ఆడశిశువుల హత్యలను నివారించే చట్టం పి.సి. పి.యన్.డి.టి.చట్టం
వైద్యశాస్త్రం మానవ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాని ఆడపిల్ల పుడితే భారమని, దురదృష్టకరమని భావించే మన సమాజంలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.
దీనిని ఆపడానికి రూపొందించిన చట్టమే గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి చేసే పరీక్షల (నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ) చట్టం. దీనినే పి.సి`పి.యన్.డి.టి. చట్టం అని కూడా అంటారు. ఇది 1994లో అమలులోనికి వచ్చింది.
కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే అబార్షన్ మొదలైన పద్ధతుల ద్వారా ఆ పిండాన్ని తొలగించడం స్త్రీల పట్ల వివక్షను చూపుతుందని, స్త్రీల ఆత్మగౌరవానికి వ్యతిరేకమని ఈ చట్టం భావిస్తుంది. అందుకే ఈ నేరానికి పాల్పడిన వైద్యులకు, పరీక్షలు జరిపిన ఇతర వైద్య సిబ్బందికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. అదే నేరాన్ని మళ్ళీ చేస్తే అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష యాభైవేల వరకు జరిమానా విధిస్తుంది. పుట్టబోయే పిల్లల లింగాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు చేసే వారిది ఎంత తీవ్రమైన నేరమో అలాగే అలాంటి పరీక్షలు జరిపించుకునే తల్లిదండ్రులు, వారి బంధువులది కూడా అంతే నేరమని ఈ చట్టం భావిస్తుంది. అందుకే వారిని కూడా ఇదే విధంగా శిక్షిస్తుంది. వైద్య వృత్తి చేస్తున్న వారు జైలు శిక్షను అనుభవించినట్లైతే వారి గుర్తింపును ప్రభుత్వం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుండి రెండు సంవత్సరాల వరకు తొలగిస్తుంది. దాని వలన వారు రెండు సంవత్సరాల పాటు వైద్య వృత్తి చేయడానికి అవకాశం ఉండదు.
మీరిది మరవకండి:
ఖీ సాధారణంగా ఈ వైద్య పరీక్షలు చేయించుకున్న స్త్రీని ఆమె భర్త బలవంతం పైనే అలా చేసిందని చట్టం భావిస్తుంది. కనుక ఈ చట్ట ప్రకారం ఆమె నేరస్థురాలు కాదు. కాని ఆ విధంగా బలవంతపెట్టిన ఆ భర్త నేరస్థుడవుతాడు.
ఖీ గర్భంలో ఉండగానే శిశువు యొక్క లింగాన్ని చెప్పే పరీక్షల గురించిన ప్రచారం చేయడం నిషేధం.
ఖీ పిండం ఎదుగుదల లేక ఆ తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయాల దృష్ట్యా పరీక్షలు జరపవలసి వస్తే ఆ విషయాలను వైద్యులు ఆమెకు అర్థమయ్యే భాషలో తెలియచేసి ఆమెనుండి రాతపూర్వక హామీని తీసుకోవాలి.
ఖీ కడుపులో పెరుగుతున్న పిండం ఆడా? మగా? అనే విషయాన్ని ఎవరూ ఆ స్త్రీకి కానీ, వారి బంధువులకు కానీ, మాటల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ చెప్పకూడదు.
ఖీ ఈ నేరాన్ని ఆపడానికి చట్టం ఒక కేంద్ర పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేసింది.
ఖీ అలాంటి వైద్య పరీక్షలు జరుపుతూ పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే చెప్పే ఆసుపత్రుల, జెనెటిక్ లాబరేటరీల మరియు క్లినిక్‌ల గుర్తింపు రద్దు చేయబడుతుంది.
ఖీ ఎవరైతే గర్భంతో ఉన్న స్త్రీ ప్రాణాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశ్యంతో కాకుండా ఆమెకు గర్భస్రావం కల్గించే ప్రయత్నం చేస్తారో వారికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా ఉంటుంది. (సెక్షన్ ఐపిసి 312)
ఖీ ఒకవేళ ఇలాంటి గర్భస్రావాలు గర్భంతో ఉన్న స్త్రీలకు ఇష్టం లేకుండా గాని సమ్మతి తీసుకోకుండా గాని చేయిస్తే అందుకు బాధ్యులైన వారు జీవితకాల శిక్ష గాని లేదా పది సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా అనుభవించవలసి వస్తుంది. (సెక్షన్ ఐపిసి 313)
ఖీ గర్భస్థ ఆడశిశువుల హత్యలను నిషేధించే లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పి.సి.`పి.ఎన్.డి.టి. యాక్ట్ 1994 అమలులోకి వచ్చిన తరువాత, ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిని శిక్షించిన దాఖలాలు లేవు. వీధికొక్క అల్ట్రాసౌండ్ మిషీన్ పెట్టి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి (ఇలా చేయడం నేరం అయినప్పటికీ) డాక్టర్లు, మెడికల్ ప్రాక్టిషనర్స్ అవినీతికి పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే లేడు.
గృహహింస నిరోధక చట్టం 2005
భారతీయ సమాజంలో కుటుంబానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాల స్థానే వ్యష్టి కుటుంబాలు లేదా న్యూక్లియర్ కుటుంబాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలలో మహిళలు ఎన్నో ఆంక్షలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వ్యక్తి స్వేచ్ఛకి అవకాశం వుండేది కాదు. స్త్రీల ఆకాంక్షలకు, ఆలోచనలకు విలువ ఉండకపోగా వారి మీద వివిధ స్థాయిల్లో హింస అమలవుతుండేది. పెళ్ళయి, పుట్టి పెరిగిన ఇంటిని వదిలిపెట్టి, అత్తింట అడుగుపెట్టిన కోడలికి ఆరళ్ళు స్వాగతం చెప్పేవి. ఇంటి గుట్టు బయట పెట్టకూడదంటూ అత్తింట, ఎన్ని బాధలు పడ్డా మౌనంగా భరించాలి తప్ప ఎవరికీ చెప్పుకోకూడదని, ఇంటి నాలుగు గోడల మధ్య జరిగేవన్నీ వ్యక్తిగతమైనవని, భార్యని దండిరచే హక్కు భర్తకున్నదని ప్రచారం చెయ్యడం సర్వసామాన్యం. ఆడపిల్ల అత్తింటికి వెళ్ళేముందు ఇలాంటి నీతుల్ని బోధించి పంపడం సంప్రదాయమైంది. అందుకే భర్త తిట్టినా, కొట్టినా, సంసారం పట్టించుకోకపోయినా భార్య మౌనంగా భరిస్తుంది. కుటుంబంలో ఎంత భయంకరమైన హింస జరిగినా, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా సరే స్త్రీలు బయటకు రాకుండా హింసను అనుభవిస్తుంటారు.
కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఎప్పటినుండో కోరుతున్నాయి. దానికోసం ఉద్యమాలు చేసారు. వీటి ఫలితంగానే మొట్టమొదటిసారి ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహ హింస నిరోధక చట్టం 2005 ని తీసుకొచ్చింది. జమ్ము కాశ్మీర్ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండిరచడం కాకుండా బాధితులకు (స్త్రీలకు) ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పడిరది.
తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబం లోని మగవారు (భర్త/బావ/మరిది/అన్నదమ్ములు/మామ/కొడుకు/అల్లుడు/తండ్రి) జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ చట్టం మహిళలకు ఎక్కడైతే రక్షణ కొరవడిరదో, తను ఎక్కడైతే హింసకు గురవుతుందో అక్కడినుంచే చట్టం సహాయంతో పోరాటం సాగించే హక్కు కల్పించింది. అంటే స్త్రీకి స్థానబలం కల్పించింది. ఇది గొప్ప వెసులుబాటు.
ఇది ఒక సివిల్ చట్టం అయినప్పటికీ పకడ్బందీ అమలుకోసం నేరన్యాయవ్యవస్థకు అమలు బాధ్యత పొందుపరచడమైంది. వైవాహిక జీవితంలో అంటే సున్నితమైన బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ పాత్ర పరిమితం చేస్తూ మెజిస్ట్రేట్ కుటుంబ పెద్దగా ఆ భర్తకు / మగవారికి సంబంధించి జరిగిన తప్పును ఎత్తిచూపి సరిదిద్దుకోమని సూచించి, భార్యా పిల్లల్ని, తల్లిని / స్త్రీని సరిగ్గా చూసుకోమని ఆజ్ఞాపించి ` అట్టి ఉత్తర్వులు అమలు పరచని పక్షంలో రక్షణ ఉత్తర్వుల ధిక్కారాన్ని మాత్రం నేరంగా పరిగణించి ` శిక్షించే అధికారం కల్పించింది ఈ చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు మరియు పిల్లలు (18 సం॥లలోపు) లబ్ధిదారులు.
కుటుంబ హింస అంటే…
ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతని వల్ల హింసకు గురవడం కుటుంబ హింస కిందికి వస్తుంది.
ఈ హింస చాలా రకాలుగా ఉంటుంది. మహిళలు రోజువారీ జీవితంలో అనేక హింసల్ని ఎదుర్కొంటూ వుంటారు. అవేమిటంటే`
శారీరక హింస ` అంటే శరీరానికి నొప్పి, హాని, గాయం చెయ్యడం, ప్రాణాలకు హాని తలపెట్టడం, కొట్టడం, తన్నడం, నెట్టడం. అనగా శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి.
లైంగిక హింస ` అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం, ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక సంబంధానికి బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు అన్నీ లైంగిక హింస కిందకి వస్తాయి.
మాటల, భావోద్రేక హింస లేదా మానసిక హింస ` అంటే అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్న బుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి ఇష్టమైన వ్యక్తుల్ని శారీరకంగా హింసి స్తానని అదేపనిగా బెదిరించడం ఇవన్నీ మానసిక హింక కిందకు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనసును నొప్పిస్తూ, క్షోభకు గురి చెయ్యడం.
ఆర్థిక హింస ` ఆర్థికమంటే డబ్బు లేదా వనరులు ` కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకివ్వకపోవడం, చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం, అంటే సాంప్రదాయంకానీ, కోర్టు ఉత్తర్వుల ద్వారా గానీ ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం, స్త్రీ ధనం దక్కకుండా చెయ్యడం, ఇంటి అద్దె చెల్లించకపోవడం, ఇంటి నుంచి గెంటివేయడం ఆమె ఆదాయాన్ని గుంజుకోవడమేకాక అదనపు కట్నం తెమ్మంటూ వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస లేదా వేధింపుల కిందకు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు/పిల్లలకు సంబంధించి ఆ కుటుంబంలో మగవారి ద్వారా జరిగే ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన అయినా కూడా గృహహింస అవుతుంది. భర్తే కాకుండా ఇతర సంబంధీకుల ద్వారా కూడా.
గృహహింస నిరోధక చట్టం కింద మహిళలకు రక్షణ చేకూర్చే సంస్థలు
కుటుంబంలో శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ లేక ఆర్థిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ చేకూర్చడానికి ఈ చట్టం చక్కని ఏర్పాట్లు చేస్తూ తత్‌సంబంధిత అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. బాధిత మహిళలకి అవసరమైన సంస్థలు, సహాయం చేసే సంస్థలూ, వ్యక్తులూ వున్నారు. వీరు రక్షణాధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు, షెల్టర్ హోమ్స్, కౌన్సిలర్‌లు, పోలీసులు. గృహహింసను అనుభవిస్తున్న స్త్రీలు ఈ సంస్థలూ, వ్యక్తుల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
రక్షణాధికారులు (పి.ఒ) : గృహహింస నిరోధక చట్టం సక్రమంగా అమలవ్వడంలో ముఖ్య పాత్ర పోషించేది రక్షణాధికారులే. బాధితులను రక్షించాల్సిన వాళ్ళు కాబట్టి రక్షణాధికారులని వీరిని పిలుస్తున్నారు.
బాధితురాలికి తప్పనిసరిగా చట్టపరమైన సహాయం గురించి ఉచిత న్యాయసేవలు, ఆర్థిక సహాయం గురించి, పిల్లల కస్టడి గురించి, ఆశ్రయం అందించే సంస్థల గురించి, వైద్యసహాయం గురించి, ఇతర సేవలను గురించి సమాచారం పొందే హక్కు ఉంది. పై సమాచారాలను బాధితురాలికి అందజేయడం పి.ఓ. ప్రధాన బాధ్యత.
రక్షణాధికారుల విధులు : ఏదైనా ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతున్నట్లు లేదా జరిగే ప్రమాదం ఉన్నట్లు బాధితురాలి నుండి గానీ మరే ఇతర వ్యక్తి నుండి గానీ నిర్దిష్టమైన సమాచారాన్ని రాత పూర్వకంగా కానీ, మాట ద్వారా కానీ అందినపుడు దానిని రక్షణాధికారి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
రాతపూర్వకంగా కాక నోటి మాటగా ఇచ్చిన సమాచారాన్ని రక్షణాధికారి తానే పేపర్‌పై రాసి సమాచారాన్ని ఇచ్చినవారి సంతకం తీసుకోవాలి. వారి వివరాలు తీసుకుని జాగ్రత్త చేయాలి.
ఒకవేళ కుటుంబ హింస జరుగుతున్నట్లు, లేదా జరగబోతున్నట్లు టెలిఫోన్ ద్వారా గానీ, యిమెయిల్ ద్వారా గానీ సమాచారం రక్షణాధికారికి అందినట్లయితే, వెంటనే పోలీసుల సహాయం తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి కుటుంబ సంఘటన నివేదిక తయారు చేసి, తగిన ఆదేశాల కోసం వెంటనే మెజిస్ట్రేటు ముందు దాఖలు చేయాలి.
ఈ సమాచార పత్రం కాపీని సమాచారం అందించిన వ్యక్తికి ఉచితంగా ఇవ్వాలి. కుటుంబ హింసకు గురైన బాధితురాలికి ఆమెకు గల హక్కుల గురించి, గృహహింస నిరోధక చట్టంలోని వెసులుబాట్ల గురించి వివరించాలి.
బాధితురాలి శరీరంపై గాయాలు, దెబ్బలు వుంటే వెంటనే ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి, ఆ పరీక్షల నివేదిక కాపీలను కుటుంబ హింస జరిగిన ప్రాంతపు పోలీసు స్టేషనుకు, మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఈ చట్టం క్రింద గుర్తించిన ఆసుపత్రుల వైద్యాధికారులతో మాట్లాడి బాధితురాలికి, ఆమె పిల్లలకు అవసరమైతే వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులకు వెళ్ళేందుకయ్యే రవాణా ఖర్చులను రక్షణాధికారులే భరించాలి.
బాధితురాలికి అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా రాష్ట్ర న్యాయసేవల సహాయ సంస్థ ద్వారా రక్షణాధికారి ఇప్పించాలి. బాధితురాలు ఆశ్రయం కోరితే ఆమెను, ఆమె పిల్లలను ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్ హోమ్‌లో ఉంచి, ఆ సమాచారాన్ని ఆ ప్రాంత పోలీసు స్టేషన్‌కు, మేజిస్ట్రేట్‌కి రక్షణాధికారి తెలియచెయ్యాలి. షెల్టర్ హోమ్‌కు వెళ్ళేందుకు రవాణా సదుపాయాన్ని కల్పించాలి.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే కుటుంబ హింస సంఘటన జరిగినట్లు సమాచారం అందిన తక్షణం రక్షణాధికారి, చట్టంలో నిర్దేశించిన విధంగా ఫారమ్ 1 లో కుటుంబ హింస సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్) ను తయారు చేసి మేజిస్ట్రేటుకు అందజెయ్యాలి. ఈ నివేదిక కాపీలను ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్‌కి, సర్వీస్ ప్రొవైడర్‌కి అందజెయ్యాలి.
ఈ చట్టం క్రింద బాధితురాలు రక్షణ ఉత్తర్వులు కోరితే, నిర్ణీత నమూనా దరఖాస్తును రక్షణాధికారి మేజిస్ట్రేట్ ముందు దాఖలు చెయ్యాలి. అంతేకాదు విధులు నిర్వర్తించడంలో మేజిస్ట్రేటుకు రక్షణాధికారి సహాయంగా వుండాలి. రక్షణాధికారి మేజిస్ట్రేటు నియంత్రణలో, పర్యవేక్షణలో వుండాలి.
మేజిస్ట్రేటు కేసు విచారణకు నిర్దేశించిన తేదీని తెలియచేస్తూ వాది, ప్రతివాదులకు మూడు రోజులు లేదా మేజిస్ట్రేటు చెప్పిన వ్యవధిలో నోటీసులు అందేలా చూడాల్సిన బాధ్యత రక్షణాధికారిదే. ఈ నోటీసులు అందచేసినట్లు ధృవీకరిస్తూ కోర్టుకు ఆధారం పంపించాలి.
కోర్టు ఎక్స్‌పార్టీ ఆదేశాలు చెయ్యదలచి, ఆదేశిస్తే, బాధితురాలు, ప్రతివాది కలిసివుండే ఇంటిని రక్షణాధికారి సందర్శించి అవసరమైన విచారణ జరపాలి. బాధితురాలికి చెందిన వస్తువులను, నగలను, కలిసివున్న ఇల్లును ఆమెకు ఇప్పించాల్సిన బాధ్యత రక్షణాధికారిదే.
మేజిస్ట్రేటు ఆదేశించిన విధంగా, బాధితురాలు తన పిల్లల కస్టడీని పొందేందుకు లేదా ప్రతివాది కస్టడిలో వున్న తన పిల్లలను కలిసేందుకు రక్షణాధికారి సహాయం చెయ్యాలి.
మేజిస్ట్రేటు జారీ చేసే అన్ని ఉత్తర్వులను నివాస హక్కు ఉత్తర్వులు, పిల్లల కస్టడీ ఉత్తర్వులు, ఆర్థిక ఉపశమనం ఉత్తర్వులు, ఎక్స్‌పార్టీ ఆదేశాలను రక్షణాధికారి అమలు చెయ్యాలి. ఈ విధంగా కుటుంబ హింస నిరోధక చట్టం అమలులో రక్షణాధికారులు ముఖ్యమైన పాత్రను కలిగివున్నారు.
జి.ఓ.ఆర్.టి. నెం. 220, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమశాఖ, తేది. 21.08.2007 ప్రకారం జిల్లా రక్షణ అధికారులకు సహాయ నిమిత్తం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు కౌన్సిలర్లు (సోషల్ వర్కరు, న్యాయవాది) ఇద్దరు మెసెంజర్లను, ప్రతి జిల్లాయందు నియమించటం జరిగింది. అలాగే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక జూనియర్ అసిస్టెంటును డైరక్టర్ ఆఫీసునందు నియమించడం జరిగింది.
మేజిస్ట్రేటు బాధ్యత
కుటుంబహింసకు గురైన బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమె తరపున రక్షణాధికారి కానీ సర్వీస్ ప్రొవైడర్లు కానీ దరఖాస్తు చెయ్యొచ్చు. బాధిత మహిళ ఈ చట్టం కింద ఒకటి లేదా అంతకంటె ఎక్కువ ఉపశమనాలు కోరుతూ మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ చట్టం అమలు ప్రారంభమౌతుంది. (సెక్షన్ 12)
గృహహింస నిరోధక చట్టం 2005 కింద మేజిస్ట్రేటు ఈ క్రింద పేర్కొన్న ఉపశమనాలను ఉత్తర్వుల రూపంలో ఇవ్వవచ్చు.
సెక్షన్ 17 కింద ప్రతివాదితో కలిసివున్న ఇంటిలో నివసించే హక్కు
సెక్షన్ 18 కింద రక్షణ ఉత్తర్వులు
సెక్షన్ 19 కింద నివాసపు ఉత్తర్వులు (వేరుగా ఉండేందుకు)
సెక్షన్ 20 కింద ఆర్థిక ఉపశమన ఉత్తర్వులు
సెక్షన్ 21 కింద ఆధీనపు ఉత్తర్వులు అంటే పిల్లల సంరక్షణ ఉత్తర్వులు
సెక్షన్ 22 కింద నష్ట పరిహారం ఉత్తర్వులు
సెక్షన్ 23 కింద బాధితురాలి పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో మెజిస్ట్రేట్ సెక్షన్ 18 Ê 22 ప్రకారం ఇచ్చే ఉత్తర్వులు ఏకపక్షంగా కూడా ఇవ్వవచ్చును.
మేజిస్ట్రేటు ముందు దాఖలు పరిచే దరఖాస్తుతో పాటు కుటుంబ సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్.) ను తప్పనిసరిగా జత చేయాలి. ఈ డి.ఐ.ఆర్. రక్షణాధికారి లేదా సర్వీస్ ప్రొవైడర్ల నుండి వచ్చి వుండాలి.
ఈ దరఖాస్తు అందిన వెంటనే బాధితురాలి పరిస్థితి బట్టి ఆమెకు ఏఏ ఉపశమనాలు అందుతాయో వివరించాల్సిన బాధ్యత మేజిస్ట్రేటుదే. కేసు విచారణ తేదీని నిర్ణయిస్తూ మేజిస్ట్రేటు నోటీసులు జారీచేసి, ప్రతివాదికి రెండు రోజుల్లో అందించ వలసిందిగా ఆదేశిస్తూ రక్షణాధికారికి ఇస్తారు. నోటీసులు ప్రతివాదికి అందాయని రక్షణాధికారి ధృవీకరించాలి. అందుకవసరమైన ఆధారాన్ని కోర్టుకు సమర్పించాలి.
కోర్టులో కేసు విచారణ జరుగుతున్న ఏ దశలోనైనా బాధితురాలిని, ప్రతివాదిని లేదా ఇద్దరిని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని మేజిస్ట్రేటు ఆదేశించవచ్చు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్ల వద్ద వుండే అర్హులైన కౌన్సిలర్‌లను కోరవచ్చు. ఈ కౌన్సిలింగ్ చేసే వ్యక్తికి ఇరుపక్షాలతో ఎలాంటి సంబంధమూ ఉండరాదు. కౌన్సిలింగ్ ప్రక్రియ తుది తీర్పు వెలువడే లోపు జరగాలి. (60 రోజులలోపు తుదితీర్పు వెలువడాలి) కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం రెండు నెలల వరకు గడువును మేజిస్ట్రేట్ ఇవ్వొచ్చు.
గృహహింస నిరోధక చట్టం సక్రమ అమలు మేజిస్ట్రేటు మీదనే ఆధారపడి వుంది. కుటుంబంలో జరుగుతున్న హింసని ఆపుచేసే ఆదేశం వెంటనే యివ్వగలిగితే బాధిత మహిళ కొంత ఉపశమనం పొందగలుగుతుంది.
ఈ చట్టం కింద చాలా రకాల సంఘటనలని/వేధింపులను కోర్టు నిలుపుదల చేసే అవకాశం ఉంది.
ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, మానసిక వేదనకు గురిచేయడం లాంటి సంఘటనలను కోర్టు నిలుపుదల చేసే అవకాశం వుంది. అంతే కాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 ప్రకారం కానీ, ఇతర చట్టాల ప్రకారం కానీ మనోవర్తి మంజూరు అయినప్పటికీ కూడా ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం మనోవర్తిని మంజూరు చేయవచ్చు.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన తరువాత బాధితులు వేరే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోరాదని చాలామంది అనుకుంటూ వుంటారు. కానీ అది సరైన ఆలోచన కాదు. ఇప్పటికే అమలులో
ఉన్న చట్టాలకి అదనంగా మేలు చేసేది ఈ చట్టం. అందువల్ల బాధిత మహిళలు ఇతర చట్టాలను కూడా
ఉపయోగించుకుని చర్యలు తీసుకుంటూ ఉపశమనాలు పొందవచ్చు. అవి సివిల్ చర్యలు కావచ్చు, క్రిమినల్ చర్యలు కావచ్చు. ముఖ్యంగా బాధితులు గృహహింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేసినప్పటికీ ఐపిసి సెక్షన్ 498 (ఏ) ప్రకారం కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది.
అంతే కాకుండా గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలని ఈ చట్టం ప్రకారం దాఖలైన దరఖాస్తుల్లోనే కాకుండా ఇతర లీగల్ ప్రొసీడిరగ్‌లలో కూడా అడగవచ్చు. (సెక్షన్ 26)
ఉదా : విడాకుల కేసుల్లో, మనోవర్తి కేసుల్లో, సెక్షన్ 498 (ఏ) ఐ.పి.సి. ప్రకారం వున్న కేసుల్లో కూడా ఈ చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న ఉపశమనాలను కోరే అవకాశముందని మర్చిపోకూడదు.
గృహహింసకు సంబంధించిన కేసులను మేజిస్ట్రేట్ 60 రోజులలో తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వాది/ప్రతివాదులకు సంఘటన జరిగిన పరిధిలోని పోలీసులకి, రక్షణాధికారికి, గృహహింస సంఘటన నివేదిక సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్‌కి ఉచితంగా అందచేయాలి.
కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష గాని, రూ. 20000 (ఇరవై వేలు) జరిమానా గాని, రెండిరటిని గాని విధించవచ్చు. మరియు రిజిస్ట్రారు (విజిలెన్సు), హైకోర్టు వారు రాష్ట్రంలోని ప్రధాన మరియు జిల్లా సెషన్సు న్యాయమూర్తులను కేవలం గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం క్రింద నమోదు అయిన కేసులను మరియు అత్యవసర కేసులను విచారించుటకు గాను, వారం/పక్షం రోజులలో ప్రత్యేకంగా ఒక రోజు మొత్తం కేటాయించవలసిందిగా సర్కులర్ ఆర్.ఒ.సి.నెం. 1246/ఇ1/2009 తేది. 27.08.2009 ను జారీ చేయడమైనది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గృహహింస సంబంధిత కేసులను విచారించుటకు ప్రత్యేకంగా 3 కోర్టులు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు`1, మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు`3, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు`4 కేటాయించినారు.
సెషన్స్ కోర్టులో అప్పీలు
గృహహింస చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టులో వెలువడిన ఉత్తర్వులపై, ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అయితే కొంతమంది ప్రతివాదులు సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోకుండా నేరుగా హైకోర్టులో రిట్ దరఖాస్తును దాఖలు చేసి, మేజిస్ట్రేటు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు లోనై, హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు.
సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకునే వీలున్నప్పటికీ హైకోర్టుకు వెళ్ళడం గురించి ఢల్లీి హైకోర్టు మాయాదేవి అనే మహిళ కేసులో ఒక మంచి పద్ధతిని ప్రవేశపెట్టింది.
ఈ కేసులో ఏం జరిగిందంటే ` మాయాదేవి అనే ఆమె నివాస ఉత్తర్వుల కోసం మేజిస్ట్రేటు కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ప్రధాన దరఖాస్తు పరిష్కారం అయ్యేవరకు ఆమెను భర్తతో కలిసివుండే భాగస్వామ్య గృహం నుండి తొలగించకూడదని మేజిస్ట్రేట్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసాడు. ప్రతివాది ఈ ఉత్తర్వులని సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులోనే సవాలు చెయ్యొచ్చు. లేదా సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయవచ్చు. ఈ రెండు చెయ్యకుండా ప్రతివాది రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టులో రిట్ వేసాడు. ఈ దరఖాస్తును విచారించిన ఢల్లీి హైకోర్టు, అప్పీలు దాఖలు చేసే విషయంలో అవలంబించాల్సిన పద్ధతులను నిర్ధారించింది.
ప్రతివాది వేసిన రిట్ పిటీషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.
‘‘మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఉపశమనాలని కోరాలంటే 30 రోజుల్లోగా సెషన్స్ కోర్టుకు అప్పీలు చేసుకోవాలని సె. 29 ప్రకారం వుంది. దాన్ని పూర్తి చేసుకోకుండా ప్రతివాది నేరుగా హైకోర్టులో సవాల్ చేసాడు. చట్టం ద్వారా ప్రత్యామ్నాయాలు వున్నప్పుడు వాటిని పూర్తిచేసుకున్న తర్వాతనే హైకోర్టుకి రావాలి తప్ప అవి పూర్తి చేసుకోకుండా హైకోర్టుకు రాకూడదు. అది సరైంది కాదు. (మాయాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్.సి.టి. ఢల్లీి మను / చ.ఈ. / 8716 / 2007)’’
బాధిత మహిళల్ని మరింత బాధించడానికి ప్రతివాదులు హైకోర్టుకి వెళతారు. ఈ తీర్పు ద్వారా ఢల్లీి హైకోర్టు ఒక మంచి పద్ధతిని అమలులో పెట్టింది. ప్రతివాది క్రింది కోర్టులో ప్రత్యామ్నాయ ఉపశమనాలని పూర్తి చేయకముందే హైకోర్టుకు వెళ్ళకుండా ఈ తీర్పు ఉపకరిస్తుంది.
గృహహింస నిరోధక చట్టం 2005 లో పోలీసుల పాత్ర ఏమిటి?
ఈ చట్టం సివిల్ చట్టం కాబట్టి దీని అమలులో పోలీసుల పాత్ర నామమాత్రమే. అయితే బాధిత మహిళ ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వస్తే, సెక్షన్ 5 ప్రకారం డి.వి. చట్టం ద్వారా ఆమెకు దొరికే ఉపశమనాల గురించి పోలీసులు ఆమెకు వివరించాలి.
సర్వీస్ ప్రొవైడర్లు ఆమెకు సేవలందిస్తారని, లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందుతుందని, అది ఆమె హక్కని వివరించాలి. గృహహింస చట్టం క్రింద దొరికే ఉపశమనాలే కాక 498 (ఏ) కింద కూడా కేసుపెట్టొచ్చని బాధితురాలికి వివరించాలి. కుటుంబ హింస సంఘటన జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళే రక్షణాధికారి కోరితే వారితోపాటు పోలీసులూ వెళ్ళాలి. నిందితులు ఏవైనా ఆయుధాలు ఉపయోగిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలి.
ముఖ్యంగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులని ప్రతివాది అమలు పరచకపోయినా, ఉల్లంఘించినా అది నేరమవుతుంది. ఈ అంశాన్ని బాధితురాలు కోర్టు దృష్టికి గానీ, పోలీసుల దృష్టికి గానీ తేవాల్సి వుంటుంది.
మేజిస్ట్రేట్ జారీచేసే అన్ని ఆదేశాలను ముఖ్యంగా నివాసపు హక్కు రక్షణ హక్కులను అమలు చేయడంలో బాధితురాలికి సహాయం చేయాలని కోర్టు ఆదేశిస్తే పోలీసులు తప్పకుండా సహకరించాలి.
ఈ చట్టంలోని సెక్షన్ 19 (5), 19 (7) ప్రకారం బాధితురాలి ఇంటి నుండి ప్రతివాదిని ఖాళీ చేయించడంలోనూ, బాధితురాలి ఇంటి వాటాకి ప్రతివాదిగాని, అతని తరపునవారు గాని ప్రవేశించకుండా కోర్టు ఆదేశించినా, కలిసివున్న ఇంటిని (షేర్డ్‌హౌస్) ను అమ్మివేయకుండా ఆదేశాలు జారీ అయినా, వీటిని అమలు చేయడంలో పోలీసులు సహకరించాలి.
నేరము ` శిక్ష : సెక్షన్ 31 కింద విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఇచ్చిన రక్షణ ఉత్తర్వును గాని, ఇతర ఉత్తర్వులను గాని ప్రతివాది అమలు పరచనట్లయితే అట్టి ప్రతివాదికి నేరం చేసినట్లుగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 20,000/` జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చును. ఇట్టి విచారణ నిమిత్తం బాధితురాలు (పిటిషనర్) ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేసి చార్జ్‌షీట్ చేయాలి. లేదా బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్‌కు రక్షణ ఉత్తర్వులు అమలు కాలేదని ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు సంబంధించి బాధితురాలి (పిటిషనర్) సాక్ష్యం ఒక్కటి మాత్రమే చాలు అని చట్టం చెబుతుంది. (సెక్షన్ 32 (2))
జి.ఓ. యం.యస్. నెం. 28, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, తేది. 4.7.03 ద్వారా వరకట్న మరణం పొందిన బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయ సంబంధిత పోరాట ఖర్చుల కొరకు రూ.25,000లు మంజూరు చేయుటకు అవకాశం కల్పించబడినది. ఒకవేళ వరకట్న చావు బాధితురాలికి ఆడపిల్ల ఉన్నచో రూ. 25000/`లు ఆ బాలిక పేరు మీద బ్యాంకులో జమ చేసి, ఆ బాలికకు 20 సం॥ల వయస్సు వచ్చిన తరువాత, తీసుకొనుటకు అవకాశం కల్పించబడినది.
ముగింపు : మన దేశ న్యాయ చరిత్రలోనే మొట్టమొదటి సారి కుటుంబ హింసంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా, ఎంత తీవ్రంగా వుంటుందో నిర్వచిస్తూ, అలాంటి నిత్యహింసల కొలుముల్లో కాలుతున్న మహిళల రక్షణ కోసం తయారుచేయబడిన చట్టం, గృహహింస నిరోధక చట్టం 2005, బాధిత మహిళలను రక్షించడానికి చక్కటి ఏర్పాటును కల్పించిన చట్టం. రక్షణాధికారి, సర్వీస్ ప్రొవైడర్‌లు, వసతి గృహాలు, కోర్టులు, పోలీసులు ` ఈ వ్యవస్థలన్నీ బాధిత మహిళకి అండగా, ఆదుకునే విధంగా వుండాలన్నది చట్టం ముఖ్యోద్దేశ్యం. జండర్ స్పృహతో పనిచేసే సంస్థలు ముఖ్య భూమిక పోషించడం వల్ల జండర్ సెన్సిటివిటీతో తయారైన అద్భుతమైన చట్టం.
అయితే ఇంత మంచి చట్టం అమలులోకి వచ్చి పదేళ్ళు దాటిపోతున్నా దీని అమలు తీరు అనుకున్నంత ఆశాజనకంగా లేదని ప్రతి సంవత్సరం విడుదలయ్యే స్త్రీల మీద నేరాల చిట్టా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నివేదిక స్పష్టం చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రక్షణాధికారుల నియామకం కూడా జరగలేదు.
కొన్ని రాష్ట్రాల్లో సర్వీస్ ప్రొవైడర్లు లేరు. కోర్టులు 60 రోజుల్లో తీర్పులివ్వడం లేదు. ఇచ్చిన కాసిన్ని తీర్పుల్లో హైకోర్టులు స్టేలు ఇవ్వడమో, కొట్టి వేయడమో జరుగుతోంది. రక్షణాధికారుల చుట్టూ లాయర్లు చేరి బాధిత మహిళల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు.
‘‘జండర్ స్పృహ’’ తో తయారైన ఓ అపురూప చట్టాన్ని ‘‘జండర్ సెన్సిటివిటీ’’ లేని వ్యవస్థలు, సంస్థలు హింసలో మగ్గుతున్న మహిళలకు అక్కరకు రాకుండా చేస్తున్నారని చెప్పడానికి ఇటీవల విడుదలైన జాతీయ నేరాల నివేదిక ఒక నిదర్శనం.
రాజకీయ నాయకులకు, పరిపాలనా వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు, మీడియాకు, పోలీసులకు, జండర్ సెన్సిటివిటి లోపించడం వల్లే కుటుంబ హింస బాధిత స్త్రీల కష్టాలు, కడగండ్లు వారికి అర్థమవ్వని పరిస్థితి వుంది.
ఈ పరిస్థితి మారాలి. కుటుంబ హింస ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభుత్వ నిర్వచనాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ అంశం వారి వారి ప్రధాన అజెండాలోకి రావాలి. అందరూ ఈ విషయమై మాట్లాడాలి. అప్పుడే ఈ చట్టం పకడ్బందీగా అమలవుతుంది. మహిళలపై కుటుంబ హింస నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశిద్దాం.
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ` 2013
ఈ చట్ట ప్రకారం ‘ఉద్యోగి’ అనే పదం ఒక పని ప్రదేశంలో శాశ్వతంగా గానీ, తాత్కాలికంగా కానీ, దినసరి కూలీగా కానీ, ఎలా పని చేస్తున్నా అందరికీ వర్తిస్తుంది. అలా పనిచేసే స్త్రీ ఆ సంస్థచే నియమించబడకుండా ఎవరైనా ఏజెంటు, కంట్రాక్టరు వంటివారిచేత నియమించబడ్డా కూడా ‘ఉద్యోగి’ క్రిందకే వస్తారు. సహ ఉద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగి, ప్రొబేషనరు, ట్రయినీ, అప్రెంటీసు వంటి పేర్లతో ఎలా పిలిచినా వారంతా ఉద్యోగుల కిందకే వస్తారు.
‘యజమాని’ (ఎంప్లాయర్) అంటే ఏ ప్రభుత్వ శాఖ కానీ, ప్రభుత్వరంగ సంస్థ కానీ, స్థానిక ప్రభుత్వానికి సంబంధించి కానీ, సహకార సంస్థ కానీ, విద్యాసంస్థ కానీ, పరిశ్రమకు సంబంధించి కానీ, వాటి ముఖ్య కార్యాలయం కానీ, ఏ బ్రాంచి అయినా లేదా ఏ పని ప్రదేశమయినా అక్కడి ముఖ్య అధికారి, మేనేజిమెంటు, బోర్డు వంటివి అన్నీ దీనికిందికి వస్తాయి. ఏ పని ప్రదేశంలో పనిచేసేవారయినా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
అసంఘటిత రంగ పనిప్రదేశం అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నడిపే సంస్థ, వస్తువుల తయారీ, అమ్మకం వంటి ఏరకమయిన సేవలందించే వాటితో సంబంధమున్నదైనా, పదిమంది కంటే తక్కువ పనివారున్న సంస్థ కూడా ఈ చట్టం కిందికి వస్తుంది.
ఇతర పరిస్థితులతో బాటుగా క్రింది విధంగా లైంగికపరమైన ఉద్దేశ్యంతో ఏం జరిగినా అది కూడా లైంగికవేధింపు క్రిందికి వస్తుంది. (అ) తన పనిలో ప్రాధాన్యత కల్పించేటట్లు చేస్తానని భ్రమ పెట్టడం (ఆ) తన పనిలో తక్కువ స్థాయి పని కల్పించేటట్లు బెదిరింపుగా వ్యక్తీకరించటం (ఇ) ఉద్యోగిని ఉద్యోగం యొక్క ప్రస్తుత లేదా వర్తమానస్థాయిపై ప్రభావం చూపటం (ఈ) ఉద్యోగిని చేసే పనిలో జోక్యం చేసుకొని సాన్నిహిత్యం నెరపటం లేదా పనిపై వేధించటం, తదితరాలు (ఉ) ఆమె ఆరోగ్యం, రక్షణలపై ప్రభావం చూపేట్లుగా బాధలకు గురిచేయటం వంటివన్నీ పని ప్రదేశంలో వేధింపుల క్రిందకే వస్తాయి.
ఈ చట్టం ప్రకారం ప్రతి యజమాని రాతపూర్వక ఉత్తర్వులతో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటి’ పేరుతో లైంగిక వేధింపుల నిరోధానికి పని ప్రదేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక సంస్థ కార్యాలయం, పరిశ్రమ వంటివి అనేక ప్రదేశాలలో హెడ్ ఆఫీసు, బ్రాంచి యూనిట్ వంటివి వేరువేరు చోట్ల ఏర్పాటు చేసిన పక్షంలో ప్రతిచోటా ఈ కమిటీని ఏర్పాటు చేయాలి.
ప్రతి కమిటీలోనూ ప్రిసైడిరగ్ అధికారిగా అక్కడ పనిచేసే స్త్రీని నియమించాలి. ఒకవేళ ఆ యూనిట్‌లో ప్రిసైడిరగ్ అధికారిగా నియమించదగ్గ మహిళ లేని పక్షంలో అదే సంస్థకు చెందిన ఇతర యూనిట్‌లో ఉన్న మహిళను నియమించవచ్చు. ఒకవేళ ఇతర యూనిట్లలో కూడా అందుకు అర్హమైన మహిళ దొరకని పక్షంలో దగ్గరలోని ఇతర ఉద్యోగినిని/కార్మికురాలిని నియమించాలి. ఈ ప్రిసైడిరగ్ అధికారితోబాటు అక్కడి ఉద్యోగులలో స్త్రీల సమస్యలపట్ల అంకితభావం ఉన్న లేదా సమాజ సేవారంగ అనుభవం ఉన్న లేదా న్యాయశాస్త్రం తెలిసిన స్త్రీలను ఇద్దరిని కమిటి సభ్యులుగా నియమించాలి. ప్రభుత్వేతర రంగ సంస్థలనుంచి లేదా మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఒకరిని నియమించాలి. వీరికి నిర్దేశించిన ఫీజు, అలవెన్సులు చెల్లించాలి. ఈ కమిటీలలో కనీసం సగం మంది స్త్రీలే సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీ మూడు సంవత్సరాలకు మించని కాలానికి పనిచేస్తుంది. తర్వాత కొత్త కమిటీని ఎన్నుకుంటారు. ఈ సభ్యులు ఎవరూ ఏవిధమైన నేరారోపణలు ఎదుర్కొన్నవారై ఉండకూడదు. ఒకవేళ అనంతరకాలంలో వారు ఈ రకమైన నేరారోపణలు ఎదుర్కొన్న పక్షంలో వారిని తీసివేసి కొత్తవారిని ఎంపిక చేసుకోవాలి.
ఒకవేళ పదిమంది కంటే తక్కువ పనిచేసేవారున్న చోటయితే, అటువంటివాటికి జిల్లాస్థాయిలోని అధికారి ఆధ్వర్యంలో ‘స్థానిక ఫిర్యాదుల కమిటీ’ ఏర్పాటవుతుంది. జిల్లాస్థాయి అధికారి ప్రతి మండలం, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ కమిటి బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు పనిప్రదేశాలలో స్త్రీలపై జరిగే వేధింపులను గురించిన ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఏడురోజులలోగా విచారణకై ‘స్థానిక ఫిర్యాదుల కమిటీ’కి అందేట్లు చూడాలి. ఈ స్థానిక కంప్లయింట్ కమిటీకి స్త్రీల సమస్యల పట్ల అంకితభావమున్న, సామాజిక సేవారంగంలో నిష్ణాతురాలైన స్త్రీని, చైర్‌పర్సన్‌గా నియమించాలి. ఆమెతోబాటుగా ఆ జిల్లాలోని సదరు మండలం, మున్సిపాలిటి వంటి వాటిచోట్ల పనిచేస్తుండే స్త్రీని ఒకరిని, మహిళలకోసం పనిచేసే ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధి ఒకరిని, లైంగిక వేధింపుల సమస్యలపై పనిచేసేవారుగా పేరొందిన మరొకరిని సభ్యులుగా నియమించాలి. వీరిలో ఒకరైనా ఎస్.సి/ఎస్.టి లేదా బిసి/మైనారిటీకి సంబంధించిన వారు, ఒకరయినా న్యాయవాది లేదా న్యాయవిజ్ఞానం కలిగిన వారు ఉండాలి. ఇందుకు సంబంధించిన విషయాలు చూసే సాంఘిక సంక్షేమ శాఖకు గానీ, స్త్రీ శిశు సంక్షేమశాఖకుగానీ చెందిన ప్రభుత్వ అధికారి ఈ కమిటీకి ‘ఎక్స్ అఫీషియో’ సభ్యులుగా ఉంటారు.
ఫిర్యాదు : పనిప్రదేశంలో లైంగిక హింస/ వేధింపుకు గురి అయిన మహిళ, ఆ విషయాన్ని తను పనిచేస్తుండే విభాగంలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి, ఒకవేళ అక్కడ ఫిర్యాదుల కమిటీ లేనట్లయితే స్థానిక ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును వేధింపు సంఘటన జరిగిన మూడు నెలలలోగా ఇవ్వాలి. ఈ లైంగిక వేధింపు వరుసగా కొంతకాలం నుంచీ జరుగుతున్న నేపథ్యంలో చివరి సంఘటన జరిగిన నాటినుంచి మూడు నెలలలోగా ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేని పరిస్థితులలో ఉంటే అందుకు సంబంధించిన ఫిర్యాదుల కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేసి, మౌఖిక ఫిర్యాదు నమోదు చేసుకునేట్లు చూడాలి. ఫిర్యాదు చేయాల్సిన మహిళ చనిపోవటం, మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినటం వంటి సందర్భాలలో, ఆమెకు గల వారసులుగానీ, నిర్దేశించిన మరోవ్యక్తిగానీ ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదును అందుకున్న తరువాత సంబంధిత ఫిర్యాదుల కమిటీ బాధితురాలిని, బాధ్యుడినీ పిలిచి సంప్రదింపులు జరుపవచ్చు. ఈ సంప్రదింపుల ఫలితంగా బాధితురాలికి పరిహారంగా డబ్బు ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. ఒకవేళ ఇలా (డబ్బుతో కాకుండా) సెటిల్‌మెంట్ చేసుకున్న సందర్భాలలో ఆ విషయాలన్నిటిని నమోదు చేసుకుని బాధ్యుడికి, బాధితురాలికి ఆ పత్రాలు అందజేయాలి. ఈ సెటిల్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునేందుకు సంస్థ యజమానికి, అధికారికి, జిల్లా అధికారికి కూడా సదరు పత్రాలను పంపాలి.
ఈ ఫిర్యాదును స్వీకరించిన తరువాత, వారికి వర్తించే సర్వీస్‌రూల్స్‌కు అనుగుణంగా విచారణ చేయడానికి సంబంధిత అధికారికి అందజేయాలి. ఒకవేళ అటువంటి సర్వీస్‌రూల్స్ లేని పక్షంలో ఈ విషయమై కేసు నమోదు చేసుకునేందుకు ఏడు రోజులలోగా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపే బాధ్యతను ఫిర్యాదుల కమిటీ నిర్వర్తించాలి.
ఈ ఫిర్యాదు అంది, పరిశీలనలో ఉన్న సమయంలో ఫిర్యాదుల కమిటీ ఫిర్యాదు చేసిన మహిళను కానీ, బాధ్యుడిని కానీ వేరే పనిప్రదేశానికి బదిలీ చేయమని యజమానిని కోరవచ్చు. లేదా సదరు మహిళకు మూడు నెలల ప్రత్యేక సెలవు మంజూరీకి, లేదా బాధిత మహిళకు ఊరట కల్గించే ఇతర చర్యలకు కానీ శిఫార్సు చేయవచ్చు.
ఫిర్యాదుల కమిటీ తన విచారణను పూర్తి చేసుకున్న తరువాత ఒకవేళ నేరారోపణకు గురయిన వ్యక్తి వల్ల దోషం లేనట్లు తేలితే, అతనిపై ఏ చర్య తీసుకోరాదని యజమానికి గానీ, జిల్లా అధికారికి గానీ తెలియజేయవచ్చు.
విచారణలో నిందితుడు దోషిగా తేలిన పక్షంలో విచారణ కమిటీ సదరు యజమానికిగానీ, జిల్లా అధికారికిగానీ తగు చర్యలకై సిఫార్సు చేయవచ్చు. ఆ చర్యలు క్రింది విధంగా ఉంటాయి.
అ) ప్రవర్తనా నియమావళి (సర్వీస్‌రూల్స్) వర్తించే సందర్భంలో, దుష్ప్రవర్తనకు గానూ సూచించిన శిక్షను, సర్వీస్‌రూల్స్ లేని సందర్భంలో అందుకు వర్తించే శిక్షనూ
ఆ) బాధిత మహిళకు ఊరట నిచ్చేందుకు సర్వీస్‌రూల్స్‌లో ఏంచెప్పారనే దానికి సంబంధం లేకుండా, బాధ్యుడి జీతభత్యాలనుంచీ చెప్పినంత మొత్తాన్ని తగ్గించి, ఆ సొమ్మును బాధిత మహిళకుగాని, ఆమె వారసులకుగానీ చెల్లించటం. ఒకవేళ సదరు దోషి ఉద్యోగం ఎగ్గొట్టి తిరగటం వంటి సందర్భాలలో యజమాని/అధికారి అతని జీతంనుంచీ చెల్లించటం కుదరని పరిస్థితుల్లో దోషినే చెల్లించాలని ఆదేశించాలి. అతని నుంచి సొమ్ము రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తుల జప్తువంటి చర్యలకై సంబంధిత జిల్లా అధికారికి పంపాలి. ఆ అధికారి ఉత్తర్వులు అందిన 60 రోజులలోగా తగిన చర్యలు తీసుకోవాలి.
దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుదారు అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం వంటి వాటికి శిక్ష విధించటం జరుగుతుంది. అయితే సరైన విధంగా దీన్ని నిర్ధారించుకోవాలి. అంతేకాని ఫిర్యాదుదారు రుజువులు చూపించుకోవటానికి కుదరలేదని భావించినపుడు ఫిర్యాదు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.
నేరం రుజువైన పక్షంలో బాధితురాలికి జరిగిన మానసిక, శారీరక నష్టాలు, విధుల గైర్హాజరీ, ఉద్యోగానికి జరిగే నష్టం, వైద్య ఖర్చుల వంటి వాటితో బాటు నిందితుడి ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పరిహారం నిర్ణయించాలి. ఈ పరిహారం ఒకేసారికానీ, వాయిదా పద్ధతులలో కానీ చెల్లించే వెసులుబాటు ఉంది.
సమాచార హక్కు చట్టంలో ఏముందనే దానితో సంబంధం లేకుండా బాధిత మహిళకు సంబంధించి ఆమెను గుర్తించే విధంగా వివరాలు ఏవీ పత్రికలు, టీవీలతో సహా ఎవరూ బయటపెట్టకూడదు. ఒకవేళ ఎవరయినా బయటపెడితే వారు జైలు శిక్షకు గురౌతారు.
ఈ చట్టంలో కార్యాలయం లేదా పని ప్రదేశంలో తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు.
పని ప్రదేశంలో భద్రతకు, రక్షణకు బయటినుంచి వివిధ పనుల కోసం వారివద్దకు వచ్చే వారినుంచీ భద్రత కల్గించే ఏర్పాట్లు ఉండాలి.
పని ప్రదేశంలో లైంగిక వేధింపులు శిక్షార్హమనే ప్రకటనతో బాటు ఫిర్యాదుల కమిటీ ఉత్తర్వులను తెలియజేస్తూ నోటీసు బోర్డులో ఉంచాలి.
నిర్ణీత సమయాల్లో అవగాహన సదస్సులు, ఫిర్యాదుల కమిటీకి అధ్యయన, శిక్షణా తరగతులు నిర్వహించాలి.
ఫిర్యాదుల కమిటీకి అన్ని సందర్భాలలోనూ అవసరమైన అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు చేయాలి.
ఈ కమిటీ ముందుకు నిందితుడిని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
అవసరమైన సమాచారాన్నంతా ఈ ఫిర్యాదుల విచారణ కమిటీకి కోరినప్పుడల్లా ఇవ్వాలి.
సర్వీస్ రూల్స్‌లో లైంగిక వేధింపులను దుష్ప్రవర్తనగా చేర్చాలి.
నేర సంబంధ న్యాయ (సవరణ) చట్టం ` 2013 (నిర్భయ చట్టం ` 2013)
ఈ చట్టాన్నే నేర సంబంధ న్యాయ (సవరణ) చట్టం`2013 గా వ్యవహరిస్తారు. భారతీయ శిక్షాస్మృతి, నేరశిక్షా విధానం, 1973, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 చట్టాలకు మార్పుచేర్పులతో, మహిళలపై జరిగే లైంగికదాడులను సమగ్రంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ సవరణ చట్టం చేయడమైంది. కొన్ని కొత్త సెక్షన్‌లు చేర్చటం ద్వారా కొత్తగా వస్తున్న నేర పోకడలను సమర్థవంతంగా ఎదుర్కొని, నిందితులకు మరింత కఠిన శిక్షను విధించడం జరిగింది. ఢల్లీిలో ‘నిర్భయ’ కేసులో విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టే చర్యలు సూచించేందుకై జస్టిస్ వర్మ నేతృత్వంలో ఒక కమీషన్ నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు.
ఈ చట్టం ప్రకారం మహిళపై ఏసిడ్ దాడి జరిగిన పక్షంలోనూ లేదా మహిళపై శారీరకంగా గాయపర్చడం వల్ల మహిళ తీవ్ర గాయాలకు లోనైన పక్షంలో పదేళ్ళకు తగ్గని జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఏసిడ్ దాడి జరిపినా, జరిపే ప్రయత్నం చేసినా ఐదేళ్ళకు తగ్గని జైలు శిక్షతోబాటు జరిమానా విధిస్తారు.
లైంగిక ఉద్దేశ్యంతో మహిళ శరీరాన్ని తాకడం, సైగలు చేయటం, లైంగికపరంగా ఒప్పుకోమని లేదా ఇతరత్రా అశ్లీల సంభాషణలు, మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా బూతుబొమ్మలు, అశ్లీల చిత్రాల ప్రదర్శన వంటివి చేసినవారికి మూడేళ్ళ వరకూ కారాగార శిక్షతోబాటు జరిమానా విధించే వీలుంది. స్త్రీలు నగ్నంగా స్నానం చేయటం లేదా ఇతర పనుల్లో ఉన్నప్పుడు రహస్యంగా చూడడం, చిత్రీకరించడం వంటివి చేస్తే మూడేళ్ళకు పైన ఏడేళ్ళ వరకు జైలుతోబాటు జరిమానాతో కూడిన శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ బాధితురాలి అంగీకారంతో నగ్నచిత్రీకరణ జరిపినా నేరమౌతుంది. మహిళ అభిమతానికి విరుద్ధంగా సదరు స్త్రీ యోని, మల, మూత్ర విసర్జన భాగాలలో ఎక్కడయినా ఏ వస్తువు జొప్పించినా, అందుకు బలవంతం చేసినా, ఎవరితోనైనా ఆవిధంగా చేయమని ఒత్తిడి చేసినా అత్యాచార నేరం క్రింద శిక్ష విధించటమౌతుంది. ఆ మహిళకు సంబంధించిన వారిని ఎవరినయినా చంపుతామనికానీ, గాయపరుస్తామనికానీ స్త్రీని భయపెట్టి లొంగదీసుకున్నా, పరాయి మహిళను భర్తకు తెలియకుండా లొంగదీసుకున్నా లేదా ఆ స్త్రీ సరైన మానసిక స్థితిలో లేనపుడు లేదా మద్యం మత్తు లేదా హానికర పదార్థం వినియోగించిన స్థితిలో ఉన్నా, అంగీకారం సక్రమంగా తెలుపలేని పరిస్థితులలోనూ, అంగీకారం ఉన్నా 18 సం॥లోపు బాలికతో పైపేరాలో వివరించినట్టు ప్రవర్తించినా అత్యాచారం క్రింద శిక్ష విధిస్తారు. ఇందుకు ఏడేళ్ళకు తగ్గకుండా జైలు శిక్షతోబాటు జరిమానా కూడా విధిస్తారు.
ఇదే నేరాన్ని పోలీస్‌స్టేషన్‌లో కానీ, మరెక్కడయినా చేసిన పోలీసు అధికారికి, సైన్యంలో పనిచేసే వారికి, రిమాండ్ హోం, బాలల హోం వంటి చోట్ల పనిచేసేవారికి, ఆస్పత్రి సిబ్బందికి, మతకలహాల సమయంలో అత్యాచారం చేసినవారికి, గర్భిణులు, 16 సం॥ల లోపు పిల్లలను అత్యాచారం చేసినవారికి, తన ఆధీనంలోని మహిళపై అత్యాచారం జరిపినవారికి, మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే స్త్రీపై అత్యాచారం చేసినవారికి, అత్యాచారాన్ని మళ్ళీ మళ్ళీ కొనసాగించిన వారికి మరింత కఠిన శిక్షను నిర్దేశించటమయింది. పదేళ్ళకు తగ్గకుండా జైలుగానీ, జీవితఖైదుతోబాటు జరిమానా గానీ విధించవచ్చు. ఈ సందర్భంగా మహిళ మరణించినా, కోమాలోకి వెళ్ళినా నేరస్తునికి 20 సం॥లకు తగ్గకుండా ఆమరణ ఖైదు విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం భార్యతో కోర్టు డిక్రీద్వారా కానీ, మరేవిధంగా కానీ విడిగా ఉంటున్న సమయంలో భార్యతో సంభోగం జరిపితే రెండేళ్ళకు తక్కువ కాని జైలు జరిమానా విధించవచ్చు.
ఒక మహిళను ఒకరు లేదా అంతకు మించిన వ్యక్తులు సామూహికంగా / ఉమ్మడిగా అత్యాచారం చేస్తే ఆ చర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ నేరంలో వ్యక్తిగతంగా పాల్గొన్నట్లు భావించి విడివిడిగా ఒక్కొక్కరికీ జీవితఖైదు విధించవచ్చు.
ఏ వ్యక్తి అయినా మానసిక, శారీరక వైకల్యంతో ఉన్నట్లయితే ఆ వ్యక్తి గుర్తింపును వీడియో తీయాలి.
నేరారోపణ చేసిన స్త్రీ రక్షణకు సరయిన చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానం ఆదేశించాలి.
నేరవిచారణను ఛార్జిషీటు నమోదయిన రెండు నెలల్లో పూర్తి చేయాలి. బాధితురాలికి ప్రయివేటు వైద్యశాలలతో సహా ప్రభుత్వ వైద్యశాలలన్నిటిలో ప్రథమ చికిత్సతో బాటు అన్ని వైద్యసేవలు అందించటమే కాకుండా, తక్షణం ఆ నేర సమాచారాన్ని పోలీసులకు అందించాలి.
బాధితురాలికి నిందితుడి నుంచి రాబట్టే అపరాధ రుసుముతో బాటు రాష్ట్రప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించాలి.
ఐతే చట్టాల అమలు ఆచరణలో ఎంత ఘోరంగా విఫలం అవుతోందీ మనకు ప్రత్యక్షంగా కనబడుతూనే వుంది. కాశ్మీర్ లోయలో, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా దళాల అమానుష చర్యలను ఎంతగా నొక్కిపట్టినా, స్త్రీల హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటంతో ఆ దురంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా మాన్యం అడవులలో పోలీసులు గిరిజన మహిళలను సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో బాధితుల వేదన అరణ్య రోదనగానే మిగిలింది. విదేశీ కంపెనీల తరఫున ఇక్కడి ప్రజాప్రభుత్వమే బాక్సైట్ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు పోలీసుల ద్వారా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, నిర్వాసితులను చేసేందుకే ఇలా జరిపించారని మీడియా సైతం గోలపెట్టినా బాధ్యులపై చర్యలు లేవు. చట్టాలపై ప్రజలలో అవగాహన పెరిగి, తమ హక్కులకై ఎలుగెత్తి నినదించే కార్యకర్తల చైతన్యం పెరగనిదే ఇలాంటి అమానుషాలకు అడ్డుతగలడం సాధ్యం కాదు.
లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం ` 2012 (ూూజూ)
భారత రాజ్యాంగంలోని 39వ అధికరణంలో ఇతర విషయాలతోబాటుగా సంతోషంగా గడపాల్సిన బాల్యాన్ని బాధామయం కాకుండా చూసి, పెరుగుతున్న వయసులో వారికి అన్నిరకాల దోపిడీలనుంచి రక్షణ కల్పించి, వారి స్వేచ్ఛకూ, వ్యక్తిగత గౌరవానికి భంగం కాకుండా ఉండే విధాన నిర్ణయాన్ని అవలంబించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఐక్యరాజ్యసమితి 1992 డిశెంబరు 11న పిల్లల హక్కులపై జరిపిన తీర్మానంలో (అ) పిల్లలను లైంగికపరంగా చట్టవిరుద్ధ చర్యలకు పురికొల్పటం, బలవంతం చేయటం (ఆ) పిల్లలను వ్యభిచార వృత్తిలోకి దించి దోపిడి చేయటం, ఇతర చట్ట వ్యతిరేక లైంగిక చర్యలకు ఉపయోగించుకోవడం (ఇ) పిల్లలను కామపరంగా నగ్నంగా ఉపయోగించటం, చిత్రాలు తీయటం వంటి వాటిని పటిష్టంగా నిరోధించాలని తీర్మానించింది. అందులో భారత ప్రభుత్వం పాల్గొని అంగీకరించింది. అందుకు అనుగుణంగా పిల్లలకోసం ప్రత్యేక చట్టం తెచ్చారు.
ముఖ్యాంశాలు :
అ) ఈ చట్టం బిడ్డలందరకూ వర్తిస్తుంది. బిడ్డ అంటే 18 సం॥లలోపు వయస్సు ఉన్న బాలుడు లేదా బాలిక అని అర్థం.
ఆ) ఈ చట్టంలో బిడ్డ ఏదేని శరీరభాగంలోకి ఏదేని అవయవం లేదా వస్తువు ఏమేరకు చొప్పించి దాడిచేసినా తీవ్ర శిక్ష విధించవచ్చు. ఒకవేళ ఈ చర్యను పోలీసు, మిలటరీ, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది జరిపితే శిక్ష తీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది.
ఇ) బిడ్డ శరీరాన్ని ఏరకంగా అశ్లీల దృష్టితో తాకినా అది లైంగికదాడి అవుతుంది. ఒకవేళ బిడ్డపై ఏరకంగా జరిగిన లైంగిక దాడి అయినా ఒకరికంటే ఎక్కువమంది జరిపినట్లయితే ఆ గుంపులోని ప్రతి ఒక్కరూ విడివిడిగా, ఒకరే లైంగిక దాడి జరిపినట్లుగా భావించి శిక్షించాల్సి వస్తుంది.
ఈ) బిడ్డ చూసేలా సైగలు చేయడం, శబ్దాలు చేయడం, ఏదైనా వస్తువును లేదా శరీర అంగాన్ని లైంగిక ఉద్దేశ్యంతో బిడ్డకు కనబడేటట్లు ప్రదర్శించడం, ఆ సైగలు, అంగాల్ని బిడ్డ చూసినా వేధింపు క్రింద నేరస్తులౌతారు. కామప్రేరితమైన వస్తువులు, బొమ్మలు, చిత్రాలు చూపినా, వెంటబడి తిరగడం ద్వారా లేదా ఫోన్, మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వేధించినా లైంగికనేరం క్రింద మూడేళ్ళవరకూ జైలు శిక్ష పడుతుంది.
ఉ) బిడ్డపై ఏ రకమైన లైంగికనేరం జరిగేందుకు అయినా, ఏవిధంగా ప్రోత్సహించినా, నేరానికి ప్రయత్నించినా ఈ చట్ట ప్రకారం నేరం. ప్రోత్సాహం చేయటం ఏరకంగా ఉన్నా శిక్షార్హమైన నేరమే.
నేరం జరిగినట్లు తెలిసినా, జరుగవచ్చుననే భయంవున్నా, ప్రత్యేక బాలపోలీసు (జువైనల్) విభాగానికి గానీ, స్థానిక పోలీసులకు కానీ తెలియజేయాలి. రిపోర్టు నమోదు చేసుకొని, 24 గంటలలోపు ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, పిల్లల న్యాయస్థానంలో (పిల్లల న్యాయస్థానం లేనిచోట సెషన్స్ కోర్టులో) తెలియజేయాలి. బిడ్డకు ఆలన, రక్షణ అవసరమని భావించిన పక్షంలో తక్షణం అందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ చట్టం ప్రకారం తను సరైనదిగా నమ్మి సమాచారం ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే వీలులేదు. ఐతే ఇతరులకు యాతన కలిగించి, పీడిరచేందుకు ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించవచ్చు. బిడ్డ ఫిర్యాదు చేస్తే అది ఋజువు కాకున్నా బిడ్డపై ఎలాంటి చర్యలూ తీసుకునే వీలులేదు.
ఇక టి.వి. పత్రికల వాళ్ళు బాధిత బిడ్డ ముఖం చూపించటం చేయరాదు. బిడ్డ పేరు, చదివే స్కూలు, ఇరుగు పొరుగు వంటి బిడ్డ గుర్తింపును తెలియజేస్తే కారకులకు ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
కేసు పరిశీలన, పరిశోధన సమయంలోకూడా బిడ్డను ఏయే ప్రశ్నలు అడగదల్చుకున్నదీ తెలియజేయాలి. బిడ్డ బహిరంగ గుర్తింపునకు అనుమతించకూడదు. న్యాయస్థానంలో పరీక్షించే సమయంలో నిందితుడు బిడ్డకు కనబడకుండా చర్యలు తీసుకోవాలి. విచారణ సందర్భంగా కానీ, కేసు నమోదు సందర్భంగా కాని ఆ బిడ్డ మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నా, బిడ్డకు భాష రాకున్నా తగిన ఫీజు చెల్లించి, బిడ్డతో భావప్రసరణ (సైగలు, వేరే భాష) జరపగల వారి సహాయం పొందాలి.
బిడ్డకు న్యాయవాదిని ప్రత్యేకంగా నియమించుకునే హక్కు ఉంది. ఒకవేళ వారు ఆర్థిక స్థోమత లేనివారు అయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక న్యాయవాదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ చట్టం అమలు పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలోనూ, కేంద్రస్థాయిలోనూ ‘కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్’ సంస్థల ఏర్పాటు చేయాలి.
ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు అందుకుని నమోదు చేసే వ్యక్తి ఫిర్యాదు చేసినవారికి తన పేరు, హోదా, చిరునామా, టెలిఫోను నెంబరు, తన పై అధికారి పేరు, చిరునామాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బిడ్డకు తక్షణం అవసరమయ్యే వైద్యసహాయాన్ని బిడ్డకు సంబంధించిన వ్యక్తి సమక్షంలో జరపాలి. ఫోరెన్సిక్ పరీక్షలకు అవసరమైన నమూనా సేకరణకు ఏర్పాటు చేయాలి.
బిడ్డకు జరిగిన నష్టం, గాయాలు, పనిచేసేట్లయితే కోల్పోయిన పనిదినాలు, శారీరక, మానసిక ఆరోగ్యం, వైకల్యత జరిగితే దాని తీవ్రత, మొ॥ అంశాలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన పరిహారాన్ని ‘బాధితుల పరిహార నిధి’ నుంచీ చెల్లించాలి. ఆ రకమైన నిధులు పరిహారాలు లేనిచోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచీ ఉత్తర్వులు అందిన 30 రోజులలోగా రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలి.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 (MTP Act)
కొన్ని రకాల అవాంఛనీయ గర్భాలను అబార్షన్ చేయించుకుని తొలగించుకునే సావకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం 1971లో చేయబడిరది.
శ్రీ ఈ చట్టాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టమని పిలుస్తారు.
శ్రీ జమ్ము`కాశ్మీర్ తప్ప బారత దేశమంతటా అమలు చేయబడుతుంది.
శ్రీ ప్రభుత్వ రిజిస్టర్లలో వైద్యులుగా నమోదైన, గైనకాలజీ Ê ఆబ్ట్సికల్స్‌లో ప్రత్యేకత కల్గిన ప్రభుత్వ వైద్యుడు అవాంఛనీయ గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగిస్తే, ఐ.పి.సి కింద అతను శిక్షార్హుడు కాదని ఎమ్.టి.పి. చట్టం 1971 చెబుతుంది.
శ్రీ ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు మాత్రమే అబార్షన్ చేయడానికి అర్హత కలిగివుంటారు.
శ్రీ అబార్షన్ చేయడానికి గర్భం 12 వారాలు దాటకూడదు.
శ్రీ ఒకవేళ గర్భాన్ని తీసేయాల్నిన అవసరాన్ని ఇద్దరు ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే గర్భం/పిండం వయస్సు 20 వారాలు దాటకుండా అబార్షన్ చేయాలి.
శ్రీ గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేయొచ్చు.
శ్రీ పుట్టబోయే బిడ్డకి శారీరక, మానసిక అవలక్షణాలు వ్యక్తమయ్యే పరిస్థితిని వైద్యులు నిర్ధారించినపుడు, అంగవైకల్యం ఏర్పడేస్థితి వున్నపుడు అబార్షన్ చేయొచ్చు.
శ్రీ మహిళ అత్యాచార బాధితురాలై, గర్భం ధరించినపుడు ఆ గర్భం వల్ల ఆ స్త్రీ తీవ్ర మానసిక ఆందోళనకి గురైనపుడు ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయొచ్చు.
శ్రీ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నపుడు ఆ పద్ధతులు విఫలమై మహిళ గర్భం దాల్చినపుడు తమ కుటుంబ ప్లానింగ్ దెబ్బతినడం, అవాంఛిత గర్భంవల్ల మహిళ మానసికంగా కుంగిపోయినపుడు అబార్షన్ చేయవచ్చు.
శ్రీ 18 సంవత్సరాలు నిండని బాలిక గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించొచ్చు. అలాగే మానసికంగా బాధపడే బాలిక గర్భాన్ని ఆమె సంరక్షకుల అనుమతితో తొలగించొచ్చు.
అబార్షన్ నిర్వహించాల్సిన ఆసుపత్రులు
శ్రీ ప్రభుత్వ నిర్వహణలో వుండే ఆసుపత్రుల్లోనే అబార్షన్‌లు నిర్వహించాలి.
శ్రీ ప్రభుత్వ అనుమతితో ఎప్పటికప్పుడు ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఎం.టి.పి చేయాలి.
బాల్య వివాహాల నిరోధక చట్టం, 2008
చట్టంలోని ముఖ్య అంశాలు
సెక్షన్ 2 (ఏ) బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని ఆడపిల్ల.
సెక్షన్ 2 (బి) ‘‘బాల్య వివాహం’’ అంటే మైనర్ బాలిక, మరియు బాలుడు మధ్య జరిగేది. (మైనర్ అంటే 18 సం. నిండని బాల బాలికలు ఎవరైనా).
సెక్షన్ 3(1) ఈ చట్ట పరిధి ప్రకారం, ఎవరైనా (బాలిక గాని బాలుడు గాని) వివాహ సమయానికి మైనరు అయితే ఆ వివాహం చెల్లదు.
సెక్షన్ 4(1) ఈ సెక్షన్ క్రింద మైనర్ వివాహం జరిగినపుడు, దానిని జరిపిన బాలుని తల్లిదండ్రులు లేదా అతని సంరక్షకులు గాని మైనర్ బాలికకు భరణం చెల్లించవలసి ఉంటుంది. ఈ భరణం ఆమె మరలా వివాహం చేసుకునేదాక ఇచ్చేటట్లు ‘‘జిల్లా న్యాయస్థానం’’ ఆజ్ఞాపిస్తుంది.
సెక్షన్ 5 బాల్య వివాహం ద్వారా మైనరు బాలిక శిశువుకు జన్మనిస్తే ఆ శిశువు రక్షణ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
సెక్షన్ 9 18 సంవత్సరాలు దాటిన పురుషుడు ఎవరైనా బాల్యవివాహం చేసుకుంటే (మైనర్ బాలికను) 2 సంవత్సరాలు జైలుశిక్ష మరియు జరిమానా కోర్టు విధిస్తుంది.
సెక్షన్ 10 ఈ సెక్షను క్రింద ఎవరైతే బాల్యవివాహాన్ని జరిపిస్తారో, జరగడానికి తోడ్పడతారో వారు కూడా శిక్షార్హులే. వారికి రెండు సంవత్సరాల దాకా జైలుశిక్ష రూ.లక్ష దాకా జరిమానా కోర్టు విధిస్తుంది.
సెక్షన్ 12 బాల్య వివాహం జరిపి తరువాత ఆ మైనరు బాలికను, అతని సంరక్షకుడుగాని, మరి ఎవరైనా ఇతరులుగాని ఆమెను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తే ఆ వివాహం చట్టరీత్యా నేరం.
సెక్షన్ 13(1) ఈ సెక్షన్ ద్వారా ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్‌కు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు, బాల్య వివాహాలను నిరోధించే అధికారం ప్రభుత్వం ఇచ్చింది.
సెక్షన్ 13(4) ఈ సెక్షన్ ద్వారా జిల్లా మేజిస్ట్రేట్, బాల్య వివాహ నిరోధక అధికారిగా బాల్య వివాహాలను నిరోధించే అధికారం ఉంటుంది.
సెక్షన్ 14 ఈ చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని అన్ని హిందూ సాంప్రదాయాలలో జరిపినా అది చెల్లదు.
సెక్షన్ 15 ఈ చట్టం క్రింద నమోదయ్యే కేసులో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్యవివాహాన్ని ఆపవచ్చు.
షెడ్యూల్డు జాతుల, తెగలపై అత్యాచార నిరోధక చట్టం ` 1989
షెడ్యూల్డు జాతులు, తెగలు ఆర్థిక విద్యారంగాలలో సమాన అవకాశాలను పొందుటకు, వారికి సామాజిక న్యాయం చేకూర్చుటకు, ధనిక వర్గాలవారి అత్యాచారాల నుండి రక్షించుటకు ఏర్పాటు చేయబడిన చట్టమే, షెడ్యూల్డ్ జాతుల, తెగల అత్యాచార నిరోధక చట్టం. ఇతర వ్యక్తులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారి న్యాయపరమైన హక్కులకు భంగం కలిగించుట, వారిని అసత్యపు నేరారోపణల ద్వారా దావాలలో ఇరికించుట, వారి సార్వజనీన హక్కులకు భంగం కలిగించుట ఈ చట్టం క్రింద నేరాలుగా పరిగణించబడతాయి. షెడ్యూల్డ్ తెగలు, కులాలకు చెందినవారిని అంటరానివారుగా పరిగణించుట, అవమానించే ఉద్దేశ్యంతో కులం పేరున దూషించుట ఈ చట్టం ప్రకారం శిక్షార్హములు.
షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందని వ్యక్తి ఈ క్రింది చర్యలు జరిపినచో అవి నేరాలుగా లేదా అత్యాచారాలుగా పరిగణించబడును (సెక్షన్ 3).
తినరాని పదార్థములు తినమని వారిని బలవంత పెట్టుట
అవమాన పరచు ఉద్దేశ్యంతో చెత్త పదార్ధాలు, శవాలు, చెడు పదార్ధాలు మొదలగునవి వారి స్థలంలో బలవంతంగా వేయుట.
వారి బట్టలు ఊడదీయుట, నగ్నంగా ప్రదర్శించుట వంటి చర్యలు
వారికి చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుట లేదా సాగు చేయుట లేదా బలవంతంగా బదిలీ చేయుట, అన్యాయంగా వారి స్థలములు / భూముల నుండి ఖాళీ చేయించుట.
యాచకము లేదా వెట్టి చాకిరి చేయమని బలవంత పెట్టుట.
ఓటు వేయకుండా అడ్డుపడుట వంటి చర్యలు
వారిపై తప్పుడు కేసులు బనాయించుట
ప్రభుత్వ ఉద్యోగులకు తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన వారికి నష్టం వంటివి కలిగించుట.
షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన స్త్రీని అగౌరవ పరచుట, బలాత్కారము చేయుట.
పై నేరాలు చేసిన వారికి ఆరు నెలల నుండి ఐదు సంవత్సరముల వరకు శిక్ష మరియు జరిమానా విధించవచ్చును.
వారి ఆస్థులకు నష్టం కలిగించిన నేరస్థులకు ఆరు నెలల నుండి ఏడు సంవత్సరముల వరకు శిక్ష విధించవచ్చును.
సూచన : ఈ చట్టము క్రిందికి వచ్చు నేరములను విచారించుటకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల చిరునామా :
స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ది యస్.సి/యస్.టి. (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) ఆక్ట్ 1989.
జిల్లా కోర్టు భవనములు (ప్రతి జిల్లాలోను నెలకొల్పబడినాయి.)
తినకూడని అసహ్యకరమైన పదార్థం తినుట ప్రతి బాధితునికి 25,000 రూపాయలు లేదా
లేదా త్రాగుట (సెక్షన్ 3(1)(i)) అంతకు ఎక్కువ, నేరం యొక్క తీవ్రతను బట్టి మరియు
గాయపరచుటకు, అవమానపరచుట లేదా బాధితుడు అనుభవించిన దెబ్బలు, అవమానం, ఆర్థిక స్థితికి తగు విధంగా
ఇబ్బంది పరచటం (సెక్షన్ 3(1)(ii)) ధన సహాయం ఈ క్రింది విధంగా చేయాలి.
అగౌరవ పరచే చర్య (సెక్షన్ 3(1)(iii)) చార్జిషీటు కోర్టుకు పంపినప్పుడు 25%
కింది కోర్టు నిందితులకు శిక్ష విధించిన వెంటనే 75%
భూమిని అక్రమంగా ఆక్రమించుకొనుట లేదా నేర తీవ్రత స్వభావాన్ని బట్టి కనీసం 25,000 రూపాయలు అవసరాన్ని
సాగుచేయుట మొదలైనవి (సెక్షన్ 3(1)(iv) బట్టి భూమి/ఆవరణ/నీటి సరఫరా ప్రభుత్వమే కల్పించాలి.
భూమి, ఆవరణ నీరుకు సంబంధించి
(సెక్షన్ 3(1)(vii)
భిక్షమెత్తించడం లేదా బలవంతపు లేదా కనీసం 25,000 రూ॥ ప్రతి బాధితునికి చెల్లించాలి. ప్రథమ సమాచార
కట్టుబానిసత్వం (సెక్షన్ 3(1)(iv)) నివేదిక స్థాయిలో 25 శాతం, కింద కోర్టులో శిక్షపడిన వెంటనే 75% చెల్లించాలి.
ఓటు హక్కుకు సంబంధించి నేరం తీవ్రత బట్టి 20,000 రూపాయల వరకు ప్రతి బాధితునికి చెల్లించాలి.
(సెక్షన్ (3(1)(ఙఱఱ))
తప్పుడు, నష్టపరచే విధంగా ఇబ్బందిపరిచే 25,000 రూపాయల లేదా నష్టానికి, న్యాయ
విధంగా న్యాయ చర్యలు (సెక్షన్ 3(1)(vii) విచారణకు అయిన ఖర్చు తిరిగి చెల్లించడం లేదా
తప్పుడు సమాచారం (సెక్షన్ 3(1)(ix) నేర స్వభావాన్ని బట్టి ప్రతి బాధితునికి 25,000 రూపాయలు చెల్లించాలి.
అవమానించటం భయాందోళనలు కోర్టులో చార్జిషీటు పెట్టేటప్పుడు 25%, మిగతా మొత్తాన్ని ముద్దాయికి
కలిగించటం (సెక్షన్ 3(1)(x)) శిక్ష పడినప్పుడు చెల్లించాలి.
స్త్రీని ఆమె అభిమానానికి భంగం కలిగేటట్లుగా నిందితులచే నేర చర్యకి గురైన ప్రతి బాధితునికి 50,000 రూపాయలు
చర్యలకి పాల్పడటం (సెక్షన్ 3(1)(xi)) చెల్లించాలి. వైద్య పరీక్షల సమయంలో 50% మిగతా 50% నేర విచారణ
పూర్తి అయిన తరువాత చెల్లించాలి.
స్త్రీని లైంగికంగా ఉపయోగించుకోవటం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలి.
(సెక్షన్ 3(1)(xii))
రహదారులపై రాకపోకలకి సంబంధించిన 1,00,000 రూపాయల వరకు లేదా రహదారి హక్కుని పునరుద్ధరించేందుకు
సాంప్రదాయిక హక్కుల్ని నిరాకరించటం అయ్యే ఖర్చుతో పాటు, నష్టమేమైనా జరిగి ఉంటే, అందుకు నష్టపరిహారం
(సెక్షన్ 3(1)(xv)) మొత్తం చార్జిషీటు కోర్టుకి పంపేటప్పుడు 50%, కింది కోర్టులు నిందితులకి
శిక్ష విధించేటప్పుడు మిగిలిన 50% చెల్లించాలి.
ఎవరినైనా, వారు నివసించే ప్రదేశం నుండి నివాస స్థలాన్ని లేదా నివాస హక్కుని పునరుద్ధరించటం, ప్రతి బాధితునికి
వెళ్ళగొట్టడం (సెక్షన్ 3(1)(xvi)) 25,000 రూపాయల నష్టపరిహారంతో బాటు, ఇల్లు లేదా నివాసం
ధ్వంసమైనట్లయితే, ప్రభుత్వ ఖర్చుతో ఇంటిని నిర్మించటం, క్రింది కోర్టులో
ఛార్జిషీటు పెట్టినప్పుడు నష్టపరిహారం మొత్తాన్ని చెల్లించాలి. కనీసం లక్ష
రూపాయలు లేదా ఎంత మేరకు నష్టానికి గురైతే అంత మొత్తం నష్ట
పరిహారంగా చెల్లించాలి.
తప్పుడు సాక్ష్యం ఇవ్వటం (సెక్షన్ 3(1)(xvi)) కోర్టుకు ఛార్జిషీటు పంపినప్పుడు 50%, మిగతా 50% నిందితులకి
కింది కోర్టు శిక్ష విధించినప్పుడు చెల్లించాలి.
భారత శిక్షాస్మ ృతి ప్రకారం 10 సంవత్సరాలు నేర స్వభావం, తీవ్రతని బట్టి ప్రతి బాధితునికి లేదా అతనిపై ఆధారపడ్డ వారికి
లేదా అంతకు మించి శిక్ష పడే నేరాలకి కనీసం 50,000 వరకు చెల్లించాలి. షెడ్యూల్‌లో దీనితో పాటు ఇతర అంశాల
పాల్పడినప్పుడు (సెక్షన్ 3(1)(ఞఙఱఱ)) గురించి ప్రత్యేకించి పేర్కొన్నట్లయితే, అప్పుడు చెల్లించే నష్ట పరిహారంలో కూడా
తేడాలుంటాయి. నష్టాన్ని బట్టి అంతే స్థాయితో నష్టపరిహారం చెల్లించాలి.
ప్రభుత్వ ఉద్యోగి వలన ఇబ్బందులకి కోర్టులో చార్జిషీటు పెట్టినప్పుడు 50%, మిగతా 50% నిందితులకి కింది కోర్టులు
గురికావటం శిక్ష విధించినప్పుడు చెల్లించాలి. కనీసం లక్ష రూపాయలు బాధితునికి చెల్లించాలి.
అంగవైకల్యం
(ఎ) 100% శక్తి సామర్థ్యాలు కోల్పోవటం
(ఱ) కుటుంబంలో సంపాదించే వ్యక్తి కానప్పుడు ఎఫ్.ఐ.ఆర్. కట్టినప్పుడు 50%, చార్జిషీట్ కట్టినపుడు 25%, మరియు క్రింది
కోర్టు నిందితునికి శిక్ష విధించినపుడు 25% చెల్లించాలి. కనీసం 2,00,000
రూపాయలు బాధితునికి చెల్లించాలి.
(ఱఱ) కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినప్పుడు ఎఫ్.ఐ.ఆర్. మరియు మెడికల్ పరీక్ష సమయంలో 50% చార్జిషీట్ కోర్టుకు
పంపేటపుడు 25%, మరియు క్రింది కోర్టు నిందితునికి శిక్ష విధించినపుడు
25% చెల్లించాలి.
(బి) 100% శక్తిహీనులైనచో పైన తెలిపిన ఎ(i) మరియు ఎ(ii) లో నిర్ణయించిన ప్రకారం శాతాన్ని బట్టి
చెల్లించవచ్చు. డబ్బు చెల్లించే విధానం కూడా ఎ(i), ఎ(ii)లు పేర్కొన్న విధంగా
ఉంటుంది. పోషించే శక్తిలేని వ్యక్తికి 15,000 రూపాయలు పోషించే వ్యక్తికి
30,000 రూపాయలు తక్కువ కాకుండా చెల్లించాలి.
హత్య/మరణం
(ఎ) కుటుంబంలో సంపాదించే వ్యక్తి కానప్పుడు కనీసం ప్రతి కేసుకు 1,00,000 రూపాయలు 75% పోస్టుమార్టం తర్వాత
చెల్లించాలి. మరియు 25% క్రింది కోర్టు శిక్ష విధించిన తర్వాత చెల్లించాలి.
బి) కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినప్పుడు కనీసం 2,00,000 రూపాయలు, 75% పోస్టుమార్టం తర్వాత చెల్లించాలి.
మరియు 25% శిక్ష విధించిన తర్వాత చెల్లించాలి.
బాధితులు హత్య, మరణం, మరణ కాండ, పైన తెలిపిన వాటికి అదనంగా ధన సహాయం చేయాలి.
అత్యాచారం, సామూహిక అత్యాచారం, శాశ్వతంగా (i) వారిపై ఆధారపడిన వితంతువు లేక వ్యక్తులు అయిన ఎస్సీ, ఎస్టీలకు
శక్తిహీనత్వం మరియు దోపిడికి గురైనచో నెలకి 1,000 రూ॥లు పెన్షన్ అందించాలి. కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇల్లు అవసరం అయినచో వెంటనే కొని
వారికి అందించాలి.
(ii) బాధితుల పిల్లలకి విద్యకి అవసరమైన పూర్తి మొత్తాన్ని అందివ్వాలి. వారి
పిల్లల్ని గురుకుల/రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలి.
(iii) అవసరమైన బియ్యం, గోధుమలు, పప్పులు మరియు నిత్యావసర సరుకులు
3 నెలలకి సరిపడా అందివ్వాలి.
ఇండ్లని పూర్తిగా నాశనం/కాల్చివేసినచో ఇటుకలు/లేక రాళ్ళతో కట్టిన ఇంటిని నిర్మించి లేదా పూర్తిగా ప్రభుత్వ ధనంతో
కాలిపోయిన లేదా తగలబడిన ఇండ్లని నిర్మించాలి.
తల్లిదండ్రులు, వృధ్దుల పోషణ సంక్షేమ చట్టం ` 2007
సమాజంలో పీడనకు గురయ్యేవారిని గురించి చెప్పుకోవాలంటే వృద్ధులు, నిరుపేదలు, పిల్లలు, స్త్రీలు, దళితులు, గిరిజనులు, శారీరక, మానసిక అసహాయతతో బాధపడే వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా దశాబ్దాలు గడుస్తున్నా మౌలిక మార్పు రావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం వాటి నిర్మాణంలోనే అమలుకు తూట్లు పొడిచే లొసుగులు ఉండటమనేది మేధావుల ఉవాచ.
మన రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టాన్ని జి.వో.ఎం.ఎస్. నెం.10 మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం మరియు వికలాంగ సంక్షేమశాఖ, తేదీ 22`04`2008 ద్వారా అమలులోకి తెచ్చింది.
ప్రస్తుతమున్న పరిస్థితులలో, తమ వారసులపై పోషణ హక్కు కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంతో ఖర్చుతోనూ, కాలయాపనతోనూ కూడిన పనిగా తయారయింది. అందువల్ల వారి హక్కుల క్లెయింలు సత్వరం తక్కువ ఖర్చుతో పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈ చట్టం తెస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ చట్టం ప్రకారం ప్రతి సబ్ డివిజన్‌కు ఒకటి లేదా అంతకుమించిన ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేయాలి. సబ్‌డివిజన్‌లో అధికారి హోదాకు తక్కువకాని అధికారితో వీటిని ప్రారంభించాలి.
అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ పౌరులకు అంటే తల్లిదండ్రులు/తల్లి లేదా తండ్రి అవసరాలను సంతానం/వారసులు తీర్చాలి. అటువంటి సీనియర్ పౌరుల ఆస్తులకు ఒకరికి మించి వారసులు ఉన్నప్పుడు ఆస్తిని పంచుకున్న నిష్పత్తిలోనే సీనియర్ పౌరుల జీవనానికయ్యే ఖర్చులు భరించాలి. సదరు సీనియర్ పౌరులు సంతానం లేనివారయితే వారి ఆస్తులు ఎవరికి చెందుతాయో సదరు బంధువులు ఖర్చులు భరించాలి. అలా పోషణ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న, నిర్వహణ క్లెయిం కోరే సీనియర్ పౌరులు ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వారి తరపున అంగీకారం పొందిన వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చు. తన దృష్టికి వచ్చిన కేసుల విషయంలో ట్రిబ్యునల్ తనంత తాను కూడా విచారణ చేపట్టవచ్చు. లేదా ఏదయినా రిజిష్టర్ అయివున్న సొసైటీకి కానీ, స్వచ్ఛంద సంస్థ కానీ వారి తరపున ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయవచ్చు.
ఫిర్యాదు దరఖాస్తు అందిన వెంటనే ట్రిబ్యునల్ మధ్యంతరంగా వారి జీవనం కోసం కొంత మొత్తాన్ని సదరు తల్లిదండ్రులు, లేదా సీనియర్ పౌరునికి చెల్లించాల్సిందిగా ఆదేశించవచ్చు. పై దరఖాస్తు అందిన వెంటనే కక్షిదారులకు నోటీసు పంపి వారి వాదనలు వినవచ్చు. ఈ నెలసరి భత్యానికి సంబంధించిన దరఖాస్తు అందిన 90 రోజులలోగా విచారణ జరిపి పరిష్కరిస్తారు. ఏదైనా అనివార్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా 30 రోజుల పరిమితికి లోబడి గడువును పెంచవచ్చు. తిరిగి గడువు పెంచే వీలులేదు. ఈ దరఖాస్తును అర్జీదారుడు నివసించే ప్రదేశంలోని ట్రిబ్యునల్‌లోగానీ, కక్షిదారుడు నివసించే ప్రదేశంలోని ట్రిబ్యునల్‌లో గాని ఎక్కడయినా దాఖలు చేయవచ్చు.
ట్రిబ్యునల్ సదరు దరఖాస్తును విచారించే ముందుగా దానిని రాజీ అధికారికి పంపుతుంది. రాజీ అధికారి నెలలోపుగా సముచిత పరిష్కారంతో తన నివేదికను ట్రిబ్యునల్‌కు పంపుతారు. సదరు నివేదికను ట్రిబ్యునల్ ఉత్తర్వులుగా జారీచేస్తుంది. రాజీ అధికారిగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లేదా ఆ స్థాయికి తగ్గని అధికారిని ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తి, లేదా చట్టప్రకారం నమోదయిన స్వచ్ఛంద సంస్థ అధికారిగానీ అయివుంటారు.
భారతదేశం వెలుపల కక్షిదారులు నివసిస్తున్నట్లయితే ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురింపజేసి ఇందుకై నియుక్తులైన అధికారులద్వారా అందజేయటమౌతుంది.
సంతానం లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందు హాజరుకాకుండా, బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు భావించిన పక్షంలో, కేసును ఏకపక్షంగా విచారించి తీర్పును ఇవ్వటమౌతుంది.
ఈ ట్రిబ్యునళ్ళలో సీనియర్ పౌరులకు లేదా తల్లిదండ్రులకు ఎటువంటి ఫీజులు లేకుండానే వ్యయ ప్రొసీడిరగ్‌ల ఉత్తరువు, నిర్వహణ ఉత్తర్వులను ట్రిబ్యునల్ జారీ చేస్తుంది.
ట్రిబ్యునల్ ఫిర్యాదుదారుని నిర్వహణ చెల్లింపు డబ్బుకు 5 శాతం నుంచీ 18 శాతానికి మించకుండా ఆలస్య రుసుముగా వడ్డీ చెల్లించాల్సిందిగా కూడా ఆదేశించవచ్చు. తల్లిదండ్రులకు నిర్వహణ పిటిషన్ వెనుకకు తీసుకునేందుకు అనుమతి ఉంది. ఐతే వారు తిరిగి నిర్వహణకై పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది.
ఈ ట్రిబ్యునల్ తీర్పు నచ్చని పక్షంలో సీనియర్ పౌరులు/తల్లిదండ్రులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించి, ప్రతి జిల్లాకు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయవలసి వుంది. జిల్లా మేజిస్ట్రేటు స్థాయికి తగ్గని అధికారి ఆధ్వర్యంలో ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్వహణ జరుగుతుంది. సీనియర్ పౌరుడు/తల్లిదండ్రులు ట్రిబ్యునల్ ఉత్తర్వు తనకు ఆమోదయోగ్యం కాని పరిస్థితుల్లో ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన 60 రోజుల లోగా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే తగిన కారణాన్ని సహేతుకంగా చూపించగలిగితే 60 రోజుల తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరమైన రికార్డులు తెప్పించుకొని, కక్షిదారులు ఇరువురి వాదనలు విన్న తరువాత తీర్పు చెబుతుంది. అలా వినకుండా ఏ అప్పీలును ఏరకంగానూ తిరస్కరించకూడదు. అప్పీలును అందుకున్న నెల రోజులలోగా ఉత్తర్వులు వెలువరించి ఇరుపక్షాలకూ ఉచితంగా అందించాలి. ట్రిబ్యునల్‌కు వారే వెళ్ళాలి కానీ న్యాయవాది ద్వారా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించటం నిషేధించారు.
నిరుపేదలకు వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ప్రారంభకాలంలో కనీసం జిల్లాకు ఒక వృద్ధాశ్రమం స్థాపించి ఒక్కోదాంట్లో 150 మందికి తగ్గకుండా నిరుపేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాలి. సదరు వృద్ధాశ్రమాలలో నివసిస్తుండే వారికి ఆహారంతోబాటు వైద్యం, వినోదం వంటి వాటిని అందించాలి. నిర్వహణ నిబంధనలను రాష్ట్రప్రభుత్వం ఏర్పరచాలి.
ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, ప్రభుత్వం పాక్షికంగా నిధులు అందించే హాస్పిటళ్ళలోనూ సీనియర్ పౌరులందరికి ప్రత్యేకంగా పడకలు ఏర్పరచటం, వృద్ధాప్య సంరక్షణలో అనుభవం ఉన్న వైద్యులను జిల్లా వైద్యశాలల్లో నియమించటం, సీనియర్ పౌరులకు నేరుగా క్యూ పద్ధతి ప్రవేశపెట్టటం వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చట్టం నిర్దేశిస్తున్నది.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత సీనియర్ పౌరులు బహుమతిగా కానీ, సంరక్షణ బాధ్యత చూసే విధంగా ఒప్పందం ద్వారా కానీ ఆస్తిని బదిలీ చేసిన సందర్భంలో అలా బదిలీ చేయించుకున్న వ్యక్తి సీనియర్ పౌరునకు జీవన అవసరాలను తీర్చి సక్రమ వసతులు కల్పించటంలో విఫలమైనా, తిరస్కరించినా, ఆ బదిలీ చెల్లదు. సదరు ఆస్తిని బదిలీ చేయటం మోసం కింద భావించి బదిలీ చెల్లదని ప్రకటించవచ్చు.
ఇక తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల రక్షణ నిర్వహణ చూడాల్సిన సంతానం కానీ, ఆస్తి వారసులు కానీ వారిని చూడకుండా
ఉన్నా, విడిచిపెట్టినా వారికి శిక్ష పడుతుంది. మూడు నెలల వరకూ జైలుశిక్ష, లేదా ఐదువేల వరకూ జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు.
తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం ` 2007
(ఆసియా లా హోస్ ప్రచురణలు ` అనువాదం : కె.ఎల్.ఎన్.శర్మ)
వివాహిత మహిళలపై హింస ` ఐపిసి 498ఏ
వివాహిత మహిళలపై హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టం : డబ్బుకోసం భార్యని భర్తే కాకుండా అతని బంధువులు, తల్లీ తండ్రి, ఆడపడుచులు హింసిస్తున్న సంఘటనలు మనకు ప్రతిరోజూ కోకొల్లలుగా కన్పిస్తున్నాయి. ఇది సర్వసాధారణమైపోయింది. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకు వచ్చిన కొత్త కోడలు జీవితం ఇలాంటి మనుషుల మధ్య దుర్భరమై పోతుంది. వారి క్రూరత్వం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ శారీరక క్రూరత్వం, మానసిక క్రూరత్వం అమానుషమైనప్పటికీ, దానికి తగిన శిక్ష చట్టాలలో ఇంతకు ముందు లేదు. ఈ అవసరాన్ని గుర్తించి శాసనకర్తలు భారతీయ శిక్షాస్మృతిలో కొత్త నిబంధనని (498 ఏ) పొందుపరిచారు.
పెళ్ళైన యువతిపట్ల ఆమె భర్తగానీ అతని బంధువులు గానీ క్రూరంగా వ్యవహరించినప్పుడు అది నేరమవుతుంది. వాళ్ళు శిక్షార్హులు అవుతారు. భర్తగానీ, ఆమె బంధువులు గానీ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యల వల్ల పెళ్ళైన యువతి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించినపుడు ఆమె శరీరానికి, జీవితానికి తీవ్రమైన హాని కలిగించే పరిస్థితులు కల్పించినప్పుడు అది క్రూరత్వమవుతుంది. చట్ట వ్యతిరేకమైన డిమాండు చేస్తూ ఆమెను గానీ, ఆమె బంధువులుగానీ, కట్నం గానీ, ఇతర కోరికలు గానీ తీర్చమని ఒత్తిడి చేసినప్పుడు దానిని క్రూరత్వమంటారు.
ఈ నేరం ఋజువు కావాలంటే… ఆమెకు పెళ్ళైందని, ఆమె హింసించబడిరదని, ఆ హింస (క్రూరత్వం) ఆమె భర్తచేగానీ అతని బంధువులచే గానీ జరిగిందని ఋజువు చేయాల్సి వుంటుంది. ఈ నిబంధన కింద కేసును ఈ స్త్రీ బతికి వున్నప్పుడు గానీ, చనిపోయినప్పుడు గానీ పెట్టవచ్చు. ఆమె వైవాహిక జీవిత కాలపరిమితితో సంబంధం లేదు. ఈ నేరం కాగ్నిజబుల్ నేరం. ఈ నేరం గురించిన సమాచారం పోలీసులకి అందిన వెంటనే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఈ సమాచారాన్ని ఆమె రక్త సంబంధీకులుగానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ, ఆ స్త్రీ గానీ పోలీసులకి అందజేయవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ నేరం. అంటే బెయిల్ ఇవ్వడమనేది మేజిస్ట్రేట్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేరాలని ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గానీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గానీ విచారిస్తారు.
కోర్టులు నేరుగా ఫిర్యాదులను స్వీకరించవచ్చా?
పోలీసుల చార్జిషీట్‌తో నిమిత్తం లేకుండా, కోర్టులు ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులు గానీ, అన్నదమ్ములుగానీ, అక్కాచెల్లెళ్ళు గానీ, మేనత్తలు గానీ, మేనమామలు గానీ ఫిర్యాదు చేసినప్పుడు విచారిస్తాయి. కోర్టు అనుమతించినప్పుడు ఆమె రక్త సంబంధీకులు కూడా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.
ఇంటర్‌నెట్ మోసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎలా?
సమాచార విప్లవానికి దారివేసిన ఇంటర్‌నెట్ అపారమైన సమాచారాన్ని చిటికేసినంత తేలికగా అందుబాటులోకి తెచ్చింది. క్షణాల్లో వార్తల చేరవేత, అవతలి మనుష్యుల్ని చూస్తూ మాట్లాడగలిగిన డిజిటల్ వీడియోల సౌలభ్యం, లక్షలాది ఫోటోల నిక్షిప్తం, ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం ఇవెన్నో లాభాలతో పాటు నష్టాల్ని కల్గిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల నెట్ హింస కూడా పెరుగుతోంది. ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అబ్యూసివ్ ఇమెయిల్స్ పంపడంలాంటివి. వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింద పొందుపరిచాం.
ఇక్కడ ఫిర్యాదుదారులు రెండు రకాల పరిస్థితులను ఎదుర్కొంటారు
్న నేరం జరుగుతూ ఉన్నప్పుడు లేదా తప్పక జరుగుతుందనుకున్నప్పుడు.
్న నేరం ముందే జరిగిపోయినపుడు
చేయవలసిన, తీసుకొనవలసిన చర్యలు :
మొదటి కేసులో ఆ సమాచారాన్ని సంబంధిత లోకల్ పోలీసుకు తెలియజేయండి లేదా దాని గురించి సైబర్ క్రైమ్ సెల్‌కు సమాచారం వెబ్‌సైట్ ద్వారా షషష.aజూర్a్‌వ జూశీశ్రీఱషవ.శీతీస్త్ర/షషష.ష్ట్రవసవతీaపaస జూశీశ్రీఱషవ.స్త్రశీఙ.ఱఅ తెలియ జేయాలి. అలా చేసినట్లయితే ఆ సంఘటన జరుగకుండా నివారించే అవకాశం ఉంటుంది. రెండవ కేసునందు చాలావరకు ఆర్థిక సంబంధమైన నేరాలన్నీ ఐపిసి పరిధిలోకి వస్తాయి. కావున ఫిర్యాదుదారుడు సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్‌లోగానీ లేదా సిసిఎస్ లో గానీ ఫిర్యాదు చేయాలి.
ఇటువంటి కేసు సైబర్ ఎన్విరాన్‌మెంట్‌లో జరిగినదయితే కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదు. ఈ క్రింద చెప్పబడిన సమాచారాన్ని కూడా అందించవలసి ఉంటుంది.
త పరిశోధనకు సంబంధించిన ఇ`మెయిల్ మెసేజ్‌లు.
త ఇతర ఇ`మెయిల్ అడ్రస్‌లు.
త పంపినవారి సమాచారం.
త ఆ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సమాచారం (కాంటెంట్)
త ఐపి అడ్రస్‌లు
త డేట్ (తారీఖు) మరియు టైం (సమయం) కు సంబంధించిన సమాచారం.
త ఉపయోగించిన వ్యక్తి (యూజర్) యొక్క సమాచారం.
త అటాచ్‌మెంట్స్.
త పాస్‌వర్డ్స్.
త అప్లికేషన్ లాగ్‌లు. అవి ‘స్నూపింగ్’కు సాక్ష్యాలుగా ఉంటాయి.
త ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించిన కంప్యూటర్.
త స్క్రీన్ లేక యూజర్ నేమ్ (బాధితుడు మరియు అనుమానితుడు ఇద్దరివీ)
త ఆ ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పి), అకౌంట్
ఉపయోగిస్తున్న దాని యజమాని (ఓనర్)
త ముఖ్య సమాచారం/మొత్తం సమాచారం
త ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న లేదా చూసిన డేట్ మరియు టైమ్ వివరాలు.
త అంతకు పూర్వం/ముందు చేసిన కాంటాక్ట్‌ల యొక్క డేట్స్ మరియు టైమ్‌ల వివరాలు.
త ఏదైనా ఆ కమ్యూనికేషన్ బాధితుని ద్వారా లాగిన్ లేదా ప్రింటవుట్ చేయబడి ఉంటే అది.
త ఉపయోగించిన/ ఉపయోగపడే/సంబంధించిన పాస్‌వర్డ్స్.
త నేరంతో సంబంధముందని భావించిన అనుమానితుల వివరాలు.
త ఏదైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఉపయోగించి నట్లయితే అది మరికొంత అదనపు సమాచారాన్ని గ్రహించి ఉంచుతుంది. అటువంటి సమాచారం యొక్క వివరాలు.
త క్రెడిట్‌కార్డ్/ఏటియం కార్డ్/డెబిట్ కార్డ్‌ల యొక్క సమాచారం మరియు వాటి అకౌంట్ వివరాలు.
త ఆ కార్డులు ఇటీవలి కాలంలో ఉపయోగించిన ప్రదేశాల వివరాలు.
డిజిటల్ సాక్ష్యాన్ని చాలా సులభంగా నాశనం చేయవచ్చు/చెడగొట్టవచ్చు. ఉదాహరణకు:
త ఉపయోగించడం ద్వారా అది మారిపోతుంది
త దాని దురుద్దేశ్య పూర్వకంగా మరియు తరచుగా తుడిచివేయడం గానీ లేదా మార్పు చేయడం గానీ జరుగుతుంది.
త దానిని సరిగా హాండ్లింగ్ చేయకపోయినా, సేవ్ చేయకపో వడం వలన కూడా అది మారిపోవచ్చును.
త ఈ కారణాల వలన సాక్ష్యాన్ని జాగ్రత్తగా సేకరించాలి మరియు దాచి ఉంచాలి. ఇటువంటి నేరాల పరిశోధనలో ఇంటర్‌నెట్ ఉపయోగించడం, టైమ్, డేట్ మరియు టైంజోన్ సమాచారం మొదలైనవి రుజువు చేయడం చాలా ముఖ్యం.
ఫిర్యాదు చేసేటపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు:
త ఎల్లప్పుడూ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి పోలీసులను సంప్రదించి వారికి ఫిర్యాదు చేయడమే సరిjైున పని.
త అన్నింటికంటే ముందుగా సంబంధిత బ్యాంకుకు ఆ మోసాన్ని గురించి తెలియజేయాలి. దీని వలన తరువాత జరిగే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.
త మోసగాడు ఇప్పటికీ మీతో టచ్‌లో ఉంటే, అతనితో సంబంధాన్ని కొనసాగిస్తూ అతని గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయండి.
త మీకు ఏదైనా ఒక మెయిల్ ఐడి లేదా మొబైల్ నంబరు మీద అనుమానం ఉన్నట్లయితే, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకండి మరియు దాని గురించి వెంటనే పోలీసులకు తెలియజేయండి.
త ఎంత ఇబ్బందికరమైన సమాచారమైనా సరే పోలీసులు దాన్ని చూసేవరకు నేరానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని తొలగించకండి.
భూమిక నిర్వహిస్తున్న జెండర్ శిక్షణలు, అవగాహనా సదస్సులు
భూమిక పత్రిక ద్వారా స్త్రీవాద భావజాలాన్ని, సామాజిక అంశాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తే, భూమిక హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల్లో ఉన్న స్త్రీలకు అండగా ఉండటం జరుగుతోంది. మహిళల కోసం ప్రభుత్వం నడిపే విభాగాలు, వ్యవస్థలు, సపోర్ట్ సిస్టమ్‌లలో పనిచేసే వారికి జెండర్ స్పృహ కలిగించడం, జెండర్ ఆధారిత హింసను అర్థం చేయించడం కోసం భూమిక అనేక శిక్షణలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలీసులకు జెండర్ సెన్సిటివిటీ ట్రయినింగ్‌లు చాలా అవసరం. తమపై ఇంటా, బయటా ఎపుడైనా హింస జరిగితే మహిళలు తక్షణం వెళ్ళేది పోలీస్ స్టేషన్‌లకే. అలా తమ వద్దకు వచ్చే బాధిత మహిళలతో సాధారణంగా పోలీసులు చాలా మొరటుగా, ఎలాంటి సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తుంటారు. గృహహింసకి గురై తమ వద్దకు వచ్చే స్త్రీల పట్ల ఎలాంటి సానుభూతి వ్యక్తం కానీ దోరణిలోనే పోలీసులు వ్యవహరిస్తారు.
ఈ అంశాన్ని గుర్తించిన భూమిక పోలీసులకు జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగులు, అవగాహనా కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. రైల్వే పోలీసులు, జనరల్ పోలీసులు, పారిశ్రామిక భద్రత విభాగంలో పనిచేసే పోలీసులు ` ఇలా వివిధ విభాగాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి ఎన్నో ట్రైనింగులను భూమిక నిర్వహించింది.
రాచకొండ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తించే అన్ని స్థాయి పోలీసులకు నాలుగైదు పర్యాయాలు ఈ శిక్షణలు జరిగాయి. ఈ శిక్షణల వల్ల ఆయా పోలీస్ స్టేషన్‌ల సిబ్బందితో భూమికకు ప్రత్యక్ష సంబంధాలేర్పడి బాధిత స్త్రీల కేసులు, సమస్యలను వారితో చర్చించడానికి, తగిన సహాయం అందించడానికి అవకాశమేర్పడిరది. ఈ శిక్షణల వల్ల పోలీసు సిబ్బంది స్త్రీల సమస్యల్ని అర్థం చేసుకోగలగడం, స్త్రీలు తమ స్టేషన్‌లకి వచ్చినపుడు సానుకూల, సున్నిత ధోరణిలో వ్యవహరించడం ఈ శిక్షణల వల్ల జరిగిన ఒక మంచి పరిణామం.
భూమిక ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది జడ్జిలకు జెండర్ స్పృహ మీద ఇచ్చిన జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్. దేశం మొత్తం మీద ఎక్కడా జరగని ఈ కార్యక్రమం ద్వారా భూమిక జడ్జీలకు శిక్షణలిచ్చే జుడీషియల్ అకాడమీలో ఒక రోజు జెండర్ మీద శిక్షణకు కేటాయించేలా చెయ్యగలగడంతో పాటు శిక్షణలో ఉన్న నాలుగు బ్యాచీల జడ్జీలకు స్త్రీల దృష్టికోణంతో చట్టాలను చూడాల్సిన అవసరాన్ని, హింసకు గురయ్యే స్త్రీల సామాజిక స్థితిగతుల్ని ఎలా అర్థం చేసుకోవాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గృహహింస చట్టం అమలులో జెండర్ సున్నితత్వం, వేగవంతంగా కేసుల్ని పరిష్కరించడం, బాధిత స్త్రీల పక్షాన తీర్పుల్ని ఎందుకవసరమో స్త్రీల దృష్టి కోణంతోను, బాధితుల దృష్టి కోణంతోను వారికి వివరించడం వల్ల ఆయా న్యాయమూర్తులు ఆలోచనా ధోరణుల్లో తప్పకుండా మార్పులొస్తాయని, రావాలనే ఉద్ధేశ్యంతో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఎన్‌ఆర్‌ఐ వివాహాలు ` తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విదేశాల్లో ఉండే భారతీయులతో జరిగే పెళ్ళిళ్ళు అన్నీ చెడుగా ఉండవు. కానీ మీ కుమార్తె మరియు మీ కుటుంబం శ్రేయస్సు కోసం మీరు అటువంటి సంబంధాల్లోకి ప్రవేశించటానికి ముందు తీసుకొనవలసిన జాగ్రత్తలు.
ఎన్ ఆర్ ఐ లు/విదేశాల్లోని భారతీయుల వల్ల ఎన్నో మోసకారి వివాహాలు జరిగిన కేసులు ఉన్నాయి.
ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కేసుల వివరాలు ఉన్నాయి :
1. విదేశాలకు తీసుకు వెళ్ళబడటానికి ముందే ఆమె వదిలి వేయబడుతుంది. స్వల్పకాల హానీమూన్ తర్వాత త్వరలోనే టిక్కెట్లను పంపిస్తానని ప్రమాణం చేస్తాడు కానీ అతడు తిరిగి ఎన్నటికీ ఆమెను సంప్రదించడు.
2. మహిళ పరాయిదేశానికి వెళ్ళి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తన భర్త ఇంక తిరిగిరాడని అక్కడే ఆమె అర్థం చేసుకుంటుంది.
3. వివాహమైన మహిళ విదేశానికి వెళ్తుంది కానీ సంవత్సరంలోపే ఆమె బలవంతంగా వెనక్కి రావలసిన పరిస్థితి వస్తుంది. ఆమె తన బిడ్డను తన వెంట తీసుకు వెళ్ళటానికి అనుమతించబడదు.
4. వివాహిత విదేశానికి వెళ్ళి క్రూరంగా చావుదెబ్బలు తినడం, దాడులకు గురికావటం, మరియు శారీరకంగా, మానసికంగా తిట్లు తినడం, పౌష్టికాహారలోపం మరియు మరింకెన్నో విధాలుగా అవమానకరంగా చూడబడుతోంది.
5. తన భర్త తప్పుడు సమాచారమిచ్చినట్లు లేదా కింద పేర్నొన్నవన్నీ చెప్పినట్లు వివాహమైన తర్వాతే మహిళ తెల్సుకుంటుంది. అతడి ఉద్యోగం, ఇమ్మిగ్రేషన్ హోదా, ఆస్తి, వివాహ హోదా మరియు తక్కిన భౌతికమైన వివరాలు. ఇవి ఆమెను వివాహం చేసుకునేలా చేసి మోసానికి గురి చేస్తున్నాయి.
6. వివాహానికి ముందు, తర్వాత కూడా మహిళ, లేదా ఆమె తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాల్సిన విషవలయంలో చిక్కుకుంటున్నారు. పరాయిదేశంలో ఆమె సంపాదన కోసం ఆమె చేత బలవంతంగా పని చేయించి ఆమె వద్దనుండి సంపాదనను భర్త గుంజుకుంటున్నాడు.
7. తాను వివాహం చేసుకున్న విదేశీ భారతీయుడికి అప్పటికే పెళ్ళయ్యిందని, అతడు వేరొక మహిళతో జీవిస్తున్నాడని ఆమె అక్కడికెళ్ళాక మాత్రమే తెలుస్తుంది.
8. మహిళ భర్త, ఆమెకు తెలియకుండానే విదేశాల్లో ఏకపక్ష ఎక్స్‌పార్టీ డిక్రీ ద్వారా విడాకులు తీసుకుంటున్నాడు.
9. ఎటువంటి మద్ధతు, లేదా జీవించటానికి ఆధారంగా ఉండేమార్గాలు, లేదా తప్పించుకోవటానికి మార్గాలు లేక ఆ దేశంలో
ఉండటానికి వీసా కూడా లేకుండా మహిళ విదేశంలో వదిలి వేయబడుతోంది.
10. భరణం లేదా విడాకుల కోసం మహిళ కోర్టుకు వెళ్తోంది. కానీ కోర్టుల అధికారాలు, నోటీసుల జారీ, లేదా ఆదేశాల జారీ లేదా ఆదేశాల అమలు వంటి చట్టబద్ధమైన అడ్డంకులను ఆమె తరచు ఎదుర్కొంటోంది.
11. పెళ్ళి కొడుకు ఉండే విదేశానికి మహిళ అనేక రకాల వంచించబడి వెళ్తోంది. అతడ్ని అక్కడ వివాహం చేసుకుంటోంది. భారతీయ కోర్టులకు అక్కడ పరిమితమైన అధికారం వుందని ఆమె తర్వాతనే తెలుసుకుంటుంది.
ఇటువంటి వివాహాలు మీ కుటుంబానికి ఆపదను కలిగిస్తాయి మరియు మీ కుమార్తె భవిష్యత్తుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.
ఈ క్రింద పేర్కొన్న ముందు జాగ్రత్తలు తీసుకోండి :
1. విదేశాలకు చెందిన వివాహం చేయాలనే నిర్ణయం తొందరపడి తీసుకోకండి. అది మీ కుమార్తె జీవితానికి సంబంధించినది.
2. ప్రతిపాదిత ఎన్‌ఆర్‌ఐ/ విదేశంలో ఉన్న భారతీయునితో వివాహాన్ని ఖాయపర్చే ముందు అతడి పూర్వచరిత్రను తనిఖీ చేయండి.
3. విదేశీ పెళ్ళి కుమారుడితో వివాహ ప్రతిపాదనను పరిగణించే సమయంలో నిర్ణయాన్ని తీసుకోవటంలో ఒత్తిడికి గురికాకండి.
ఎందుకంటే ఇదొక ముఖ్యమైన నిర్ణయం.
4. ఫోన్ మీద లేదా ఈ`మెయిళ్ళ ద్వారా వివాహ విషయాన్ని ఖాయపర్చకండి.
5. విదేశాలకు చెందిన వివాహాన్ని మీ కుమార్తెకు చేయడంలో ఏదైనా బ్యూరో, ఏజంట్, లేదా మధ్యవర్తిని గుడ్డిగా విశ్వసించకండి.
6. వివాహం ద్వారా వేరొక దేశానికి వలస వెళ్ళటానికి లేదా గ్రీన్ కార్డు పొందవచ్చనే వాగ్దానాల పథకాలకు బలికాకండి.
7. విషయాలను రహస్యంగా నిర్ణయించకండి. ప్రతిపాదనను స్నేహితులు మరియు దగ్గర బంధువుల దగ్గర ప్రచారం చేయండి. మీరు మరొక విధంగా సంపాదించలేని ముఖ్యమైన సమాచారాన్ని పొందటంలో వారు సహాయపడగలరు.
8. వివాహాన్ని ప్రచారం చేయటానికి అవసరమైన ఫోటోగ్రాఫ్ తదితరాల నిరూపణతో మత సంబంధమైన వివాహంతో పాటు రిజిస్టర్ వివాహం కూడా భారతదేశంలో జరగటానికి ఎల్లప్పుడూ నొక్కి చెప్పండి.
9. పెళ్ళి కొడుకుకి చెందిన వివాహ హోదా, ఉద్యోగం`స్థానం, జీతం, అతడి అధికారాలు, ఇమ్మిగ్రేషన్ హోదా, వీసా రకం, వేరొక దేశానికి భార్యను తీసుకువెళ్ళటానికి అతడికున్న అర్హత, కుటుంబ వివరాలు, కుటుంబ రకం, అతడికి చెందిన నేరచరిత్ర తదితర విషయాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి.
10. అత్యవసర పరిస్థితులు ఎదురైనట్లైతే ఆమె దగ్గర ఉండటానికి మీ కుమార్తెకు రాయబార కార్యాలయాలు, హెల్ప్‌లైన్స్, బంధువులు తదితరాల ముఖ్యమైన టెలీఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇవ్వండి.
11. మీ పాస్‌పోర్టు/వీసాను మీ ఆధీనంలో ఉంచుకోండి మరియు పాస్‌పోర్టు/వీసా కాపీని కూడా ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోండి.
12. ఏ కారణం వల్లనైనాగాని నకిలీ కాగితాలు లేదా ఏవైనా నకిలీ లావాదేవీల మీద సంతకం పెట్టటానికి అంగీకరించకండి.
13. మీ తరఫున మరియు పెళ్ళి కొడుకు తరఫున కావల్సిన ఇతర లాంఛనాలు, మరియు వీసా జారీకి అవసరమైన కాగితపు పనంతటినీ పూర్తి చేయండి. అసలు కాగితాలన్నింటిని మీతోటే ఉంచుకోండి. విదేశాలలో చాలా తక్కువ సాంఘిక ఒత్తిడి ఉంటుంది. భర్త భార్యను స్పాన్సర్ చేయనిదే వీసాలు అంత సులభంగా దొరకవు. పెళ్ళికొడుకు తన భార్యను ఏదో ఒక కారణం మీద ఆమె దేశంలో వదిలి వేయగలడు, మరియు తరచు ఆమె డబ్బుతో స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇక మీద జాగ్రత్తగా ఉండండి.
విదేశాలలో వుండి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళల కోసం
. (USA) Asha Helpline Ph.no. 202-2305186/18884172742 email : coordinator@ashaforwomen.org
2. (Australia) Women’s domestic violence crisis services of Victoria Ph. No. 1800015188/84136800
3. Willington Domestic Violence Resource Centre Ph. No. 03-94869844
4. Manavi End Violence in the lives of South asian Women – P.O. Box. 3103, New Brunswick Ph. No. (732) 435-1414747-4 email.minu@manavi.org/www.manavi.org
5. NRI Cell – 040-27852246
హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
మీకు పోలీస్‌స్టేషన్లలోగాని, మరెక్కడైనా గానీ సరైన న్యాయం జరగలేదని భావిస్తే మీరు నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం ద్వారాగాని, టెలిగ్రామ్ ద్వారాగానీ మీ విజ్ఞాపనను పంపుకోవచ్చు.
అడ్రస్: హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ సిటీ కాలేజీ దగ్గర, మదీనా, చార్‌మినార్, హైదరాబాద్ ` 500066
హైకోర్టులో వేసిన కేసులకు సంబంధించిన సమాచారం ` అంటే కేసు ఏ స్థితిలో వుంది, ఎప్పుడు బెంచి మీదికి వస్తుంది, తదుపరి వాయిదా ఎప్పుడుంటుంది లాంటి విషయలు తెలుసుకోవడానికి ఈ దిగువ సమాచారం ఉపయోగపడుతుంది.
మీ కేసుల స్థితిగతుల గురించి 040`23446140 ఫోన్ చేయవచ్చు. అలాగే 52345 (బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ వన్) నంబర్‌కి ఎస్‌ఎంఎస్ చేసినా మీకు సమాచారం లభిస్తుంది. ఈ మెయిల్ : aజూష్ట్రషఏaజూ.అఱష.ఱఅ వెబ్‌సైట్ : ష్ట్ర్‌్‌జూ://ష్ట్రష.aజూ.అఱష.ఱఅ
కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలలో ర్యాగింగ్‌ని నిషేధిస్తూ ప్రభుత్వం 1997 లో ర్యాగింగ్ నిరోధక చట్టం నెం. 26 ను తీసుకొచ్చింది. ర్యాగింగ్ అంటే విద్యార్థినీ విద్యార్థులను పీడిరచడం, కలవరపెట్టడం, చిన్న బుచ్చడం, వారిపై దౌర్జన్యం చేయడం, బెదిరించడం, ఘోరమైన హాని తలపెట్టడం, అపహరణ, బలాత్కరించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం.
ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది?
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యాన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఉపాధ్యక్షుడిగా, రెవెన్యూ డివిజనల్ అధికారి, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, విద్యా సంస్థల అధిపతులు (ప్రిన్సిపాల్) సభ్యులుగా ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంఘం కళాశాలల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రెండు సార్లు కలిసి, ర్యాగింగ్ నిరోధక చర్యలను రూపొందించి అమలు పరుస్తారు.
ప్రతి కళాశాలలోను ర్యాగింగ్ నిరోధక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపన్యాసకులు, విద్యార్థినీ విద్యార్థుల ప్రతినిధులు ఉంటారు. కళాశాలలందు ర్యాగింగ్ చేసినట్లయితే ఎదుర్కోవలసిన పరిణామాలను తెలియజేసే ప్రకటనలను రాతపూర్వకంగా ప్రదర్శిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్ చేయం అనీ, చేసినట్లయితే తగిన శిక్షకు తమదే బాధ్యత అనీ రాత పూర్వక హామీపత్రాలను కళాశాల అధికారులకు అందజేయవలసి వుంటుంది.
ర్యాగింగ్ నివారణకు సూచనలు
బ జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 1800 180 2255 నెంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కారాన్ని పొందవచ్చు. ఇ`మెయిల్ : helpline@antiragging.in
బ ర్యాగింగ్ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
బ కమిటీలో అనుభవం ఉన్న ప్రొఫెసరు, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని భాగస్వామిని చేయాలి.
బ సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య సత్సంబంధాలు నెరపేలా హాస్టల్ వార్డెన్‌లు కృషి చేయాలి.
బ నూతనంగా కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రత్యేకమైన బ్లాక్‌ను ఏర్పాటు చేయాలి.
బ 1997 ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అతిక్రమించిన వారిపై పెట్టే కేసులను వివరించే బ్యానర్లను కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు కనపడేలా ఉంచాలి.
బ విద్యార్థి సంఘాలను భాగస్వామ్యం చేసి అవగాహన కల్పించాలి.
బ ర్యాగింగ్ జరిగిన విషయాన్ని విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే యాజమాన్యం పై చర్యలు తప్పవు.
బ విద్యార్థులు హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవడంతో పాటు నేరుగా ఫోన్ 9490616301 లో సంప్రదించవచ్చు.
బ మీ కళాశాలలో ర్యాగింగ్ నిరోధక సంఘానికి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. భయపడొద్దు. స్థానిక రెవెన్యూ అధికారికి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ర్యాగింగ్ చేసిన వారికి విధించబడే శిక్షలు:
పీడిరచుట, కలవరపెట్టుట, చిన్నబుచ్చుట: ఆరు నెలల పాటు జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండునూ
దౌర్జన్యం, నేర ప్రవృత్తి, బెదిరించడం: సంవత్సరకాలం జైలు శిక్ష లేదా రూ. 2000 వరకు జరిమానా లేదా రెండునూ
తప్పుడు పద్ధతిలో నియంత్రించడం,
అవరోధించడం, అపకారం చేయడం: రెండేళ్ళ పాటు జైలు శిక్ష లేదా రూ. 5000 వరకు జరిమానా లేదా రెండునూ
ఘోరమైన హాని తలపెట్టడం, అపహరించడం,
అసహజమైన అపరాధం: 5 సం॥ల పాటు జైలు శిక్ష లేదా రూ. 10000 వరకు జరిమానా లేదా రెండునూ
మరణకారణమగుట, ఆత్మహత్యకు ప్రేరేపించడం: 10 సం॥ల పాటు జైలు శిక్ష లేదా రూ. 50000 వరకు జరిమానా లేదా రెండునూ
ఉచిత న్యాయ సహాయం (ణూA)
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాలవారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక, ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు. ఫలితంగా 1976 వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి
ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించినారు.
అంతేకాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించారు. ఇదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారు.
అర్హులు : ఈ చట్టం, దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ పేర్కొన్న వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు.
శ్రీ షెడ్యూల్డ్ కులం లేక తెగకు చెందినవారు
శ్రీ మానవ అక్రమ రవాణా భాధితులు, యాచకులు
శ్రీ స్త్రీలు, పిల్లలు
శ్రీ మతి స్థిమితం లేనివారు, అవిటివారు
శ్రీ సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు. పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.
శ్రీ పారిశ్రామిక కార్మికులు
శ్రీ ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టం 1956 లో సెక్షన్ 2 (జి) లో తెలిపిన ‘‘నిర్బంధం’’, (సంరక్షణ నిర్బంధంతో సహా) లేక బాల నేరస్తుల న్యాయచట్టం 1986 సెక్షన్ 2 (జె) లో తెలిపిన నిబంధనలో మెంటల్ హెల్త్ చట్టం 1987 సెక్షన్ (జి) లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో ‘‘నిర్భంధం’’ లో వున్న వ్యక్తులు.
శ్రీ వార్షిక ఆదాయం రూ. 50,000/` (యాభై వేలు) కు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.
దరఖాస్తు చేయు పద్ధతి
న్యాయ సహాయం కోరువారు తమ కేసు యొక్క పూర్వాపరాలు, కావల్సిన పరిష్కారం (రిలీఫ్) వివరిస్తూ అఫిడవిట్‌ను, సంబంధిత డాక్యుమెంటులను జత చేస్తూ దరఖాస్తు చేసుకొనవలసి వుంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంతమేరకు) పంపిన యెడల నిబంధనల మేరకు తగు చర్య తీసుకొనబడును.
దరఖాస్తు చేయవలసిన చిరునామా
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమతమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు గల జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు గాని, రాష్ట్ర హైకోర్టునందు గల రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకుగాని తమ యొక్క కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును.
1. సెక్రటరీ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా కోర్టు భవనములు, లేదా
2. మెంబరు సెక్రటరీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, న్యాయ సేవా సదన్, సిటీ సివిల్ కోర్టు భవనములు, పురానాహవేలి, హైదరాబాద్ ` 500 002.
న్యాయ సహాయ విధానాలు
1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట 2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట. 3. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులను భరించుట. 4. న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్ల నకళ్ళు ఉచితంగా ఇచ్చుట, మొదలగు సహాయాలు అందించబడతాయి.
వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కోసం జరిగే
‘‘మానవ అక్రమ రవాణా’’ కేసులను పరిశోధించే పోలీసు అధికారులకు ప్రామాణిక మార్గదర్శకాలు
వ్యాపార లైంగిక దోపిడీ కోసం చేసే బాలల అక్రమ రవాణాలో వివిధ కోణాలు
మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థాగతమైన నేరం. ఇందులో మానవులను ఎలాంటి దోపిడీ కోసం కొనుగోలు చేయడం లేదా విక్రయించడం జరుగుతుందో ముందుగా అర్ధం చేసుకోవాలి. మానవ అక్రమ రవాణా ముఖ్యంగా వ్యాపార లైంగిక దోపిడీ కోసం, ఇళ్ళలో పనిచేయించుకోవడానికి లేదా వెట్టి చాకిరీ చేయించుకోవడానికి, దత్తత చేసుకోవడానికి, నగ్న చిత్రాలు తీసేందుకు, భిక్షాటన చేయించి సొమ్ము చేసుకునేందుకు, అవయవాలను దొంగిలించేందుకు లేదా వేరే ఇతర ప్రయోజనాల కోసం జరుగుతుంది. ఇందులో వ్యాపార లైంగిక దోపిడీలో లైంగిక వాంఛలు సంతృప్తి పరచడం కోసం జరిగే అక్రమ రవాణా కీలకమైనది. లైంగిక వాంఛ తీర్చుకోవడం అనే డిమాండ్‌ను తట్టుకునేందుకు బాలలు లేదా మహిళలను సరఫరా చేయడం అనే ప్రక్రియ భాగమై వుంది. అంటే వ్యాపార లైంగిక దోపిడీ (కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ` జూజు) వెనక డిమాండ్ / సరఫరా సూత్రం ప్రధానం, అంటే వినియోగదారుడి నుంచి డిమాండ్ ఉంటేనే వస్తు సరఫరా జరుగుతుంది లేకుంటే నిలిచిపోతుంది. ఈ వినియోగదారుడి డిమాండ్ తీర్చేందుకు పలువురు నేరస్తులు రంగంలోకి దిగి అమ్మాయిలను లొంగదీసుకుని, రవాణా చేసి వ్యభిచార గృహాలకు చేర్చి వారిని తార్చుతూ ఉంటారు. ఆ విధంగా ఈ కేసుల్లో వ్యవస్థీకృతమైన నేరస్థుల ముఠా తయారవుతుంది. అందువల్ల ముందుగా డిమాండును ఆరికట్టవలసి ఉంది.
ఈ నేరస్థుల జాబితాలో ముందుగా నియామకుడు, విటుడు లేక కొనుగోలుదారుడు, విక్రేత, రవాణాదారుడు, బ్రోతల్ ఓనర్ (వ్యభిచారగృహ యజమాని), రుణదాత (ఈ వ్యాపారం కొనసాగేందుకు ఆర్ధిక సహాయం చేసేవాడు), ఫైనాన్షియల్‌తో పాటుగా ఈ నేరంలో పాల్గొనే వ్యక్తులందరూ ఉంటారు. ఒక అమ్మాయిని గుర్తించి వినియోగదారుడికి చేర్చేవరకు ఈ నేర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అంతవరకూ ఆ అమ్మాయిని వివిధ స్థాయిలోని వ్యక్తులు, వివిధ రూపాలలో దోచుకుంటూనే ఉంటారు. ఆ బాధితురాలిని రక్షించేంత వరకు ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయిని రక్షించిన తర్వాత కూడా తగినవిధంగా పునరావాసం లభించకపోతే ఆమో తిరిగి అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉంది.
అక్రమ రవాణాకు గురైన వ్యక్తిపై లైంగిక దోపిడీ వ్యభిచార గృహాల్లోనే గాక మసాజ్ పార్లర్, పర్యాటక కేంద్రాలు, సంరక్షణ గృహాలు లేదా పనిచేసే చోటు లేదా మరే చోటైనా జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంటి పనికోసం కుదుర్చుకున్న వ్యక్తుల, ముఖ్యంగా హహిళలు, పిల్లల మీద ఆ యింటి యజమాని లేదా అతని బంధు మిత్రులు ఆకృత్యాలకు పాల్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో లైంగిక దోపిడీతో పాటు కార్మిక చట్టాల్లోని నిబంధనలను కూడా వర్తింపజేయవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఆ మహిళ / బాలిక స్వయంగా అంగీకరించి స్వచ్ఛందంగా లొంగిపోయి పురుషుడి కామవాంఛ తీర్చినట్టు కనిపించవచ్చు. కానీ లోతుగా ప్రశ్నిస్తే ఇది బలవంతంగా అంగీకరించడమో లేక ప్రలోభాలకు లేక మోసపూరితమైన వాగ్దానాలకు లొంగిపోవడమో జరిగి ఉండవచ్చునని స్పష్టమవుతుంది. అలాంటప్పుడు అది స్వేచ్ఛాయుతమైన, సంపూర్ణమైన అంగీకారం కానేకాదు కాబట్టి ‘‘అక్రమ రవాణా’’ కిందికే వస్తుంది.

బ జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 1800 180 2255 నెంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కారాన్ని పొందవచ్చు. ఇ`మెయిల్ : ష్ట్రవశ్రీజూశ్రీఱఅవఏaఅ్‌ఱతీaస్త్రస్త్రఱఅస్త్ర.ఱఅ

లింగ మార్పిడి వ్యక్తుల (హక్కుల రక్షణ) బిల్లు, 2019
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) బిల్లు, 2019ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్ జులై 19, 2019న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
లింగమార్పిడి వ్యక్తి యొక్క నిర్వచనం: బిల్ లింగమార్పిడి వ్యక్తిని పుట్టినప్పుడు కేటాయించిన లింగంతో సరిపోలని వ్యక్తిగా నిర్వచిస్తుంది. ఇందులో ట్రాన్స్`మెన్ మరియు ట్రాన్స్`ఉమెన్, ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు ఉన్న వ్యక్తులు, లింగ`క్వీయర్‌లు మరియు కిన్నార్ మరియు హిజ్రా వంటి సామాజిక`సాంస్కృతిక గుర్తింపులు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు వంటి అంటే పుట్టినప్పుడు అతని లేదా ఆమె ప్రాథమిక లైంగిక లక్షణాలు, బాహ్య జననేంద్రియాలు, క్రోమోజోమ్‌లు లేదా మగ లేదా స్త్రీ శరీరం యొక్క సాధారణ ప్రమాణం నుండి హార్మోన్లలో వైవిధ్యాన్ని చూపించే వ్యక్తి అని అర్థం.
వివక్షకు వ్యతిరేకంగా నిషేధం: బిల్ లింగమార్పిడి వ్యక్తిపై వివక్షను నిషేధిస్తుంది. ఇందులో సేవానిరాకరణ లేదా అన్యాయమైన చికిత్సః (1) విద్య (2) ఉపాధి (3) ఆరోగ్య సంరక్షణ (4) ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువులు, సౌకర్యాలు, అవకాశాలను యాక్సెస్ చేయడం లేదా అనుభవించడం (5) ఉద్యమం హక్కు (6) నివాసం, అద్దెకు లేదా ఆస్తిని ఆక్రమించే హక్కు (7) ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించే అవకాశం మరియు (8) లింగమార్పిడి వ్యక్తి సంరక్షణ లేదా అదుపులో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థకు యాక్సెస్.
నివాస హక్కు: ప్రతి లింగమార్పిడి వ్యక్తికి నివాసం మరియు అతని ఇంటిలో చేర్చుకునే హక్కు ఉంటుంది. తక్షణ కుటుంబం లింగమార్పిడి చేయని వ్యక్తిని చూసుకోలేకపోతే, సమర్థ న్యాయస్థానం ఆదేశాల మేరకు వ్యక్తిని పునరావాస కేంద్రంలో ఉంచవచ్చు.
ఉపాధి: రిక్రూట్‌మెంట్ మరియు ప్రమోషన్‌తో సహా ఉద్యోగ విషయాలలో లింగమార్పిడి చేసిన వ్యక్తి పట్ల ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ వివక్ష చూపకూడదు. చట్టానికి సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి సంస్థ ఒక వ్యక్తిని ఫిర్యాదు అధికారిగా నియమించాలి.
విద్య: సంబంధిత ప్రభుత్వం నిధులు లేదా గుర్తింపు పొందిన విద్యా సంస్థలు లింగమార్పిడి వ్యక్తులకు వివక్ష లేకుండా విద్య, క్రీడలు మరియు వినోద సౌకర్యాలను అందిస్తాయి.
ఆరోగ్య సంరక్షణ: లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు ప్రత్యేక హెచ్‌ఐవి నిఘా కేంద్రాలు మరియు లింగమార్పిడి శస్త్రచికిత్సలతో సహా ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వైద్య పాఠ్యాంశాలను సమీక్షిస్తుంది మరియు వారికి సమగ్ర వైద్య భీమా పథకాలను అందిస్తుంది.
లింగ మార్పిడి వ్యక్తికి గుర్తింపు ధృవీకరణ పత్రం: లింగమార్పిడి వ్యక్తి గుర్తింపు ధృవీకరణ పత్రం కోసం జిల్లా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. లింగాన్ని ‘లింగమార్పిడి’గా సూచిస్తారు. వ్యక్తి వారి లింగాన్ని మగ లేదా స్త్రీగా మార్చుకోడానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే మాత్రమే సవరించిన సర్టిఫికెట్ పొందవచ్చు.
ప్రభుత్వ సంక్షేమ చర్యలు: లింగమార్పిడి చేసిన వ్యక్తులను సమాజంలో పూర్తిగా చేర్చేందుకు మరియు వారి భాగస్వామ్యం ఉండేలా సంబంధిత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బిల్లు పేర్కొంది. ఇది వారి రెస్క్యూ మరియు పునరావాసం, వృత్తి శిక్షణ మరియు స్వయం ఉపాధి కోసం చర్యలు తీసుకోవాలి, లింగమార్పిడి కోసం సున్నితమైన పథకాలను రూపొందించాలి మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
నేరాలు మరియు జరిమానాలు: లింగమార్పిడి వ్యక్తులపై కింది నేరాలను బిల్లు గుర్తిస్తుంది: (1) బలవంతంగా లేదా బంధిత కార్మికులు (ప్రజా ప్రయోజనాల కోసం నిర్బంధ ప్రభుత్వ సేవను మినహాయించి), (2) బహిరంగ స్థలాల వినియోగాన్ని తిరస్కరించడం, (3) ఇల్లు మరియు గ్రామం నుండి తొలగించడం, (4) శారీరక, లైంగిక, శబ్ద, భావోద్వేగ లేదా ఆర్థిక దుర్వినియోగం. ఈ నేరాలకు జరిమానాలు ఆరు నెలలు మరియు రెండు సంవత్సరాల మధ్య మారుతూ ఉంటాయి మరియు జరిమానా.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ఎన్సీటీ): ఎన్సీటీలో ఇవి ఉంటాయి: (1) కేంద్ర సామాజిక న్యాయ మంత్రి (ఛైర్‌పర్సన్) (2) సామాజిక న్యాయం కోసం రాష్ట్ర మంత్రి (వైస్ ఛైర్‌పర్సన్) (3) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (4) ఆరోగ్యం, హోమ్ వ్యవహారాలు మరియు మానవ వనరుల అభివృద్ధితో సహా మంత్రిత్వ శాఖల నుండి ఒక ప్రతినిధి. ఇతర సభ్యులలో నీతి ఆయోగ్ మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. కౌన్సిల్‌లో ట్రాన్స్‌జెండర్ల సంఘం నుండి ఐదుగురు సభ్యులు మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి ఐదుగురు నిపుణులు కూడా ఉంటారు.
లింగమార్పిడి వ్యక్తులకు సంబంధించి విధానాలు, చట్టం మరియు ప్రాజెక్టుల ప్రభావాన్ని పర్యవేక్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కౌన్సిల్ సలహా ఇస్తుంది. ఇది ట్రాన్స్‌జెండర్ల ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తుంది.
ఉమెన్ సేఫ్టీవింగ్, లక్డికపూర్
ట్రాన్స్ జెండర్స్ (ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ) వ్యక్తుల ప్రొటెక్షన్ సెల్ ` తెలంగాణ పోలీస్
భారత రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం కలిపిస్తూ అందరినీ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో సహా కలుపుకొని పోయి ఉండే సమ సమాజం ఉండాలని నిర్దేశిస్తుంది.
లక్ష్యాలు:
్న ట్రాన్స్ జెండర్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తుల యొక్క హక్కులపై అవగాహన కల్పించడం, చట్టపరంగా వారికి
ఉన్నటువంటి భద్రత మరియు రక్షణలు ఉండేలా చేయటం.
్న ట్రాన్స్ జెండర్స్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తులపై జరిగే దాడులు, హింస పెరగకుండా పర్యవేక్షించడం మరియు కేసులను పర్యవేక్షించడం.
్న ట్రాన్స్ జెండర్‌లకు మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తులకు బహిరంగ ప్రదేశాలు స్వేచ్ఛగా, సురక్షితంగా, అందుబాటులో
ఉండేలా చేయటం.
్న పోలీసులకు, ట్రాన్స్ జెండర్‌ల మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తుల యొక్క సమస్యలపై అవగాహన కల్పించడం.
్న వీరికి పోలీసుల నుండి సంపూర్ణమైన సహాయ సహకారాలను అలాగే ఇతర నెట్‌వర్క్‌ల నుండి అవసరమైన సేవలను అందించడం.
్న ట్రాన్స్ జెండర్స్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తుల ప్రొటెక్షన్ సెల్స్ రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది.
సందర్భం:
్న భారత రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ (ఆర్టికల్ 19 (1)(ఎ)) మరియు సమానత్వ హక్కు (ఆర్టికల్ 14) ఏ లింగ భేదం లేకుండా, అందరి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నిర్మించబడ్డాయి.
్న 15 ఏప్రిల్ 2014లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నల్సా పం. భారత యూనియన్ కేసులో మొట్టమొదటి సారిగా ప్రతి వ్యక్తికి వారి జెండర్‌ని స్వయంగా ఎలాంటి వైద్య పరీక్ష లేకుండా, ఆడా, మగా, ట్రాన్స్‌జెండర్‌గా నిర్ధారించుకునే ప్రాథమిక హక్కును కల్పిస్తూ, అలాగే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రాజ్యాంగ హక్కులను కల్పిస్తూ తీర్పునిచ్చింది.
్న 2017 ఆగస్టులో పుట్టుస్వామి పం. భారత యూనియన్ కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గోప్యత హక్కును (రైట్ టూ ప్రైవసీ) ని సమాన హక్కు Ê జీవించే హక్కు (రైట్ టూ లైఫ్)లో అంతర్భాగమని చెప్తూ, పౌరులు వారికి నచ్చిన సంబంధాలలో
ఉండడం, లైంగికత్వ హక్కు, అలాగే స్వీయ లింగ నిర్ధారణ హక్కులో భాగం చేస్తూ తీర్పునిచ్చింది.
్న 2018 సెప్టెంబరులో నవతేజ్‌సింగ్ జోహార్ పం. భారత యూనియన్ కేసులో భారత శిక్షా స్మృతిలో భాగమైన సెక్షన్ 377 కి సంబంధించి సమ లైంగిక సంబంధాలు నేరం కాదు అని తీర్పునిచ్చింది. ూGదీు హక్కుల సంఘర్షణ చరిత్రలో ఇది ఒక ప్రముఖమైన తీర్పు.
్న ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం 2019 మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల సంరక్షణ) రూల్స్‌ని చట్టబద్దం చేసింది. ఇవి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాలను, హక్కుల సంరక్షణను కల్పిస్తూ ప్రతిపాదించినవి.
ప్రైడ్ ప్లేస్ ఎందుకు?
చారిత్రక, వ్యవస్థీకృతమైన హింసకు, ఆర్థిక, వివక్షతకు, సామాజిక వెనుకబాటుతనానికి క్వీర్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, సమూహాలు గురవుతున్నారు. అత్యున్నత న్యాయస్థానాల తీర్పులను, ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు పరుస్తూ, వారి రక్షణ, భద్రతలను కల్పించడంలో విమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్, ముఖ్య పాత్ర పోషించగలమని దృఢంగా నమ్ముతున్నాము.
ఇది మేము మా కొత్త ఇనీషియేటివ్ అయిన ‘ప్రైడ్ ప్లేస్`ట్రాన్స్‌జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల యొక్క ప్రొటెక్షన్ సెల్’ ద్వారా చేయాలనుకుంటున్నాము.
ప్రైడ్ ప్లేస్, విమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యొక్క కార్యక్రమాలలో భాగం. ప్రైడ్ ప్లేస్ ద్వారా ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల పట్ల జరిగే హింసను అరికడుతూ, వారికి భద్రతను, రక్షణను కల్పించబడుతుంది. ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) సమూహాలతో కలిసి పనిచేస్తూ, లింగం, లైంగికత్వం ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని పోయే సమాజాన్ని నిర్మించే దిశగా ఈ ప్రయత్నం.
కొన్ని తెలుసుకోవలసిన విషయాలు:
సెక్స్:
సెక్స్ వ్యక్తి యొక్క శారీరక అంశాలకు (క్రోమోజోమ్స్, గోనాడ్స్, హార్మోన్స్, ప్రత్యుత్పత్తి అవయవాలు, ద్వితీయ లైంగిక లక్షణాలకు) సంబంధించిన విషయం. వీటి ఆధారంగా వ్యక్తులను ఆడా, మగా, లేదా ఇంటర్ సెక్స్ వ్యక్తులుగా పరిగణించవచ్చు. ఈ శారీరక అంశాలు పరస్పర భిన్నత్వం కలిగి అందరికీ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.
లైంగికత్వం:
ఇతర వ్యక్తుల పట్ల ఉండే లైంగిక ఆకర్షణను లైంగికత్వం అంటారు. లైంగికత్వం Ê సెక్స్ రెండూ భిన్నమైన విషయాలు. లైంగికత్వం, లైంగిక ఆకర్షణకు సంబంధించిన విషయం. సెక్స్ శరీర అంశాలు/ అవయవాలకు సంబంధించిన విషయం.
లింగం:
సామాజిక, సాంస్కృతిక పరిణామ క్రమంలో వ్యక్తులను వారి, వారి సెక్స్ ఆధారంగా వివిధ వర్గాల్లో విభజించి, దాని ఆధారంగా వారికి తగ్గ పనులు, బట్టలు, రూపం మొదలైనవి ఆపాదిస్తూ చేసేది జెండర్ (లింగం) ప్రక్రియ.
లింగ అస్తిత్వం:
ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తాను ఆడా, మగా, లేదా రెండిరటి మిశ్రమం లేదా వేరే అస్తిత్వమా అనేది వ్యక్తులు వారి గురించి వారు ఏమనుకుంటున్నారు, వారిని వారు ఏమని సంబోధించుకుంటారు, ఇవి లింగ అస్తిత్వంలో భాగం. ఒక వ్యక్తి యొక్క లింగ అస్తిత్వం వారికి పుట్టినప్పుడు ఇచ్చిన సెక్స్‌తోనే ఉండవచ్చు లేదా అందుకు భిన్నమై ఉండవచ్చు.
సీస్ జెండర్ వ్యక్తి:
చాలామందిలో పుట్టుకతో వారికి ఆపాదించబడే సెక్స్‌కు, ఎదుగుతున్న క్రమంలో రూపొందే జెండర్ గుర్తింపునకు మధ్య పొత్తు
ఉంటుంది. వారిని సీస్ జెండర్ వ్యక్తులు అంటారు.
ట్రాన్స్ జెండర్ వ్యక్తులు:
చాలా మందికి పుట్టుకతో వారికి ఆపాదించబడే సెక్స్‌కు, ఎదుగుతున్న క్రమంలో రూపొందే జెండర్ గుర్తింపునకు మధ్య పొత్తు
ఉండదు. వారిని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అంటారు. (ఈ వ్యక్తులు ఎలాంటి వైద్య పరమైన చికిత్స తీసుకోని వారు కూడా అయి ఉంటారు) ఇందులో స్త్రీ, పురుషులలో ఇమిడే అస్తిత్వాలు అయినా ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు, ఇమడని అస్తిత్వాలు అయినా జెండర్, క్వీర్, ట్రాన్స్ ఫెమినైన్, ట్రాన్స్ మాస్క్యులైన్ అస్తిత్వాలు కూడా ఉంటాయి.
PridePlace.WSW.TS – https://womensafetywing.telangana.gov.in
9440700906 – transcell.wsw@taspolice.gov.in