నేను ఐక్యతారాగం శిక్షణా కార్యక్రమంలో సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి బాగా నేర్చుకున్నాను. దీనిలో కులం, మతం, జెండర్, లైంగికత, జాతీయత, ప్రాంతం, వర్గం లాంటి అంశాల్లో వివక్ష అనేది సమాజంలో ఎలా
ఉందో రోల్‌ప్లేలు చేసినపుడు ప్రాక్టికల్‌గా అర్ధమయింది. అలాగే మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి పనిచేయడం వలన, అందరూ కలసికట్టుగా పనిచేసినపుడు ఏదైనా సాధించవచ్చనేది బాగా నేర్చుకున్నాను. ప్రతి విషయాన్ని స్త్రీ వాద దృక్పథంతో ఆలోచిస్తున్నాను. లైంగికతలో నాకు గతంలో ఎల్.జి.టి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణా కార్యక్రమంలో బి.క్యు.ఎ. అనేవి కూడా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్నాను. ఈ శిక్షణా కార్యక్రమం తర్వాత నేను పనిచేస్తున్న క్రమంలో చాలామంది ఆడపిల్లలు/స్త్రీలు పురుషాధిపత్యం వలనే కాకుండా, కుల పరంగా కానీ, సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని కోణాలలో వారు పడే వివక్షని పూర్తిగా అర్థం చేసుకొని వారిని సపోర్ట్ చేయగలుగుతున్నాను. జెండర్ ఆధారిత హింస గురించి వృత్తిలోనే కాకుండా, కుటుంబంలో, సమాజంలో కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడగలుగుతున్నాను. ఈ శిక్షణా కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారి అభిప్రాయాలను ప్రాక్టికల్‌గా తెలుసుకొనే అవకాశం ఉంటే బాగుండేదనిపించింది. ఈ శిక్షణ వలన వ్యక్తిగతంగా కూడా నాలో చాలా ధైర్యాన్ని పెంపొందించుకున్నానుÑ గతంలో నన్ను ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, వారికి కాలమే సమాధానం చెప్తుందని సైలెంటుగా ఉండేదాన్ని. కానీ ఈ శిక్షణా కార్యక్రమం తర్వాత నాలో చాలా ధైర్యం పెరిగి అవసరమైన సందర్భాల్లో నేను మాట్లాడగలుగుతున్నాను. అలాగే దీనిద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యవతి మేడం గారికి, ప్రశాంతి మేడం గారికి ధన్యవాదాలు.