ఆమె సృష్టికి మూలం అంటారు
కానీ ఇంట్లో ఆమె స్థానం ఓ మూల
ఇంటికి దీపం అంటారు
కానీ ఆమె వెలుగుని గుర్తించరు
ఆకాశంలో సగం అంటారు
అయినా ఆవగింజంత విలువ కూడా ఇవ్వరు
ధైర్యవంతురాలు అంటారు
కానీ ధైర్యంగా బయటకు పంపరు
సమర్ధురాలు అంటారు
కానీ ఎవరూ అర్థం చేసుకోరు
ఒకరు ఉప్పెన అంటారు
కానీ ఇంకొకరు ఉప్పుతో పోలుస్తారు
ఎందుకో ఎవరూ మహిళగా గుర్తించరు
ఆనాడు గుమ్మం దాటని మహిళకు
` అంజలి
ఆనాడు గుమ్మం దాటని మహిళకు
ఈనాడు ప్రపంచం చుట్టొస్తున్న మహిళకు
పాడుపడ్డ పద్ధతులు మారలేదు
మనిషి విలువను పెంచే సంస్కృతి కావాలి
చంపుకునే సంస్కృతి మనకు వద్దు
శాసనం కాదు అది జీవన విధానం