చెరువ భానుజ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం చారుమల్లి గ్రామంలో జన్మించారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నారు. భానుజ తను జన్మించిన గ్రామంలో నాల్గవ తరగతి వరకు చదివిన తర్వాత ఆమె చదువు దృష్ట్యా కదిరి దగ్గర్లోని పుట్టాడుల గ్రామానికి
నివాసం మార్చారు. సి.పి.ఐ. బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో ఆమె తండ్రి సి.పి.ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఆరవ తరగతి నుండి భానూజ కదిరి మండలంలోని ఎస్సీ/ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. హాస్టల్లో ఉన్నందువల్ల అప్పటికే కుల వ్యవస్థ గురించి, అమ్మాయిలను చదివించకుండా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేయడం వంటివి ఆమె తెలుసుకున్నారు. తన తండ్రితో కలిసి అప్పుడప్పుడూ సమావేశాల్లో పాల్గొన్నందువల్ల కుల వివక్ష, అమ్మాయిల పట్ల వివక్ష ఎందుకుండాలి అని ఆలోచించే, ప్రశ్నించే భావనలు ఏర్పడ్డాయి. హాస్టల్లో ఆహారం సరిగ్గా లేదని ఒకసారి ప్రత్యక్షంగా అధికారులకు తెలియజేసి హాస్టల్ యాజమాన్యంతో దెబ్బలు తిన్నారు. ఆ వయస్సు నుండే ఆమెలో ఇలాంటి భావనలు మొదలయ్యాయి. 1985లో ఆమె పదవ తరగతి చదువుతుండగా యంగ్ ఇండియా ప్రాజెక్టు వారు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. అప్పటికే తనకు సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం, చెక్క భజన, కర్ర సాములో మంచి ప్రావీణ్యం కలిగి ఉంది. అప్పటినుండే ఆమె కార్మికుల పట్ల పనిచేస్తున్నారు. ఆమెకు 17వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కార్మిక పక్షాన పనిచేస్తున్నందున ఆమె తన కుటుంబ సభ్యుల నుండి ఎన్నో మాటలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన ఆదర్శాలను ఎప్పటికీ వదల్లేదు. ఒత్తిడులను ఎదుర్కొంటూనే 1995 వరకు యంగ్ ఇండియా ప్రాజెక్టులో పనిచేశారు.
రెడ్స్ మొదలు పెట్టడానికి కారణమేంటి?
బాల్య వివాహాలు, మహిళలపై హింస వంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహిళాభివృద్ధి కోసం పాటుపడాలన్న ముఖ్యోద్దేశంతో 1996లో రెడ్స్ (రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ) అనే సంస్థ నల్లమాడ మండలంలో ఏర్పాటయింది. మొదట అత్యాచారాల నిరోధక కమిటీలను మొదలుపెట్టి అక్కడి నుండి హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై హింస, బాల్య వివాహాల నివారణ, సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ఒంటరి స్త్రీలు, గృహహింస, మహిళా ఎఫ్.పి.ఓ.లు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
రెడ్స్ మొదలు పెట్టినపుడు అత్యాచారాల నిరోధక కమిటీని ఏర్పాటు చేశాం. దీనిద్వారా కౌన్సిలింగ్ సెంటర్‌ను మొదలుపెట్టాం. ఇందులో మహిళల అంశాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడం, ఏ రకమైన సమస్య, ఏమి జరిగింది అని మహిళలతో మాట్లాడిరచడం, అన్ని రకాల సంఘాల వాళ్ళను ఒక అడ్వయిజరీ కమిటీలాగా చేయడం, మేము చేస్తున్న పనిపై వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం… అంటే మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళం.
మొదటినుండి కూడా రెడ్స్ సంస్థ ఒక స్ట్రాటజీతో పనిచేస్తోంది. ఒక బాధిత స్త్రీ మా దగ్గరకు వచ్చిందంటే అదే కరెక్టని తీసుకునేవాళ్ళం కాదు. ఆ గ్రామంలో కమ్యూనిటీ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసేవాళ్ళం. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ (సి.బి.ఓ)… నిరోధకంపైన ఒకవైపు అవగాహన కల్పించడం, ఇంకోవైపు వారి భావజాలంలో మార్పు తీసుకు వచ్చే విధంగా నిర్ణయాధికారం, సాధికారత, సామాజికపరమైన ఆలోచనలు చేయడానికి అవసరమైన సామర్ధ్యాలను పెంపొందించడానికి వివిధ రకాలైన అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేవాళ్ళం.
ఇలా చేయడం వల్ల చాలా గ్రామాల్లో కమ్యూనిటీ స్థాయిలో వివిధ రకాల మార్పులు వచ్చాయి. మొదట స్త్రీలు ఇంట్లో నుండి బయటకు వచ్చి, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. మహిళలు ఇంటినుండి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారంటే ఇంటిగుట్టు బయట వేశారా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. పోలీసుల రిసీవింగ్ సరిగ్గా ఉండేది కాదు. భర్త కొట్టక ఇంకెవరు కొడతారు, కొట్టడం భర్త హక్కు అని మాట్లాడేవారు. ఒక బాధిత స్త్రీ వచ్చినపుడు ఆమె తన బాధ/సమస్యను చెప్పుకోవడానికి కమ్యూనిటీలో అనుకూలంగా
ఉందా, పోలీస్ స్టేషన్లో అనుకూలంగా ఉందా అని తననే నిర్ణయించుకోమనేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో స్త్రీలకు కావలసిన మనోధైర్యాన్ని నింపడానికి రెడ్స్ చాలా కృషి చేయడం జరిగింది. బాధిత మహిళల అభిప్రాయంతోనే కౌన్సిలింగ్ నిర్వహించేవాళ్ళం.
రెడ్స్ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది? మీ టీం గురించి చెప్తారా?
రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ (రెడ్స్`) స్వచ్ఛంద సంస్థను 1996లో అనంతపురం జిల్లా కదిరి మండలంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కదిరి డివిజన్లోని 7 మండలాల్లో మరియు అనంతపురం డివిజన్లోని మూడు మండలాల్లో కలిపి మొత్తం 10 మండలాల్లో పనిచేస్తుంది.
సమాజంలోని ప్రతి వ్యక్తికి, సమూహాలకు తగిన గౌరవం, ఉన్నతితో పాటు న్యాయమైన మరియు నిష్పాక్షిక ప్రయోజనాలను సమాజం కల్పించే విధంగా చేయడమే రెడ్స్ ముఖ్యోద్దేశం.
మేము ఒక ప్రాజెక్టు పరంగానే కాదు ఇష్యూస్ ఆధారంగా పనిచేయడం జరుగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలు, రైతు ఆత్మహత్యల కుటుంబాలతో పని చేయడం… ఈ మూడు అంశాల గురించి జిల్లా మొత్తంగా పని చేయడం జరుగుతోంది. ఈ మూడిరటిలో ఏ సమస్య గురించైనా సమాచారం, ఫిర్యాదు వచ్చినా అక్కడికి వెంటనే మా బృందం వెళ్ళడం, డేటా సేకరించడం, వారిని ఫాలో అప్‌లో పెట్టడం చేస్తాం. అనంతపురం జిల్లా మొత్తం అంటే రాయదుర్గం నుండి ఎస్.పి. కుంట వరకు దాదాపు 250 కి.మీ. పరిధిలో పని చేస్తాం. ఇవి ఒక క్యాంపైన్ రూపంలో నడుస్తున్న ప్రోగ్రాంలు ఫోకస్డ్గా, రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేది మాత్రం పది మండలాల్లో మాత్రమే. అంతేకాకుండా సమస్య పరంగా అయితే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా హ్యుమన్ ట్రాఫికింగ్ అంశంపైన పోరాడుతున్నాం. కడప జిల్లాలో కూడా రైతు ఆత్మహత్యల కుటుంబాలతో, భూమి హక్కులపైన పని చేస్తున్నాం. అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నారు. రెడ్స్ సంస్థ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందినవారు, చిన్న, సన్నకారు రైతులు, పేద, నిరుపేద కుటుంబాలకు చెందినవారు, ఒంటరి మహిళలు, రైతు ఆత్మహత్య కుటుంబాలకు చెందినవారు, వికలాంగులు, అక్రమ రవాణాకు గురైన నిరుపేద మహిళలు, మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుంది. రెడ్స్లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. అందులో మహిళా ఉద్యోగులు 12, పురుషులు 10 మంది ఉన్నారు. అందులో ఇద్దరు పార్ట్‌టైం సిబ్బంది, నలుగురు ట్రైనీలు ఉన్నారు. 50 మంది వాలంటీర్స్ ఉన్నారు.
కదిరిలో హ్యుమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉండడానికి కారణాలేంటి? బాధిత స్త్రీలను ఆదుకోవడానికి మీరు ఎలాంటి విధానాలను రూపొందించారు?
అమ్మాయిల అక్రమ రవాణా ఇక్కడ ఎందుకు ఎక్కువ జరుగుతోందంటే ఈ ప్రాంతాల్లో పని లేకపోవడం. అందువల్ల ఇతర వ్యక్తుల ప్రలోభాలకు గురవుతున్నారు. అక్రమ రవాణాకు గురవుతున్న వాళ్ళలో ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునేవారు, ఒంటరి మహిళలు, ఏ ఆధారం లేని నిస్సహాయులు, చిన్న వయసులోనే పెళ్ళయిన యువతులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల నుండి ఎక్కువగా
ఉంటున్నారు. వారికి ఎన్.ఆర్.ఇ.జి.ఎ. కింద వంద పని రోజులు ఇస్తే ఇంట్లో వాళ్ళు ఒక నలుగురు కలిసి పనిచేస్తే 25 రోజుల్లో ఆ కేటాయించిన పని పూర్తయిపోతుంది. మరి మిగిలిన రోజుల్లో వారు ఏ విధంగా జీవనం గడపాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి జీవనోపాధులు లేకపోవడం వల్ల ఇక్కడ నుండి చాలామంది వలస వెళ్ళిపోతున్నారు.
అనంతపురం జిల్లాలో మేము పనిచేసే ప్రాంతాలన్నీ కూడా వర్షంపై ఆధారపడిన ప్రాంతాలే. నీటి వనరులు తక్కువ. 85% వర్షాధార వ్యవసాయం ఉంది. అందువల్ల అందరూ ఈ వ్యవసాయ భూమిని అభివృద్ధి చేయలేక వదిలేస్తున్నారు. జీవనోపాధులన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవే చేస్తున్నారు. ఇక్కడ స్త్రీలందరూ కూడా వ్యవసాయంలో ఉన్నారు. అందువల్ల రెడ్స్ సంస్థ ద్వారా మేము వ్యవసాయం, జీవనోపాధి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. పని చేస్తున్నాము.
2007 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి హోం మినిస్టర్ జానారెడ్డి గారు ఈ ట్రాఫికింగ్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. 9 జిల్లాలను ప్రత్యేకంగా ట్రాఫికింగ్ ప్రోన్ జిల్లాలుగా ప్రకటించి ప్రత్యేక రెస్క్యూ టీంలు, వాహనాలు ఏర్పాటు చేశారు. అందులో అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం కూడా గుర్తించబడిరది. అయితే కదిరి అటు చిత్తూరు జిల్లాకు, ఇటు కడప జిల్లాకు మధ్య భాగంలో ఉంది. కడప జిల్లా రాయచోటి వరకు చాలా బిడికి తండాలు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫికింగ్ చాలా ఘోరంగా జరుగుతోంది. ఇంకోవైపు కదిరి నుండి చిత్తూరు జిల్లా మదనపల్లి, పీలేరు వరకు కూడా ట్రాఫికింగ్ చాలా ఉంది. రెండు వైపుల నుండి కదిరి బేస్ అవుతోంది. నడిఒడ్డులాగా ఉంది. ఇది లోకల్ బ్రోకర్స్‌కు అడ్డాగా తయారైంది.
ఈ లోకల్ బ్రోకర్స్ అమ్మాయిలకు మంచి భవనాలు కట్టొచ్చని వాళ్ళు కూడా సంపాదించవచ్చని ఆశ చూపించి అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కదిరి ప్రాంతంలో ఎక్కువగా ట్రాప్ అవ్వడానికి కారణం ఈ దక్షిణ ప్రాంతం మొత్తం కూడా వర్షాధారిత వ్యవసాయంపైనే ఆధారపడి ఉండడమే. కెనాల్స్, కాలువలు వంటి నీటి వనరులు ఏమీ లేవు. చాలా డ్రై ఏరియా, కరువు ప్రాంతాలు. గత 20 సంవత్సరాలలో మూడుసార్లు మాత్రమే వేరుశనగ పంట చేతికి వచ్చింది. బెంగుళూరు, చిత్తూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు గ్రామాలు, గ్రామాలు వలస వెళ్తారు. వలస వెళ్ళేటపుడు పిల్లలు, పెద్దవయసు వాళ్ళను ఇంటి దగ్గర వదిలి వెళ్తారు. అమ్మాయిలకు రక్షణ లేకపోవడం వల్ల తల్లిదండ్రులు అమ్మాయిలు ఇంకా 7, 8 తరగతులు చదువుతుండగానే చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేసేవారు. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న అమ్మాయిలను సులభంగా మభ్యపెట్టి, వేరే ప్రాంతాలకు అక్రమంగా తరలించడం, లేదా కొత్త ప్రాంతాలకు వలస వెళ్ళినపుడు అక్కడ కూడా అమ్మాయిలను ప్రలోభాలకు గురిచేసి ట్రాప్ చేయడం జరుగుతోంది. ఇవన్నీ మేము కొంత వరకు చూడడం జరిగింది. కదిరి ప్రాంతంలోనే ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందని చెప్పడానికి కారణం, 2002లో యాక్షన్ ఎయిడ్ సహాయంతో మేము కొన్ని గ్రామాల్లో పరిస్థితులు ఏ ఏవిధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి సర్వే చేశాం.
ఇక్కడ కరువు వలన భయంకరమైన వలసలు, బాల్య వివాహాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కొంతమంది మహిళలు వచ్చినపుడు, ‘‘మా అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళారు, ఇంకా రాలేదు, ఇంట్లో పని చేయించుకోవడానికని ఢల్లీికి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదు’’ అంటూ చెప్పినప్పుడు, వాటి ఒక్కో కేసు బయటికి తీసినపుడు ఈ సమస్య తండాలలో ఎక్కువగా ఉందని గుర్తించాము. ఇలాంటి కేసులను తీసుకొని కదిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్. చేయించాము. ఎక్కువ ఎఫ్.ఐ.ఆర్.లు కదిరిలో నమోదయ్యాయి. అందుకని కదిరికి ఇలా హ్యుమన్ ట్రాఫికింగ్ ప్రోన్ అని పేరు వచ్చింది. 2009 నుండి సి.ఐ.డి. ఆఫీస్‌లో రిజిస్టరయిన కేసుల్లో ఎక్కువ శాతం రెడ్స్ నుండి చేసినవే. రెస్క్యూ ఆపరేషన్‌లో కూడా పూణె, ఢల్లీి, బుధవారిపేట, ముంబై వంటి అన్ని ప్రాంతాల్లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో రెడ్స్ సంస్థ ఉంది. బాధిత అమ్మాయిలు, మహిళల తరపున ఎఫ్.ఐ.ఆర్. చేయడానికి ఎవరూ ముందుకు రారు. వీళ్ళకు మేము కౌన్సిలింగ్ చేసి ‘మీలాంటి ఎంతోమంది అమ్మాయిలు అక్కడ ఉన్నారు, మీకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు’ అని చెప్పి వారి ద్వారా మేము రెడ్స్ నుండి సి.ఐ.డి. ఆఫీస్ హైదరాబాద్‌లో కేస్ ఫైల్ చేయించేవాళ్ళం.
అప్పట్లో ఉమాపతి గారు, మహేశ్ భగవత్ గారు సి.ఐ.డి.లో ఉన్నప్పుడు యు.ఎన్.ఓ.డి.సి. నుండి పెద్ద ఎత్తున 2005 ` 06 నుండి 2013 వరకు తొమ్మిది రెస్క్యూ ఆపరేషన్స్ జాతీయ స్థాయిలో చేశారు. ఈ ఆపరేషన్‌లో 333 మందిని రెస్క్యూ చేసారు. అలాగే జిల్లా స్థాయిలో 5 రెస్క్యూ ఆపరేషన్లులో 6 మందిని ఆక్రమ రవాణాకు గురి కాకుండా కాపాడాము. 19 మంది హ్యుమన్ ట్రాఫికర్లను అరెస్ట్ చేయించాము. అప్పుడు ఎఫ్.ఐ.ఆర్.లు కావాలంటే మేము కదిరిలోనే 164ఇ కింద కోర్టులో ఢల్లీి, ముంబై, భివండి, పుణెలకు వెళ్ళినపుడు రెస్కూ ఆపరేషన్ చేయడం, తీసుకొచ్చిన వాళ్ళను మళ్ళీ కదిరి కోర్టులోనే హాజరు పరచడం చేసేవాళ్ళం. తీసుకొచ్చినపుడు 60% వాళ్ళు ప్రక్కన జిల్లాల అమ్మాయిలె వచ్చారుÑ ఖమ్మం జిల్లా అమ్మాయిలు కూడా ఉన్నారు. హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో ఎక్కువ ఎఫ్.ఐ.ఆర్.లు కదిరిలో ఉన్నందువల్ల కదిరికి ఆ పేరు వచ్చింది. హ్యుమన్ ట్రాఫికింగ్ సమస్య కదిరి ఒక్కచోటే కాదు, చాలా చోట్ల ఉంది. కానీ బయటికి రావడం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోవడం లేదు. పోలీసులు లోపలికి వెళ్ళి వాటిని బయటికి తీసే పరిస్థితిలో కూడా లేరు.
అసలు పిల్లలు బాల కార్మికులుగా ఎందుకు మారుతున్నారు?
వారికున్న కుటుంబ పరిస్థితుల వల్లే బాల కార్మిక వ్యవస్థను ఆపాలంటే వారి కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా బాగుండాలి. కావున ఇలాంటివి రూపుమాపాలంటే గ్రామ స్థాయిలో ఉన్న అన్ని సంస్థలు, ప్రభుత్వ శాఖల వారి సమన్వయంతో కలిసి అంటే ఒక సెంట్రాలిక్ (అప్రోచ్) విధానంతో పనిచేసినట్లయితేనే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని నా వాదన. మొదటి నుండి కూడా రెడ్స్ ఈ విధానాన్నే పాటిస్తోంది. ఇలాంటి విధానమే మా సంస్థ సిబ్బందిలో కూడా ఉంది. సిబ్బందిలో˜్ ఇష్యూ బేస్డ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారు ఉన్నారు, వ్యవసాయంపైన చేసేవాళ్ళు ఉన్నారు, పిల్లలు, స్త్రీల అంశాల పైన… ఇలా రకరకాల అంశాలలో పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారు. కానీ, అందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉండే విధంగా శిక్షణలు కల్పిస్తాము. ఎందుకంటే మనం పనిచేసే అంశాలన్నీ ఒకదానికి మరోదానికి సంబంధం ఉండి కుటుంబం ఆధారమయ్యేటటువంటి పరిస్థితి. ఈ విధంగా చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం పనిచేసే చోట లైంగిక వేధింపులపై కమిటీ ఉందని తెలిస్తేనే కదా అమ్మాయిలు నిర్భయంగా పనిచేయగలుగుతారు. ప్రకృతి గురించి, సేంద్రీయ వ్యవసాయం గురించి, స్త్రీలకున్న హక్కులు, చట్టాల గురించి కూడా అందరికీ తెలిసుండాలి కదా. అందుకే ఇదంతా ఒక టీం వర్క్‌లాగా పనిచేస్తారు. టీం కూడా అన్ని అంశాలు, ప్రాజెక్టులపై అవగాహన, సామర్ధ్యాలు కలిగి ఉంటారు. ఇలాంటి అవకాశాలను రెడ్స్ తమ సిబ్బందికి కల్పిస్తోంది. దీనివల్ల వారు వ్యక్తిగతంగా తెలివి, నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు.
ఇది రెడ్స్ మొత్తం చేస్తున్న విధి విధానాలు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన మహిళలను చూస్తే ఇంటినుండి బయటకు పంపించేస్తే ఆమెకు ఎటువంటి ఆధారం ఉండదుÑ ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. వివిధ రకాల హోమ్స్ ఉన్నప్పటికీ ఎన్ని రోజులు ఆమెకు ఆశ్రయం కల్పిస్తారు? కుటుంబంలో హింస తగ్గాలంటే మహిళలకు ఖచ్చితంగా ఆర్థికపరమైన సౌలభ్యం ఉన్నట్లయితే ఆమె ధైర్యంగా
ఉండగలుగుతుంది. దాన్ని కల్పించడానికి ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ విధంగా ఎంతమందికి ఎన్ని రోజులు సహాయం చేయగలరు? ఈ విధంగా పనిచేసిన అనుభవాలను ప్రభుత్వంలోని పరిపాలనాధికారులు, చట్టం తయారుచేసే పాలసీ మేకర్స్‌తో అంటే కొన్ని కమిటీలు, జిల్లా స్థాయి ‘దిశ’ లాంటి వాటిలో మనం మాట్లాడి, వారికి ఈ విషయాలను తెలియ చేయడం వల్ల అది పాలసీ మేకర్స్ స్థాయికి వెళ్తే అది చట్టమయ్యే అవకాశం ఉంటుంది. చట్టాలు తెచ్చినప్పటికీ వాటి అమలు గురించి మళ్ళీ మనమే పనిచేయవలసి ఉంటుంది. చట్టం తీసుకురావడంలో పని అయిపోదు. సమర్ధవంతంగా అమలు జరిగేలా చూసుకోవాలి. ఇవన్నీ ఇంటర్`లింక్డ్ ఇష్యూస్. అదే విధానంలో రెడ్స్ విధి విధానాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వ బాధ్యతల గురించి మీరు అధికారులతో ఏమైనా చర్చించారా? వారి నుండి ఎలాంటి సమాధానాలు వచ్చాయి?
నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయిలకు, మహిళలకు సహాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ అధికారులను ఈ విషయంపై ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కోసం డి.ఆర్.డి.ఎ. నుండి 16 కోట్ల రూపాయలు రీహేబిలిటేషన్ చేసినట్లు లెక్కలున్నాయి. మూడు జిల్లాలకు కలిపి కదిరిలో యాంటీ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉండేది. ఒక ప్రత్యేక అధికారి నోడల్ అధికారిగా కూడా కదిరిలో ఉండేవారు. కానీ, యు.ఎన్.ఓ.డి.సి. ఫండిరగ్ ఉన్నంతవరకే ఈ రెస్క్యూలు జరిగాయి. తర్వాత ఇదంతా రెడ్స్ పనే అయింది. ఎన్నో సంస్థలు, ప్రాజెక్టులు అని వచ్చాయి. అవగాహన కల్పించాం, ట్రాఫికింగ్ లేదని పోలీసులకు, ప్రభుత్వానికి రిపోర్టులు ఇవ్వడం, వారు ఇక్కడినుండి వెళ్ళిపోవడం జరిగింది.
అయితే రెడ్స్ నుంచి మేము ఇప్పటికీ పోలీసులకు, అధికారులకు ఇక్కడ జరుగుతున్న హ్యుమన్ ట్రాఫికింగ్ గురించి ఫిర్యాదులిస్తున్నాం. బాధితులు, ట్రాఫికర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మొత్తం సమాచారం ఇచ్చాం. ఆ క్రమంలోనే నా మీద చాలా యుద్ధాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సహాయం చేసేలా చేయగలిగారు? వీటి నిర్మూలన కొరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
అమ్మాయిల అక్రమ రవాణా నిర్మూలించడానికి రెడ్స్ నుండి జిల్లా, గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి చాలా నివేదికలు ఇవ్వడం జరిగింది. యాంటీ ట్రాఫికింగ్ జి.ఓ.ఎం.ఎస్.నెం.1,2003 చట్టంలో 4 ముఖ్యమైన అంశాలు: Prevention, Rescue, Rehabilitation & reintegration అని ఉన్నాయి. Rescue, Rehabilitation అనేది మొదటి స్థాయిలో జరగాలి. Rవంషబవ, Rవష్ట్రaపఱశ్రీఱ్a్‌ఱశీఅ జరగడం లేదు. ఇక Rవఱఅ్వస్త్రతీa్‌ఱశీఅ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంది.
సాధారణంగా స్టాట్యుటరీ కమిటీలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. ఈ కమిటీ సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరగాలి. కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా జరగడం లేదు. ఒకవేళ మీటింగ్ జరిగినప్పుడు అధికారులను ప్రశ్నిస్తే సమావేశాలకు పిలవకపోవడం వంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా దాదాపు 319 మందిని (1996 నుండి 2019 వరకు) రెస్క్యూ చేయడం, 500 మందికి పైగా అసలు ట్రాఫికింగ్‌కు గురికాకుండా చేయడం జరిగింది. తిరిగి వచ్చిన అమ్మాయిలతో జరిగిన విషయాలు చెప్పించినందువల్ల అమ్మాయిలు వెళ్లలేదు. ఈ 319 మందిలో 90 నుంచి 100 మంది వరకు అనంతపురం జిల్లా వాళ్ళే. మిగిలిన వాళ్ళు పొరుగు జిల్లాలైన చిత్తూరు, కడప నుంచి ఉన్నారు. 10 సం॥ల తర్వాత 72 మందికి రీహాబిలిటేషన్ వచ్చిందిÑ అది కూడా జిల్లా కలెక్టర్ అనురాధ గారి సహాయంతో.
రెస్క్యూ చేసి తీసుకొచ్చినప్పటికీ 10 శాతం అమ్మాయిలు తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2011లో చివరగా సి.ఐ.డి. అధికారి సుమతి గారితో పూణె, బుధవారిపేటలో ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్ళాం. అక్కడ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఎదురుగానే దందాలు నడుస్తున్నాయి. బడా దీదీలు పోలీసు వాళ్ళపై చెయ్యి వేసి మరీ మాట్లాడుతుంటారు. అక్కడ చాలీస్, పచ్చీస్ అని నంబర్లతో మాట్లాడుతుంటారు. ఒక కార్పొరేటర్ వచ్చి ఎస్.పి.ని నేరుగా బెదిరించిన సంఘటనలు చూశాం. అక్కడ 25 మందిని తీసుకొస్తే అందరూ 20`25 సం॥ మధ్య వయసులో ఉన్న మహిళలే. వాళ్ళకు హెచ్.ఐ.వి. పరీక్షలు చేస్తే 19 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరూ మమ్మల్ని, పోలీసు వాళ్ళని నిలదీసి అడిగారు, భయంకరంగా తిట్టారు. ‘మీరు ఇప్పుడు వచ్చారు. మమ్మల్ని 10 సం॥ క్రితం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇక్కడ అమ్మేశారు. మా వాళ్ళు మీ చుట్టూ తిరిగారు. అప్పుడు మీరెవరూ రాలేదు. ఇప్పుడు మా జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మమ్మల్ని అక్కడా, ఇక్కడా కాకుండా ఎందుకు చేస్తారు?’ అని నిలదీశారు. మేము సమాధానమేమీ చెప్పలేకపోయాం. దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు.
రెస్క్యూ చేసి తీసుకొచ్చాక చట్టప్రకారం ఏం చర్య చేపట్టలేదు. ఐపాక్ట్ కింద ఏ సెక్షన్ కింద ఏం చేయాలో కూడా పోలీసు వారు ఏమి సమాచారం అందించలేదు. మళ్ళీ కదిరి నుండి హైదరాబాద్‌లో సి.బి.సి.ఐ.డి.లో కేసు నమోదు చేయించాం. అదే మా మొదటి ట్రాఫికింగ్ కేసు 2006 లో. అక్కడ ఎఫ్.ఐ.ఆర్. చేసి మళ్లీ రెస్క్యూ ఆపరేషన్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి వాటిలో బాధిత స్త్రీలందరినీ డైవర్ట్ చేసి ‘ఆమె మీకు ఏమైనా డబ్బులిస్తుందా? ఎందుకు ఇలా మీరు ఆమె మాట వింటున్నారు?’ అని నన్ను తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అలాగే 2015లో 18 మంది అమ్మాయిలను పులివెందుల, బాట్రేపల్లి నుండి సౌదీ అరేబియాకు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందింది. దీన్ని అడ్డుకోవడానికి అనంతపురం, కడప జిల్లాల ఎప్.పి అధికారులతో నిరంతరాయంగా పని చేయవలసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి ఎస్.పి. పైన చాలా ఒత్తిడి చేయవలసి వచ్చిది. అప్పుడే ఇక్కడి అమ్మాయిలను మన దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలకు పంపిస్తున్నారని, ఈ ప్రాంతంలో అంతర్జాతీయ దందా జరుగుతోందని తెలిసింది. మొత్తానికి 18 మంది అమ్మాయిలలో 8 మందిని ముద్దనూరులో కాపాడగలిగాం. పది మంది ఏమయ్యారో ఇంతవరకు పోలీసులకు కానీ, ఇంకెవరికీ తెలియదు.
పోలీసుశాఖ సమన్మయంతో ఏఏ కార్యక్రమాలు చేశారు?
ఎంత గ్రామ స్థాయిలో కమిటీలు వేసి కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని కేసులు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళవలసి వస్తుంది. పోలీస్ స్టేషన్లో బాధిత స్త్రీలతో నడుచుకునే విధానం, రిసీవింగ్ సరిగ్గా ఉండదు, ఘోరంగా ఉండేదిÑ ఇంకా కించపరిచేలా మాట్లాడేవారు. అలాంటప్పుడు బాధిత స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల పోలీసుల ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావలసిన అవసరం ఉండేది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు, 2009లో ఎపిపిఎస్ వంటి నెట్వర్క్ ద్వారా ఆక్స్‌ఫామ్ లాంటి సంస్థతో మహేశ్ భగవత్, ఉమాపతి వంటి పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో హైదరాబాద్‌లోని సి.ఐ.డి. ఆఫీసులో, ప్రతి మహిళా పోలీస్ స్టేషన్లో ఎన్జీఓల ద్వారా కౌన్సిలర్లను ఏర్పాటు చేసి బాధిత స్త్రీలు పోలీస్ స్టేషన్‌కి వచ్చినపుడు వారితో మాట్లాడి కౌన్సిలింగ్ ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరుగుతోంది. ఈ విధంగా హైదరాబాద్‌లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ (ఎపిపిఎస్ నెట్వర్క్ ద్వారా), అనంతపురంలో మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేయడం అనేది చాలా మంచి ఫలితాన్నిచ్చింది. ఈ క్రమంలో నిర్ణయ, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వారు కూడా కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహించడానికి 2008`09 నుండి 2011`12 వరకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
పోలీస్ స్టేషన్‌కి వచ్చే కేసులు చూస్తే 80% చదువురాని మహిళలు, చట్టాల గురించి ఏమీ తెలియని మహిళలే
ఉంటారు. కానీ మహిళల వల్ల 498 (ఎ), గృహ హింస చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారన్న అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఎఫ్.ఐ.ఆర్ చేసేది పోలీసులు, కేసు పెట్టించేది లాయర్లే. కావున పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పు తీసుకురావలసిన అవసరం చాలా
ఉంది. ట్రాఫికింగ్ కేసుల్లో లోకల్ డిఎస్పీ నుంచి సరైన సహకారం ఉండేది కాదు. కొంతమంది జిల్లా కలెక్టర్లు అనురాధ, సందీప్ కిషన్ లాంటివాళ్ళు చాలా మంచిగా సహకరించారు. ట్రాఫికింగ్ విషయాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు.
వ్యవసాయం, కరువు జిల్లా, సంక్షోభ పరిస్థితులు… ఇలాంటి సందర్భాల్లో మీరు మహిళా రైతుల కోసం ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు?
రైతు అనగానే మగవారే గుర్తొస్తారు. చాలామందికి రైతు అనగానే మహిళా రైతు అని చెప్పుకోవలసిన పరిస్థితి ఉంది. రెడ్స్ సంస్థ అనంతపురం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో చాలావరకు మహిళలు రకరకాల సమస్యల్లో
ఉండడమే కాకుండా ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు ఉన్నా వ్యవసాయంలో పూర్తి అవగాహన ఉన్న మహిళలు ఉన్నారు. ఈ సమస్యలు కొంచెం ప్రత్యేకంగా కూడా కనిపించాయి. వారి జీవనోపాధి కోసం ప్రత్యేక సదుపాయాలేమీ లేవు. వర్షాధారిత వ్యవసాయం. వలసలు, మహిళల అక్రమ రవాణా చాలా ఎక్కువ. వ్యవసాయ సంక్షోభం వల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2004 నుండి దాదాపు 4,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు నమోదైనట్లు మేము చేసిన డేటాలో వచ్చాయి. దీనివల్ల మహిళలు ఒంటరి వాళ్ళవడమే కాకుండా ఎప్పుడైతే వ్యవసాయం సాధ్యం కాదని ఆత్మహత్యల వరకు వెళ్తారో అప్పుడు వ్యవసాయం మీద ఒక నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకని మహిళా రైతులను ఎవరైతే ఒంటరి మహిళలున్నారో అంటే రైతు ఆత్మహత్యల కుటుంబాలు, రకరకాల కారణాల వల్ల ఒంటరి స్త్రీలుగా ఉంటున్నవారు, విడాకులు తీసుకున్నవాళ్ళు… వీళ్ళందరికీ కూడా వ్యవసాయంపై అవగాహన ఉంది. కానీ వారి చేతిలో భూమి లేదు. వ్యవసాయమంతా మహిళలే చేస్తునప్పటికీ భూమి మాత్రం ఇంటి మగవారి పేరుమీదే ఉంటుంది. కాబట్టి వారిని రైతులుగా గుర్తించే స్కీములు కానీ, ప్రభుత్వాలు గానీ, మొత్తం మనం చూస్తున్న పరిస్థితుల్లో లేదు. అందుకనే ఈ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉమెన్ హెడెడ్ అయ్యుండి రైతులుగా మొత్తం బాధ్యతలు తీసుకుంటారో అలాంటి వాళ్ళని కలిపి సంఘటితంగా తయారు చేయడం జరుగుతోంది. చాలావరకు మహిళలు ఆత్మహత్యలు చేసుకోరు, ధైర్యంగా ఉంటారు. ఒకవేళ మహిళా రైతుల ఆత్మహత్యలు కొద్ది శాతం జరిగినప్పటికీ కూడా వాటిని రైతు ఆత్మహత్యలుగా గుర్తించడం లేదు. గత పది సంవత్సరాల నుండి జరిగిన ఇలాంటి 40 మంది మహిళా రైతుల ఆత్మహత్యలను రెడ్స్ సంస్థ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఆత్మహత్యలు చేసుకుంటోంది ఎక్కువశాతం మంది మగవారే. కాబట్టి వ్యవసాయాన్ని పూర్తిగా బ్రతికించగలిగిన శక్తి సామర్ధ్యాలు, వ్యవసాయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ఆలోచనలు అన్నీ కూడా మహిళలకే ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల సంఘం, మహిళా సాధికారతకు తోడ్పడుతుంది. సెర్ప్ (ఎస్ఇఆర్పి) అని ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది. గత 30 సంవత్సరాలుగా పెద్ద సంస్థలు మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాయి. మహిళలు పొదుపు చేసుకున్నప్పుడు అందులో మహిళల ఆర్థిక లావాదేవాలు జరపడమే కాదు, వాళ్ళకున్న శక్తిసామర్ధ్యాలు, ఆలోచనలను గుర్తించాలి. ఒక గుర్తింపు వచ్చినప్పుడే అది మహిళా సాధికారత అవుతుంది.
మహిళా రైతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడానికి మకాం, (కవితా కురగంటి) ఎయిడ్, ఐ ఫర్ ఫార్మార్ లాంటి సంస్థల సహకారం లభిస్తుంది. రైతు స్వరాజ్య వేదిక ద్వారా వ్యవసాయ ఆధారిత పనులకు సహకారం చేయడంతో పాటు. రైతుల ఆత్మహత్య నివారణ, కౌలు వ్యవసాయదారులకు సంబంధించిన స్టడీ చేయడం జరుగుతోంది.
మహిళా రైతులు, మహిళా ఉత్పత్తిదారుల సంఘాలలో (ఎఫ్.పి.ఓ) పనిచేస్తున్నారని తెలుసు. వ్యవసాయంలో మహిళల అభివృద్ధి ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు?
కోవిడ్ వల్ల చాలావరకు విద్యా వ్యవస్థ, జీవనోపాధులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా అల్లకల్లోలమయింది. మునుపటి పరిస్థితి వెనక్కు తీసుకురావాలంటే ప్రభుత్వంతో పాటు అన్ని స్థాయిల వాళ్ళు, అన్ని వర్గాలు, సమూహాలు, సంస్థలు కలిసి పనిచేస్తేనే అవుతుంది. ఒక్క ప్రభుత్వం వల్లనే మొత్తం పరిస్థితులను సరిచేయడం కుదరకపోవచ్చు. అందరూ ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఉదాహరణకు మా ప్రాజెక్టు ప్రాంతంలో 2వ ఫేజ్ కోవిడ్ సమయంలో ప్రైవేటు టీచర్లు చాలా మందికి రోజువారీ గడవడం చాలా కష్టమయింది. ఎఫ్.పి.ఓ.లు ఉండడం వల్ల ఎం.సి.ఎ. చదివిన టీచర్లు కూడా వ్యవసాయంలోకి వచ్చి ఎఫ్.పి.ఓ. వాళ్ళు చేసే వ్యవసాయ పనిని నేర్చుకొని కూలీ పని చేసి రోజుకు రూ.200 సంపాదించుకొని జీవనం గడిపారు.
ఇలాంటి సమస్యలతో పాటు వలస వల్ల అక్రమ రవాణా, బాల కార్మికులు, ఆడపిల్లలు/మహిళలపై హింస వంటివన్నీ జరుగుతున్నాయి. వలసలు ఆపడానికి జీవనోపాధులు ఏమిటన్నది వలస వెళ్ళి తిరిగి వచ్చినవారందరికీ స్థానికంగా ఏమి చేయాలనేదానికి నైపుణ్య శిక్షణలు, మిల్లెట్స్ ప్రమోషన్ చేయడం జరుగుతోంది.
దళారీ వ్యవస్థ లేకుండా ఎఫ్.పి.ఓ.లు, అందులోనూ మహిళా ఎఫ్.పి.ఓ.లు ఈ చిరుధాన్యాలు పండిరచే విధంగా రెడ్స్ సంస్థ వారిని ప్రేరేపించింది. మామూలుగా ఎఫ్.పి.ఓ.లు ఉన్నప్పటికీ రెడ్స్ ద్వారా 2,000 మంది మహిళలతో ఏడు మహిళా ఎఫ్.పి.ఓ.లు ఏర్పాటు చేశాం. వాళ్ళే పంట పండిరచేవాళ్ళు. కాబట్టి వాళ్ళే యజమానులు కూడా అవుతారు. మహిళా పారిశ్రామిక వేత్తలు అవుతారు. అప్పుడు రైతుకు గిట్టుబాటు ధర వెళ్తుంది. వీళ్ళు కొని మార్జిన్ మనీ పొంది మహిళా ఎఫ్.పి.ఓ.లు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వినియోగదారులకు కూడా మంచి ఆహారం దొరుకుతుంది. ఇది ఎఫ్.పి.ఓ.లను ప్రొమోట్ చేయడానికి ముఖ్యమైన కాన్సెప్ట్. అందులో సరైన క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఇవ్వగలగాలి, మోసం జరగకుండా చూసుకోవాలి. అప్పుడు రైతుకు (పంట పండిరచిన వారికి) గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయంలో నైపుణ్యాలు, తెలివి, మెళకువలు పెంపొందించుకుంటారు, కుటుంబ పోషణ ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే స్టేక్ హోల్డర్లు హక్కుదారులవుతారు. దాని ప్రకారమే వినియోగదారులకు మంచి ఆహార ధాన్యాలు లభ్యమవుతాయి. వీటన్నింటివల్ల ఆర్థిక వ్యవస్థ దళారీ చేతుల్లోకి వెళ్ళకుండా ఆ గ్రామంలోనే తిరుగుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్‌తో మేము రెడ్స్ ద్వారా ఎఫ్.పి.ఓ.లు ఏర్పాటయ్యే విధంగా చేస్తున్నాము.
ఈ మహిళా ఎఫ్.పి.ఓ.లకు వివిధ రకాల శిక్షణలు నిర్వహించడం జరుగుతోంది. ప్రకృతి వ్యవసాయ విధానం, సేంద్రీయ ఎరువుల తయారీ, చిరుధాన్యాల పంట సాగు వంటి వాటిలో ఖాదర్‌వలీ గారు తదితర ప్రత్యేక నిపుణుల సహకారంతో అవగాహనా కార్యక్రమాలు, శిక్షణలు ఇప్పించడం ద్వారా వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచుకునే విధంగా ప్రస్తుత సమాజానికి కావలసిన రీతిలో అభివృద్ధి పరచడం చేస్తున్నాం.
మహిళా ఎఫ్.పి.ఓ.లకు ప్రభుత్వ, వ్యవసాయ బ్యాంకులకు అనుసంధానం చేస్తూ రుణ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం నాబార్డ్ వారి సహకారంతో చిరుధాన్యాలు (మిల్లెట్లు)తో రకరకాల ఉత్పత్తులను తయారుచేయడానికి కదిరి, అనంతపురం కేంద్రంగా మహిళా ఎఫ్.పి.ఓ.లకు 15 రోజులపాట శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. దీని ద్వారా బేకరీ పదార్ధాలు… మిల్లెట్ కేక్‌లు, బిస్కెట్లు, సూప్, దోసెలు, పఫ్‌లు, మురుకులు, అరిసెలు వంటి వాటి తయారీ విధానాలను నిపుణులైన రిసోర్స్ పర్సన్స్ ద్వారా నిర్వహించాం. ఎఫ్.పి.ఓ. ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. తయారు చేసిన ఈ తిండి పదార్ధాలను గ్రామాల్లోనే చిన్న స్టాల్స్లాగా పెట్టడమే కాక, ఆఫీసులో కూడా అమ్మకానికి పెడుతూ ఆదాయం పొందుతున్నారు. ఇందులో ఒక ఎఫ్పిఓ గాను అనంత మహిళా రైతుల ఉత్పత్తి దారుల సంఘానికి ఎపిఎంఎఎస్ సంస్థ ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది.
భూమి లేని మహిళలను గుర్తించి రెడ్స్ సంస్థ ద్వారా కొంత పొలం కౌలుకు తీసుకొని వారి చేత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పెట్టించి మహిళలలో ఆత్మస్థైర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్ధికంగా చేయూతనివ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం.
రైతు ఆత్మహత్యల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయం వచ్చే విధంగా చేస్తున్నారా?
రెడ్స్ సంస్థ రైతుల ఆత్మహత్యల పైన పెద్ద ఎత్తున పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఎయిడ్ (AIణ) వారి సహకారం లభిస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన రైతుల ఆత్మహత్యల కుటుంబాలలో ఇప్పటివరకు మేము 535 కుటుంబాలకు గత పది సంవత్సరాల నుండి సహకారాన్ని అందచేస్తున్నాం. ఈ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. ఈ ప్రొఫైల్స్‌ని తీవ-ఙఱంఱ్ చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇందులో దాదాపు 192 మందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం మాత్రమే కాకుండా ఇలాంటి రైతు ఆత్మహత్యలు జరగకుండా నివారణ కార్యక్రమాలు చేయాలి. అంటే అదే వ్యవసాయంలో నీకొక మంచి ఉపాధి ఉంటుంది అని చెప్పడానికి ఒక మోడల్‌ను చూపించాలి. అందుకే సంఘటిత వ్యవసాయం , చిరుధాన్యాలను పండిరచడం / సాగు చేయడం వంటి వాటిని ప్రోత్సహిస్తున్నాం. కమర్షియల్ పంట సాగుకు వెళ్ళకుండా సేంద్రీయ/ ప్రకృతి పద్ధతిలో చిరుధాన్యాలను పండిరచినట్లయితే వినియోగదారులకు రసాయనిక రహిత ఆహారంతో పాటు సారవంతమైన భూమి కొనసాగుతుందన్న ముఖ్య ఉద్దేశ్యంతో పనిచేయడం జరుగుతోంది.
కొత్తగా చేస్తున్న / నూతన ఆవిష్కరణలు :
సాధారణంగా వ్యవసాయ పరికరాలను వాడే తెలివి, సామర్ధ్యాలు మగవారికే ఉన్నాయనుకొంటారు. కానీ రెడ్స్ నుండి మేము మహిళా రైతులకు కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించడంలో శిక్షణలు ఇచ్చాము. అంటే గడ్డి తీసే పరికరాలు, వీడర్స్ లాంటివి. రోజంతా కూర్చొని గడ్డి తీయడం వల్ల వారికి నడుము నొప్పి బాగా వస్తుంటుంది. అందుకోసం సైకిల్ వీడర్స్ని అంటే ఎ.పెనాల్ సంస్థ వాళ్ళు చేసిన మోడల్ని ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి పరికరాలతో పాటు మన టిల్లరు తోటి కూడా ఆడవాళ్ళు నడపగలుగుతారు. అంటే ఎద్దులతో దున్నేది కాదు. ఇలా పరికరాలే కాకుండా పుడమి తల్లి ఎఫ్.పి.ఓ.లో ఒంటరి స్త్రీలే నాగలి పట్టుకొని పొలం దున్నుతారు. ఎడ్ల బండిని కూడా నడుపుతారు. కానీ చాలా గ్రామాల్లో ఒక అపనమ్మకం ఏంటంటే ఆడవాళ్ళు నాగలి పట్టుకొని దున్నితే ఆ ఊరికి దరిద్రం అంటారు. వ్యవసాయం చాలా శుభకరమైనది, పవిత్రమైనది కాబట్టి ఆడవాళ్ళు నాగలి పట్టుకొని దున్నకూడదు అని అంటారు. కానీ ఒంటరి స్త్రీలైన గంగమ్మ, ఆమె తల్లి మరి నాగలితో దున్నకూడదంటే మీరు ఏమైనా దున్నిస్తారా? అని నిలదీశారు. ధైర్యంగా నిలబడి వారి పొలం వాళ్ళు దున్నుకున్నారు. ఇది చూసి ఆ గ్రామంలో 22 మంది మహిళలు ఎడ్ల బండ్లు నడుపుతున్నారు.
నెట్వర్కింగ్ :
‘రెడ్స్’ ప్రారంభం నుంచి కూడా ఆయా సంబంధిత శాఖలతో సమన్వయంతో కలిసి పనిచేయడం జరుగుతోంది. దీనివల్ల వివిధరకాల స్టేక్హోల్డర్లకు కావలసిన సహాయాన్ని అందించడానికి, అలాగే క్షేత్రస్థాయిలోని వాస్తవాలను, ఇబ్బందులను అధికారుల ముందు తెలియపరిచి మహిళలకు, పిల్లలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నో రకాల సమావేశాలకు, శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావడం, శిక్షణలు ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ శాఖలలోని కమిటీలలో సభ్యులుగా ఉండడం వల్ల రెడ్స్‌కు ఉన్న అనుభవాలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించేలా చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ‘రెడ్స్’ ఈ క్రింది శాఖలలో ఎన్జీఓ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. 1.ఎ.పి.అలయెన్స్ ఫర్ ఛైల్డ్ రైట్స్, 2. రీజనల్ డ్రాట్ మూవ్మెంట్, 3. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ, 4. సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్స్ కమిటీ (8 డిపార్ట్మెంట్స్`రైల్వే, వ్యవసాయం, హార్టీకల్చర్), 5. ఎ.పి.సి.ఆర్.ఎ.ఎఫ్. 6. ఎ.పి.ఉమెన్ నెట్వర్క్, 7. సి.ఎ.సి.టి. కో`యాక్ట్`ఛైల్డ్ ట్రాఫికింగ్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్, 8. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా క్యాంపెయిన్, 9. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ కమిటీ, 10. డిస్ట్రిక్ట్ ఎస్సీ/ఎస్టీ, అట్రాసిటీ కమిటీ, 11. జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ, 12. డొమెస్టిక్ వయొలెన్స్ నిరోధకంలో సర్వీస్ ప్రొవైడర్ (రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిరది). 13. జిల్లా స్థాయి దిశ ఎగ్జిక్యూటివ్ కమిటీ. 14. పిసిపిఎన్డిటి కమిటి సభ్యులు.
రాష్ట్ర స్థాయిలో: 1. యాంటీ ట్రాఫికింగ్ కమిటీ, 2. ఎన్.పి.ఎం. ఎగ్జిక్యూటివ్ కమిటీ, 3.ఎన్.ఆర్.ఐ.జి.ఎ., జి.ఓ.Êఎన్.జి.ఓ. కొలాబరేషన్ కమిటీ, 4.అప్నా, 5. జి.ఓ.Êఎన్.జి.ఓ. సమన్వయ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్, 6. రైతు స్వరాజ్య వేదికలో స్టేట్ కన్వీనర్.
కోవాక్ట్ ప్రోగ్రాం: 2021 నుండి సి.ఐ.డి. డిపార్ట్మెంట్ వారితో కలిసి రెడ్స్ కోవాక్ట్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా సి.బి. సి.ఐ.డి వారు ఎస్.ఒ.పి ని తయారు చేసారు. ఈ ఎస్.ఒ.పి గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ 7 కాలేజీలలో చదువుతున్న యువకులతో అంటే ట్రాఫికింగ్ క్లబ్స్ (ఎటిసిలు) ఏర్పాటు చేయడం, డిపార్ట్మెంట్ వారు పంపించిన ఐ.ఇ.సి మెటీరియల్ వీరికి అందించి అవగాహన పరచడం లాంటి కార్యక్రమాలు నిర్వహించి వీరి ద్వారా గ్రామాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక నెట్వర్క్ కార్యక్రమం.
కోవిడ్`19 పునరావాస కార్యక్రమాలు: కోవిడ్ ` 19 సమయంలో మొదటి దశలో 2020లో దాదాపు 11 మండలాల్లోని 7,000 వలస కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. వీరికి కోవిడ్ అవగాహన కల్పించడంతో పాటు వారి జీవనానికి అవసరమైన నిత్యావసర సరుకుల పంపిణీ, సానిటరీ పాడ్స్, వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవడానికి సబ్బులు, మాస్క్‌లు వంటివి ముఖ్యంగా వలస కుటుంబాలకు షైల్టర్స్, కౌన్సిలింగ్, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఒంటరి స్త్రీలు, వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, వంటి వారి కుటుంబాలను ఎంపిక చేసి వారికి కరోనా సంక్షోభంలో తినడానికి సహాయం చేయడం జరిగింది. దీనికి వివిధ రకాలైన సంస్థలు ఎయిడ్, మై ఛాయిసెస్ ఫౌండేషన్, ఎ.పి.ఎం.ఎ.ఎస్, యాక్షన్ ఫ్రెట్ర్నా, రైతు స్వరాజ్య వేదిక (కిరణ్ గారు) కవిత కురగంటి గారు, కె.ఆర్.వేణు గోపాల్, ఐఎఎస్ గారు మరియు 14 మంది స్థానిక రైతులు మొదలైన వారి నుండి ఆర్థిక సహకారం లభించింది.
100% కోవిడ్ వాక్సినేషన్: అజీంప్రేంజీ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో కోవిడ్`19 రెండవ వేవ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు వారికి కోవిడ్ సెంటర్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాక్సిన్ వేసుకోమని ప్రోత్సహిస్తూ ఎంపిక చేసిన గ్రామాల్లో 100% కోవిడ్ వాక్సినేషన్ చేయించుకునేలా ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా కోవిడ్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు డెత్ క్లెయిమ్స్ ప్రభుత్వంకి దరఖాస్తులు పెట్టించి వారికి నష్ట పరిహారం అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.
మహిళా రైతులలో వచ్చిన మార్పులు ఏమైనా మీరు గమనించారా?
మహిళా రైతులలో చాలా మౌలికపరమైన మార్పులు వచ్చాయి. వారి పంటను వారే పండిరచుకొని తింటున్నారు. రెండు ఎఫ్.పి.ఓ.లకు బ్రాండ్, లీగల్ ఐడెంటిటీ వచ్చింది. ఆర్గానిక్ సర్టిఫికెట్ మాత్రమే చేయలేకపోతున్నాం. వాటికి కొంత మద్దతు అవసరం ఉంది. చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. బయటి నుండి ధాన్యం కొనవలసిన పనిలేదని గ్రహిస్తున్నారు. మగవారు కూడా ఈ ఎఫ్.పి.ఓ.ల వద్దకు వచ్చి సలహాలు తీసుకుంటున్నారు. ఆరోగ్య విషయాలు, ముఖ్యంగా గైనిక్ హెల్త్్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు. కొన్ని ఔషధ మొక్కల గురించి చర్చించుకోవడం, ఉపయోగించుకోవడం వంటివి చేస్తున్నారు. వారి నుండి మేము కూడా నేర్చుకోవడం జరిగింది.
రెడ్స్ సంస్థ పిల్లలతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
రెడ్స్ సంస్థ నుండి పాఠశాలల్లో పిల్లలతో ‘రెడ్ అలర్ట్ (RED ALERT)’ తో ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం (Safe Village Programme)’ అనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అంశంపైన పుస్తకాలు కూడా ఉన్నాయి. సురేఖ అని, రిసోర్స్ పర్సన్ ఈ ప్రోగ్రాంని చూసుకుంటున్నారు. అయితే మానవ అక్రమ రవాణా ఎక్కడ ఎక్కువగా ఉందో అలాంటి గ్రామాలను ‘హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోన్’ గ్రామాలుగా చూడడానికి, గ్రామంలో ఉన్న స్టేక్ హోల్డర్లందరితో కలిసి ‘గుడ్ ఫాదర్ ఎలా ఉండాలి, గుడ్ మదర్ ఎలా ఉండాలి, గుడ్ గర్ల్, గుడ్ బాయ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ల గురించి క్లిప్పింగ్స్ వేస ిఅన్ని గ్రామాల్లోను ప్రదర్శించాము. అలాగే నోడల్ టీచర్స్ అని చేశాముÑ గ్రామాల్లో ‘రక్షక్స్’ అని ప్రారంభించాం. రక్షక్స్ అంటే గ్రామాల్లో విజిలెన్స్ కమిటీలనిÑ ప్రభుత్వ స్త్రీ, సంక్షేమ శాఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ అవి అమల్లో లేవు. కావున మేము పది మండలాల్లో, దాదాపు 58 గ్రామాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశాం. సేఫ్ విలేజ్ ప్రోగ్రాం వల్ల ప్రివెంటివ్ యాక్టివిటీస్‌లో భాగంగా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ రక్షక్స్, గ్రామస్థాయి కమిటీలో పిల్లలు, టీచర్లు, గ్రామపెద్దలు ఉంటారు.
బాధిత స్త్రీలకు కానీ, ఒంటరి స్త్రీలకు కానీ సహకారంగా, అండగా నిలబడినప్పుడు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు?
చాలా చాలా సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ఆ మహిళల అక్రమ రవాణాపైన పని చేస్తున్నప్పుడు, ట్రాఫికర్ల నుండి ఎన్నో బెదిరింపులు, అన్ని రకాల హెచ్చరికలు వచ్చాయి. కొన్ని రాజకీయ నాయకులతో చెప్పించడం జరిగింది. కొన్ని ప్రత్యక్షంగా కూడా జరిగాయి. ఆఫీసుకి వచ్చి కంట్రిబ్యూషన్‌గా పెద్ద మొత్తం డబ్బిస్తాం, ప్రతి నెలా ఒక లక్ష రూపాయలు ఇస్తాం, మీరు బాధిత మహిళలెవరితోనూ ఎఫ్.ఐ.ఆర్ చేయించకుండా ఉండండిÑ మేం బాధిత మహిళలను మేనేజ్ చేస్తాం, లేదా ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాంÑ మీ మేడంని నిశ్శబ్దంగా ఉండమనండి అని ఆఫీసులో సిబ్బందిని బెదిరించారు. అయితే మళ్ళీ మీ మీద కేసు వేస్తామని చెప్పడం వల్ల వెళ్ళిపోయారు. అయినా ట్రాఫికర్స్ ఆగలేదు. మిత్రులు, శ్రేయోభిలాషులతో వేర్వేరు పద్ధతుల్లో నాకు చెప్పించారు జోక్యం చేసుకోవద్దని, రిస్క్ వద్దని. కానీ వాళ్ళ బెదిరింపులని నేను లెక్క చేయలేదు, వినలేదు.
వినలేదన్న కోపంతో బ్రోకర్లు మమ్మల్ని చంపాలని కదిరిలోని మా ఇంటిని తగులబెట్టారు. కానీ ఆ రోజు ఒక అంతర్జాతీయ రవాణాని ఆపడానికి పోలీసు అధికారులను కలవడానికి అనంతపురం వెళ్ళి రావడం ఆలస్యమైనందువల్ల అనంతపురంలోని ఆఫీసులో ఉండిపోవలసి వచ్చినందున, ఆ అగ్ని ప్రమాదానికి గురవ్వకుండా బయటపడగలిగాను. ఇంటికి నిప్పు పెట్టడం వల్ల ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. వెంటనే కేసు పెడితే, కదిరి పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు, తర్వాత చేశారు. కానీ కోపంతో బెదిరింపు కేసు, దొంగతనం జరిగిందని మాత్రమే ఎఫ్.ఐ.ఆర్. చేశారు. ఒక సంవత్సరం తర్వాత మానవ హక్కుల సంఘంలో అప్పుడు ఐ.ఎ.ఎస్. శర్మ, కె.ఆర్. వేణుగోపాల్ గారు ఉన్నప్పుడు ఒక మానవ హక్కుల కార్యకర్తకే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనిÑ ఇంత దాడులు జరిగితే ఆమె పెట్టిన ఎఫ్.ఐ.ఆర్.లాగా కాకుండా వేరేలాగా కేసు రాశారని అన్నారు. సంవత్సరం తర్వాత ఛార్జ్‌షీట్ మార్చి కేసు కోర్టులో ట్రయల్కి వచ్చింది. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా సహకరించలేదు. పోలీసులు సాక్ష్యాలు మార్చేసేలా బ్రోకర్లు డబ్బులిచ్చి మేనేజ్ చేశారు. నాకే ఇలా జరిగితే ఇంక వేరేవాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది?
అలాగే కురుగుంట గ్రామంలో మహిళా రైతుల ఎఫ్.పి.ఓ. ఏర్పాటు చేసుకున్న ఆఫీసుకు మొన్న ఎవరో నిప్పు పెట్టారు. చిరు ధాన్యాలు, మిషన్లు కాలిపోయాయి. వాళ్ళు తమ ఆఫీసును వేరే ప్రాంతానికి మార్చుకున్నారు.
ఎలాంటి నిరాశ, నిస్పృహలు రాలేదా?
ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఎటువంటి నిరాశకు గురవ్వలేదు. అన్నీ అలా అనుకోకూడదు. ఎవరో ఒకరు, ఏదో ఒకటి చేయాలి. నన్ను ఆపడానికి, మహిళలకు అండగా ఉండకూడదని బెదిరించడానికి నా ఇంటిని కాల్చేశారు, బెదిరించారు. ఎఫ్.పి.ఐ. ఆఫీసును కాల్చేశారు. ఒకవేళ నేను ఆపేస్తే వాళ్ళకి ఇంకా బలం వచ్చినట్లవుతుంది. అంతకన్నా బాగా బాధిత మహిళలు మన మాట వింటున్నారు, ఆలోచిస్తున్నారు, అభివృద్ది చెందుతున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటివి నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తాయి. ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట ఈ సమస్యను ఎవరో ఒకరి దృష్టికి తీసుకువెళ్తే ఏదో ఒక కోణంలో వాళ్ళు బాధ్యత తీసుకొని సహకరిస్తారని చిన్న ఆశ. అందువల్లే ఏ పార్టీ అధినేతలు వచ్చినా, సమావేశాలకు పిలిచినా అందరి సమావేశాలకు వెళ్ళి ఈ సమస్యలను వారికి వివరించడం, పరిష్కరించమని కోరడం జరిగింది. అమ్మాయిలను ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారంటే ఒక రెడ్స్, పోలీస్ వ్యవస్థ మాత్రమే కాకుండా కేంద్ర స్థాయి అధికారులు, రాజకీయ నాయకుల చర్యల వల్ల నిరోధించవచ్చు.
రెడ్స్ సంస్థ వ్యవస్థాపకురాలైన భానుజ తను చేసిన, చేస్తున్న నిరంతర కృషికి, మహిళల సాధికారతకు ఎన్నో రకాల కార్యక్రమాలను నిర్వహించడంలో ఎన్ని సమస్యలు/ఇబ్బందులు ఎదురైనా విజయం సాధించి మహిళలకు అండగా నిలబడుతున్నారు. అందుకు గాను తనకు ‘జిల్లా, రాష్ట్రీయ, జాతీయ స్థాయిలలో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించగలిగారు. ఎన్నో అవార్డు, రివార్డులను, ప్రశంసలను పొందారు.
అందులో ముఖ్యంగా…
బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘‘బెస్ట్ ఎన్.జి.ఓ ఇన్ ద డిస్ట్రిక్ట్’’ గణతంత్ర దినోత్సవం సందర్భంగా (1999, 2001, 2008, 2020).
బ ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను ‘‘ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. అవార్డు’’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ నుండి 2006లో అవార్డు పొందారు.
బ శ్రీ లక్ష్మీ సారథి సర్వీసెస్, కదిరి వారిచే 2012లో వరల్డ్ తెలుగు దినోత్సవం సందర్భంగా అవార్డు.
బ టి.వి.9 తెలుగు ఛానల్ ‘నవీన మహిళా అవార్డు’’ 2013లో పొందారు.
బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ ` 2014లో ‘‘స్త్రీలపై హింస ` మౌనాన్ని చేధించండి.’’
బ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ` 2015లో ‘‘చంద్రన్న రైతు పురస్కారాలు’’
బ ASSOCHAM లేడీస్ లీగ్ వారిచే 2015లో ‘‘ఆల్ గ్రాస్రూట్స్ ఉమెన్ ఆఫ్ ద డెకేడ్ అచీవర్స్ అవార్డు’’
బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ` 2016 లో ‘‘బెస్ట్ ఎన్.జి.ఓ’’
బ మదనపల్లి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ` 2016లో ‘‘సేవారతన్ పురస్కారం’’.
బ జనసేన పార్టీ ` 2018లో ‘‘వీరనారీమణి అవార్డు’’
బ E PURE` 2019లో ‘‘ఎక్సలెన్స్ ఇన్ ఎంపవర్మెంట్’’
బ మార్తాఫెరల్ ` 2020లో ‘‘బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’’
బ మహా న్యూస్ ` 2022లో ‘‘రైతే రాణి అవార్డ్’’ ప్రకృతి వ్యవసాయం ` సహజ వనరుల అభివృద్ధి కొరకు.
రాబోయే కాలంలో ‘రెడ్స్’ చేయబోయే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
కోవిడ్‌కి ముందు వరకు మనం పిల్లలు టీవీలు, సెల్ఫోన్లు వాడటం, చూడడం వల్ల వారు చెడిపోతారని ఇచ్చేందుకు నిరాకరించేవాళ్ళం. కోవిడ్ సమయంలో వాళ్ళకు ఆన్లైన్ క్లాసులని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ క్లాసులని చెప్పి క్లాసు కోసం పిల్లలను వదిలేయడంతో పిల్లలు వాటిని యూట్యూబ్‌లలో చూడడానికి అలవాటు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సంఘటనలు చాలా జరిగాయి. మా దగ్గరకు పిల్లలకు కౌన్సిలింగ్ కోసం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా సిబ్బంది వెళ్ళి చూస్తే పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే అసలు బ్రతకలేమనే స్థాయికి వెళ్ళారు. పిల్లలు ఒక విధంగా కోవిడ్ సమయంలో సెల్ఫోన్లకు బానిసలయ్యారు. అయితే ఇంకొకవైపు బాలకార్మికులుగా కూడా అయ్యారుÑ బాల్య వివాహాలు ఎక్కువయ్యాయి. సెల్‌ఫోన్ అడిక్షన్ నుండి పిల్లలను ఏ విధంగా బయటకు తీసుకురావాలని టెక్నికల్‌గా ఎలా చేయాలనే సమప్య ఉంది.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎఫ్.పి.ఓ.ల ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. మహిళా పారిశ్రామికవేత్తలుగా అడుగు ముందుకు వేయాలని అనుకుంటున్నాం. ఒంటరి మహిళలతోనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలని ఆలోచిస్తున్నాం.
అన్ని గ్రామాలు ఆహార భద్రత కలిగి ఉండేలా చూడాలి. ఎఫ్.పి.ఓ.ల ద్వారా మహిళలు అందరికీ ఆహార భద్రత కల్పించడం, బయో విలేజిస్ ` 0% రసాయనిక ఎరువుల రాహిత్య గ్రామాలుగా తయారు చేయడం, 100% ప్రకృతి వ్యవసాయం పెంపొందించడం ‘0’ ఆత్మహత్యల గ్రామాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ లేని, బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన చేయాలి అనేది నా కల. అలాగే మహిళలు, పిల్లలపై హింస జరగకుండా కమ్యూనిటీ నాయకులు బాధ్యత వహించే విధంగా గ్రామాలను తయారు చేయాలి అనేది నా ఆలోచన, మా సంస్థ ఉద్దేశ్యం.