కడలంతా కష్టాలున్న
విరబూసిన పువ్వుల
చిరునవ్వు చిందిస్తూ
ఆకాశమంత విశాల
హృదయంతో అక్కున
చేర్చుకొని భూమాతల
బాధ్యతలను మోస్తూ
నిత్యం కుటుంబ సభ్యుల
కోసం తాపత్రయ పడుతూ
నవ మాసాలు గర్భంలో
ఆనందంగా మోయడమే
కాక నీ ప్రాణాన్ని సైతం
పణంగా పెట్టి నాకు ఊపిరి
పోసి ప్రతి క్షణం కంటికి
రెప్పలా కాపాడుకొని
అహర్నిశలు చాకిరీ
చేస్తూ అమితమైన
ప్రేమను పంచుతూ
వృక్షంలా తనకంటూ
ఏమీ దాచుకోక అమృత
ఫలాలనిచ్చే నిస్వార్థ
జీవివి పచ్చని పైరుల
నిర్మలమైన మనసుతో
శిఖర స్థాయికి చేరాలని
కొండంత ఆశతో
వేచి చూస్తున్నా
నా మరో ప్రాణమా
నా సంతోషమే నీ సంతోషంగా
భావించిన నీ ఋణం
తీర్చుకునేదెలా?
నీ బాధలను పంచుకుని
భరోసానవ్వడం తప్ప…!