దక్షిణ ఆసియాలో స్త్రీవాద క్రియాశీలతకు చిహ్నమైన కమలా భాసిన్‌ను గుర్తుచేసుకుందాం -`నిఖత్‌ ఫాతిమా అనువాదం: పి. సుజాత రాజ్‌

75 ఏళ్ళ వయసులో కమలా భాసిన్‌ మరణం దక్షిణాసియాలో మహిళా ఉద్యమంలో విస్తృత అంతరాన్ని మిగిల్చింది. ఆమె ఆజాది (స్వేచ్ఛ) యువతలో ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఈ ‘స్వేచ్ఛ’ నినాదం భారతదేశమంతటా కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా, పరస్పరం ఎవరిని కలిసినా ఆమె వ్యక్తిత్వం ప్రభావితం చూపింది.

కమలా భాసిన్‌, ప్రముఖ స్త్రీ వాద కార్యకర్త, కవి, రచయిత మరియు సామాజిక శాస్త్రవేత్త. క్యాన్సర్‌ కారణంగా శనివారం, 25 సెప్టెంబర్‌ 2021 మధ్యాహ్నం కన్ను మూశారు.
కమలా భాసిన్‌ ఏప్రిల్‌, 24, 1946న జన్మించారు. పాకిస్తాన్‌ విభజన తర్వాత ఆమె కుటుంబం రాజస్థాన్‌కు వెళ్ళింది. అక్కడ ఆమె చదువు పూర్తిచేసి, తర్వాత జర్మనీలోని మున్స్టర్‌ (Munster) విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రాన్ని అభ్యసించింంది.
ఆమె రాజస్థాన్‌లోని ఒక ఎన్జీఓలో పనిచేసింది. అక్కడ ఆమె కుల ఆధారిత వివక్షత గురించి మొదటిసారిగా లోతైన సమాచారాన్ని పొందింది. ఇది ఆమె తదుపరి స్త్రీవాద ఉద్యమానికి పునాదిని అందించింది. ఆమె సామాజిక అభివృద్ధిని భారతదేశానికే కాదు, దక్షిణాసియా అంతటికీ అందించారు.
గోనోషస్థాయ (Gonoshasthaya) కేంద్రం అనే రూరల్‌ ఎన్జీఓలో పనిచేయడానికి ఆమె బంగ్లాదేశ్‌ వెళ్ళినపుడు ఆమె దృక్పథాలు మారాయి. బంగ్లాదేశ్‌లో ఆమె ప్రజా ఆరోగ్య కార్యకర్త మరియు సామాజిక కార్యకర్త అయిన జఫ్రుల్లా చౌదరిని కలుసుకున్నారు.
ఆమె రెండు దశాబ్దాలకు పైగా యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ విభాగంలో పనిచేశారు. ఆమె దక్షిణాసియా స్త్రీ వాద నెట్‌వర్క్‌ ‘సంగత్‌’ను స్థాపించారు. ఇది గ్రామీణ మరియు గిరిజన వర్గాల నుండి వెనుకబడిన మహిళలతో పనిచేస్తుంది.
ఢల్లీిలో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న పౌర సమాజ సంస్థ ‘జాగోరి’ వ్యవస్థాపకుల్లో కమలా భాసిన్‌ ఒకరు. కమలా భాసిన్‌ దక్షిణాసియాలోని కార్యకర్తలు, శాంతి కార్యకర్తలలో కెల్లా ప్రాచుర్యం పొందారు, గౌరవించబడ్డారు
ఆమె జెండర్‌పై అనేక పుస్తకాలను రచించారు. పితృస్వామ్యం అంటే ఏమిటి? (What is Patriarchy), స్త్రీ వాదం మరియు దక్షిణాసియాలో దాని సంబంధాలు (Feminism & its Relevance in South Asia), సరిహద్దులు: భారతదేశ విభజనలో మహిళలు (Borders & Boundaries: Women in India’s Partition) లింగంని అర్థం చేసుకోవడం మరియు నవ్వుకునే విషయాలు, అనేక కవితలను కూడా రచించారు. ఆమె ఇటీవల 2020లో సత్రంగి లడ్కే మరియు సత్రంగి లడ్కియాన్‌ Satrangi Ladike and Satrangi Ladakiyan) వ్రాశారు. ఆమె రచనల ద్వారా, ఆమె జెండర్‌ న్యాయ సమాజాన్ని ఆశించారు మరియు ఆమె కవితలు ‘గొంతులు లేని మహిళ గళం’ (voice of voiceless women), ‘మేము భారతదేశపు మహిళలం, పువ్వులం కాదు, నిప్పు రవ్వలం’ (Hum bharat ki Nari hain, Phul Nahin, Chingari hain) అనే కొన్ని ప్రముఖ నినాదాలను కూడా ఆమె రూపొందించారు. ఆమె కవిత ‘నేను చదువుకోవాలి ఎందుకు అంటే నేను అమ్మాయిని కాబట్టి’ (Kyunki main ladki hoon, mujhe padhna hai)లో అమ్మాయిలు మరియు మహిళల కోసం మాట్లాడినందుకు అది చాలా ప్రజాదరణ పొందింది, ప్రతి అమ్మాయిని ఆకట్టుకుంది.
కమలా భాసిన్‌ యొక్క ఆవేశంతో కూడిన మరో ప్రసిద్ధ నినాదం, ‘ఆజాది’. తను ‘పితృస్వామ్యం నుండి ఆజాది’ కావాలని కోరుకున్నారు. నేడు ‘ఆజాది’ అనే పదం పేదరికం, అన్యాయం మరియు అన్ని రకాల వివక్ష మరియు దౌర్యన్యాల నుండి స్వేచ్ఛ కోసం ర్యాలీ నినాదంగా మారింది. పాకిస్తాన్‌లో కమలా భాసిన్‌ కార్యకర్తగా ఎంతో గౌరవాన్ని పొందారు. భాసిన్‌ ఒక ఇంటర్వ్యూలో ‘ఆజాది’ అనే నినాదాలను మొట్టమొదటిసారిగా తాను పాకిస్తాన్‌లో విన్నానని తెలిపారు. పాకిస్తాన్‌ సైనిక నియంత జియా`ఉల్‌`హక్‌ హయాంలో ‘ఆజాది’Aurat ka naara-azadi/Bachchon ka naara-azadi/Hum leke rahenge-azadi/Hai pyara naara-azadi అనే నినాదాలు వినిపించాయని తెలిపారు. కమలా భాసిన్‌, వన్‌ బిలియన్‌ రైసింగ్‌ గ్లోబల్‌ క్యాంపెయిన్‌కి భారతదేశం నుండి సమన్వయ కర్తలలో ఒకరిగా మహిళలపై అత్యాచారాలు మరియు లైంగిక హింసలను అంతం చేయడానికి పూనుకున్నారు.
ఆమె జెండర్‌పై అనేక వర్క్‌షాప్‌లను నిర్వహించారు, ఇది అనేకమంది మహిళలకు స్ఫూర్తినిచ్చింది.

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.