ఆకోశ్రం – వేంకట చండీశ్వర్‌

మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
పుట్టక ముందే గిట్టిపొయేలా చేసే మానుష-కర్కశత్వాన్ని కాదని
జీవించే అవకాశం మాకు దక్కేది – మా బలగం మరికొంత పెరిగేది!

మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
నాలుగక్షరాలు నేర్చి ఈ ప్రపంచాన వెలుగులు నింపి
ప్రగతి పథాన పరుగెత్తించే వాళ్లం !

మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
ఈ ‘కట్టు’ బానిసత్వాన్ని కాదని
స్వయం సమృద్ధులమై, మా జీవికను గౌరవంగా ఆర్జించుకునే వాళ్లం !

మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
దురాశాపరులను / చరిత్ర హీనులను వలదని
సజీవ దహనాలకు బలికాక సురక్ష జీవనం సాగించే వాళ్లం !
మరి కాస్త స్వేచ్ఛ మాకుంటే
పకడ్బందీ కుటుంబ నియంత్రణ పథకాలతో ఈ భువిని
‘జన విస్ఫోటం’ నుండి కాపాడి సుసంపన్నం చేసే వాళ్లం !

మరి కాస్త సహకారం మాకందుంటే
సమాజంలో మానవత్వాన్ని పెంచి
నిస్సహాయ, నిరాశ్రయ స్త్రీ మూర్తుల బలవన్మరణాల నంతమొందిచ్చే వాళ్లం !

మరి కాస్త తర్కం మీకుండి, మాకు చేయూత నిచ్చుంటే
అమానుషపు కట్టుబాట్లు, మూఢాచారాలు
అంధ విశ్వాసాల వధ్యశిలల నుండి అతివలెందర్నో తప్పించే వాళ్లం!

కానీ, ఆశించినంతనే ఏ వెలకూ అందని ‘స్వేచ్ఛ’ను
ఎవరైనా ఎందుకిస్తారు నేస్తం ?
కాలాతీతం కానీకు – ‘శ క్తి’ సమీకృతగా ఎదిగి-సాగిపో
నీ జీవన యానం జయకేతనాలతో ప్రభవిస్తుంది !!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.