భూమిక పేరు నేను మొదటిసారిగా చూసింది సుమారు 2009లో అనుకుంటా, ఏదో టివి న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ వస్తోంది. ఆపద, అవసరాల్లో ఉన్న మహిళలు సహాయం మరియు సలహా
కోసం భూమిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించగలరని వస్తోంది. అప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నడుపుతున్న మహిళా హెల్ప్‌లైన్ 181 ఇంకా రాలేదు. మహిళల కోసం పనిచేయడానికి ఒక హెల్ప్‌లైన్ ఉందా? అది కూడా ఒక స్వచ్ఛంద సంస్థ చేత నడపబడుతోందా? అని నంబర్‌ను నోట్ చేసుకోవడం జరిగింది.
అప్పటికే నేను హైదరాబాద్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖనందు, కొత్తగా ప్రారంభించిన ‘గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం’ కింద పనిచేస్తున్న యూనిట్‌కి లీగల్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాను. అప్పటికే గృహ హింస మీద పనిచేస్తున్న నాకు, ఇంకా గృహ హింస చట్టం జనాల్లోకి సరిగ్గా పోలేదన్న విషయం తెలుసు కనుక, మహిళల కోసం భూమిక పత్రిక నడిపే హెల్ప్‌లైన్ అవసరం ఎంత ఉందో అర్థమయింది.
తర్వాత భూమిక కార్యాలయాన్ని సందర్శించిన నాకు సత్యవతి మేడం గారితో పరిచయం ఏర్పడిరది. అక్కడకు వెళ్ళిన తర్వాత హెల్ప్‌లైన్ పనిచేసే తీరుతో పాటుగా భూమిక సంస్థ నడిపే మాసపత్రిక గురించి కూడా తెలిసింది. ఆ తర్వాత నాకు మరియు నాతోపాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పనిచేసే నాలాంటి కౌన్సిలర్లకు అందరికీ కూడా సుపరిచితం. మాకు ఎన్నో ట్రైనింగ్‌లు, మీటింగ్‌లు, గృహ హింస చట్టంతో పాటు ఇతరత్రా చట్టాల మీద భూమిక రెగ్యులర్‌గా నిర్వహించేది. అక్కడే మాకు రాష్ట్రంలో అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు / ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఫోన్ నంబర్లు మరియు అడ్రస్‌లతో పాటు వివిధ మహిళా చట్టాలు, స్కీంలకి సంబంధించి చక్కటి వివరణలతో పొందుపర్చిన భూమిక పత్రికను అందరికీ ఇవ్వడం జరిగింది.
అప్పటికీ, ఇప్పటికీ ప్రతి జిల్లాలో కూడా ఆ వివరాలతో కూడిన సంచిక ఒక Rవaసవ Rవటవతీవఅషవ ఉంటుంది. ఇప్పటికే ఈ వివరాలు మరింత అప్డేట్ చేయబడ్డాయి. సఖి కేంద్రాల వివరాలతో పాటుగా మనం భూమిక ఉమెన్స్ కలెక్టివ్ వెబ్సైట్లో చూడవచ్చు. వాటితో పాటుగా ఎన్నో ఫెమినిజంకు సంబంధించిన వ్యాసాలు, చక్కటి కథలు, వర్తమాన విషయాలతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పాఠకులకు భూమిక అందిస్తూనే ఉంది. అప్పుడప్పుడూ పాఠకుల్లో సృజనాత్మకత వెతికి తీయడానికి కథల పోటీలు నిర్వహించి, ప్రచురించేది భూమిక.
చేతిలో మొబైల్ ఉండి ప్రపంచాన్ని మరచిపోయే ఈ కాలంలో, ఇంకా ఒక మాస పత్రిక నడపగలగడం, అందరితో చదివించడం చిన్న విషయమేమీ కాదు. ఒక్క మహిళలనే కాకుండా, బాలురు, ట్రాన్స్‌జెండర్ లాంటి ఇతర జెండర్ సమస్యల మీద కూడా భూమిక పనిచేస్తూ పత్రిక వారందరికీ వేదిక అయింది.
అయితే బాలికలు, బాలురు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సంబంధించి భూమికలో కొన్ని పేజీలు ప్రత్యక్షంగా కేటాయించవలసిందిగా నా సూచన.
అభినందనలతో… ` విజయ భాస్కర్ జెల్లా