నా ఊహా లోకం
ఒక అందమైన ఇల్లు. దాని చుట్టూ పచ్చని పంట పొలాలు. దగ్గరగా ఒక సరస్సు. ఆ సరస్సులో సరసాలాడే చిన్న చేపలు. ఎటువంటి కాలుష్యం లేని ఊహా లోకాన స్వచ్ఛమైన గాలి పీలుస్తూ స్వచ్ఛంగా తిరిగి నేను సూర్యాస్తమయంతో మొహం చాటే చంద్రుడు, వెన్నెలలు
వెదజల్లుతుంటే ఎటువంటి కష్టసుఖాలు లేని ఆనందదాయక జీవితాన్ని నాకు ప్రసాదించిన భగవంతుని తనివితీరా ఆరాధిస్తూ, ప్రతిక్షణం ప్రకృతిలోని అణువణువునూ ఆస్వాదిస్తూ, హద్దులు లేని విధంగా ప్రపంచాన్ని చుట్టేస్తూ, అందమైన పక్షులతో రంగురంగుల సీతాకోక చిలుకలతో జలజలా పారే జలరాశులలో పరిమితి లేని మార్గాలలో ప్రయాణిస్తూ, అరిషడ్వర్గాలకు దూరంగా నివసిస్తూ గుండెలు ఉప్పొంగే విధంగా మనసులో కలహాలు లేకుండా అద్భుతంగా, ఆనందంగా, వర్ణాత్మకంగా ఉండే నా కలల ప్రపంచంలో విహరిస్తాను. ` కె.లహరి, 10 వ తరగతి
నేను ఆశించే ప్రపంచం
కాలుష్యం లేని ప్రపంచం
పచ్చని చెట్లతో నిండిన జగం
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ప్రజలు
దేశ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించే నవ్య శాస్త్రవేత్తలు
కులవివక్ష లేని ప్రపంచం
కల్మషాలు గొడవలు లేని సరికొత్త జగత్తు
విజ్ఞానం కొరకు ఎదురుచూపు
విజ్ఞానం కొరకు నిరంతరం శ్రమ
ప్రకృతి పరిరక్షణ సూత్రంగా
చెట్లు నాటడం అనే దీక్షతో
ఈ భూమి యొక్క పునఃజన్మకు
కారణమయ్యే ప్రేమానురాగాలు కలిగిన ప్రజలు
ఇదంతా ఒక కలలానే మిగలవచ్చు
ఎందుకంటే ఇది కల కాదు నేను ఆశించే యథార్థ జీవితం.
` ఎం.సాత్విక చౌదరి, 10వ తరగతి
అల్లరి బాల్యం
భవిష్యత్తుకు పునాది బాల్యం
అల్లరితనం బాల్యం
అందమైనది బాల్యం
చిలిపితనం బాల్యం
ఎంతో చక్కనైనది బాల్యం
ఆనందాన్ని అందించేది బాల్యం
సంతోషంగా గడిపేది బాల్యం
ముద్దు మాటలతో మాట్లాడేది బాల్యం
చిన్ని చిన్ని అడుగులతో నడిచేది బాల్యం
ఆటపాటలతో కూడిరది బాల్యం
నాన్న వేళ్ళు పట్టుకుని నడిచింది బాల్యం
అమ్మ గోరుముద్దలతో మురిసింది బాల్యం
అమ్మ మాట వినకుండా తిరిగింది బాల్యం
మనకు ఇష్టమైనది బాల్యం
మరచిపోలేనిది బాల్యం
నవ్వులతో నిండిరది బాల్యం
ఎంతో సంతోషమైనది బాల్యం
` నిఖిల్ జాన్, 7వ తరగతి