వచ్చింది ఉగాది
వసంత రుతువు వచ్చిందట
ఉగాది పండుగ తెచ్చిందట
ఉగాదికి వసంత కోకిల వచ్చిందట
ఉగాది పచ్చడి రుచి చూసిందట
షడ్రుచుల కలయిక నచ్చిందట
కుహు కుహు రాగాలతో మురిపించిందట
ఆనందంతో పరవశం పొందిందట
అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పిందట
` జి.తేజ్ ప్రమోద్, 7వ తరగతి.
ఆరు రుచుల ఉగాది
వసంత ఋతువుతో ఉగాది వచ్చింది
ఆరు రుచుల ఉగాది పచ్చడి చేసింది
అందరికీ ఆనందంతో తినిపించింది
తెలుగు సంవత్సరాది మొదలైంది
కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది
పంచాంగ శ్రవణం చేయించింది
అందరి స్థితిగతులు తెలిపింది
శుభకార్యాలకు ముహూర్తాలు సిద్ధం చేసింది
అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది
` ఎం.గణేష్ రెడ్డి, 7వ తరగతి.
ఉగాది
మన పండుగ ఉగాది
మన సంవత్సరానికి పునాది
ఆనందాల పండుగ ఇది
తెలగు వారి సంవత్సరాది
వసంత రుతువు కాంతులు
చెట్ల యొక్క చిగుర్లు
కోకిల యొక్క రాగాలు
పిల్లల ఆనందాల కేరింతలు
మారుతుంది సంవత్సర నామం
జరుగుతుంది పంచాంగ శ్రవణం
ప్రజలు తెలుసుకుంటారు గ్రహ స్థితి గతులు
అందరి ముఖంలో చిగురిస్తాయి చిరునవ్వులు
`జి.మధురిమ, 8వ తరగతి.
షడ్రుచుల కలయిక
వచ్చింది ఉగాది పండుగ
షడ్రుచుల కలయికగా
అందరి సంతోషాల వేదికగా
తెలుగువారి నూతన సంవత్సరంగా
కొత్త చిగురులు చిగురించక
పుల్లని మామిడి పళ్ళు పండిరచగా
ఉగాది పచ్చళ్ళు చేయగా
పిల్లలు ఇష్టంగా తినేగా
పెద్దలకు తృప్తికరంగా
తీపి గుర్తులు మిగల్చగా
హిందువుల ప్రముఖ పండుగ
అందరినీ మెప్పించగా
` ఎన్.తరుణ్,8వ తరగతి