అనాథల హక్కుల ప్రత్యేక చట్టం కోసం రౌండ్‌ టేబుల్‌ సమావేశం -భూమిక టీం

ఫోర్స్‌ (అనాధల హక్కుల కోసం సమాజానికి అవగాహన కల్పిస్తున్న సంస్ధ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 03`09`2021న అనాధ హక్కుల ప్రత్యేక చట్టం రూపొందించి, అమలు చేయడంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో అనాథాశ్రమాలు నడుపుతున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, అందులో ఆశ్రయం పొందుతున్న

బాల బాలికలు, స్వతంత్ర జీవితం గడుపుతున్న పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
వరంగల్‌ నుండి బాలవికాస్‌ సంస్థ, హైదరాబాద్‌ నుండి మా ఇల్లు, ఎం.వి.ఫౌండేషన్‌, డాన్‌బాస్కో నవజీవన్‌, భూమిక సంస్థ, విశ్రాంత జిల్లా జడ్జిలు, న్యాయవాదులు, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
ముందుగా ‘మా ఇల్లు’ కో`ఆర్డినేటర్‌ నీరజ స్వాగతోపన్యాసం చేశారు. ఈ ప్రతిపాదన కోసం పైన పేర్కొన్న సంస్థలు మరియు అనాథ విద్యార్థులు పది సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారని, దాని ఫలితంగానే గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగస్టు 21, 2021న పది మంది మంత్రులతో కలిసి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేశారని చెప్పారు. ఈ కమిటీ సెప్టెంబర్‌ ఆరవ తేదీన మూడవసారి సమావేశం నిర్వహిస్తున్నందున, అందుకోసం చట్టంలో రూపొందించవలసిన విషయాల గురించి చర్చించి కమిటీకి నివేదిక ఇవ్వడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందుగా ‘మా ఇల్లు’ వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ 18 ఏళ్ళ వయసుగల పిల్లల కోసం ఏర్పాటు చేసిన జువెనైల్‌ యాక్టు అనాథలకు పూర్తి న్యాయం చెయ్యలేదని, వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. విశ్రాంత న్యాయమూర్తి ప్రసాదరాజు మాట్లాడుతూ అనాథలు ఆత్మగౌరవంతో బతికేలా వారికి చట్టబద్ధమైన హక్కులు కావాలని, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్‌ లాగానే ప్రత్యేక చట్టం తేవాలని కోరారు.
డాన్‌బాస్కో నవజీవన్‌ నుంచి ఫాదర్‌ కౌశి మాట్లాడుతూ వీరికి ఉచిత నాణ్యమైన విద్య, ఆరోగ్య, ప్రయాణ సదుపాయాలు కల్పించాలని, అలాగే వారికి ప్రభుత్వ ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయాలని కోరారు.
అనాథ ఆశ్రమంతో పెరిగిన పూర్వ విద్యార్థి ప్రశాంత్‌ మాట్లాడుతూ అమ్మ, నాన్న, కుటుంబానికి దూరమై మానసిక క్షోభను అనుభవిస్తూ ఆశ్రమాల్లో జీవిస్తున్న తమకు ఇప్పటికీ సమాజంలో ఒక గుర్తింపు లేదన్నారు. అసలు మేము ఎవరం? మా తల్లిదండ్రులెవరు? మా గుర్తింపు ఏది? మా అడ్రస్‌ ఎక్కడ? మా కులం, మతం ఏమిటి? మా సంరక్షకులు ఎవరు? మా సంక్షేమం ఎవరు చూస్తారు? అని ప్రశ్నిస్తూ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, సిమ్‌ కార్డులు కొనాలన్నా ఆధార్‌ కార్డు కావాలని, ప్రభుత్వ రిజర్వేషన్లు పొందాలంటే కులం సర్టిఫికెట్‌ కావాలని అడుగుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేయాలని విన్నవించారు.
బాలవికాస ఆశ్రమం నుండి అమూల్య మాట్లాడుతూ ఈ మధ్య కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే అన్ని
హాస్టళ్ళు మూసివేశారనీ, తాము ఎక్కడికీ వెళ్ళలేక ఆశ్రమాల్లోనే ఉండాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ నిర్వాహకులకు నిధుల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డారని, వారికి కూడా భారమైపోతున్నామని, 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆశ్రమం నుండి వెళ్ళి స్వతంత్ర జీవితం గడపడానికి చాలామంది ఆర్థికంగా, ఉద్యోగపరంగా సిద్ధంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. తాను తెలంగాణ అనాథలందరి తరపున ప్రభుత్వానికి ఈ ప్రత్యేక చట్టం తేవాలని, దానికోసం తగినన్ని నిధులు కేటాయించాలని అభ్యర్థిస్తున్నానని తెలిపింది.
చివరిగా అందరి అభిప్రాయాలను క్రోడీకరించి 15 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని తయారుచేసి ఆ అంశాలను చట్టంలో పొందుపరచి నూతన ప్రత్యేక అనాథల చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి విన్నవించారు. వాటి వివరాలు:
1. ఎవరు అనాథ (సామాజికంగా అణగారిన వ్యక్తి) అనే విషయంలో లోతైన పరిశీలన చేసి, వారికి సరైన నిర్వచనం ఇవ్వాలి.
2. పద్దెనిమిదేళ్ళ లోపు పిల్లల కోసం ఉద్దేశించిన జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ మరియు సిఎన్‌సిపి (ఛైల్డ్‌ రైట్స్‌ యాక్ట్‌) చట్టాలు అనాథలకు పూర్తి న్యాయం చేయలేవు కాబట్టి, అనాథల కోసం ప్రత్యేక చట్టం తేవాలి.
3. తల్లి తండ్రి ఎవరో తెలియనివారికి ప్రభుత్వమే తల్లి, తండ్రిగా నమోదు కావాలి. వారు స్థిరపడేవరకు వారి రక్షణ, జీవిత భద్రతకు ప్రభుత్వం చట్టబద్ధంగా బాధ్యత వహించాలి.
4. ‘అనాథ’ అనే పదాన్ని ‘సామాజికంగా అణగారిన వ్యక్తి’గా లేదా మరేదైనా గౌరవప్రదమైన పేరుతో పిలిచేలా మార్పు చెయ్యాలి.
5. తమ కులం ఏమిటో తెలియని అనాథలకు ప్రభుత్వ రక్షణ, అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది అందించడం కోసం, లేదా ఇద్దరు అనాథలు పెళ్ళి చేసుకున్న సందర్భాల్లో వారి బిడ్డలకు ఎలాంటి సామాజిక, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కులనిర్థారణ ఎలా చేయవచ్చో లోతుగా పరిశీలించి, చట్టంలో వెసులుబాటు కల్పించాలి.
6. రాష్ట్రస్థాయి కమిషన్‌ ఏర్పాటు చేసి, పై చట్టం పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవాలి.
7. రాష్ట్ర స్థాయి ఫైనాన్స్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి, పై చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి.
8. ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అనాథలపై సమగ్ర జనగణన చేసి, వారిని వర్గీకరించాలి.
9. అనాథలకు గుర్తింపు పత్రం ఇవ్వాలి. ఇది అన్ని ప్రభుత్వ పథకాల్లో అర్హతాపత్రంగా చట్టం చేయాలి.
10. అన్ని రకాల విద్య, ఉద్యోగం (గ్రూప్‌`1 స్థాయి వరకు), ఉపాధి, సంక్షేమ పథకాల లబ్దిలో వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలి.
11. అనాథలకు ఉచిత వైద్య, ఆరోగ్య సేవలు, ప్రయాణ సదుపాయాలు కల్పించాలి.
12. అనాథ విద్యార్థులకు, నిరుద్యోగులకు స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్‌లు దక్కేలా చట్టంలో పొందుపరచాలి.
13. స్వయం ఉపాధి చేసుకోగల ఔత్సాహికులకు రుణాలు, సబ్సిడీల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలి.
14. అనాథలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పెళ్ళి చేసుకునే అనాథలకు కల్యాణలక్ష్మి తరహాలో, అంతకంటే మెరుగైన ఆర్థిక సహాయం ఇవ్వాలి. బీపీఎల్‌ కుటుంబాలకు ఇచ్చినట్టుగానే అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అనాథలకు అందించాలి.
15. సమాజపు చిన్నచూపుకు, అవమానాలకు, వేధింపులకు, వివక్షకు గురికాకుండా, వాటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్‌ తరహాలో అనాథలకు రక్షణ కల్పించాలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు, రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.