హార్మోన్‌ మాత్రలు ` ఓ.సి.పిల్స్‌ -రొంపిచర్ల భార్గవి

డాక్టర్‌ గారూ మా అమ్మాయి పెళ్ళి వచ్చే వారం, ఏదయినా ఇంజక్షన్‌ చేసి రేపటికల్లా పీరియడ్‌ వచ్చేట్టు చూడండి మీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళి టైముకి ఆ కాస్తా అడ్డు పడకుండా చూడండి ప్లీజ్‌ అంటున్న మాటలు విన్న డాక్టరమ్మ ‘‘చూడమ్మా విమలా పీరియడ్స్‌ని

ఆపడానికయినా, ముందుగా రావడానికయినా వాడే మాత్రలు ఒకటే అవి హార్మోన్‌ మాత్రలు. అవి వేసుకున్నంత కాలం నెలసరి రాదు, ఆపిన రెండు నుండి వారం రోజుల లోపు ఏ రోజైనా నెలసరి రావచ్చు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు నెలసరి తప్పించడం కుదరదు, కావాలంటే నీకే తేదీలో అడ్డమో ఆ తేదీకి మూడు రోజుల ముందు నుండీ హార్మోన్‌ మాత్రలు వాడటం మొదలుపెట్టి, ఆ తేదీ దాటి పోయేంతవరకూ మాత్రలు వాడటమొక్కటే మార్గం. నెలసరి ఆపడానికి గానీ, రావడానికి గానీ ఇంజక్షన్లు లేవు అంటుండగానే విమల ‘‘అదేంటండీ మా పక్కింటావిడ తనకు తెలిసిన ఆర్‌.యం.పి. డాక్టర్‌ దగ్గరికెళ్తే ఒక ఇంజక్షన్‌ చేసి, మాత్రలు ఇచ్చి నెలసరి నాలుగో రోజుకల్లా వచ్చేట్టు చేశాడని చెప్పిందే!’’ అంది. ‘‘సారీ అమ్మా! అలాంటిది సాధ్యం కాదు. నువ్వు చెప్పిన దాంట్లోనే మాత్రలిచ్చారన్నావు చూశావా, అవి మూడు రోజులు వాడి ఆపంగానే నాలుగో రోజున నెలసరి వచ్చి ఉండవచ్చు. అదీ సంగతి’’ అంది డాక్టరమ్మ.
ఇంకో చోట ‘‘డాక్టర్‌ గారూ, నేనూ, మా వారూ, పిల్లలూ కుటుంబం మొత్తం దక్షిణ దేశ యాత్ర చేయబోతున్నాం. ఒక నెల నాకు బహిష్టు రాకుండా ఏవైనా మందులు చెప్పండి మీ మేలు మర్చిపోలేను’’ అంది అమల. ‘‘అయ్యో, మూడు నాలుగు వారాలు ఆపడానికి మందులు వాడకూడదమ్మా. మొత్తంమీద పది, పధ్నాలుగు రోజులకు మించి వాడకూడదు. అదీగాక నీకు ముప్ఫయ్యేళ్ళు దాటాయి. పైగా బి.పి., షుగరూ రెండూ ఉన్నాయి కదా. నువ్వీ మందులు అస్సలు వాడకూడదమ్మా’’ చెప్పింది అమల. ‘‘అయ్యో అదేంటి డాక్టర్‌గారూ, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇబ్బంది ఉంటే ఎలా వెళ్ళేది? ఏదో ఒకటి చేద్దురూ’’ కంగారుగా అడుగుతున్న అమలతో డాక్టర్‌ ‘‘సారీ అమ్మా మూర్ఖంగా మాత్రలు వాడితే రక్తంలో గడ్డలు ఏర్పడి ప్రాణ ప్రమాదానికి దారి తీయవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఋతుచక్రాన్ని మీ చేతుల్లో తీసుకుని ఎలా అంటే అలా, ఎప్పుడు బడితే అప్పుడు మందులు వాడి డిస్టర్బ్‌ చేస్తే, గర్భసంచిలో మార్పులు రావడమే కాక, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని బహుష్టులు నెలవారీ రాకుండా ఎప్పుడు బడితే అప్పుడు ఇర్రెగ్యులర్‌గా వచ్చి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది’’ అంది. ఈ కథలిలా ఉంటే కొత్తగా పెళ్ళయిన కరుణ, కార్తీక్‌ల కథ వేరేగా ఉంది. వాళ్ళిద్దరూ పిల్లల్ని అప్పుడే కనొద్దనుకున్నారు. షాపులో అడిగి ఏమైనా మాత్రలు తెచ్చి వేసుకుందామనుకుంది కరుణ. అలాకాదు డాక్టర్ని అడిగి తమకు ఎలాంటి గర్భ నిరోధక సాధనం మంచిదో తెలుసుకుని అలా చేద్దామన్నాడు కార్తీక్‌. ఇద్దరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి వాళ్ళ సమస్యను వివరించారు. ఒక అయిదేళ్ళ వరకూ పిల్లల్ని వద్దనుకుంటున్నామని చెప్పిన వాళ్ళతో డాక్టర్‌ ‘‘కొత్తగా పెళ్ళయిన వారికి సూటయ్యేవి ఓరల్‌ కాంట్రసెప్టివ్‌ పిల్సే, కానీ అవి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలకు మించి వాడకూడదు’’ అని చెప్పారు. అది విని ‘‘అవును నిజమే డాక్టర్‌. మా బంధువుల్లో ఒకామె తెలియక ఆపరేషన్‌ అంటే భయమని ఈ పిల్స్‌ వాడటం వలన రక్తం గడ్డ కట్టి పక్షవాతానికి గురయింది’’ అన్నాడు కార్తీక్‌. అసలు ఈ హార్మోన్‌ మాత్రలంటే ఏమిటి? ఎన్ని రకాలుగా పనిచేస్తాయి? ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు? దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం.
ఈ హార్మోన్‌ మాత్రలన్నీ స్త్రీలు వాడటానికి ఉద్దేశింపబడినవి.
వీటిలో రకాలు..
1. ప్రొజెస్టిరోన్‌ మాత్రలు 2. ఈస్ట్రోజన్‌ G ప్రొజిస్టిరోన్‌ మాత్రలు` కంబైన్డ్‌ ఓసి పిల్స్‌
వీటిలో ప్రొజెస్టిరోన్‌ పిల్స్‌ని ప్రధానంగా బహిష్టు కొంతకాలం ఆపడానికీ, ‘‘మినీ పిల్‌’’ పేరుతో గర్భ నిరోధానికి కూడా వాడతారు. రెండూ కలిపిన కంబైన్డ్‌ పిల్‌ని ముఖ్యంగా గర్భ నిరోధానికి వాడతారు.
మహిళలను ప్రధానంగా వేధించే సమస్యలు రెండు.
ఒకటి బహిష్టు వలన ఇబ్బందిÑ రెండు అక్కర్లేనప్పుడు గర్భం రావడం. ఈ రెండిరటినీ నిరోధించగలిగితే వారు వారి వారి రంగాలలో సమర్ధవంతంగా పనిచేయగలుగుతారు. ఇవి దృష్టిలో పెట్టుకుని హార్మోన్‌ పిల్స్‌ని తయారు చేశారు.
హార్మోన్‌ పిల్స్‌ని ఎప్పుడెప్పుడు వాడతారు: బహిష్టుని కొంతకాలం రాకుండా ఆపడానికిÑ గర్భ నిరోధానికిÑ నెలసరి సక్రమంగా రానప్పుడు, ఋతుచక్రం సరిగ్గా వచ్చేట్టు చేయడానికిÑ పీరియడ్స్‌లో అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికిÑ పాలీసిస్టిక్‌ ఓవరీ డిసీజ్‌లోÑ ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌లోÑ ఎండోమెట్రియోసిస్‌ అనే వ్యాధికి చికిత్సగానూÑ తీవ్రమైన మొటిమలను నివారించడానికిÑ
గర్భసంచికీ, అండాశయానికీ చుట్టుపక్కల కణజాలాలకి సోకిన ఇన్‌ఫెక్షన్‌ నివారణలో ఒక భాగంగానూ ఈ హార్మోన్‌ మాత్రలు వాడతారు అదీ ముఖ్యంగా ‘‘కంబైన్డ్‌ ఓసీ పిల్స్‌ని వాడతారు.’’
బహుష్టుని ఆపడం… దీనికి వాడే ప్రొజెస్టిరోన్‌ ‘‘నార్‌ ఇథిస్టిరోన్‌’’. ఇది 5 మి.గ్రాముల డోసులో రోజుకి మూడుసార్లు, పీరియడ్‌ రావడానికి మూడు రోజుల ముందునుండీ ప్రారంభించి ఒక పది రోజుల పాటు వాడవచ్చు. అంతకు మించి వాడకూడదు. ఆపిన మర్నాటి నుంచీ పది రోజుల లోపు పీరియడ్‌ వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు పీరియడ్‌ ముందొచ్చేలా చేయమని. దేనికయినా వాడేవి అవే మాత్రలు. ఎప్పుడాపితే అప్పుడు ఒక వారం, పది రోజుల్లో ఎప్పుడయినా రావొచ్చుÑ సరిగ్గా చెప్పలేం కాబట్టి, అడ్డం అనుకున్న రోజుకి మూడు రోజుల ముందు నుండీ మాత్రలు వాడి పోస్ట్‌పోన్‌ చేసుకోవడమే సరైన పద్ధతి. ఇంకొంత మంది రోజుకొక టాబ్లెట్‌ చాలదా, ఇదివరకు అలా వాడాం అంటుంటారు. ఇదికూడా సరికాదు. రోజుకు రెండు లేక మూడు మాత్రలు డాక్టర్‌ సలహాపై వాడటమే కరెక్ట్‌. ఎందుకంటే లివర్‌ సమస్యలు, గుండె సమస్యలు, బి.పి., షుగర్‌, కిడ్నీ వ్యాధులు ఉన్నవారూ, రక్తం గడ్డకట్టే జబ్బు ఉన్నవారూ ఈ మాత్రలు వాడరాదు. పాలిచ్చే తల్లులు వాడితే పాలు తగ్గిపోతాయి.
గర్భనిరోధక మాత్రలు… కంబైన్డ్‌ ఓ.సి.పిల్స్‌: వీటినే సింపుల్‌గా ‘‘పిల్‌’’ అని వ్యవహరిస్తారు. 1960 ప్రాంతాల నుండి వీటిని ప్రపంచవ్యాప్తంగా గర్భం రాకుండా నివారించడానికి నోటి మాత్రలుగా 100 మిలియన్లు పైబడి వాడుతున్నారంటే, వీటి అవసరం ఎంతుందో గమనించవచ్చు. 15`44 సం॥ల మధ్య వయసు వారికి వీటి అవసరం ఎక్కువ. అన్ని దేశాలలోనూ వీటి వినియోగం ఎక్కువే అయినా ఆశ్చర్యకరంగా జపాన్‌ కేవలం 3% జనాభా మాత్రమే వీటిని వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసర మందుల లిస్టులో ఈ ఓ.సి. పిల్స్‌ చోటు చేసుకున్నాయంటే వాటి అవసరం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. వీటి వాడకం విద్యార్థినులు, ఉద్యోగినుల జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. వారు మరింత సమర్ధవంతంగా వారి వారి రంగాల్లో కృషి చేయడానికి తోడ్పడిరది.
ఇవి పని చేసే విధానం: కంబైన్డ్‌ పిల్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక సాధనాలన్నింటిలో అత్యంత సమర్ధవంతమైనది.
ఇక్కడ ఒకసారి ఋతుక్రమం ఎలా వస్తుందో గుర్తు చేసుకుందాం.
మహిళ మెదడులోని హైపో థలామస్‌ మరియు పిట్యుటరీ గ్రంథుల నుండీ వెలువడే హార్మోన్లు, అండాశయం మీద ప్రభావం చూపడం వలన, అండం ఎదిగి అండాశయం నుండి విడుదలవుతుంది. అలా విడుదలయినపుడు అండాశయం నుంచి ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ అనే హార్మోన్లు కూడా విడుదలై, గర్భాశయంలో పొరలు పెరగడానికీ, తిరిగి పిట్యుటరీ, హైపోథలామస్‌ నుండి వచ్చే హార్మోన్ల స్థాయి నియంత్రించడానికి కూడా పనిచేస్తాయి. దీనినే ‘‘హైపోథలామో పిట్యుటరీ ఒవేరియన్‌ యాక్సిస్‌’’ అంటారు. ఇదంతా సక్రమంగా జరిగితేనే అండం విడుదలయి, వీర్యకణంతో కలిసి గర్భం వస్తుంది. ఈ గొలుసుకట్టులో ఎక్కడయినా అంతరాయం ఏర్పడితే అండం విడుదల ఆగిపోతుంది. ఈ సూత్రం మీద ఆధారపడి ఓ.సి.పిల్స్‌ పనిచేస్తాయి.
ఇప్పుడు మనం కృత్రిమంగా తయారుచేసిన ‘‘పిల్స్‌’’లో ఉన్న ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరోన్‌లు బ్రెయిన్‌ మీద పనిచేసి అండం ఎదుగుదలకీ, విడుదలకీ కావలసిన హార్మోన్లు (ూన, ఖీూన) రాకుండా ఆపుతాయి, దీంతో అండం విడుదల ఆగిపోతుంది. అండం లేదు కాబట్టి గర్భం రాదు. ఇదీ ముఖ్యంగా పిల్స్‌ పనిచేసే విధానం ఈ పనితో పాటు గర్భాశయ ద్వారం దగ్గర చిక్కటి మ్యూకస్‌ పొర తయారుచేసి వీర్యకణాన్ని నిరోధించి గర్భం రాకుండా చేస్తాయి. ఇంకా గర్భాశయం లోపలి గోడ పలుచగా మారడం వలన ఒకవేళ పిండం ఏర్పడినా గర్భాశయంలో సరిగ్గా అతుక్కోలేక విసర్జించబడుతుంది.
ఓ.సి. పిల్స్‌ వలన చేకూరే లాభాలు: సరిగ్గా వాడితే ఈ విధానం మిగతా విధానాల కంటే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది.
99% విశ్వసనీయమైనది, అంటే… వాడిన వెయ్యి మందిలో ముగ్గురికి మాత్రమే వచ్చే అవకాశముంది. తేలికగా నోటి మాత్రలు తీసుకోవచ్చు. కలయికకు అడ్డం రాదు. మాత్రలు ఆపిన వెంటనే పునరుత్పత్తి శక్తి పునరుద్ధరించబడుతుంది. అంటే ఆపిన వెంటనే గర్భం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాత్రలు వాడేటప్పుడు వచ్చే బ్లీడిరగ్‌ తక్కువగా ఉంటుంది. మహిళలకు పెద్దగా అసౌకర్యంగా
ఉండదు. ఇది అసలు నిజమైన పీరియడ్‌ కాదు. దీన్ని ‘విత్‌ డ్రాయల్‌ బ్లీడిరగ్‌’ అంటారు.
బహిష్టు కడుపునొప్పి ఉండదు. రక్తస్రావం ఎక్కువ ఉండదు కాబట్టి రక్తహీనతను నివారిస్తుంది. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలిపిస్తుంది. కీళ్ళవాతం నుండి కూడా రక్షణ దొరుకుతుంది.
ఇందులో ఉండే మందులు: ఈస్ట్రోజన్‌ ` ఇథనైల్‌ ఈస్ట్రడయాల్‌ లేక మెన్టృనాల్‌ రూపంలో ఉంటుంది. ప్రొజెస్టిరాన్‌ ` నార్‌ ఇథిస్టరోన్‌, నార్‌ జస్ట్రిన్‌, డ్రోస్‌ పెరినోస్‌ రూపంలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్స్‌లో ఈస్ట్రోజన్‌ అతి తక్కువ మోతాదులో వాడుతున్నారు. అందువల్ల దాంతో కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ అయిన వికారమూ, బరువు పెరగడాన్ని గణనీయంగా తగ్గించరాదు.
ఎలా వాడాలి: ఈ మాత్రలు సాధారణంగా, ప్యాకెట్లుగా దొరుకుతాయి. ఒక్కొక్క ప్యాకెట్‌లో 21G7R28 మాత్రలుంటాయి. 21 హార్మోన్‌ మాత్రలు, మిగతా ఏడూ మందు లేని ఖాళీ మాత్రలు. అవి వేసుకోకపోయినా ఫర్వాలేదు. బహిష్టు అయిన అయిదు రోజుల లోపు ఎప్పుడయినా మొదలుపెట్టవచ్చు. ఆలస్యమయితే ఇంకేదయినా ఇతర విధానంతో కలిపి వాడాలి. ఉదా: కాండోమ్‌, ఒ.సి.పిల్స్‌… రెండూ వాడటం. ప్రతిరోజూ ఒక మాత్ర వేసుకోవాలి, ఒకే సమయానికి వేసుకోవాలి. ఈ రోజు రాత్రి వేసుకోవడం మొదలుపెడితే ప్రతిరోజూ రాత్రే వేసుకోవాలన్న మాట. దీనివలన మందు అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒకరోజు మాత్ర మర్చిపోతే, గుర్తు రాగానే వేసుకుని మర్నాడు వేసుకోవలసిన మాత్రను అదే సమయానికి వేసుకోవాలి. రెండుకంటే ఎక్కువ మాత్రలు మర్చిపోతే రక్షణ ఉండదు. గర్భం రావచ్చు. డాక్టర్ని కలిసి సలహా తీసుకోవాలి.
21 మాత్రలు వేసుకున్నాక, పీరియడ్‌ వస్తుంది. అది వచ్చిన ఐదవ రోజునుండి బ్లీడిరగ్‌ తగ్గకపోయినా ఇంకో పాకెట్‌ మొదలు పెట్టాలి. కొంతమంది డాక్టర్లు రెండు, మూడు పాకెట్లు వరుసగా గ్యాప్‌ లేకుండా వాడిరచాక ఏడు రోజులు గ్యాప్‌ ఇస్తారు. అప్పుడు పీరియడ్‌ వస్తుందన్న మాట. ఇంకో ముఖ్యమయిన విషయం, ఈ ప్యాకెట్‌ మొదలుపెట్టాక భార్యాభర్తలు మధ్యలో కలవకపోయినా మాత్రలు ఆపకూడదు. పూర్తిగా వాడాలి. కొంతమంది తెలియక ఆపుతూ ఉంటారు.
పిల్స్‌ వాడకం వలన వచ్చే ఇబ్బందులు: తలనొప్పి, వికారం, వాంతులుÑ చిరాకు, డిప్రెషన్‌, ఉద్వేగం, ఆందోళనÑ బరువు పెరగడంÑ నెల మధ్యలో బ్లీడిరగ్‌ మొదటి మూడు నెలల్లో కనపడి తర్వాత సాధారణంగా సర్దుకుంటుందిÑ వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన జననావయాల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చుÑ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువÑ పాలిచ్చే తల్లుల్లో పాలు తగ్గుతాయిÑ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకే డయాబెటిక్స్‌ ఉన్నవారు వాడకూడదుÑ లివర్‌ సమస్యలు, గాల్‌ బ్లాడర్‌ సమస్యలు తలెత్తవచ్చుÑ గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ వ్యాధి ఉన్నవారు వాడకూడదుÑ టి.బి. మందులు, ముఖ్యంగా రైఫాంపిసిన్‌తో కలిపి వాడకూడదుÑ బి.పి. ఉన్నవారు వాడకూడదుÑ రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉన్నవారు వాడకూడదుÑ 35 ఏళ్ళు పైబడిన వారిలో ఇబ్బందులు రావచ్చుÑ పొగ తాగేవాళ్ళలో కూడా ఇబ్బందులు రావచ్చు.
ఎవరు అసలు వాడకూడదు: 40 స॥రాల వయసువారుÑ బాగా లావుగా ఉన్నవారుÑ బి.పి, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారుÑ లివర్‌ సమస్య, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారుÑ రక్తానికి సంబంధించిన సమస్యలు, వ్యాధులు ఉన్నవారుÑ కేన్సర్‌ జబ్బు ఉన్నప్పుడుÑ టి.బి. మందులు వాడేటప్పుడుÑ ఏదైనా ఆపరేషన్‌కు ప్లాన్‌ చేసుకునే సమయంలోÑ పాలిచ్చే తల్లులుÑ పొగ తాగేవారు.
ఇతర రకాలైన పిల్స్‌: మినీ పిల్‌` ఇందులో ప్రొజెస్టిరాన్‌ మాత్రమే… లీవో నార్‌ జెస్ట్రిల్‌ రూపంలో కానీ, నార్‌ ఇథిండోస్‌ రూపంలో కానీ, డిసో జెస్ట్రిల్‌ రూపంలో కానీ ఉంటుంది. ఈస్ట్రోజన్‌ ఉండదు. అందుకే పాలిచ్చే తల్లులోనూ, వికారం, తలనొప్పితో బాధపడే వారు కూడా ఈ పిల్‌ వాడవచ్చు. అయితే ఫెయిల్యూర్‌ రేటు ఎక్కువ. ప్రొజెస్టిరోన్‌ తక్కువ మోతాదులో ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం వద్ద మ్యూకస్‌ని చిక్కగా చేయడం వలన వీర్యకణాన్ని నిరోధించి గర్భం రాకుండా నిరోధస్తుంది.
ఎమర్జన్సీ కాంట్రాసెప్టివ్‌ పిల్‌: కంబైన్డ్‌ పిల్‌ కానీ, ఈస్ట్రోజన్‌, సింథటిక్‌ ఆండ్రాయిడ్‌ పిల్‌ కానీ, ఎక్కువ డోస్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రెండు డోసులు పన్నెండు గంటల వ్యవధిలో, కలయిక జరిగిన 72 గంటలలోపు వాడి గర్భాన్ని నిరోధించవచ్చు. 24 గంటల లోపే వాడితే తొంభై అయిదు శాతం సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆ ప్రత్యేక పరిస్థితులేంటంటే… ఇతర గర్భ నిరోధక సాధనాలు విఫలమైనపుడు, ఉదా: మాత్రలు మర్చిపోవడం, కాండోమ్‌ జారిపోవడం, ఇంకా రేప్‌ జరిగినప్పుడు. ఈ మాత్రలన్నీ డాక్టర్‌ సలహాపై ఇతర వ్యాధులు లేనివారు మాత్రమే వాడాలి.
చివరగా 1960 తర్వాత వైద్యరంగంలోనూ, ప్రపంచ ప్రజల లైంగిక జీవితంలోనూ పెను మార్పు తీసుకొచ్చినవి ఈ ‘‘ఓరల్‌ పిల్స్‌’’ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల లైంగిక జీవితంలో రక్షణ, భద్రత కలిగించిన తేలికైన విధానంగా ఇది పరిణమించింది. అయితే వీటివల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఎవరు, ఎప్పుడు వీటిని వాడవచ్చో, ఎవరు వాడితే ప్రమాదాలు సంభవిస్తాయో తెలుసుకుని డాక్టర్‌ సలహాపై వాడటం ముఖ్యమనే విషయాన్ని మరవరాదు. ఎవరు పడితే
వాళ్ళు, ముఖ్యంగా యువత వీటిని విశృంఖలంగా వాడటం వలన గర్భ సంచీలోనూ, పీరియడ్స్‌ వచ్చే క్రమంలోనూ అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముంది. రక్తంలో గడ్డలు ఏర్పడటం, బి.పి., షుగర్‌ లాంటి వ్యాధులు ఎక్కువవడం, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరగడం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే డాక్టర్‌ సలహాపై ఈ హార్మోన్‌ మాత్రలు సక్రమంగా
ఉపయోగించడం వలన సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం మహిళ సొంతమవుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.