(బాలికా దినోత్సవ సందర్భంగా)
అమ్మాయి! నువ్విప్పుడు ఆడపిల్లవే కాదు..
ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా విహంగానివి
నువ్వు అమ్మ కడుపు నుండి ఎన్ని మాయపొరల్ని చీల్చుకొచ్చావో
నిన్ను కన్న తల్లికి తెలుసు..
నువ్వు పుట్టి పెరగడమే అరిష్టంగా
భావించే కర్మభూమిలోకి అడుగు పెట్టావు..
నీలాంటి గర్భస్థ పిండాల్ని గుట్టు చప్పుడు కాకుండా నిలిమేయ గల
సనాతన సంప్రదాయ కట్టు బాట్లను
తెంచుకుని నువ్వో మైనస్‌గా బ్రతుకీడుస్తున్న అందాల ఆడబొమ్మవి
ఇక్కడ చదువైనా కొలువైనా పురుషలక్షణమే..
నీకెంత చదువున్నా తెలివున్నా వంటింటి కుందేలువే నంటారు
వరకట్నాలు, కామ ప్రేమలు పరువు హత్యలు అన్నీ నీ చంచలత్త్వమేనని
పురాణాలు మనుస్మృతులు నిత్యం గుర్తుచేస్తూనే ఉంటాయి.
నువ్విప్పుడు అంతరిక్షాన్ని ఛేదించే
ఆస్ట్రోనాట్ వైనా ఆకాశంలో సగం కాదుగా అవకాశాల్లో కూడా నీకు నేల మీద తావు లేకుండా.. మణిపూర్‌లు
హత్రాసుల్లో హాస్పిటల్లో నిన్ను మాయం చేస్తుంటారు.. జాగ్రత్త!
ఇప్పుడేదేవుడు నిన్ను కాపడలేడు బాలికా నిన్ను నువ్వే ఎలుకో…
ఏబాలికా దినోత్సవ సందర్భంగా..