స్త్రీ! అద్భుత కళారూపిణి!
మహిళ! శత సహస్రకోటి విస్తృత జగతిలో మహిమాన్విత!
ఉద్వేగ ఉద్రిక్త సంఘర్షిత
షడ్వర్గ పగ్గాలను అదుపుచేస్తూ
మమతాను రాగాలపై విహరిస్తున్న ఉద్దీప దీపశిఖ!
ఆదిమ సమాజంలో కథానాయకి, మాతృదేవతగా
పూజలందుకున్న జగన్మాత! ఆదిపరాశక్తి!
పురుషాధిక్య సాంఘిక దుష్టనీతికి బలిjైు
బానిసగా మారిన పరాజిత!
అష్ట దిగ్బంధన అయిన స్త్రీ
బంధనంలోకి తోయబడి
సమాజ ప్రాంగణంలో బాధ్యతే ఆమెకు బంధన
బంధనమే సామ్రాజ్యంగా స్వామిjైు తలెత్తుకున్న ‘వీరనారి’!
రాగమునకు అనురాగం అనువర్తన గావించి
కుటుంబ నిర్వహణ గర్వముగా చేపట్టి
ఎంత ఒలిచినను తరగని గొప్ప చైతన్యమూర్తి!
దుఃఖవేదనల గుండెలను మధించి నవనీత
ప్రేమానురాగాలను పంచిన విశ్వసుందరి
పరాధీన బానిస స్థానంలో మహోన్నత జీవనం
సాధించిన ప్రతిభ ఆమె ఆత్మ తత్వమునకే సాధ్యము!
హింస, అవమానాలను, కన్నీళ్ళను చిలికి
అమృత కలశాన్ని అందించగల సమర్థురాలివి!
నిన్ను తూగ మణి మానికలు లేవు
ఏ కావ్య పరిధికి అందని గొప్ప త్యాగధనివి
లాలన కరుణ జాతి దయ ప్రేమధారవి…
దేహం రక్తం చిందించినా పెదవులపై మల్లులు పూయిస్తావు
అనామికవి ` శతకోటి నామధేయవి
విరాగినివి ` విరియు రాగిణివి
విధేయతవి ` ధీరమధీయతవి
విరామము లేని విమనస్కవి
విధి నిర్వహణలో హృదయాన్ని జోకొడుతావు…
విరామంలో హత్తుకుని బావురుమంటావు
పంచభూతాలు ప్రళయాన్ని సృష్టిస్తే
తరుణి గుండెల్లో బడబానలం ప్రేమధారjైు ప్రవహిస్తుంది
బహు భర్తృత్వం తిరస్కరించి
ఉదాత్తమైన పతిభక్తి చూపి
స్వీయ గౌరవ మానప్రాణములు కాపాడుకున్న ఆత్మాభిమానివి
బానిసవైనా ప్రగతికి బంగారు బాటలు వేశావు
సంకెళ్ళు బిగించినా ఉద్యమరాగాలాలపించావు…
సంప్రదాయాలకు కట్టుబడుతూనే
చట్టములో చట్టమై గెలిచావు
తల్లివి కావు… సతివి, తనయవి కావు
ప్రేయసివి కావు…
నీవొక అపూర్వ సుందరభావనవి
భవభూతి రచించిన ‘‘ఏకోరసః
కరుణమేవ’’ స్ఫూర్తివి
స్త్రీని మించిన గొప్ప సత్యమే లేదు,
సృష్టి లేదు, మనుగడ లేదు
రాగమే గమన మూలసూత్రమైన
భువన భువాంతరాలు లేవు
స్త్రీ!
ఓ స్త్రీ!!
స్త్రీ ప్రకృతి వైశిష్టములకు
సకల నారీ హృదయాంతరాలు
అర్పించే శతకోటి సహస్ర ‘నమస్సులు’
అందుకో తల్లీ!
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)