ఆంగ్లం: Georgia Douglas Johnson, American
స్వేచ్ఛానువాదం: జాని తక్కెడశిల (అఖిలాశ)
ప్రతిలిపి తెలుగు విభాగం మేనేజర్, బెంగళూరు
స్త్రీ హృదయం
తెల్లవారుజాముతో ముందుకు కదులుతుంది
ఒంటరి పక్షిలా, మృదువైన రెక్కలతో, విరామం లేకుండా
చాలా దూరం తర్వాత
జీవితపు బురుజులు, లోయలు మసకగా కనపడతాయి
శబ్దాల తాకిడి తట్టుకోలేక
హృదయం ఇంటికి రమ్మంటుంది.
స్త్రీ హృదయం రాత్రికి
గ్రహాంతర పంజరంలోకి చేరుకుంటుంది. తన దుస్థితి,
తన కలల నక్షత్రాలను
మర్చిపోడానికి ప్రయత్నిస్తూ విఫలమౌతుంది.
విఫలమౌతూ, విరిగిపోతూÑ
బార్లకు ఆశ్రయంగా.