ఈ శిక్షణకి ముందు నాకు జెండర్/సెక్స్, లింగ ఆధారిత వివక్ష మరియు ూGదీుూIA గురించి కొంత తెలుసు. శిక్షణలో పాల్గొన్న తర్వాత వాటిపై పూర్తి అవగాహన వచ్చింది. ఇంతకుముందు లింగ ఆధారిత వివక్ష స్త్రీలపై మాత్రమే
ఉంటుందని అనుకునేదాన్ని. కానీ ూGదీుూIA వారుకూడా ఈ వివక్షకి గురవుతున్నారని తెలుసుకున్నాను. అలాగే వివక్ష అనేది కేవలం లింగ ఆధారితంగానే కాక కులం, మతం, ప్రాంతం, సంప్రదాయం, అలవాట్లు, ఆచారాలు, స్థాయి, హోదా, చేసే పని, మాట్లాడే భాష, వస్త్రాలంకరణ, శరీర ఛాయ… ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా ఏదో ఒక విషయంలో మనకు తెలియకుండానే వివక్షకు గురవుతున్నారనే విషయాన్ని శిక్షణలో చేయించిన రోల్ప్లేల ద్వారా చాలా వివరంగా తెలుసుకున్నాను. ఇటువంటి వివక్ష స్త్రీలు మరియు ూGదీుూIA వారిపై మాత్రమే కాదు పురుషులపై కూడా కులం, మతం, ప్రాంతం ఆధారంగా వివక్ష జరుగుతుందని, చాలా విషయాల్లో ఎదగలేక వెనకడుగు వేయాల్సి వస్తుందని తెలుసుకున్నాను. ఈ శిక్షణకి రాకముందు వరకు కూడా పైన చెప్పిన విషయాల్లో కొన్ని సర్వసాధారణమని, అవి అలాగే ఉంటాయేమోనని అనుకునేదాన్ని. కానీ అది ఎంత తప్పో, మనం ఎటువంటి ఆలోచన ధోరణుల మధ్య పెరుగుతూ వచ్చామో అర్థమయింది. ఇటువంటి వివక్షలన్నింటి నుండి బయటపడాలంటే, వివక్షలేని సమాజం నిర్మించాలంటే మన ఆలోచనా విధానం మారాలి, అసలు నిజమేంటో తెలుసుకోవాలి, వాస్తవాల గురించి అవగాహన పెంచుకోవాలి, మన కుటుంబంలో వారికి, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఈ విషయాలన్నింటి గురించి అవగాహన కల్పించి ఏ విధంగా పనిచేయాలని అర్థమైంది. ఈ విషయాలన్నింటి పట్ల అవగాహన పెంచుకునే, కొత్త అంశాల గురించి నేర్చుకునే అవకాశాన్ని కల్పించినందుకు ‘ఐక్యతారాగం’కు ధన్యవాదాలు.