. ఈ సంఘటనతో కథ ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత పరీక్షలు రాసి వస్తానని హైదరాబాద్‌ నుండి వాల్తేరుకు రైలులో తన ప్రయాణం కొనసాగిస్తుంది. అందులో ఒక సాధువుతో పరిచయం ఏర్పడి అతని వ్యక్తిత్వానికి ఆశ్చర్యపడుతుంది. రాజమండ్రిలో తన స్నేహితురాలు సుధ కలిసి ఇంటికి ఆహ్వానించినపుడు, స్నేహితురాలి కోరిక మన్నించి ఆ దంపతులతో పాటు వారింటికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నవేళ సుధ భర్త రాజారావు తనపై అత్యాచారం చేస్తాడు. ఆ విషయం సుధకు చెప్పి వారి కుటుంబ జీవనాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆమెకు మనసొప్పదు. కానీ తనకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా కుమిలిపోతుంది. ఈ క్రమంలో ఆమె మానసిక సంఘర్షణకు లోనవుతుంది. అయితే తనకు ఇదంతా తెలుసని, పరస్త్రీల పట్ల తన భర్తకి గల వ్యామోహం అధికమని, ఈ ఒక్కటి తప్ప అతనికి మరే రకమైన దురలవాట్లు లేవని, భార్యనైన తనను చాలా బాగా చూసుకుంటాడని సుధ చెప్తున్న మాటలు విని నిర్ఘాంతపోతుంది. తన స్నేహితురాలిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థంకాక అయోమయంలో పడుతుంది. రావణాసురుడు, కీచకుడు, దుశ్శాసనుడు వంటి వాళ్ళందరూ పరస్త్రీల పట్ల వ్యామోహం కలిగి, దాని ఫలితంగా ఎంత భయంకరమైన మరణాన్ని పొందారో గుర్తు చేసుకుంటుంది. మరి సుధ అలాంటి నీచబుద్ధి కలిగిన భర్తని ఎలా ఆదరిస్తోందో రమకు అర్థంకాదు. అయినా స్నేహితురాలి సంసారం కోసం వారిని అక్కడే వదిలించుకుని వాల్తేరుకు బయల్దేరుతుంది. ఈ ప్రయాణం మొత్తం కూడా రమ తీవ్ర మానసిక ఒత్తిడిలోనూ, అలజడిలోనూ ఉన్నట్లు మనం గ్రహిస్తాం. తన జీవితం నాశనమైందని, ఇక సమాజానికి తన ముఖం చూపించలేనని లోలోపల మధన పడుతుంది. తన ప్రియుడు మూర్తికి ఈ విషయం చెప్పాలని నిశ్చయించుకుంటుంది. అయినా అతన్ని కలవడానికి ధైర్యం చాలక దూరం దూరంగానే ఉంటుంది. ఒకసారి వారిద్దరూ మాత్రమే ఉన్న సమయంలో రాజమండ్రిలో తన స్నేహితురాలి భర్త వల్ల జరిగిన విషయాన్నంతా మూర్తికి వివరిస్తుంది. అప్పటిదాకా ఆమె వెంటపడి చూట్టూ తిరిగిన మూర్తి మొహం చాటేస్తూ వెళ్ళిపోతాడు. ఈ దుర్ఘటనలో తన ప్రమేయం ఏమీ లేకున్నా తను బలిపశువును కావటం పట్ల ఆమె మానసిక సంక్షోభానికి లోనవుతుంది. జీవితమంతా సన్యాసినిలా గడిపేద్దామని రైలులో కనిపించిన సాధువు వద్దకు వెళ్తుంది. అతను చెప్పిన సాంత్వ వచనాలు విని జీవితాన్ని ఈ విధంగా ముగించవద్దని, మరో మలుపునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుని బయలుదేరుతుంది. ఆ క్రమంలోనే తల్లిదండ్రులు చూసిన పెళ్ళికొడుకు డా॥చంద్రశేఖర్‌ కనబడి జరిగిన విషయమంతా తెలుసుకుని ఆ విషయాన్ని చాలా తేలికగా తీసేస్తూ, ఆమెకు ఊరట కలిగిస్తూ మనసులో ఆ దుర్ఘటన పట్ల ఉన్న అపరాధ భావాన్ని తొలగిస్తాడు. ఇలాంటి ఓదార్పుని మూర్తి నుంచి ఆశించిన ఆమె అక్కడ శూన్యమై, శేఖర్‌ దగ్గర స్నేహ హస్తం అందుకుంటుంది. ఇలా ఆమె మలి జీవన ప్రయాణం సంతృప్తిగా, ప్రశాంతంగా ప్రారంభమై కథ ముగుస్తుంది.
ఇందులో రమ, సుధ, సుధ భర్త రాజారావు, సాధువు, శేఖర్‌ వంటి పాత్రలు ప్రముఖంగా కనపడగా, తల్లిదండ్రులు, తమ్ముడు, రైలు ప్రయాణికులు, జట్కావాడు, పిన్ని, బాబాయి, స్నేహితు
రాళ్ళు, మూర్తి చెల్లెలు రాధ వంటి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి.
స్థూలంగా ఇదీ ప్రయాణం కథ. మనిషి జీవితంలో ఎంత పెద్ద ఆపదను గెలిస్తే అంత గొప్పవాడవుతాడు. అలాగే సున్నితమైన మనసు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని స్థిరంగా, ధైర్యంగా నిలబడినప్పుడే కఠినమైన వజ్రంగా మారి, ఇంద్రధనుస్సులోని రంగులవలే వెలుగుతుంది. జీవితంలో జరిగే గుణపాఠాలే మనల్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్తాయి. రమ విషయంలోనూ అదే జరుగుతుంది. ఒక సాధారణ స్త్రీ నుంచి సబలగా సాగిన జీవన ప్రయాణమే ఈ ‘ప్రయాణం’ కథ. మొదట తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడు మూర్తి దగ్గరకు వెళ్ళాలనే విషయంలో దూకుడుగా కనిపించి, తన స్నేహితురాలి భర్త చేతిలో అత్యాచారానికి గురై అబలగా మారి మూర్తి చేత నిరాదరణకు గురైనపుడు బేలగా కృంగిపోయి, సన్యాసినిగా తన జీవితాన్ని ముగించాలనుకున్న సందర్భంలో సాధువు యొక్క ఉపదేశంతో సబలగా మారి తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి డాక్టర్‌ చంద్రశేఖర్‌ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ, తన భావి జీవితపు కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.