పరిపూర్ణ గారి జ్ఞాపకాలలో ‘జీవనోత్సవ సౌరభం అమ్మ సమావేశం’కి అమరేంద్ర పిలిస్తే వెళ్ళాను. అతను పెట్టిన క్యాప్షన్ ఎంతో నచ్చింది. గతంలో ఇలా ఏర్పాటు చేసిన సమావేశాలకి ‘నివాళి’, ‘భాష్పాంజలి’ అంటూ పేర్లు పెట్టేవారు. ఈ పేరు భిన్నంగా ఉండటమే కాకుండా, ఆత్మీయంగా ఉంది. సమావేశం కూడా అంత బాగానే జరిగింది. రెండు మాటలు మాట్లాడమని అమరేంద్ర నాకిచ్చిన అవకాశం వాడుకోలేదు,
కారణం ` మనలో చాలామంది ఎవరి గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలో, అవి చెప్పకుండా తమ గురించి విశేషాలు చెప్పేస్తూ ఉండడం కద్దు. ఆ భయం/బలహీనత నాకూ ఉందిÑ పరిపూర్ణ గారిని కలుసుకున్నప్పుడల్లా నాతో మా అత్తగారు, మా ఆవిడ ఉండేవారు. మా అత్తగారు ఎక్కడున్నా She steals the show’ అని మా మావగారు అనేవారు. అలా ఆమె గురించి నేను తెలుసుకున్నది మా అత్తగారి కబుర్ల ద్వారానే. వారిద్దరికీ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. పరిపూర్ణ గారిలాగే మా అత్తగారు, ఆమె తల్లి కొమ్మూరి పద్మావతి నాటక రంగంలోకి వెళ్ళారు, స్త్రీ వాదులు, సాహిత్యాభిమానులు! ఈ సమావేశంలో నాకు నచ్చిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అమరేంద్ర అమూల్యమైన తన తల్లిగారి మూడు రచనలను అతిథులందరికీ బహుకరించారు, పైగా కాపీరైటు వాటికి లేదని, ఎవరైనా వాటిని ప్రకటించుకోవచ్చు అని సభాముఖంగా ప్రకటించారు. (ఈ మూడిరటిని తర్వాత పరిచయం చేస్తాను). మూడిరటిలో ఒకటి… ఒక దీపం వేయి వెలుగులు collector’s edition! మూడూ లేఅవుట్, కవర్ డిజైన్‌లో వాటికవే సాటి.