ముప్ఫై సంవత్సరాలు నిండిన మగువ ‘భూమిక’. స్త్రీల ఆలోచనలను, భావజాలాలను, సమస్యలను, సంఘర్షణలను, అంతర్మథనాలను తనలో ఇముడ్చుకున్న పరిణీత ‘భూమిక.
మహిళలందరికీ, మరీ ముఖ్యంగా స్త్రీవాద రచయిత్రులకు, కవయిత్రులకు గొప్ప అండ ‘భూమిక’. మనదైన పత్రిక అని అతివలందరూ భావించే ఆలంబన ‘భూమిక’. స్త్రీల గురించి స్త్రీలు రాసే రచనలకు నేనున్నాననే భరోసా ‘భూమిక’.
భూమిక గురించి ఈ సందర్భంగా నాలుగు మాటలు రాయడం నాకు అత్యంత ప్రియమైన అవకాశం! నేను రాయడమే చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను. నా కథల్ని, కవితల్ని ప్రచురించి నాలో ఆత్మవిశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది ‘భూమిక’. ఇంకా ఇంకా రాయాలనే ఉత్సాహాన్ని నింపింది. ప్రతినెలా విడవకుండా చదివే అలవాటు చేసింది. సాటి స్త్రీల అనుభవాల గురించి అవగాహన పెంచింది. సత్యవతిగారి సారధ్యంతో, ప్రముఖ స్త్రీవాద రచయిత్రుల అండతో నిలకడగా, నిరాటంకంగా సాగించాలి ప్రయాణం ‘భూమిక’.
` శాంతిశ్రీ బెనరీ