ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు కొదవలేదు. అన్ని ప్రక్రియల్లోనూ తమదే పైచేయిగా చాటి చెప్పారు. అలా చాటిచెప్పిన రచయిత్రుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి డా. మాలతీ చందూర్. ఈమె నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, శీర్షికా రచయిత్రిగా, పాఠకులను మెప్పించేలా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించిన వ్యక్తిగా తెలుగు పాఠక లోకంలో చిరస్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి.
ఆధునిక ఆలోచనాతీరు మాలతీచందూర్ సొంతం. వాస్తవిక జీవితం, పాత సంప్రదాయాల పట్ల నిరసన ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల జీవితాలను, స్త్రీలపై జరిగే దోపిడీ, హింస వంటి విభిన్నాంశాలు ఆమె రచనలలో ప్రతిఫలిస్తాయి. కథలు రాయడంలో తనదైన ముద్రను చాటిన మాలతీ చందూర్ (1950 ప్రాంతంలో రాసిన) మొదటి కథ ‘‘రవ్వల దుద్దులు’’. ఈ కథతో ప్రారంభమై సుమారు 150కి పైగా కథలు రాసింది. ఈ కథలన్నీ ప్రకృతి, పర్యావరణం, ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, స్త్రీల వైవిధ్యం… వంటి పలు అంశాలను విశ్లేషణాత్మకంగా, ఆసక్తిగా, హాస్యోక్తిగా చిత్రీకరించారు. ఆ కాలంనాటి స్త్రీల దయనీయస్థితి, సామాజిక కట్టుబాట్ల మధ్య నలుగుతున్న స్త్రీల మనఃస్థితి, నిస్సహాయత ఎక్కువగా చిత్రీకరించారు. వాస్తవానికి దగ్గరగా రచనలు చేస్తూ ఎంతోమంది స్త్రీల మనసులను ఆకట్టుకొన్నారు.
1. ఆత్మగౌరవం: మాలతీచందూర్ గారి రచనల్లో మధ్యతరగతి కుటుంబంలోని మానవ సంబంధాలు, ఒడిదుడుకులు ప్రధానపాత్ర వహిస్తాయి. అయితే స్త్రీ పాత్రలను వట్టిబేలలుగా చిత్రించరు. ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు ఆత్మగౌరవంతో సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మగౌరవం ప్రాతిపదికగా చిత్రించిన అద్భుతకథలు’’ ఎవరెంత? ‘‘, ‘‘శానమ్మ’’. ఈ కథల్లోని రమామణి, శానమ్మలు ఆత్మగౌరవానికి ప్రతీకలు. డిగ్రీ చదివిన రమామణి శకుంతల ఇంట్లో వంటమనిషిగా చేరి అందరినీ ఆకట్టుకుంది. చదువుకుందని తెలియని కుటుంబ సభ్యులు తనని ఒక పనిమనిషిగానే ట్రీట్ చేశారు తప్ప సాటిమనిషిగా చూడలేకపోయారు. ఇది నచ్చని రమామణి పని మానేస్తానంది. దానికి నిన్ను నాకన్న బిడ్డలా చూసుకున్నానంది శకుంతలమ్మ. మీకు Aబ్‌ష్ట్రశీతీఱ్‌వ చేయడం తప్ప ఒక మనిషిని మనిషిగా చూడగల శక్తి లేదంది. ఏదైనా ధైర్యంగా కరాఖండిగా చెప్పగల శక్తి రమామణిలో కనిపించింది. ఆ ఇంట్లో అందరూ చదువుకుందనే అహంకారం లేకుండా వంట చేయడానికి వచ్చిన రమామణిని చూసి ఆశ్చర్యపోయారు. డిగ్రీ చదివి మెరిట్ authority ఉండి కూడా మెడిసిన్‌లో సీటు రాకపోయినా ఏమాత్రం కృంగిపోని తత్వం రమామణిది. తన కాళ్ళ పైతాను నిలబడగల తెగువ, సామర్థ్యం, వ్యక్తిత్వం గల స్త్రీపాత్ర రమామణి. నేటి మహిళలకు ఆదర్శపాత్ర. తన బాధ నుండి ఇతరుల బాధని చూడగలిగినప్పుడే ప్రతిమనిషీ ఎదిగి మానవతామూర్తి కాగలరు. అలా చూడలేనివారికి చెంపపెట్టులాంటిదే ఈకథ.
మరొక స్త్రీ పాత్ర శానమ్మ. లేమిలోనూ కట్టుబట్టలకు కూడా లేకపోయినా ఆత్మాభిమానంతో జీవించిన ఒక స్త్రీపాత్ర. తన భర్త ఉద్యోగం చేసుకుంటూ సాఫీగా సాగిపోయే వారి జీవితంలో సీనారేకు ముక్క భర్త చేతికి గుచ్చుకుంది. అది నయంకాక నెలరోజులు ఆసుపత్రిలో ఉండటంవల్ల ఉద్యోగం పోయింది. దానితో శానమ్మ జీవితం పేవ్‌మెంట్ మీదకి వచ్చింది. అయినా ఏ మాత్రం భయపడని, పక్కవాళ్ళ దగ్గర చేయిచాచని ఆత్మగౌరవం గల స్త్రీ శానమ్మ. ఎవరైనా జాలిపడి దానం చేసినా వద్దని తిరస్కరించేది. తన స్వశక్తితో సంపాదించిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొచ్చిన స్త్రీ.శానమ్మ కొడుకు దగ్గర ఉన్న అణాచూసి వేరే పిల్లలు మా దగ్గర దొంగతనం చేశావని హింసించారు. దానితో శానమ్మ భర్త పిచ్చివాడయ్యాడు. బాధించిన వాళ్ళని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనూ ఇంకొకరి దగ్గర చేయిచాచని ఆత్మగౌరవం శానమ్మది. సాధారణంగా పేదరికం పక్క వాళ్ళ పైన ఆధారపడేలా చేస్తుంది. కనీసం తినడానికి పైసా లేకపోయినా ఆశించని ఔన్నత్యాన్ని శానమ్మ పాత్రకు ఆపాదించారు మాలతీ చందూర్.
2. వ్యక్తిత్వం:-‘‘స్త్రీ తనకిష్టమైన పనులు చేయగలిగే మానసిక స్వేచ్ఛ కల్గి ఉండటమే స్త్రీవాద’’మంటారు మాలతీ చందూర్. స్త్రీల హృదయం సున్నితం సౌకుమార్యమేకాదు అవసరమైతే దృడంగానూ, స్థిరంగానూ ఆలోచించగలిగే నైపుణ్యమున్నటు వంటి వారని కల్యాణి, నీరజ పాత్రలను చిత్రీకరించారు. ఇద్దరూ తమ జీవితంలో ఎలా ఉండాలో ఒక దృఢమైన స్వభావం కలిగిన స్త్రీలుగా చూపించారు. స్త్రీలందరూ ఆట బొమ్మలుగా, మనోనిశ్చయంలేని రామచిలుకల్లాగా ఏ స్త్రీ అయినా తన పాదాల వద్ద వాలుతుందని భావించిన ఒక పురుషుడికి జ్ఞానోదయం కలిగించిన కథ ‘‘తనూ – నీరజ’’. నీరజ ఒక వ్యక్తిత్వం కల్గిన స్త్రీ. ఎలా ఉండాలో నిశ్చయించుకున్న స్త్రీ. ప్రియురాలి దగ్గరికి ప్రేమికుడూ, దేవుడి దగ్గరికి భక్తుడూ అహంకార స్వభావంతో ఏ పనినీ సాధించలేమని తెలియజెప్పిన స్త్రీ. తనని తానుగానే ఎవరైనా ఇష్టపడాలి తప్ప మరొకరిని తనలో చూడడం ఇష్టపడని స్త్రీని ‘‘లగ్నబలిమి’’ కథలో చూపించారు. తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం ఉండాలనుకునే స్త్రీ కళ్యాణి. దిక్కూమొక్కులేని కళ్యాణిని పెంపుడు తల్లి తన కూతురు రాధలా పోల్చుకుంది. తనకి కావాల్సినవన్నీ చేసి పెట్టింది. రాధతో తనని పోల్చడం ఇష్టంలేని కళ్యాణిని ఆనంద్ ప్రేమించాడు. కాని ఆనంద్ తన మొదటి భార్యను కళ్యాణిలో చూస్తున్నాడని అలాంటి పెళ్ళి నాకొద్దని నిరాకరించింది. అయితే ఆనంద్ స్వచ్ఛమైన మనసు గ్రహించాక కళ్యాణి తిరిగి పెళ్ళికి ఒప్పుకుంది. నీరజ, కళ్యాణి పాత్రలు రెండూ తమకేమి కావాలో ఆవిషయం మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎదుటివారిని మార్చుకోగలిగే నైపుణ్యం కూడా ఉన్నవారు.
3. ప్రేమతత్వం: స్త్రీని పిల్లలుకనే యంత్రంలా, భర్త మీద ప్రేమలేని మనిషిలా, ఓర్పులేని మోతలా చూసిన సత్యానికి సుశీల సాంగత్యంతో స్త్రీ ప్రేమతత్వాన్ని తెలిపిన కథే ‘‘సుశి’’. ఒక స్త్రీ తన ప్రేమతో మనిషిని ఎలా మార్చగలదో నిరూపించిన స్త్రీపాత్ర సుశీల. తనకు ఏమీకాని ఒక వ్యక్తికి తన నగలమ్మి మరీ మూడువేల రూపాయలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టడానికి ఇచ్చింది. దానితో సత్యం ప్రయోజకుడు అయ్యాడు. లక్షలు సంపాదించాడు. ఆ కృతజ్ఞతతో పెళ్ళి చేసుకుంటానన్న మాటను ‘‘స్త్రీకి భార్య అవటం కంటే ఎక్కువ ఆశయం కూడా ఉంటుందని మర్చి పోకండని’’ (పు :220) సున్నితంగా తిరస్కరించింది. ప్రేమ దేన్నీ ఆశించదు. అలా ఆశించే ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఎలాంటి స్వార్థంలేని, దేన్నీ ఆశించని ప్రేమతత్వం సుశీలది. నీకు ఇక ఆ ఉద్యోగం ఎందుకు? మానేయమన్నప్పుడు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనమే సరైన మార్గమంటారు మాలతీ చందూర్. ఆ పుస్తక పఠనం వల్లే సుశీలకి ఎదుటి మనిషిని అర్థంచేసుకోగలిగే స్పందన, అన్నిటినీ మించి ఒక ఉన్నత ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది.
4. ప్రతీకార స్వభావం: ఆత్మస్థైర్యంతో అనుకొన్నది సాధించగలిగే దిశగా స్త్రీ పయనం సాగించడమే కాదు ప్రతీకార స్వభావాన్ని కూడా మాలతీచందూర్ గారు చిత్రీకరించారు. ‘‘రేణుకాదేవి ఆత్మకథ’’ ఈ కోవకు చెందిన కథే. స్త్రీ పాత్ర కేంద్ర బిందువుగా రాసిన కథ. 64 పేజీల కథ. మిగిలిన కథలకంటే పెద్దది. కొంతమంది దీన్ని నవలికగానూ భావిస్తున్నారు. అయితే దీన్ని కథా సంపుటంలో నిక్షిప్తం చేయడం వల్ల నేను దీన్ని కథగానే తీసుకున్నాను. బాలనటి నుండి కథానాయిక స్థాయికి చేరుకున్న రేణుకాదేవి ఆత్మకథే ఇతివృత్తం. కథా రచయిత అనిల్‌బాబు అనబడే హనుమంతరావును పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకుంది. కాని తన వైవాహిక జీవితంలో రాణించలేకపోయింది. కారణం తన భర్త డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ తనకు నచ్చినట్లు జీవించాడు. పక్కదారి పట్టాడు. రేణుకాదేవిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక సినిమాతారగా ప్రపంచమంతా ఒక వెలుగు వెలిగిన తనని తన కుటుంబసభ్యులే మోసం చేస్తుంటే సహించలేకపోయింది. నిద్ర పట్టక నిద్రమాత్రలు కూడా పనిచేయని స్థితికి వచ్చింది. దానితో గుండెపోటు వచ్చి భీమ్మ్లీలోని డా. రామారావు హాస్పిటల్‌లో చేరింది. తన గురించి పట్టించుకోకుండా తన డబ్బుకోసం మాత్రమే జీవించేవారికి ఎలాగైనా తన ఆస్తిని దక్కనీయకూడదని సేవాసదన్‌కు రాసేసింది. తనని మనిషిగా కూడా లెక్కచేయని తన వాళ్ళకు ఆస్తి దక్కకుండా చేశానని, వారిపై గెలిచాననే తృప్తితో చనిపోయింది. ఇందులో మనకు రెండు అంశాలు గోచరిస్తున్నాయి. ఒకటి ప్రతీకార వాంఛ. రెండవది ఆత్మతృప్తి. ప్రతీకారం మనస్తత్వ శాస్త్రంలో ప్రాథమిక మానవ స్వభావంగా పరిగణిస్తారు. వ్యక్తులు తమకు వ్యతిరేకంగా చేసిన తప్పులు లేదా అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకుంటారు. అలాంటి మనస్తత్వమే మనం రేణుకాదేవిలో చూస్తాం. తనని బాధపెట్టిన కుటుంబ సభ్యులకు ఆస్తి లేకుండా చేసి ‘‘టిట్ ఫర్ టాట్’’ స్ట్రాటజీని అమలు చేసింది. రెండవది ప్రశాంతంగా మరణించాలన్న తన చివరి కోరిక తీరి ఆత్మసంతృప్తితో కన్నుమూసింది.
5. అసహాయత: తను అనుకున్నది సాధించి ఆతృప్తితో మరణించిన స్త్రీని రేణుకాదేవి ఆత్మకథలో చూస్తే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో పరాజితjైు మరణించిన స్త్రీని ‘‘క్షణికం’’ కథలో చిత్రీకరించారు. తను చేయని తప్పుకు నిందింపబడి ఇంటినుండి గెంటి వేయబడిన స్త్రీ రాజ్యలక్ష్మి. తన ఆడపడుచు సుబ్బులు కోసం వచ్చిన వీర్రాజు రాజ్యలక్ష్మికోసం వచ్చాడని అత్తమామలు నిందించారు. నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. ఎక్కడికెళ్ళాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న తనని వీర్రాజే తీసికెళ్ళి సేవాసదనంలో చేర్చాలనుకున్నాడు. అతనిని నమ్మి వెళ్లిన రాజ్యలక్ష్మి జీవితం పాడుచేశాడు. చివరికి తనకి ఆత్మహత్య ఒకటే శరణ్యమని భావించింది. హాస్పిటల్ బిల్డింగ్ మీద నుండి దూకి మరణించింది. క్షణికావేశం ఎంతటి అనర్ధానికి దారితీస్తుందో చెప్పిన కథ ఇది. ఒక స్త్రీ చదువుకోకపోవడం వల్ల అమాయకత్వంతో ఏమీ చేయలేని అసహాయతతో ప్రాణాల్ని తీసుకుంది. క్షణికానందం కోసం విలాసవస్తువుగా బలిపశువుగా చూసే పురుషాహంకారానికి నిదర్శనంగా నిల్పిన పాత్ర రాజ్యలక్ష్మి. తన బాధను బహిర్గతం చేయలేక ఓర్పుతో సహించి చివరికి తనని తానే అంతం చేసుకున్న స్త్రీ పాత్ర రాజ్యలక్ష్మి.
6. స్వేచ్ఛా నిర్ణయం: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తను వదిలి మరొకరితో వెళ్ళగలిగే స్వేచ్ఛను ‘జూలీ’ కథలో చూపించారు. విదేశీయుల స్వేచ్ఛా నిర్ణయాన్ని భారతదేశ సంస్కృతికి ముడిపెట్టి రాసిన కథ ఇది. పాశ్చాత్యులు స్వేచ్ఛ తీసుకోవడంలో నిపుణులు. జూలీ భర్త భారతదేశం వల్లనే తన భార్య మరొక వ్యక్తితో వెళ్ళే సాహసం చేసిందని నిందించారు.కాని మాలతీచందూర్‌గారు భారతీయ సంస్కృతితో ముడిపెట్టి ఆమెను ఒక చెడు ప్రవర్తనకల్గిన స్త్రీగా అభివర్ణించారు.
7. నిగూఢ స్థితి: ‘‘ఆడవాళ్ళ నోటిలో ఆవగింజైనా దాగదంటారు’’ కాని ఒక స్త్రీ చనిపోయేదాకా తను ప్రేమించిన వ్యక్తి విషయం దాచిపెట్టింది. స్త్రీలెంత నిగూఢంగా ఉండగలరో, విషయాలను దాచగలరో నిరూపించిన కథ’’ జమున వేసిన భారం’’. తను ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరొకరిని వివాహమాడిరది జమున. తాను ప్రేమించిన విషయంగాని, ఆవ్యక్తి గురించిగాని ఎప్పుడూ బయటకు రానియ్యదు. తన భర్తకు, సమాజానికి సందేహమేలేనంత సంతోషంగా తన వైవాహిక జీవితాన్ని గడిపింది. తన ఇంట్లో దొంగలుపడి తను రోజూ చూసుకునే ఫోటోఫ్రేమ్‌ని దొంగిలించినప్పుడు తను ఏడ్చింది. అందరూ తనభర్త ఫోటో కోసం ఏడ్చిందనుకుంటారు. కాని తను ఏడ్చేది ఫ్రేమ్ కోసమని తన స్నేహితురాలికి జరిగినదంతా చెప్పి, తను ప్రేమించిన వ్యక్తికి తెలపమని కన్ను మూసింది. స్త్రీలు ఎంత నిగూఢంగా కూడా ఉండగలరో మాలతీచందూరుగారు ఈ కథ ద్వారా మనకందించారు.
8. మరణ భీతి నుండి వచ్చే హలోసినేషన్స్: ఒక స్త్రీ తన మరణభీతినుండి వచ్చే హాలోసినేషన్స్‌కి లోనయ్యే కథ ‘‘వాకింగ్ హాస్పిటల్’’. కేవలం చలిజ్వరంతో ఉన్న ఒక స్త్రీ అనేక భ్రాంతులకు గురిjైున స్థితిని చూపిన కథ ఇది. స్త్రీ ప్రధాన కేంద్ర బిందువుగా రాసిన కథే ఇది. ఈ కథలో సరస్వతి అనే పాత్ర తను రాసిన నవలలోని హీరోకిలాగే తనకి కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుందేమోననుకొంది. అంతలోనే కార్డియాక్ అరెస్టయితే నొప్పి ఆగి ఆగిరాదు కనుక హార్ట్ అటాకేమోననే అనుమానం! అప్పుడు బైపాస్ సర్జరీ జరిగితే నాలుగు నెలలు రెస్టుకావాలని, ఎన్ టి ఆర్ నాలుగు వారాల్లో లేచి తిరిగాడని తను కూడా అదే విధంగా లేచి రైటర్స్‌కి కొత్త ఒరవడి పెట్టాలనుకొంది. పక్కమీద పడుకొనే వారానికి ఒక నవలరాసి, మానసికశక్తి ఎంత ఉన్నతమైందో చూపాలని ఊహించింది. అంతలోనే పిక్కలు లాగడం, కడుపులోంచి పోట్లు, అరిచేతులు, నాలుక పొడిగా కావడంతో డి-హైడ్రేషన్ అనీ, ఇదొక కొత్తరకం వ్యాధి ఏమోననే అనుమానం! దీనికి సెలైన్ ఎక్కిస్తారేమో? ఇంటెన్సివ్లో పెడతారేమో? తన శరీరతత్వం గురించి పరిశోధనలు చేస్తారు. నేను ఒక వేవ్ సృష్టిస్తాననుకొంది. మరోవైపు గుండెజబ్బు అయితే 105 డిగ్రీల జ్వరం ఉండదని ఇది కచ్చితంగా గొంతు క్యాన్సరేమో? ట్రీట్మెంట్ చేస్తే జుట్టు ఊడిపోతుంది. చీమునెత్తురూ పీల్చుకుపోతుంది. ఆ ట్రీట్మెంట్ నేను తీసుకోను. ఖర్చు దండగ. అంతలోనే క్యాన్సర్ అంటే భయంలేదని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ధైర్యాన్ని శక్తినిచ్చే రచనలు చేయాలని ఆత్మశక్తి ఉంటే ఎలాంటి వ్యాధినైనా జయించవచ్చనే సందేశాన్నిచ్చే రచనలు చేస్తానని, వాటన్నిటిని ఒక ట్రస్టుగా ఏర్పరిచి వాటి మీద వచ్చే డబ్బులు క్యాన్సరు వ్యాధి నిర్మూలనకు దానం చేయాలని, తను బ్రతికుండగానే క్యాన్సర్ సఫరర్స్ అసోసియేషన్ స్థాపించి ఉద్యమానికి పునాది వేయాలని ఊహించుకుంది. తర్వాత డాక్టరు వచ్చి ఇది ఫ్లూ-మలేరియా వంటిదేనని సాయంత్రానికి తగ్గిపోతుందనగానే రమామణి కంటే గొప్ప హాస్పిటల్ లో ఉండలేనా? కట్ ఫ్లవర్స్, బొకేలు, గెట్ వెల్ కార్డులు, ఏసీ గదిలో దర్జాగా పడుకునే ప్రాప్తి, అందరూ సానుభూతిగా చూసే యోగ్యత తనకు లేవా? అనుకోవడమే కథాంశం. ఇలాంటి భ్రాంతులకు గురికావడమన్నది ఒక మనోరుగ్మత. చనిపోతానేమోననే భయంతో కూడిన బ్రాంతులతో చివరికి అది ఒక ఫ్లూ జ్వరమని తెలియగానే నిజస్థితికి వచ్చిన స్త్రీని చిత్రీకరించారు మాలతీ చందూర్. నaశ్రీశ్రీబషఱఅa్‌ఱశీఅం aతీవ ్‌వజూఱషaశ్రీశ్రీవ Hallucinations are typically a symptom of a psychosis related disorder, Particularly schizophrenia but they can also result from substance use. Neurological conditions and same temporary situations. A person may experience a hallucination with or without the insight that what they are experiencing is not real.
9. సున్నితత్వం: వాకింగ్ హాస్పిటల్ లాంటిదే మరోకథ ‘బోన్సాయ్’. తను పెంచిన మొక్కల వల్ల తనకు పుట్టబోయే బిడ్డకి హాని జరుగుతుందేమోనని భయపడిన కథ. ఫ్లవర్ షోలో చూసిన బోన్సాయ్ మొక్కలని ప్రేమించి, వాటిని పెంచి అవార్డులు అందుకుంది సుగంధి. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదవాలని డాక్టరు ఇచ్చిన సలహా మేరకు చదివేది. ఈక్రమంలో చదివిన ‘‘మనిషికి ప్రకృతిని మార్చే హక్కులేదు’’ అనే వ్యాసం తన ఇష్టాన్ని మార్చేసింది. మొక్కలను కుండీలలో పెంచడంవల్ల వాటి ఎదుగుదలకు మనమే అడ్డుపడుతున్నామని, మనుషులని కూడా షోకేసులోని బొమ్మల్లాగా చిన్నసైజులో ఉండేలా ఎవరైనా మందులు కనిపెడితే అప్పుడు మనిషి ఏం చేస్తాడు? చెట్లపట్ల చేసిన అపచారానికి… యిది పరిణామం అనుకుంటాడా? అంటూ రచయిత రాసిన మాటలు సుగంధిని ఆలోచింపజేశాయి. బోన్సాయ్‌లా తనకి మరుగుజ్జు శిశువు పుడుతుందేమోనని హడలిపోయింది. వృక్షాల పట్ల మనుషులు చూపిస్తున్న క్రూరత్వంగా భావించింది. దానితో తనలో కల్గిన మానసిక వేదన, భయం అనవసరమైనవిగా, సిల్లీగా అనిపించినా ఆరునెలలు మానసిక క్షోభకు గురిచేసిన బోన్సాయ్ హాబీ తనకు అక్కరలేదని నిర్ణయించుకొంది. స్త్రీహృదయం ఎంత సున్నితమైందో చూపించారు. సమాజంలో ప్రతి మనిషీ ఇదే సున్నిత హృదయంతో ఉండగల్గితే, ఆలోచిస్తే తాముచేసే పనులవల్ల తిరిగి అది తమకే అపకారం చేస్తుందనే స్పృహతో ఉంటే సగం సమస్యలు సమసిపోతాయని రచయిత్రి సూచించిన కథ ఇది. ‘‘ఋతువులను ఒట్టి గతులు మారే నదిలా కాక, నిరంతరం ప్రవహించే జీవనదిలాంటి రచయిత్రి మాలతీ చందూర్’’ అంటారు డా. సినారె (గురజాడ పురస్కార స్వీకరణ సందర్భంగా మాలతిపై అభినందన సుమాలు, జగతి మాసపత్రిక, నాగేశ్వరరావు చందూరి, పుట – 19- 20) అది సత్యమని ఆమెరాసిన కథలు మనకు బోధిస్తాయి.
10. ఆత్మవిశ్వాసం: ఆరోజుల్లోనే స్త్రీల సమస్యల మీద బాహాటంగా కథలు రాశారు మాలతీ చందూర్. స్త్రీజాతి విద్య, ఉద్యోగం, జీవితం, సంఘర్షణలు, కట్టుబాట్లు, స్వతంత్రంగా నిలబడాలన్న ఆకాంక్ష, ఆత్మగౌరవం… వంటి ఎన్నో ఇతివృత్తాలతో కథలు రాశారు. అలా రాసిన ఒక కథే ‘‘పరీక్ష’’. వితంతువైన స్త్రీ చదువుకొని జీవితంలో స్థిరపడాలనుకొని పరీక్ష ఫెయిలై రెండవ పెళ్ళితో తన జీవితాన్ని సుఖాంతం చేసుకున్న స్త్రీకథే ఇది. వితంతువులైన స్త్రీలు చదువుకోవడానికి అడ్డుతగిలే పాతతరం మొండితనం, కుటుంబ పరిస్థితులు సత్యవతి కల కల్లగానే మిగిలిపోవడానికి కారణమయ్యాయి. అయితే ఆనాటి కట్టుబాట్ల మధ్య సత్యవతి రెండో వివాహం చేసుకొని తన జీవితానికి అర్థాన్ని వెతుక్కొందంటే అది ఆత్మవిశ్వాసంగానే భావించాలి. సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో జయప్రదమైన పాత్ర సత్యవతి. స్త్రీలెప్పుడూ సామాజిక స్పృహతో పరిపూర్ణంగా ఎదగాలనుకునే తత్వం వీరిది. అది ఈ కథలో స్పష్టంగా కన్పిస్తుంది. స్త్రీల సమస్యలను భిన్నకోణాల నుండి ఆలోచించి రచనల్లో ఆవిష్కరిస్తారనడానికి నిదర్శనం ఈకథ. నిత్యజీవితంలో తారసపడే మనుషులు వారి సమస్యలు, కష్టాలు, ఆలోచనలు, ధైర్యాలు… ఈ కథలో చిత్రీకరించారు.
మాలతీచందూర్ రచనలు అందరినీ ఆకర్షించేవి. విషయం సూటిగా స్పష్టంగా ఉంటుంది. అనవసరమైన వర్ణనలు, అలంకారాలు, ఉపమానాలు, హాస్యోక్తులు, అడ్డుపడే పాత్రలు ఉండవు. ఎవరో ఒకరి పక్షాన కథ నడపరు. ఉన్న విషయాన్ని రాసి పాఠకుల ముందు పెడతారు. పాఠకుల సంస్కారాన్ని బట్టి ఆ విషయంలో మంచి చెడ్డలను గ్రహిస్తారు. అలా రాసిన రెండు కథలు’’ విజయ రానన్నది’’, ‘‘లక్ష్మీదేవి నవ్వు’’. ధన గర్వం, విద్యా గర్వం, సౌందర్య గర్వంతో అనవసరమైన పట్టుదలలకీ, అపోహలకీ పోయి స్నేహాలను చెడగొట్టుకునే వాళ్ళ తీరుతెన్నులను తెలిపే కథ ‘విజయ రానన్నది’. తన కూతురి పుట్టినరోజుకి రాఘవమ్మ రాలేదని విజయకూడా తన మనుమరాలి పుట్టినరోజు పేరంటానికి రానంది. కంఠంలో ఊపిరుండగా రాఘవమ్మగారి గడప తొక్కనని విరోధం పెట్టుకునేంత వరకు వచ్చింది. రాకపోవడానికి అసలు కారణం రాఘవమ్మ మెట్ల మీదనుండి జారిపడి 15 రోజులు మంచం మీద ఉండడం. ఆ విషయం తెలియని విజయ తన స్నేహాన్ని అపార్థం చేసుకొంది. ఇలాంటి స్త్రీలు మనకు నిత్యమూ సమాజంలో కన్పిస్తుంటారు. మానవ మనస్తత్వాలను ప్రతిబింబించే కథ ఇది.
మరో కథ ‘లక్ష్మీదేవి నవ్వు’. అమాయకుడైన భర్తను చైతన్యవంతం చేసిన స్త్రీ కథ. మీరుత్త అమాయకులన్న భార్య మాటకు అవమానంగా ఫీలయి తెలివైన వాడినని నిరూపించాలనుకున్నాడు నారాయణమూర్తి. పల్లెటూళ్ళో ఉండే శంకరరావనే వ్యక్తికి కోరినవన్నీ చేసి తాను ప్రయోజకుడు అనిపించుకోవాలన్న కోరిక తీరదు. ఏకోరికలేకుండా మంచి చేయాలనుకొన్న నారాయణమూర్తినే చంపాలనుకున్నాడు శంకర్ రావు. దానితో ‘‘కంటికి కనబడని మహాశక్తి తనని నీడలా అంటిపెట్టుకొని ఉంటుందని తెలుసుకోలేని ఇటువంటి పరమ మూరు? డికి కోర్కెలు లేకుండా చేయ్యటం సాధ్యమా? కాదు అది అసాధ్యమైన పని’’ (పు. 26) అని అనుకొన్నాడు. లక్ష్మిదేవి మాటల్లో సత్యం ఉందని తనని తాను ఒప్పుకొన్నాడు నారాయణమూర్తి. సమాజంలో జరిగే సాధారణ విషయాలను జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ, వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకొనే విధానాలు మాలతీచందూర్‌గారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయనడానికి నిదర్శనం ఈకథ.
11. భయం: కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న లలితకు శేఖర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు శేఖర్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసి నిరాకరించింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఏర్పడిన భయమే దానికి కారణం. అది తెలుసుకొని పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలేసాడు శేఖర్. జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనల తాలూకు చిహ్నాలు ఏవిధంగా వేధిస్తాయో లలితలో చిత్రీకరించారు’’ విలువ ఎంత…?’’ కథలో మాలతీ చందూర్. భయమనేది ఒక ప్రమాదకరమైన సంకేతం. తన జీవితంలో జరగటానికి ఏమాత్రం ఆస్కారంలేని విషయాల గురించి అర్థంలేని భయాలతో జీవించిన లలిత తత్వాన్నే చిత్రీకరించిన కథ ‘‘విలువ ఎంత…?’’. అర్థం లేని భయాలతో సుఖంగా సాగాల్సిన జీవితం లలితది. తనకు కాబోయే భర్త పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికే రాజీనామా చేసే పరిస్థితి కల్పించింది.
ముగింపు: తెలుగు సాహిత్యరంగంలో పాఠకుల హృదయాలలో ఒక అద్వితీయమైన విశిష్టమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది మాలతీ చందూర్. ప్రత్యేకంగా స్త్రీలతో భావాత్మక సంబంధాన్ని ఏర్పరచుకొంది. స్త్రీ పాత్రను ప్రధాన పాత్రగా, ఆపాత్ర చుట్టూ తిరిగే కథను ఇతివృత్తంగా చేసుకొంది. ఆ ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన భావాన్ని సందేశాన్ని అందించింది.
– అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయనశాఖ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.