27/06/2023న భూమిక ఆధ్వర్యంలో సోమాజిగూడలో మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షా, సోషల్ యాక్టివిస్ట్ దేవి, జెండర్ ట్రెనర్ మరియు రైటర్ అపర్ణ, అడ్వకేట్ శ్రీకాంత్ వక్తలుగా పాల్గొన్నారు.
ఎబిఎన్ ఛానల్ నుండి జర్నలిజం విద్యార్థులు, యువ రిపోర్టర్లు, వివిధ ప్రింట్ Ê ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులు దాదాపు 50 మంది హాజరయ్యారు.
వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ వర్క్‌షాప్ ఉద్దేశ్యాన్ని చెప్పారు. ‘‘మీడియాలో స్త్రీల అంశాలకు దొరుకుతున్న స్థానం (స్పేస్) ఏమైనా ఉందా, ఆ స్థానం కుంచించుకుపోవడానికి కారణాలేమింటి, వాడే భాషలో ఎలాంటి మార్పు రాకపోవడం అనే అంశాలపై, ముఖ్యంగా పిల్లల అంశాలకు సంబంధించి, వారిపైన లైంగిక హింస జరిగినప్పుడు వారి గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, వారి పేర్లు బయటపెట్టకుండా ఉండడం వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వాళ్ళ వివరాలు బయటపెడితే పోక్సో యాక్ట్ కింద ఉన్న కేసులలో వివరాలు గోప్యంగా ఉంచలేకపోవడం వంటి విషయాలు ఏర్పడుతాయి. మీడియాలో జెండర్ సెన్సిటివిటీ ఎందుకు ఉండాలి అనే విషయంపై మేము చాల సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ప్రస్తుతం కొంతవరకు మార్పు వచ్చింది. ఉదాహరణ female fetiside జరిగినప్పుడు ‘భ్రూణహత్యలు’ అని రాస్తున్నారు. ఇలాంటి పదాలను మీడియాలో వాడడం చాలా తప్పు. ఎందుకంటే “Abortion is right woman”. ఇది చట్టపరమైన హక్కు. ప్రత్యేకంగా ‘‘ఆడపిండాల హత్యలు’’ అనే పదం వాడాలి. కానీ ఇంకా ‘‘భ్రూణ హత్యలు’’ అనే రాస్తున్నారు. స్త్రీలకు సంబంధించిన చాలా పదాలు ఇలాంటివి రాస్తున్నారు. ఉదా: పుణ్యస్త్రీ, పేరంటాలు, ముత్తైదువ వంటివి. ఇలాంటి భావజాలాన్ని ప్రచారం చేసేలాంటి వార్తలు రాస్తున్నారు. ఇలాంటి విషయాలపై మాట్లాడుకుందాం’’ అని అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతూ, వర్క్‌షాప్‌కి వచ్చిన విద్యార్థులు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవడం వల్ల ఎలాంటి భాషను, భావజాలాన్ని ఉపయోగించాలి అనేది నేర్చుకోగలరు అని చెప్పారు.
పద్మజ షా మాట్లాడుతూ ‘‘జర్నలిస్టులు రిపోర్టులు రాస్తున్నప్పుడు వారు ఉపయోగిస్తున్న భాష అనేది చాలా ముఖ్యం. ఇది ఒక రకమైన భావజాలం నుండి వస్తుంది. భావజాలం అనేది సరిగ్గా లేనివారు, స్త్రీలను సమానంగా చూడలేరు. సమాజం, వారు గీసిన గీతలో లేని స్త్రీలను రెబల్స్‌గా భావిస్తుంది. నల్సార్ విద్యార్థులు చేసుకున్న ఒక పార్టీని ఉదాహరణగా చెబుతూ వారిని ఉద్దేశించి మీడియాలో రాసినప్పుడు వారు వాడిన భాష అనేది మనుసిద్ధాంతాన్ని సమర్దించేది గాను, పితృస్వామ్య భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగానూ ఉంది. ఇది ఒక చట్ట వ్యతిరేక చర్యగా భావించి కోర్టు ఫైన్ వేయడం కూడా జరిగింది. స్త్రీలపై ఇటువంటి భావజాలం ఉండడమనేది ఘోరమైన సామాజిక ధోరణిని కనబరుస్తుంది. జర్నలిస్టులకు empathy & sympathy ఉండాలి. ఇండివిడ్యువల్ జర్నలిస్టులు ఈ విధానాన్ని అలవరచుకుని రాయడం చేయగలిగితే సమాజంలో ఖచ్చితంగా మార్పుని తీసుకురాగలము’’ అన్నారు. మీడియా యాజమాన్యం డబ్బుకి, రాజకీయాలకు అమ్ముడుపోయిందని, జర్నలిస్టులు ఎక్కడా స్వాభిమానం పోగొట్టుకోకుండా, human dignity కాపాడడం అనే సామాజిక బాధ్యతతో వార్తలు రాయడం అనేది ప్రస్తుతం చాలా అవసరమని అన్నారు. అలాగని అన్ని మీడియా యాజమాన్యాలు అలాగే ఉంటున్నాయని కాదని అంటూ కొన్ని ఉదాహరణలను చెప్పారు. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ కొంతమంది వ్యక్తులను సెలబ్రిటీలుగా చూపించడం వలన ఒక్కొక్కసారి సంస్థలకు ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుందన్నారు. యువ జర్నలిస్టులు మరియు ఇండివిడ్యువల్ జర్నలిస్టులు రాసే వార్తల పట్ల భావజాలాన్ని, భాషను మార్చుకుని రాయడం సమాజానికి ఎంతో
ఉపయోగకరమని అన్నారు. సోషల్ యాక్టివిస్ట్ దేవి మాట్లాడుతూ భావజాలపరమైన అతి తీవ్రభావజాలంలో మునిగిన వాళ్ళు ఈ దేశంలో ద్విజులలాగా ఉంటారు. వీరు ఎలాంటి వాళ్ళంటే భార్యను, తల్లి గర్భాన్ని, బిడ్డను కూడా తిరస్కరిస్తారు. వీళ్ళ జన్మ ఆ మతిలేని గుంపులో భాగంగానే ఉంటుంది. అలాగే వాళ్ళు వాళ్ళ మగతనాన్ని తిరిగి పొందుతారు. అది సామాజిక మాధ్యమాలలో స్త్రీల మీద జరిగే దాడులు ఏమైతే ఉన్నాయో వాటిని సెక్స్‌కి, సమాగమనానికి సంబంధించిన అతి తీవ్ర పదజాలంతో ఉండడం వీళ్ళ అభద్రతకు సూచిక. ప్రపంచ చరిత్రలో పిరికి వాళ్ళయిన నియంతలు ఎంత విధ్వంసాన్ని సృష్టించారో వారు వారి వ్యక్తిగత జీవితంలో అంత వైఫల్యాలను చూశారు. దీన్ని కప్పిపుచ్చడానికి మీడియా over glorification చేస్తోంది. మనల్ని మనం ఎందుకు ఎక్కువ చేసుకుంటామంటే, మనలో తక్కువతనం బలంగా పాతుకుని ఉండడం వలన. అందువలనే ఆడవాళ్ళపై జరుగుతున్న దాడులు ఈ భావజాలం నుంచి మొదలైన దాడులే. ఇక్కడి నుండి తిరస్కారం అనేది మొదలైంది.
ఈ తిరస్కారం నుండి మొదలయ్యాయి కాబట్టే ఒక అకృత్యంగాను, అమానుషంగాను, మనుషులు చేయకూడని పనిగా ఉన్న రేప్‌ను, స్త్రీలపై, బిడ్డలపై జరిగే అకృత్యాలను అపరాధంగాను, నేరంగాను భావించే సమాజం ఇవాళ దాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా చూసే స్థితికి వచ్చింది. ఈ రేప్‌లకు సంబంధించి ఏ కవరేజ్ కూడా వినేవాడు చొంగలు కార్చుకుంటూ వినడానికి వీలైన భాషల్లోనూ, దృశ్యంలోనూ దాన్ని చూపిస్తున్నాం. స్త్రీల శరీరాలను కూడా కేవలం శరీరంగా మాత్రమే చూసే సంస్కృతి కూడా మత సంస్కృతిలో భాగమేనని మనం గుర్తించాలి. వీళ్లను కేవలం పాత్రలుగా మాత్రమే చూడడం అనేది ఒక మతపరమైన భవజాలంలో భాగమే. స్త్రీల శరీరాలను ఫ్లడ్‌లైట్ వెలుగులలో చూపించాల్సిన సెప్టికల్స్గా ఎందుకు ఉన్నాయో మీడియాకు ఏమైనా స్పృహ ఉందా అని అడిగారు. గతంలో ఎన్నడూ జరగనంత marginalization ఇప్పుడు ఆడవాళ్ళపై జరుగుతోంది. ప్రభుత్వాలలో కానీ, ప్రసార మాధ్యమాలలో కానీ స్త్రీల మీద చర్చ ఏ సందర్భంలో జరుగుతోంది? డీజిల్, పెట్రోల్ పెరుగుదల సందర్భంలో కూడా జరిగిందా అని ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చలకు ఆడవారిని మాత్రం ఎవరూ పిలవరు. ఇవాళ ఆడవాళ్ళకు ఉన్న పెద్ద సమస్య వాళ్ళకు ఉపాధి లేకపోవడమే’’. ప్రధాన స్రవంతి నుండి స్త్రీలకు సంబంధంచిన సమస్యలను marginalize చేసేశారు. ఇటువంటి భావజాలాన్ని ఎదుర్కొని పోరాడగలిగేవారు కూడా మీ నుండే రావాలి అని మీడియాని ఉద్దేశించి అన్నారు.
అడ్వకేట్ శ్రీకాంత్ మాట్లాడుతూ మీడియాకి ప్రాథమిక హక్కలు ఉండాలా వద్ధా? అంటే రాజ్యాంగంలో ఎక్కడయినా ప్రెస్ వైఖరిని గురించి పెట్టాలా వద్దా అనే చర్చ జరిగినప్పుడు ఆర్టికల్ 19లో free speech of the press ని రెగ్యులేట్ చేయడానికి లేదు అనే వర్డింగ్ని పెట్టాలని అనుకున్నారు. కానీ దానిపై విస్తృత చర్చలు జరిగినప్పుడు ప్రెస్కంటూ ప్రాథమిక హక్కుల్లో పెట్టాల్సిన పనిలేదు; పత్రికని, వ్యక్తిని ఏనాడైతే విడదీస్తామో అప్పుడు స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనే పాప్యులర్ ఐడియా వచ్చింది. ఒక సాధారణ పౌరునికి ఏవైతే హక్కులున్నాయో అవన్నీ ప్రెస్‌కి కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రెస్ కంటూ ప్రత్యేక ప్రివిలేజ్ ఇచ్చి ఉంటే ప్రెస్ వాళ్ళు కూడా పార్లమెంటు సభ్యులలాగా మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ఎవరూ అడగడానికి లేదు అంటారేమో అని శ్రీకాంత్ తన ఉద్దేశ్యాన్ని అందరితో పంచుకున్నారు. ఇటీవల జరిగిన ఒక అమ్మాయి హత్య ఉదంతాన్ని మీడియా ఎలా దారుణమైన పదజాలంతో చూపించిందో ఆయన వివరించారు. ఒక బాధితురాలిని తనదే తప్పు అన్నట్లు వార్తలు రాయడం, దాన్ని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడడం అనేది చాలా బాధపెట్టిందని అన్నారు. ఎలాంటి కంటెంట్ చెబుతున్నాం అనే కనీస అవగాహన, సున్నితత్వం ఉండాలి. ఐపిసి 376 సబ్ క్లాజ్ రేప్ బాధితురాలి యొక్క ఐడెంటిటీని బయట పెట్టకూడదు అని ఉంది. ఇటువంటి కనీస అవగాహన కూడా లేకపోవడం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్‌లో బాధితురాలి పేరు బయటపెట్టకూడదు అని చెప్పింది. సెక్షన్ 228లో ఉన్న స్పిరిట్‌ని మనం కూడా తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.sexual offence లో ఉన్న బాధితురాలి యొక్క పేరుని బయటికి చెప్పకూడదు అని ఉంటుంది. మీడియాలో చిన్నపిల్లలను రిఫర్ చేసినప్పుడు బాల నేరస్థులు అని రాస్తున్నారు, కానీ ‘child in conflict with law’ అని రాయాలి అని చెప్పారు. ఇటువంటి terminalogy తెలియకపోవడానికి కారణం అందరికీ ఇంతటి సెన్సిటివిటీ లేకపోవడం. కానీ జర్నలిస్టులకు ఇటువంటి అవగాహన, సెన్సిటివిటీ తప్పకుండా ఉండాలని అన్నారు. ఎక్కడో ఒకచోట మనం అందరినీ ప్రశ్నించగలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగ నైతికత లేకపోవడం అనేది అతి ప్రధాన కారణం, కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నైతికతను కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఆర్టికల్ 19 అనేది ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. రాజ్యాంగ నైతికతను జర్నలిజం సిలబస్‌లో చేర్చితే ఆ సెన్సిటివిటీతో రాయగలరని ఆయన అన్నారు.
అపర్ణ మాట్లాడుతూ మీడియాలో 90% కధనాలు Crime against women ఉన్నవి మాత్రమే ప్రచురితమవుతున్నాయి. అయితే వీటిలో కూడ ఆస్తికి రాజకీయ పరమైనవి ఇలాంటివి ఎక్కడ రాకుండా కేవలం వివాహేతర సంబంధాలకు సంబంధించిన వాటిని మాత్రమే చూపించడం జరుగుతుంది. మీడియాలో ఉమెన్ జర్నలిస్ట్‌ల శాతం ఎంత? అసలు ఉన్నారా? స్త్రీలే కాదు. ట్రాన్స్ ఉమెన్ జర్నలిస్ట్‌లు అసలు తేనే లేరు. ఎవరనా ఒకరిద్దరు ఉంటే సోషల్ మీడియాలో ఉన్నారు. యువ జర్నలిస్ట్‌లు అందరూ జెండర్ స్పృహతో
ఉండాలి. వారి కోర్సులో కూడా జెండర్ అంశాలపై ఒక భాగమైనప్పుడు మార్పు తప్పకుండా ఉంటుంది ఉన్నారు.
వక్తలు మాట్లాడిన అంశాలు గురించి చెప్తూ వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్ధులను మాట్లాడమని అడిగారు. కొంతమంది మాట్లాడుతూ మనువాదం పిత్రస్వామ్య భావజాలం, జెండర్ అంశాలపై అవగాహన ఉన్నప్పటికి సమస్యలను చూడటం. రాయడంలోఎలాంటి భావజాలం, భాష వాడాలి అన్న విషయం తెలుసుకోగలిగాం అని కొన్ని కొత్త విషయాలను నేర్చుకున్నాము అని తెలియచేసారు.