మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ -భూమిక టీమ్‌

భూమిక టీమ్‌
భూమిక హెల్ప్‌లైన్‌ : 1800 425 2908
సమస్యల్లో ఉన్న, హింసకు గురౌతున్న మహిళలకు సలహా, సమాచారం కోసం
సమస్యల్లో ఉన్న మహిళలకు సాంత్వననిచ్చి, వారికి భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ 2006 సంవత్సరంలో డిసిపి సౌమ్యామిశ్రాగారి చేతులమీదుగా ప్రారంభమైంది. ప్రారంభంలో 8

గంటలపాటు టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా సేవలు అందించబడేవి. సమస్యల్లోని మహిళల అవసరార్థం ఈ సేవలు 24 గంటలపాటు విస్తరించాయి. 3 షిఫ్టులలో సుశిక్షుతులైన కౌన్సిలర్లచే ఇది నిర్వహించబడుతోంది. ఈ హెల్ప్‌లైన్‌ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల బాధిత స్త్రీలతోపాటు దేశం నలుమూలల నుంచి వినియోగించుకుంటున్నారు. ఈ ఫోన్‌ టోల్‌ఫ్రీ కాబట్టి ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. కొంతమంది ఫోన్‌కాల్‌తో పాటు ఈ మెయిల్‌ ద్వారా కూడా తమ సమస్యలను తెలియపరుస్తారు.
` గోప్యత పాటించడం హెల్ప్‌లైన్‌ ముఖ్య ఉద్దేశ్యం.
` బాధిత స్త్రీల సమస్యలను సానుభూతితో వినడం, అవసరమైన సమాచారంతో సమస్యను పరిష్కరించుకునే మార్గాలను తెలియచేయటం.
` సమస్యల్లో ఉన్న స్త్రీలకు ధైర్యాన్ని అందించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించడం.
` స్త్రీల కోసం పనిచేస్తున్న సంస్థలతో అనుసంధానం చేయటం.
` సమస్యల్లో ఉండి డిప్రెషన్‌లో ఉన్న స్త్రీలకు మానసిక వైద్య నిపుణుల సహాయం అందేలా ప్రోత్సహించటం, ఎక్కడికి వెళ్ళాలో సూచించటం.
` న్యాయపరమైన సలహాలు/సూచనల కోసం కోర్టు పద్ధతులను, కోర్టు పని విధానాన్ని అర్థం చేయించడం కోసం ప్రతి శనివారం హెల్ప్‌లైన్‌లో న్యాయవాదులచే సలహాలు ఇప్పించడం.
` స్త్రీల సహాయార్ధం ఉన్న సహాయ సంస్థల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ, బాధిత స్త్రీలకు తెలియపరచటం, సహాయాన్ని అందచేయడం.
` హెల్ప్‌లైన్‌ నిర్వహణ ద్వారా సమస్యల్లో ఉన్న స్త్రీలకు అందుతున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 9వ తరగతి ‘‘సాంఘిక శాస్త్రం’’ పాఠ్యపుస్తకంలో హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరును ‘‘స్త్రీలు మరియు పిల్లల చట్టాలు’’ అనే పాఠంలో ప్రింట్‌ చేయడం ద్వారా విద్యార్ధులకు నంబరును అందుబాటులోకి తెచ్చారు.
సపోర్ట్‌సెంటర్‌ ` మహిళా పోలీస్‌ స్టేషన్‌, సరూర్‌నగర్‌
ఈ మహిళా పోలీస్‌స్టేషన్‌ డిసెంబర్‌ 2016లో భగత్‌నగర్‌, సరూర్‌నగర్‌లో ప్రారంభించ బడిరది. ఈ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన నాటి నుంచి భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ నుండి ఇద్దరు కౌన్సిలర్లు తమ సేవలనందిస్తున్నారు. ఈ స్టేషన్‌కు ప్రతిరోజూ సమస్యలలో ఉన్న స్త్రీలు వస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్‌ జీతాన్ని రాచకొండ కమిషనరేట్‌ చెల్లించడం ద్వారా స్త్రీల సమస్యల పట్ల పోలీస్‌ వ్యవస్థ సానుకూలంగా స్పందిస్తున్నటానికి ఉదాహరణంగా చెప్పవచ్చు. వివిధ రకాల కుటుంబ సమస్యలతో ఇక్కడకు వచ్చే స్త్రీలకు తగిన సలహా, సహాయం అందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగేలా వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. వచ్చేవారి సమస్యలను బట్టి వారికి డివిసెల్‌, సఖి సెంటర్‌, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వివరాలతో పాటు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనవారికి ఆ అలవాటును మార్చుకునేందుకు సాయం చేసే డీ అడిక్షన్‌ సెంటర్లు, మానసికంగా బాధపడే వారికి మానసిక చికిత్సా కేంద్రాల అడ్రస్‌లను, కాంటాక్ట్‌ పర్సన్‌ వివరాలను అందిస్తూ వారితో అనుసంధానిస్తారు.
భూమిక తరపున పనిచేస్తున్న కౌన్సిలర్స్‌ ఈ స్టేషన్‌కు వచ్చే బాధిత స్త్రీలకు కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో పాటు, సంబంధిత (మహిళా) చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. అంతేకాక ఆయా స్త్రీల పరిస్థితిని, అవసరాన్ని బట్టి తాత్కాలిక, శాశ్వత ఆశ్రయం కల్పించటం, వారు స్వయంశక్తితో జీవనోపాధి పొందేలా ఏర్పాట్లు చేయటం, వారి పిల్లలను హాస్టల్‌లో చేర్పించటం ద్వారా వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడటం, వైద్య సదుపాయం అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళటం, వారి సమస్య ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రానట్లయితే సంబంధిత స్టేషన్లలో కేసు నమోదు చేయటం, ఎప్పటికప్పుడు కేస్‌ను ఫాలోఅప్‌ చేయడంతోపాటు బాధిత స్త్రీలకు అన్నిరకాలుగా అండగా నిలబడడం జరుగుతోంది.
అడ్రస్‌ : మహిళా పోలీస్‌ స్టేషన్‌, సరూర్‌నగర్‌. ఫోన్‌ నెం. 040`27853901
సపోర్ట్‌ సెంటర్‌ ` మహిళా పోలీస్‌స్టేషన్‌, గచ్చిబౌలి
సైబరాబాదు పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మహిళలకు బాసటగా నిలిచేందుకుగాను మహిళా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించారు. 2015 డిసెంబరు 5న భూమిక ఆధ్వర్యంలో సపోర్ట్‌ సెంటర్‌ మొదలైంది.
ఈ సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు ధైర్యం కల్పించడంతో పాటు సమస్యను అధిగమించడానికి అవసరమైన కౌన్సిలింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ సెంటర్‌లో ఇద్దరు సుశిక్షితులైన కౌన్సిలర్లు తమ సేవలనందిస్తున్నారు.
సమస్యతో వచ్చిన మహిళకు ముందుగా ధైర్యం చెప్పి సమస్యను అధిగమించటానికి కావలసిన నమ్మకాన్ని కలిగించటం కౌన్సిలింగ్‌ ప్రక్రియలో మొదటి భాగం. తన సమస్యను సామరస్యంగా వినటం వల్ల బాధిత మహిళకు కొంత ఊరట కలుగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి, కేసు పరిస్థితిని బట్టి కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరి వారికి ముందు విడివిడిగాను, తర్వాత కలిపి కౌన్సిలింగ్‌ చేయటం ద్వారా సమస్యను అర్థం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు చట్టాలపైన అవగాహన, సంబంధిత కేసుకు సంబంధించిన చట్టంపైన అవగాహన అందిస్తారు. అంతా జరిగాక సమస్య ఉన్న మహిళ తన సమస్యపై తాను నిర్ణయించుకున్న దాని ప్రకారం ఆమెకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తారు.
అడ్రస్‌ : ఐటి కారిడార్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌. ఫోన్‌ నెం. 91000 22826
భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , విజయవాడ
భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో స్పెషల్‌ సెల్‌ డిసెంబర్‌ 13, 2017 నుంచి పనిచేస్తోంది.
ఒక బాధిత మహిళ మహిళా పొలీస్‌ స్టేషన్‌కు వచ్చినపుడు వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి వారివారి సమస్యలను బట్టి వారిని వివిధ సహాయ వ్యవస్థలకు అనుసంధానం చేస్తారు. ఆమెకు న్యాయ సహాయం అందిస్తారు. అవసరమైతే ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఇంటికి కూడా వెళతారు. ఆమె తన సమస్యను పరిష్కరించుకొనేలా బలోపేతం చెయ్యడం కౌన్సిలర్‌ ముఖ్యమైన విధిగా ఉంటుంది.
అడ్రస్‌ : 1వ అంతస్తు, దిశా పోలీస్‌ స్టేషన్‌, కంట్రోల్‌ రూమ్‌, పండిత్‌ నెహ్రు బస్టాండ్‌ దగ్గర, విజయవాడ. ఫోన్‌ : 99496 33166
భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , రాజమండ్రి
2017 సంవత్సరంలో రాజమండ్రి మహిళా పోలీస్‌ స్టేషన్‌కు అనుబంధంగా రెడ్‌క్రాస్‌ బిల్డింగ్‌లో సపోర్ట్‌ సెంటర్‌ ప్రారంభించబడిరది. సమస్యలతో వచ్చిన స్త్రీలకు ముందు వ్యక్తిగతంగా సమస్యను అర్థం చేసుకుని వారికి సమస్యపట్ల అవగాహన కల్పించడం, సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులతో విడివిడిగాను, సమిష్టిగాను చర్చించడం జరుగుతుంది. సెంటర్‌కు వస్తున్న సమస్యల్లో ఎక్కువగా భార్యాభర్తల గొడవలు, సహజీవనం, వివాహేతర సంబంధం, పిల్లలు, కుటుంబాల పట్ల బాధ్యత లేకపోవడం, మద్యపానం, తాగివచ్చి కొట్టడం, కట్నం సమస్యలు వంటివి ముఖ్యమైనవి. బాధిత స్త్రీలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు, సమాచారం అందించడానికి సెంటర్‌లో లీగల్‌ అడ్వయిజర్‌ను నియమించాము. దీనిలో భాగంగా రాజమండ్రి స్పెషల్‌ సెల్‌కు లాయర్‌ వచ్చి కేసులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి న్యాయపరమైన హక్కులను పొందడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో వివరిస్తారు.
అడ్రస్‌ : 2వ అంతస్తు, రెయిన్‌ బో కలర్‌ ల్యాబ్‌ పైన, దేవి చౌక్‌, రాజమండ్రి. ఫోన్‌ నెం. 99498 44166
భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , రంపచోడవరం
2020 రంపచోడవరంలో IుణA వారితో కలిసి భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఏరియా హాస్పిటల్‌లో ఒక సపోర్‌నట సెంటర్‌ను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలు మరియు పిల్లలకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వారికి తగిన సలహాలను సూచనులను అందిస్తున్నాం.
ఈ ఏరియాలో బాల్య వివాహాలు కొంతమంది ప్రేమ పేరుతో ఇంటి నుండి వెళ్ళిపోవడం మోసగించబడి చిన్న వయసులో గర్భవతులవడం జరుగుతోంది. ఈ విషయాలపై మేము వారికి అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యలు చేపట్టటం జరుగుతుంది.
అడ్రస్‌: టి.ఇ.ఐ.పి. బిల్డింగ్‌, ఏరియా హస్పిటల్‌, రంపచోడవరం,
తూర్పు గోదావరి జిల్లా`533288. ఫోన్‌: 9490403709
భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , కరీంనగర్‌
తెలంగాణలో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదవుతున్న జిల్లాలలో కరీంనగర్‌ మొదటిది. కరీంనగర్‌ మహిళలకు ఆసరాగా ఉండేందుకుగాను, హింసకు గురవుతున్న మహిళలకు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఒక వేదికగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా మహిళా సపోర్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాము. ఈ సెంటర్‌ 2015 వ సం॥ నుండి తన సేవలను అందిస్తోంది. ఈ సెంటర్‌లో ఒక కౌన్సిలర్‌ ఉన్నారు. ఈ సెంటర్‌ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకు పని చేస్తుంది.
అడ్రస్‌: మంకమ్మ తోట, కరీంనగర్‌ ` 505 001. ఫోన్‌: 9491214479
‘షీ టీమ్స్‌’ తో కలిసి చేస్తున్న కార్యక్రమం
దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణా రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం నిర్వహించబడుతున్న కార్యక్రమం షీ`టీమ్స్‌. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి (ఎక్కడైతే మహిళలు ఎక్కువగా సంచరిస్తారో అలాంటి ప్రదేశాలు) బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురిచేసే వ్యక్తులను పట్టుకునేందుకు వీలుగా 60 టీమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే వేధింపులకు గురయ్యే మహిళలు వెంటనే సహాయం కోరుతూ 100 నంబరుకు ఫోన్‌ చేసేలా, వాట్సప్‌ మెసేజెస్‌ ద్వారా సమాచారం పంపించేందుకు 9490617444, ఫేస్‌బుక్‌ ద్వారా, ంష్ట్రవ్‌వaఎ.షవపవతీaపaసఏ స్త్రఎaఱశ్రీ.షశీఎ, Raషష్ట్రaసశీఅసa, నవసవతీaపaస కు మెయిల్‌ ద్వారా సమాచారం అందించవచ్చు.
డిసెంబర్‌, 2015 నుండి షీ టీమ్స్‌ ద్వారా పట్టుకోబడిన నిందితులకు భూమిక కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ కేసులకు సంబంధించిన నిందితులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.
ముందుగా నిందితులతో ముఖాముఖి సంభాషణ జరుపుతారు. తర్వాత తల్లి/తండ్రి లేదా భార్య సమక్షంలో సమస్యను, నిందితుడు చేసిన చర్యలను, వారిపై మోపబడిన ఆరోపణలను తెలియచేస్తారు. వారి కుటుంబ సభ్యులకు కూడా వారి బాధ్యతను, పిల్లలు, వారి ప్రవర్తనలపై ఎలాంటి అజమాయిషీ ఉండాలనే విషయాలను తెలియచేస్తారు. ఈ చర్యలవల్ల చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశాలున్నాయో, నిర్భయ చట్టం, పోక్సో చట్టం గురించిన సమగ్ర సమాచారాన్ని ఇస్తారు. మొదటిసారి నిందితుడిగా పట్టుబడితే చట్టప్రకారం శిక్షలు, సమాజంలో గౌరవం, చదువు యొక్క ప్రాముఖ్యత వంటి అంశాలపై సమాచారం ఇస్తారు. శిక్షలు పడితే దాని ప్రభావం జీవితంపై ఏ విధంగా పడుతుందో, ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియచేస్తారు. ఈ విషయం అంత సులువుగా తీసివేయవద్దని, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ఇకముందు మరలా అలా జరగకుండా చూడాలని, వారికి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలంటూ నిందితుని తల్లి/తండ్రి లేదా భార్యకి చెప్తారు. ఒకవేళ నిందితులు వారి తల్లి/తండ్రి లేదా భార్యని తీసుకురాకపోతే నిందితుడిని మరలా కౌన్సిలింగ్‌కి రావాలని, కుటుంబసభ్యులను తప్పకుండా తీసుకురావాలని సూచిస్తారు. ఇక్కడికి కౌన్సిలింగ్‌కి వచ్చే నిందితులలో 13 నుండి 65 కు పైబడిన వయస్సు కలిగిన పురుషులు… ముఖ్యంగా స్టూడెంట్స్‌, ప్రైవేటు ఉద్యోగులు, అసంఘటిత రంగంలోని కార్మికులు, ఐటి ఉద్యోగస్థులు ఉంటారు. ముఖ్యంగా బస్‌స్టాప్‌లలో, స్కూళ్ళు, కాలేజీల దగ్గర వేధింపులకు పాల్పడేవారు, సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసేవారు నిందితులుగా కౌన్సిలింగ్‌కు హాజరవుతారు.
వేధింపులకు గురైన మహిళలు, యువతులు వాట్సప్‌ నంబర్‌ ద్వారా రిపోర్టు చేస్తారు. అలాగే సంఘటన సమయంలో షీ టీమ్స్‌ ద్వారా పట్టుకోబడినవారు, స్పై కెమెరాల ద్వారా పట్టుబడిన వారు ఎక్కువగా ఉంటారు.
బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తున్న భూమిక, నారాయణ్‌పేట్‌
భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, నారాయణ్‌పేట్‌ జిల్లా మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని 102 గ్రామాలలో జులై 2015 నుండి పనిచేస్తోంది. బాల్య వివాహాల నిర్మూలన, యుక్తవయసు బాలబాలికలను స్వశక్తివంతులను చేయటం, బాల్యవివాహాలపై పనిచేసే సంస్థలు/వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మద్దూరు మండలంలోని 67 గ్రామాల్లో, దామరగిద్ద మండలంలోని 35 గ్రామాల్లో మొత్తంగా 102 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని స్కూలు పిల్లలతో, యుక్తవయసు బాలబాలికలతో, యూత్‌, స్వయం సహాయక సంఘం సభ్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సభ్యులతో, కుల పెద్దలతో బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, బాలబాలికల చదువు, వారి భవిష్యత్తు వంటి అంశాలతోపాటు, 2013`బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మండల స్థాయిలో విద్యాధికారులు, పోలీసులు, పురోహితులతో బాల్యవివాహాల నిర్మూలనలో వారి బాధ్యత గురించి చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా బాల్యవివాహాల నిర్మూలన, పిల్లల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం, జెండర్‌ స్పృహను పెంపొందించడం, బాలబాలికలు వారి అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, వారు స్వశక్తివంతులయ్యేలా కృషి చేయడం జరుగుతోంది.
అడ్రస్‌: ఇ.నెం.: 2`22, నారాయణ్‌పేట రోడ్డు,
నవోదయ డిగ్రీ కాలేజ్‌ ప్రక్కన, మద్దూరు, మహబూబ్‌నగర్‌ ` 509001. ఫోన్‌ నం.: 9100022829
ఫెడరేషన్ల గురించి
వెన్నెల మహిళా సమాఖ్య గురించి
వెన్నెల మహిళా ఫెడరేషన్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1860 క్రింద 2008లో రిజిస్టర్‌ చేయబడిరది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ గ్రామం Ê మండలంలో వెన్నెల మహిళా ఫెడరేషన్‌ కార్యాలయం ఉంది. ఇందులో 39 గ్రామ స్థాయి సంఘాల నుంచి 973 మంది మహిళలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ మహిళలందరూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారు. గత 3 సంవత్సరాల నుండి, ఫెడరేషన్‌ 22 గ్రామాలలో 837 మంది కౌమార యువతీ యువకులను 22 కౌమార సమూహాలుగా సేకరించింది.
ముందడుగు ఆదర్శ మహిళా సమాఖ్య
ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్‌ 2005లో సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1860 కింద రిజిస్టర్‌ చేయబడిరది మరియు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలో దాని కార్యాలయం ఉంది. ఇందులో 54 సంఘాలకు చెందిన 991 మంది మహిళలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఫెడరేషన్‌లో 546 మంది సభ్యులతో 23 కౌమార సమూహాలు కూడా ఉన్నాయి.
ఫెడరేషన్ల కార్యకలాపాలు
మహిళలు బాలికల విద్య, మహిళల ఆరోగ్యం, భూమిపై యాజమాన్యం, కనీస వేతనాలు, లింగ ఆధారిత హింస, కుల వివక్ష, అక్రమ మద్యం అమ్మకాల నిషేధం, భద్రత మరియు పరిశుభ్రత, పిల్లల, హక్కుల ఆధారిత సమస్యలపై ప్రచారం చేశారు. మరియు బాల్య వివాహాలు, కళాజాతాల ద్వారా నIప/AIణూ నివారణ, సంఘ మహిళలు, సామూహిక వ్యవసాయాన్ని చేపట్టి కాలక్రమేణా మహిళా రైతులుగా ఎదిగారు. అక్షరాస్యత శిక్షణ పొందారు మరియు హింస నుండి బయటపడిన వారికి మద్దతుగా బలమైన న్యాయ కమిటీని (ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థ) స్థాపించారు.
మహిళలు మరియు బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, లైంగితపై శిక్షన మరియు అవగాహన కల్పిస్తున్నారు.
ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్‌, హుస్నాబాద్‌ Ê అక్కన్న పెట్‌ మండలం, సిద్దిపేట (జిల్లా)
అధ్యక్షురాలు: శ్రీమతి శేషమ్మ ` 9542769592
వెన్నెల మహిళా ఫెడరేషన్‌, సైదాపూర్‌ మండలం, కరీంనగర్‌ (జిల్లా)
అధ్యక్షురాలు : శ్రీమతి భారతి ` 9440417929.
సఖి కేంద్రం / వన్‌ స్టాప్‌ సెంటర్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల (లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక, రాజకీయ) హింసల నుండి రక్షణ కల్పించడానికి అనేక సహాయ సంస్థలను ఏర్పాటు చేసాయి. షీ టీమ్స్‌, 181 హెల్ప్‌ లైన్‌, డివి సెల్‌ లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రులలో సఖి సెంటర్లను ఏర్పాటు చేసింది.
భారతదేశంలోని 28 రాష్ట్రాలలో 186 సఖి కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భిన్నమైన ఆచరణకు శ్రీకారం చుడుతూ, స్త్రీల దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఏర్పాటయ్యాయి. మరో 150 కొత్త సఖి కేంద్రాలు దేశమంతటా ఏర్పాటు కాబోతున్నాయి. దీనికనుగుణంగా తెలంగాణ పాత 9 జిల్లాలలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నవంబర్‌, 2017 నుండి నూతన సఖి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలుగా స్త్రీలు, బాలికల హక్కుల కోసం పనిచేస్తున్న భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, కరీంనగర్‌ సఖి కేంద్ర నిర్వహణ బాధ్యతలు స్వీకరించింది. టాటా ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) స్వచ్ఛంద సంస్థల ఎంపిక, సిబ్బంది శక్తి సామర్థ్యాల పెంపు అంశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం చేసుకున్నది.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు, హింసల నుండి రక్షణ కల్పించడానికి, వారికి అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి సఖి సెంటర్‌ కృషి చేస్తుంది. గృహ హింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణా, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు మొదలైన హింసల నుండి రక్షణ కల్పించడం వారికి అవసరమైన సమస్త సహాయాలను ఒకేచోటు నుండి అందించడం సఖి సెంటర్‌ ప్రత్యేకత. హఠాత్తుగా కట్టుబట్టలతో ఇళ్ళ నుండి బయటికి వచ్చేసిన బాధిత స్త్రీల కోసం తాత్కాలిక వసతి, వారికవసరమైన వైద్య సేవలు, వారి తరుఫున కేసులు నమోదు, పరిహారం, ఖీIR చేయించడం లాంటి సదుపాయాలను బాధిత స్త్రీలకు అందించి, వారు ఎదుర్కొంటున్న హింసల నుండి రక్షణ కల్పించడమే సఖి సెంటర్‌ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సేవలనన్నింటిని అందించడానికి సఖి సెంటర్లో పూర్తి స్థాయి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఒకసారి బాధిత స్త్రీ సఖి సెంటర్‌కి వస్తే, సఖి సెంటర్‌ అన్ని వేళలలోను ఆమెకు తోడుగా ఉంటుంది. సెంటర్‌ నిర్వహణకు గాను సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌, న్యాయ పరమైన సలహాలు ఇవ్వడానికి లీగల్‌ కౌన్సిలర్‌, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి సోషల్‌ కౌన్సిలర్‌, వైద్య సేవలందించడానికి పారా మెడికల్‌ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండటం సఖి సెంటర్‌ ప్రత్యేకత. మొత్తంగా 19 మంది సిబ్బంది ఉంటారు. అలాగే ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకోవడానికి, రక్షించడానికి వాహనం కూడా అందుబాటులో ఉంటుంది.
కరీంనగర్‌లో నివసించే మహిళలు తమ జీవితాల్లో ఏ రోజైన, ఎలాంటి హింసకైనా లోనైతే సఖి సెంటర్‌ని సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. మౌనంగా హింసలను భరించకుండా అందుబాటులో ఉన్న సహాయ సంస్థలను సంప్రదించాలని, ముఖ్యంగా సఖి సెంటర్‌ని సందర్శించాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నాం. సఖి మీ నేస్తం – 24 గంటలు మీకోసం పనిచేస్తుంది.
‘‘హింసలేని జీవితం కోసం సందర్శించండి సఖి సెంటర్‌’’
సఖి కేంద్రం చిరునామా :-
సఖి సెంటర్‌, కరీంనగర్‌,
ఇ.నెం. 2-3-139, రాఘవేంద్ర మెస్‌ రోడ్‌,
పాత పోస్ట్‌ ఆఫీస్‌ దగ్గర, ముకరంపుర, కరీంనగర్‌.
ఫోన్‌ : 0878-2244644, సెల్‌: 6302710701
జు-ఎaఱశ్రీ : ంaసష్ట్రఱషవఅ్‌తీవసaతీఱఎఅaస్త్రaతీఏస్త్రఎaఱశ్రీ.షశీఎ
సఖి సెంటర్‌, రాజన్న సిరిసిల్ల,
ఇంటి నెం. 6`6`125/బి/4,
పద్మనాయక ఫంక్షన్‌ హల్‌ ఎదురుగా,
విద్యానగర్‌, రాజన్నసిరిసిల్లా ` 505301.
ఫోన్‌ నం: 08723 295181, సెల్‌ : 9441495181
జు-ఎaఱశ్రీ : ంaఅషష్ట్రఱంఱతీఱషఱశ్రీశ్రీaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ
సఖి ` వన్‌ స్టాప్‌ సెంటర్‌ వివరాలు
తెలంగాణ
1. సఖి సెంటర్‌, ఆదిలాబాద్‌
ఇ.నం. 14`102/1, ఇండోర్‌ స్టేడియం ప్రక్కన
లేబర్‌ ఆఫీస్‌ పైన, కైలాసనగర్‌,
ఆదిలాబాద్‌ ` 504 001
ఫోన్‌ : 0832`223272
2. సఖి సెంటర్‌, కరీంనగర్‌
ఇ.నం. 2`9`139, ముకరంపుర,
శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ రోడ్‌,
పాత పోస్ట్‌ ఆఫీస్‌ దగ్గర, కరీంనగర్‌ ` 505 001.
ఫోన్‌: 0878 ` 2244644
3. సఖి ` భరోసా సెంటర్‌, ఖమ్మం
ఇ.నం. 6`3`8, జెడ్‌.పి.సెంటర్‌, జమ్మిబండ ఏరియా,
సిద్దార్ధ హాస్పిటల్‌ ఎదురుగా, ఖమ్మం ` 507 001.
ఫోన్‌ : 08742`298234
4. సఖి సెంటర్‌, మహబూబ్‌నగర్‌
ఇ.నం. 7`4`40/18, చంద్ర హాస్పిటల్‌ ఎదురుగా
వెంకటేశ్వర కాలనీ, సత్యసాయి లైన్‌,
మహబూబ్‌నగర్‌ ` 509 001
ఫోన్‌ : 08542 ` 273181
5. సఖి సెంటర్‌, నల్గొండ
Aజుూఔణ, R డ దీ బిల్డింగ్‌,
ప్రకాశం బజార్‌, నల్గొండ ` 508 001
ఫోన్‌ : 08682 ` 234088
6. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, నిజామాబాద్‌
గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ వెనుక,
(గవర్నమెంట్‌ జనరల్‌ హస్పిటల్‌ స్థలంలో)
నిజామాబాద్‌ ` 503 001
ఫోన్‌ : 08462 ` 225181

7. సఖి సెంటర్‌, రంగారెడ్డి
ఇ.నం. 5`5`109, ఫ్లాట్‌ నం. 177, వనస్థలిపురం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ` 500 070
(వీaఞ మాల్‌ ఎదురుగా) ఫోన్‌ : 040 ` 29800821
8. సఖి సెంటర్‌, సంగారెడ్డి
ఇ.నం. 9`91/6, రోడ్‌ నం. 3, విద్యానగర్‌ కాలనీ,
పోతిరెడ్డిపల్లి దగ్గరలో, జెడ్‌పి హైస్కూల్‌,
సంగారెడ్డి ` 502295 ఫోన్‌ : 8499844552

9. సఖి సెంటర్‌, వరంగల్‌
ఇ.నం. 2`7`66, ఎక్సైజ్‌ కాలనీ,
హన్మకొండ, వరంగల్‌ ` 506 001.
ఫోన్‌ : 0870 ` 2452112

10. సఖి సెంటర్‌, మంచిర్యాల
కెరాఫ్‌ నకరి కొమ్ముల అనసూయ,
ఇంటి.నెం. 7`100, ఐబి రోడ్‌,
మోర్‌ సూపర్‌ మార్కెట్‌ ఎదురుగా,
లడ్డా కాంప్లెక్స్‌ ప్రక్కన, మంచిర్యాల`504208. తెలంగాణ.
ఫోన్‌ : 8736250181, 9652451029
11. సఖి సెంటర్‌, కామారెడ్డి
ఇ.నం. 1`5`442, ఆర్‌.ఆర్‌.రామారెడ్డి రోడ్‌,
వైష్ణవి హస్పిటల్‌ ఎదురుగా, కామారెడ్డి`503110.
కామారెడ్డి జిల్లా, తెలంగాణ
ఫోన్‌: 8341228720, 8468223232
12. సఖిసెంటర్‌ ` భద్రాద్రి కొత్త గూడెం
క్వార్టర్‌ నెం. డెట్‌ సి1 మరియు సి2 ఎస్‌సిసిఎల్‌, క్వార్టర్స్‌,
బాబు కంపెనీ, కొత్తగూడెం జిల్లా ` 507 101. తెలంగాణ.
ఫోన్‌ : 8744248222, 9985875566
13. సఖి సెంటర్‌, జనగాం
ఎమ్‌.సి.హెచ్‌, 2వ ప్లోర్‌,
చంపక్‌ హిల్స్‌, జనగాం జిల్లా ` 506 167.
ఫోన్‌ : 8639657153, 9347186918
14. సఖి సెంటర్‌, నాగర్‌ కర్నూల్‌
ఇంటి.నెం.8`5, జమ`యి మసీదు, చెరువు రోడ్‌,
నాగర్‌ కర్నూల్‌ ` 509 209. తెలంగాణ.
ఫోన్‌ : 85402 98000, 9494631248
15. సఖి సెంటర్‌, జగిత్యాల
శ్రీరాం చౌరస్తా దగ్గర, ఉమెన్స్‌ డిగ్రీ మరియు
పి.జి.కాలేజ్‌, సంతోష్‌నగర్‌.
జగిత్యాల`505 327, తెలంగాణ.
ఫోన్‌ : 90005 75774, 87242 95235
16. సఖి సెంటర్‌, మేడ్చల్‌
ప్లాట్‌ నెం. 93, ఇంటినెం. 37`10/9/3, డిఫెన్స్‌ కాలని,
సైనిక్‌పురి, మేడ్చల్‌ ` 500 094.
మల్కాజ్‌గిరి తెలంగాణ.
ఫోన్‌ నెం. 040`27115144, 9959215212
17. సఖి సెంటర్‌, హైదరాబాద్‌.
ఇంటి నెం.9`1`127,
ఒకటి మరియు మూడవ ఆంతస్థు,
మాధవ్‌ నర్సింగ్‌ హోంలైన్‌,
ఎస్‌.డి.రోడ్‌, సికింద్రాబాద్‌ ` 500 003.
ఫోన్‌ : 040 ` 27714881, 63050 08913.
18. సఖి సెంటర్‌, ములుగు
ఇంటి నెం. 6`68/1, కె.కె నగర్‌,
మెయిన్‌ రోడ్‌ దగ్గర, ములుగు పోస్ట్‌,
ములుగు జిల్లా ` 506 343
ఫోన్‌ నెం. 96184 14343, 78935 44115
19. సఖి సెంటర్‌, నిర్మల్‌
ఇంటి నెం. 5`13`124/56,
ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపు ఎదురుగా,
సరస్వతి నగర్‌, నిర్మల్‌ ` 504 106.
ఫోన్‌ నెం. 8500 54181, 9959271856.
20. సఖి సెంటర్‌, సిద్ధిపేట,
పాత ఎమ్‌.సి.హెచ్‌ బిల్డింగ్‌,
మొదటి అంతస్థు, బురుజు దగ్గర, సిద్ధిపేట జిల్లా,
తెలంగాణ. ఫోన్‌ నెం. 08457 229108, 7702708905
21. సఖి సెంటర్‌, వికారాబాద్‌
ఇంటి నెం. 4`1`208, న్యూ గాంధీ గంజ్‌,
ఫోన్‌ నెం. 08416295344, 9553300644
22. సఖి సెంటర్‌, నల్గొండ
ఎఇపిడబ్ల్యూడి, ఆర్‌ అండ్‌ బి బిల్డింగ్‌,
ప్రకాశం బజార్‌, ఓల్డ్‌ ఎజెసి బిల్డింగ్‌,
నల్గొండ ` 508 001.
తెలంగాణ. ఫోన్‌ నెం. 99593 49854
23. సఖి సెంటర్‌, వనపర్తి
ఇంటి నెం: 39`113,
బండారు నగర్‌, వనపర్తి ` 509 103.
ఫోన్‌ నెం. 08545 233441, 81211 18090
24. సఖి సెంటర్‌, సూర్యాపేట
కమ్యూనిటీ హాల్‌, హౌజింగ్‌ బోర్డ్‌ కాలని,
ఎమ్‌.పి.డి.ఒ ఆఫీస్‌ ఎదురుగా, జమ్మిగడ్డ,
సూర్యాపేట జిల్లా, తెలంగాణ.
ఫోన్‌ నెం. 08684`254555, 9440977022.
25. సఖి సెంటర్‌, పెద్దపల్లి
ఇంటి నెం. 1`198, ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కాంప్‌,
కొత్త కలెక్టరేట్‌ బిల్డింగ్‌ ఎదురుగా, పెద్దపల్లి.
ఫోన్‌ నెం. 08728`224224, 9440958067
26. సఖి సెంటర్‌, జోగులాంబ గద్వాల్‌
ఇంటి నెం. 1`3`75/5/6,
సుంకాలమ్మ మెట్టు, జోగులాంబ గద్వాల ` 509125.
ఫోన్‌ ` 08546272250, 9989077301
27. సఖి సెంటర్‌, మహబూబాబాద్‌
ఇంటి నెం. 6`2`85/1, మూడవ లైన్‌,
కాబిన్‌ రోడ్‌, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ.
ఫోన్‌ నెం. 9397677770, 9100792105
28. సఖి సెంటర్‌, మెదక్‌
ఇంటి నెం. 1`12`24/ఎ/163,
ఇందిర పురి కాలనీ, రోడ్‌ నెం.1
ఎమ్‌.జి.ఎమ్‌ పార్క్‌ ఎదురుగా, మెదక్‌ ` 502110.
29. సఖి సెంటర్‌, నారాయణ్‌పేట్‌
ఫ్లాట్‌ నెం. 130, శ్రీనివాసా కాలనీ,
అమృత సాయి గుడి దగ్గర, నారాయణపేట ` 509210
30. సఖి సెంటర్‌, యాదాద్రి భువనగిరి
ఇంటి నెం. ఎల్‌.ఐ.జి`1`208,
5`2`79, ఎ.పి.హెచ్‌.బి.కాలనీ,
భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా.
31. సఖి సెంటర్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి,
ఇంటి నెం. 8`143/3, ఎల్‌.బి.నగర్‌,
ఆర్టీసి బస్‌స్టాండ్‌ ఎదురుగా,
మండల్‌/విలేజ్‌, భూపాలపల్లి`506169.
32. సఖి సెంటర్‌, కొమురం భీం అసిఫాబాద్‌
ఓల్డ్‌ ఆర్‌.టి.ఓ ఆఫీస్‌ ప్రక్కన, మెయిన్‌ రోడ్‌,
కె.బి. అసిఫాబాద్‌ ` 504293.
33. సఖి సెంటర్‌, రాజన్న సిరిసిల్ల,
ఇంటి నెం. 6`6`125/బి/4,
పద్మనాయక ఫంక్షన్‌ హల్‌ ఎదురుగా,
విద్యానగర్‌, రాజన్నసిరిసిల్లా ` 505301.
34. సఖి సెంటర్‌, వరంగల్‌ రూరల్‌
ఇంటి నెం. 6`21, సాయినగర్‌,
పాకాల్‌ రోడ్‌, నర్సన్నపేట,
వరంగల్‌ రూరల్‌.
ఆంధ్రప్రదేశ్‌

1. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, విజయవాడ
మలేరియా హాస్పిటల్‌,
షేక్‌ రాజా సాహెబ్‌ మునిసిపల్‌ మెటర్నటీ హాస్పిటల్‌,
కొత్తపేట, విజయవాడ.కృష్ణా జిల్లా.
ఫోన్‌ : 0866 ` 2566589
2. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, చిత్తూరు
గవర్నమెంట్‌ హస్పిటల్‌, చిత్తూరు.
ఫోన్‌ : 08572 ` 232444
3. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, శ్రీకాకుళం
రిమ్స్‌ ` జనరల్‌ హాస్పిటల్‌
7వ వార్డు, బలగ, శ్రీకాకుళం ` 532001
ఫోన్‌ : 08942 ` 278966
4. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, అనంతరపురం
రూ. నెం. 12 Ê 13, ట్రామా కేర్‌, మేడపైన
ఎమర్జెన్సీ సెంటర్‌, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌
అనంతపురం ` 515 001,
ఫోన్‌ : 08554 ` 222205
5. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, కర్నూల్‌
రూ. నెం. 214 (మేడపైన),
ఎన్‌.టి.ఆర్‌. వైద్య సేవా కార్యాలయం
గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, కర్నూలు ` 581 002
ఫోన్‌ : 08518 ` 255057
6. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, కడప
2వ అంతస్తు, ఓ.పి. బ్లాక్‌, 2వ అంతస్థు,
ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ దగ్గర, న్యూరిమ్స్‌ జనరల్‌ హాస్పిటల్‌
కడప ` 516 001 ఫోన్‌ : 08562 ` 225602
7. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, తూర్పు గోదావరి
వెటర్నరీ హాస్పిటల్‌, సిటీ ఇన్‌ హోటల్‌ ఎదురుగా,
టౌన్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర, రామారావు పేట,
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా ` 533 004
ఫోన్‌ : 0884 ` 2380181
8. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, నెల్లూరు
డి.ఎస్‌.ఆర్‌. గవర్నమెంట్‌ హాస్పిటల్‌,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఫోన్‌ : 0861 ` 2347990
9. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, గుంటూరు
మహిళా ప్రాంగణం, కలెక్టర్‌ బంగ్లా ప్రక్కన,
జిల్లా పరిషత్‌ ఎదురుగా
గుంటూరు. ఫోన్‌ : 0863 ` 2233525
10. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, విశాఖపట్నం
కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌, మెటర్నటీ హాస్పిటల్‌
గ్రౌండ్‌ ఫోర్‌, కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర
విశాఖపట్నం ఫోన్‌ : 0891`2564575
11. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, విజయనగరం
డి.వి.సెల్‌, 29వ వార్డు దగ్గర, మహరాజా జిల్లా ఆసుపత్రి
విజయనగరం ` 535003.
ఫోన్‌ : 08922`277986
12. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, ఒంగోలు
వార్డు నెం. 211, రెండవ అంతస్తు
రిమ్స్‌ హాస్పిటల్‌, ఒంగోలు.
ఫోన్‌ : 08592 ` 284506
13. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, పశ్చిమ గోదావరి
డి.వి.సెల్‌, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్‌ : 08812`223218

181`మహిళా హెల్ప్‌లైన్‌
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో, Gపఖ-జువీRI టెక్నికల్‌ సహకారంతో, మహిళా రక్షణ మరియు భద్రత ముఖ్యమైన ఉద్ద్యేశ్యంగా ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. ఇందులో 24/7 గంటలు మరియు 365 రోజులు సేవలు అందుబాటులో ఉంటాయి. మానసిక హింస, శారీరక హింస, లైంగిక హింస, గృహ హింస, వరకట్న వేధింపులు, ఆత్మహత్య ధోరణులు, కళాశాలల్లో ర్యాగింగ్‌ మహిళల అక్రమ రవాణాకి సంబంధించిన కాల్స్‌ వస్తాయి.
పై సమస్యలకు గురవుతున్న మహిళలు 181 మహిళా హోల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి వారి సమస్యలను వివరించి, తగు కౌన్సిలింగ్‌ మరియు సలహాలను పొందవచ్చు. వారిని సంబంధిత జిల్లా సఖి కేంద్రంకు కనెక్ట్‌ చేస్తారు.
చైల్డ్‌ లైన్‌ ` 1098
ఛైల్డ్‌లైన్‌ ఇండియా పౌండేషన్‌ ద్వారా, జాతీయ స్త్రీ శిశు మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది 24 గం॥ల టోల్‌ ఫ్రీ నంబరు. ఇది ప్రస్తుతం 594 పట్టణాలు మరియు జిల్లాలు, 1047 భాగస్వామ్య స్వచ్చంధ సంస్థలు, 132 జష్ట్రఱశ్రీస నవశ్రీజూ ణవంసం రైల్వే స్టేషన్స్‌లో మరియు 80% భారత భూభాగంలో పని చేస్తుంది.
ఇది 24/7 గంటలు 365 రోజులు పని చేస్తుంది. ఇది సమస్యల్లో ఉన్న బాలబాలికల ఉచిత అత్యవసర ఫోన్‌ సదుపాయం. జaశ్రీశ్రీ రిసీవ్‌ చేసుకున్న 60 ని॥ల లోపు ఆపదలో ఉన్న బాలబాలికల వద్దకు Rవంషబవ ువaఎ చేరుకొని వారి సమస్యను పరిష్కరిస్తారు. బాలబాలికల సమస్య ఆధారంగా తాత్కాలిక మరియు శాశ్వత వసతి సదుపాయం కల్పిస్తారు.
చైల్డ్‌లైన్‌ వారు బాల బాలికల సమస్యల పరిష్కారానికి వివిధ భాగస్వాములు (ర్‌aసవ ష్ట్రశీశ్రీసవతీం)తో అనగా పోలీస్‌ బాల బాలికల సంరక్షణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు, కౌన్సిలర్స్‌ బాలల హక్కుల సంఘాలు, జష్ట్రఱశ్రీస ఔవశ్రీటaతీవ జశీఎఎఱ్‌్‌వవ తో కలిసి బాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

Share
This entry was posted in మహిళలు చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.